
న్యూఢిల్లీ: గతేడాది వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రంనకు సంబంధించి అదనంగా రూ. 5,985 కోట్ల మొత్తాన్ని టెల్కో భారతి ఎయిర్‌టెల్, దాని అనుబంధ సంస్థ భారతి హెక్సాకామ్ చెల్లించాయి. రుణాలు, వడ్డీ వ్యయాల భారాన్ని తగ్గించుకుని, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో భాగంగా ఈ మేరకు చెల్లించినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.
దీనితో అధిక వడ్డీ భా రం ఉండే స్పెక్ట్రం బాకీలకు సంబంధించి ఎయిర్‌టెల్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 25,981 కోట్లు, ఇప్పటివరకు మొత్తం రూ. 66,665 కోట్లు చెల్లించినట్లయింది. ముందస్తుగా చెల్లించిన మొత్తం లయబిలిటీలపై సగటు వడ్డీ రేటు 9.74 శాతంగా ఉంది. అటు మరో అనుబంధ సంస్థ నెట్‌వర్క్ ఐ2ఐ కూడా 1 బిలియన్ డాలర్ల పర్పెచ్యువల్ డెట్ సెక్యూరిటీలను చెల్లించేసింది. కంపెనీ వీటిని 2020లో జారీ చేసింది.