ఐపీఎల్‌ మజా.. ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్లు | Airtel Introduces Two New Affordable Data Plans With Free Jiohotstar Subscription Ahead Of IPL 2025 Matches, More Details Inside | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ మజా.. ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్లు

Published Fri, Mar 21 2025 9:31 PM | Last Updated on Sat, Mar 22 2025 12:59 PM

Airtel introduces two new affordable data plans with free JioHotstar subscription

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్రారంభం నేపథ్యంలో ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ జియో హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు కొత్త డేటా వోచర్లను ప్రవేశపెట్టింది. రూ.100, రూ.195 ధర కలిగిన ఈ కొత్త ప్లాన్లు జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు అదనపు డేటా కోసం చూస్తున్న వినియోగదారులకు ఉపయోగపడతాయి. ఈ వోచర్లను ఇప్పటికే ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ పైన రీఛార్జ్ చేసుకోవచ్చు.

రూ.100 డేటా వోచర్
ఎయిర్‌టెల్ రూ .100 డేటా వోచర్‌ 5 జీబీ అదనపు డేటాతో పాటు జియో హాట్‌స్టార్‌ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను 30 రోజుల పాటు అందిస్తుంది. ఐపీఎల్ 2025 మ్యాచ్‌లను ప్రయాణంలో లేదా మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్లో చూడాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ అనువైనది.

రూ.195 డేటా వోచర్
ఎయిర్‌టెల్‌ రూ .195 డేటా వోచర్ 15 జీబీ డేటా, 90 రోజుల వ్యాలిడిటీతో జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఎక్కువ వ్యాలిడిటీ,  అధిక డేటాతోపాటు జియో హాట్‌స్టార్ కంటెంట్‌ యాక్సెస్‌ కావాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్‌ సరిపోతుంది.

ఇతర జియో హాట్‌స్టార్ ప్లాన్లు
జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో మరికొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా ఎయిర్‌టెల్ అందిస్తోంది. రూ.3,999, రూ.1,029, రూ.549, రూ.398 విలువైన ఈ ప్లాన్లు సర్వీస్ వ్యాలిడిటీ, అధిక డేటా పరిమితులు, అదనపు బెనిఫిట్స్ వంటి వివిధ ప్రయోజనాలను అందిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement