
సాక్షి,న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ 44 బిలియన్ డాలర్ల కొనుగోలు డీల్ రద్దుపై ఊహించినట్టుగానే న్యాయ పోరాటానికి దిగింది ట్విటర్. టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ మంగళవారం దావా వేసింది. ప్రతీ ట్విటర్ షేర్‌కు అంగీకరించిన 54.20 డాలర్ల చొప్పున విలీనాన్ని పూర్తి చేయాలని ఆదేశించాలని డెలావేర్ కోర్టును ఆశ్రయించింది. సెప్టెంబర్ మధ్యలో నాలుగు రోజుల విచారణనుషెడ్యూల్ చేయాలని కూడా ట్విటర్ కోర్టును కోరింది.
మస్క్ ఆరోపణలను కుంటిసాకులు మాత్రమేనని కొట్టిపారేసిన ట్విటర్, రెగ్యులేటర్‌లకు సమాచారం లేకుండానే జనవరి-మార్చి మధ్య కంపెనీలో "రహస్యంగా" షేర్లను పోగు చేసుకున్నాడని ఆరోపించింది. అంతేకాదు ఈ సందర్బంగా ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఉద్యోగులకు కంపెనీ భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు. కోర్టు విజయం తమదే, ఆందోళన అవసరం లేదంటూ వారికి ఒక లేఖ రాశారు.
ఇది కూడా చదవండి : Elon Musk: ట్విటర్ గుర్రు: పగలబడి నవ్వుతున్న మస్క్
అయితే ట్విటర్ న్యాయపోరాటంపై ఇప్పటికే విభిన్నంగా స్పందించిన మస్క్ మరోసారి ట్విటర్‌లో వ్యంగ్యంగా స్పందించారు. ట్విటర్ దావా గురించి ప్రస్తావించకుండానే ‘‘అయ్యో రామ..ఇదేం విచిత్రం (Oh the irony lol)’’ అన్నట్టుగా ట్వీట్ చేశారు. కాగా ఫేక్, స్పామ్ అకౌంట్ల సమాచారం ఇవ్వడంలో ట్విటర్ వైఫల్యం కారణంగానే డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్టు గతవారం మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Oh the irony lol
— Elon Musk (@elonmusk) July 12, 2022