
భారత పాదరక్షలు, తోలు పరిశ్రమంలో ఉత్పాదకత, నాణ్యత, పోటీతత్వాన్ని పెంపొందించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025 సందర్భంగా కీలక ప్రకటన చేశారు. పాదరక్షలు, తోలు పరిశ్రమ వివిధ అంశాలకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన కేంద్రీకృత ఉత్పత్తుల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ పథకంలోని ప్రధాన అంశాలు కింది విధంగా ఉన్నాయి.
డిజైన్ సామర్థ్యం: సృజనాత్మక, అధిక-నాణ్యత పాదరక్షలను సృష్టించడానికి డిజైన్ సామర్థ్యాలను పెంచడం.
కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్: నాన్ లెదర్ క్వాలిటీ పాదరక్షలకు అవసరమైన కాంపోనెంట్స్ ఉత్పత్తికి మద్దతు ఇవ్వడం.
యంత్రాలు: లెదర్, నాన్ లెదర్ పాదరక్షల ఉత్పత్తికి అవసరమైన అధునాతన యంత్రాలకు అనుమతులను సులభతరం చేయడం.
ఈ పథకం ద్వారా 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రూ.400 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని, రూ.1.1 లక్షల కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతాయని అంచనా.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్
బొమ్మల రంగానికి ప్రయోజనాలు
పాదరక్షలు, తోలు పరిశ్రమపై దృష్టి పెట్టడంతో పాటు బొమ్మల రంగం అభివృద్ధిపై చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. బొమ్మల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను నిర్మించినట్లు చెప్పారు. బొమ్మల తయారీకి భారత్‌ను గ్లోబల్ హబ్‌గా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీనివల్ల బొమ్మల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి ప్రత్యేక క్లస్టర్లను సృష్టించనున్నారు. అధిక నాణ్యత, సృజనాత్మక బొమ్మలను ఉత్పత్తి చేయడానికి కార్మికుల నైపుణ్యాలను పెంపొందిస్తారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించే సుస్థిర తయారీ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తారు.