మరో మడత ఫోన్‌ వచ్చేస్తోంది.. రేటు రూ.లక్షకు పైనే! | Vivo X Fold 3 Pro set to launch in India on June 6 | Sakshi
Sakshi News home page

మరో మడత ఫోన్‌ వచ్చేస్తోంది.. రేటు రూ.లక్షకు పైనే!

Published Thu, May 30 2024 8:35 PM | Last Updated on Thu, May 30 2024 8:35 PM

Vivo X Fold 3 Pro set to launch in India on June 6

దేశ ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లోకి మరో మడత ఫోన్‌ వచ్చేస్తోంది. ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ వివొ గ్రేటర్ నోయిడాలోని కర్మాగారంలో తయారైన తన లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను భారత్‌ మార్కెట్‌లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.

వివో తన నాలుగో ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసిన తర్వాత, ఈ ఫోన్‌ను భారత్‌కు తీసుకురానుంది. భారత మార్కెట్లో వివో నుంచి దేశంలోకి వచ్చిన తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే అవుతుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్‌ లాంచ్ తేదీని జూన్ 6గా వివో ధ్రువీకరించింది. తొలి ఫోల్డబుల్ ఫోన్ తో ప్రీమియం సెగ్మెంట్ లో శాంసంగ్, యాపిల్ సరసన చేరాలని వివో భావిస్తోంది.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)

  • తేలికపాటి డిజైన్‌ను మన్నికతో సమతుల్యం చేసేలా కార్బన్‌ హింజ్‌ ఫైబర్‌.

  • 6.53 అంగుళాల కవర్ డిస్ ప్లే, 8.03 అంగుళాల ఇన్నర్ అమోల్డ్‌ ఎల్‌టీపీఓ ఫోల్డింగ్ డిస్ ప్లే

  • 2480-2200 రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, హెచ్ డీఆర్ 10+ సపోర్ట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్

  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీ, అడ్రినో జీపీయూ

  • 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ యూఎఫ్ఎస్ 4.0 వరకు స్టోరేజ్ 

  • ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టం

  • 50 మెగాపిక్సెల్ అల్ట్రా-సెన్సింగ్ మెయిన్‌ కెమెరా, 64 మెగాపిక్సెల్ 3ఎక్స్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, వీ3 ఇమేజింగ్ చిప్

  • సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

అంచనా ధర
వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా విక్రయించనున్నారు. చైనాలో దీని ధర 9,999 యువాన్లుగా(సుమారు రూ.1.17 లక్షలు) ఉండగా, భారత్‌లో దీని ధర రూ.1.2 లక్షలుగా ఉండొచ్చని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement