foldable smartphones
-
శామ్సంగ్ ట్రై ఫోల్డ్ ఫోన్: వివరాలు లీక్..
ఇప్పటి వరకు ఫోల్డబుల్ ఫోన్స్ వచ్చాయి. ఇకపై ట్రై-ఫోల్డ్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. శామ్సంగ్ కంపెనీ ఈ రకమైన ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. సంస్థ దీనికి 'గెలాక్సీ జీ ఫోల్డ్' అని పేరు పెట్టనున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.ఇప్పటి వరకు గ్లోబల్ మార్కెట్లో ఉన్న ఒకే ఒక్క ట్రై-ఫోల్డ్ ఫోన్ 'హువావే మేట్ ఎక్స్‌టి'. కాగా దీనికి శామ్సంగ్ గెలాక్సీ జీ ఫోల్డ్ ప్రత్యర్థిగా నిలువనుంది. దీనిని కంపెనీ ఏప్రిల్ 2025లో లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది శామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7లతో పాటు గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో లాంచ్ అవుతుందని చెబుతున్నారు.కొత్త శామ్సంగ్ గెలాక్సీ జి ఫోల్డ్ మొబైల్.. హువావే మేట్ XT కంటే భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.49 ఇంచెస్ కవర్ డిస్ప్లే, 9.96 ఇంచెస్ మెయిన్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉండవచ్చు. ఈ కొలతలు మేట్ ఎక్స్‌టి కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇది పరిమాణంలో కొంచెం పెద్దది. లాంచ్ అయినప్పటికీ, గెలాక్సీ జి ఫోల్డ్ లాంచ్ అయిన వెంటనే అమ్మకానికి రాకపోవచ్చు. గెలాక్సీ ఫోల్డ్ స్పెషల్ ఎడిషన్‌గా మాత్రమే పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే అవకాశం ఉంది.శామ్సంగ్ ఈ గెలాక్సీ జి ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎస్ పెన్ అందించనుంది. పెరుగుతున్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌తో పోటీ పడటానికి శామ్సంగ్ ఈ ఫోన్ తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ ధరలు, లాంచ్ డేట్ వివరాలు వంటివి అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటారా?.. ఉద్యోగం వదులుకుంటారా?: కంపెనీ వార్నింగ్ -
ఫోల్డబుల్ యాపిల్ ఐఫోన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో కంపెనీల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఈ రంగంలో ఫోల్డబుల్ మోడల్ సరికొత్త ఆవిష్కరణగా కొనసాగుతోంది. ఫోల్డబుల్ మోడల్ తేవడం ద్వారా శామ్సంగ్, గూగుల్, మోటరోలా, షావొమీ, టెక్నో, వివో, వన్‌ప్లస్, ఒప్పో, హువావే, హానర్ సరసన చేరేందుకు ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.అన్నీ అనుకూలిస్తే ఒకట్రెండేళ్లలో ఐఫోన్ ఫోల్డబుల్ రంగ ప్రవేశం చేయనుంది. వీ68 కోడ్ పేరుతో ఈ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు సమాచారం. డిజైన్ విషయంలో కంపెనీ ఒక నిర్ణయానికి వచ్చింది. మరోవైపు 2025 సంవత్సరానికిగాను తక్కువ మందం కలిగిన ఐఫోన్ అభివృద్ధి చేస్తున్నటు మార్కెట్ వర్గాల సమాచారం. -
సరికొత్త మడత ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్లు!
శాంసంగ్ తన సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లను ప్రకటించింది. గెలాక్సి జెడ్ ఫోల్డ్6 (Galaxy Z Fold6), గెలాక్సి జెడ్ ఫ్లిప్6 (Galaxy Z Flip6)లను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. భారత్‌లో వీటి ధరలను ప్రకటించిన కంపెనీ ముందస్తు ఆర్డర్లను ప్రారంభించింది.గెలాక్సి జెడ్ ఫ్లిప్6 (12GB+256GB) ధర రూ. 1,09,999 కాగా 12GB+512GB వెర్షన్ ధర రూ. 1,21,999. ఇక 12GB+256GB వేరియంట్లోని గెలాక్సి జెడ్ ఫోల్డ్6 ధర రూ.1,64,999 కాగా, 12GB+512GB వెర్షన్ రూ.1,76,999కి వస్తుంది. 12GB+1TB (సిల్వర్ షాడో కలర్) ధర రూ. 2,00,999 అని కంపెనీ తెలిపింది."డివైస్‌లను ప్రీ-ఆర్డర్ చేసే వారు రూ. 14,999 విలువ చేసే 'గెలాక్సీ జెడ్ అస్యూరెన్స్'లో భాగంగా రెండు స్క్రీన్లు, విడిభాగాలను కేవలం రూ. 999కి పొందుతారు" అని కంపెనీ తెలిపింది, ప్రస్తుత శాంసంగ్ ఫ్లాగ్షిప్ కస్టమర్లు రూ. 15,000 అప్‌గ్రేడ్ బోనస్‌ను పొందవచ్చని కంపెనీ పేర్కొంది.గెలాక్సి జెడ్ ఫోల్డ్6, గెలాక్సి జెడ్ ఫ్లిప్6 ఫోల్డబుల్ ఫోన్లతో పాటు గెలాక్సి బడ్స్3 (Galaxy Buds3), గెలాక్సి బడ్స్3 ప్రో (Galaxy Buds3 Pro)లను కూడా శాంసంగ్ లాంచ్ చేసింది. వీటిలో బడ్స్3 ధర రూ. 14,999 కాగా బడ్స్3 ప్రో ధర రూ. 19,999. శాంసంగ్ గెలాక్సి ఫోల్డబుల్ ఫోన్లు, బడ్స్ అమ్మకాలు జూలై 24 నుంచి ప్రారంభం కానున్నాయి.గెలాక్సి జెడ్ ఫోల్డ్6 స్పెసిఫికేషన్లు» 7.60-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే» స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్» 10-మెగాపిక్సెల్ + 4-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా» 50-మెగాపిక్సెల్ + 12-మెగాపిక్సెల్ + 10-మెగాపిక్సెల్ రియర్ కెమెరా» 12GB ర్యామ్, 256GB, 512GB, 1TB స్టోరేజ్» 4400mAh బ్యాటరీ కెపాసిటీ» ఆండ్రాయిడ్ 14 ఓఎస్గెలాక్సి జెడ్ ఫ్లిప్6 స్పెసిఫికేషన్లు» 6.70-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే» స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్» 10-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా» 50-మెగాపిక్సెల్ + 12-మెగాపిక్సెల్ రియర్ కెమెరా» 12GB ర్యామ్, 256GB, 512GB స్టోరేజ్» 4000mAh బ్యాటరీ కెపాసిటీ» ఆండ్రాయిడ్ 14 ఓఎస్ -
మరో మడత ఫోన్ వచ్చేస్తోంది.. రేటు రూ.లక్షకు పైనే!
దేశ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి మరో మడత ఫోన్ వచ్చేస్తోంది. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివొ గ్రేటర్ నోయిడాలోని కర్మాగారంలో తయారైన తన లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను భారత్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.వివో తన నాలుగో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసిన తర్వాత, ఈ ఫోన్‌ను భారత్‌కు తీసుకురానుంది. భారత మార్కెట్లో వివో నుంచి దేశంలోకి వచ్చిన తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే అవుతుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ తేదీని జూన్ 6గా వివో ధ్రువీకరించింది. తొలి ఫోల్డబుల్ ఫోన్ తో ప్రీమియం సెగ్మెంట్ లో శాంసంగ్, యాపిల్ సరసన చేరాలని వివో భావిస్తోంది.వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)తేలికపాటి డిజైన్‌ను మన్నికతో సమతుల్యం చేసేలా కార్బన్ హింజ్ ఫైబర్.6.53 అంగుళాల కవర్ డిస్ ప్లే, 8.03 అంగుళాల ఇన్నర్ అమోల్డ్ ఎల్టీపీఓ ఫోల్డింగ్ డిస్ ప్లే2480-2200 రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, హెచ్ డీఆర్ 10+ సపోర్ట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీ, అడ్రినో జీపీయూ16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ యూఎఫ్ఎస్ 4.0 వరకు స్టోరేజ్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టం50 మెగాపిక్సెల్ అల్ట్రా-సెన్సింగ్ మెయిన్ కెమెరా, 64 మెగాపిక్సెల్ 3ఎక్స్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, వీ3 ఇమేజింగ్ చిప్సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాఅంచనా ధరవివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా విక్రయించనున్నారు. చైనాలో దీని ధర 9,999 యువాన్లుగా(సుమారు రూ.1.17 లక్షలు) ఉండగా, భారత్‌లో దీని ధర రూ.1.2 లక్షలుగా ఉండొచ్చని అంచనా. -
ఐఫోన్ల విక్రయాలు కొత్త రికార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల విపణిలో యాపిల్ కొత్త రికార్డు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై–సెపె్టంబర్ కాలంలో 25 లక్షల యూనిట్లకుపైగా ఐఫోన్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 34 శాతం అధికంగా సాధించడం విశేషం. ఒక త్రైమాసికంలో భారత్‌లో కంపెనీ ఖాతాలో ఇదే ఇప్పటి వరకు రికార్డు. ఖరీదైన మోడళ్లకు మార్కెట్ మళ్లుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. సెపె్టంబర్ త్రైమాసికంలో భారత్‌లో 17.2 శాతం వాటాతో శామ్సంగ్ తొలి స్థానంలో నిలిచింది. నాలుగు త్రైమాసికాలుగా శామ్సంగ్ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోందని పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ బుధవారం వెల్లడించింది. ఏ, ఎం సిరీస్ ఫోన్లు ఇందుకు దోహదం చేసిందని తెలిపింది. ఇక 16.6 శాతం వాటాతో షావొమీ రెండవ స్థానం ఆక్రమించింది. రూ.30–45 వేల ధరల శ్రేణి విభాగంలో వన్‌ప్లస్ 29 శాతం వాటాతో సత్తా చాటుతోంది. ఫోల్డబుల్ మోడళ్లకు.. ప్రీమియం విభాగం, 5జీ లక్ష్యంగా కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. రూ.45,000 ఆపైన ఖరీదు చేసే అల్ట్రా ప్రీమియం మోడళ్లకు డిమాండ్ ప్రతి త్రైమాసికంలోనూ పెరుగుతూ వస్తోంది. సెప్టెంబర్ క్వార్టర్లో అల్ట్రా ప్రీమియం మోడళ్ల అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 44 శాతం దూసుకెళ్లాయి. సులభ వాయిదాలు, ఇతర ప్రోత్సాహకాలు, నూతన టెక్నాలజీవైపు కస్టమర్ల మొగ్గు ఇందుకు దోహదం చేశాయి. ఫోల్డబుల్ మోడళ్లకు డిమాండ్ దూసుకెళ్తోంది. ఈ విభాగంలోకి కంపెనీలు క్రమంగా ప్రవేశిస్తున్నాయి. అన్ని బ్రాండ్ల అమ్మకాల్లో 5జీ స్మార్ట్ఫోన్ల వాటా ఏకంగా 53 శాతానికి ఎగబాకింది. 10–15 వేల ధరల శ్రేణిలో ఎక్కువ మోడళ్లను కంపెనీలు ప్రవేశపెట్టాయి. వీటిలో 5జీ మోడళ్ల వాటా ఏడాదిలో 7 నుంచి 35 శాతానికి చేరింది. ఆసక్తికర విషయం ఏమంటే 5జీ, అధిక ర్యామ్ (8జీబీ) వంటి కీలక ఫీచర్లు రూ.10,000లోపు సరసమైన స్మార్ట్ఫోన్లకు విస్తరించాయి. -
శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్: అదిరిపోయే ఫోల్డబుల్ స్మార్ట్‌పోన్స్, వాచ్ 6, ప్యాడ్ 9 సిరీస్ (ఫోటోలు)
-
శాంసంగ్ కొత్త మడత ఫోన్లు వచ్చేశాయ్..అదిరిపోయే ఆఫర్‌తో...
Samsung Galaxy Z Fold 5 and Z Flip 5: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ బుధవారం సియోల్‌లో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో రెండు కొత్త ఫోల్డింగ్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 , గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 పేరుతో రెండు ఫోల్డబుల్ స్మార్ట్పోన్లను తీసుకొచ్చింది. అలాగే గెలాక్సీ వాచ్ 6 సిరీస్, గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్‌ను కూడా ఆవిష్కరించింది.గత సంవత్సరం మాదిరిగానే, కొత్తగెలాక్సీ S9 సిరీస్‌లో మూడు మోడల్స్తీసుకొచ్చింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్, గెలాక్సీ ఎస్ 9 అల్ట్రా మోడల్స్‌ను లాంచ్ చేసింది. ('ట్యాప్ & పే' ఫీచర్‌తో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6..యాపిల్‌కు షాకే!) ప్రీమియం సెగ్మెంట్లో ఆండ్రాయిడ్ ప్రత్యర్థులైన షావోమి, ఒప్పో లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. కొత్తగా లాంచ్ అన్ని డివైస్‌లు ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి. Snapdragon 8 Gen 2 SoC కొత్త కీలు డిజైన్‌తోపాటు Z Flip 5 డిస్ప్లేకి కొన్ని అప్గ్రేడ్లను కూడా చేసింది. (మారుతి జిమ్నీని సింగిల్ బెడ్‌తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో) కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు, ధరలు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (8 జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్): రూ 99,999 గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (8జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్): రూ 1,09,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12 జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ): రూ 1,54,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్): రూ 1,64,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12జీబీ ర్యామ్ + 1టీబీ స్టోరేజ్): రూ 1,84,999 ప్రీ-బుకింగ్ కస్టమర్లు రూ. 23,000 (జెడ్ ఫ్లిప్ 5 కోసం రూ. 20,000) వరకు విలువైన ప్రయోజనాలను పొందుతారని శాంసంగ్ వెల్లడించింది. ఇందులో క్యాష్‌బ్యాక్ అప్‌గ్రేడ్ బోనస్‌లు ఉంటాయని పేర్కొంది. ప్రీ-బుకింగ్ విండో జూలై 27 నుంచి మొదలు. ఆగస్టు 17 లైవ్ సేల్, ఆ తర్వాత విక్రయాలు ఉంటాయి. -
శాంసంగ్ లాంచ్ ఈవెంట్: అంచనాలు మామూలుగా లేవుగా!
Galaxy Unpacked 2023: దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో సహా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ ఫ్లిప్ 5లను భారత మార్కెట్లో తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. దక్షిణ కొరియాలోని సియోల్‌లో డిజిటల్ ఇన్ పర్సన్ ఈవెంట్‌గా జరుగుతుంది. మెరుగైన కెమెరాలు, బిగ్ డిస్ప్లే లాంటివి ఫీచర్లతో ముఖ్యంగా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో తీసుకురానుందని అంచనా. దీనికి తోడు ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వీటి ధర, ముందస్తు ఆఫర్ గురించి లీక్ చేయడంతో మరింత ఉత్కంఠ పెరిగింది. ఈ లీక్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ధర రూ. 1,49,999గా ఉంటుందని, ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 1,43,999కే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ధర రూ.99,999గఘుంది. అయితే ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 94,999కి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ : 5, 7.6 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే, 6.2 అంగుళాల కవర్ డిస్ప్లే, 50+12+10 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 12 ఎంపీ సెల్పీ కెమెరా లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. అలాగే 6.7 అంగుళాల మెయిన్ డిస్ప్లే, 3.4 అంగుళాల కవర్ డిస్ప్లేతో గెలాక్సీ ఫ్లిప్ ఫోన్ తీసుకొస్తోంది. అయితే అధికారిక లాంచింగ్ తరువాత దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గెలాక్సీ వాచెస్, గెలాక్సీ ట్యాబ్స్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 , వాచ్ 6 క్లాసిక్‌లను కూడా లాంచ్ చేయనుంది. బిగ్ స్క్రీన్లు సన్నని బెజెల్‌లను కలిగి ఉంటాయని అంచనా. దీంతోపాటు అప్‌గ్రేడ్ చేసిన డిస్ప్లేలు , ప్రాసెసర్లతో Tab S9, S9 ప్లస్ , S9 అల్ట్రాలను కలిగి ఉండే Galaxy Tab S9 సిరీస్‌ని కూడా లాంచ్ చేయనుంది. తొలి స్మార్ట్ రింగ్ అంతేకాదు శాంసంగ్ తన తొలి స్మార్ట్ రింగ్, గెలాక్సీ రింగ్, కొత్త వైర్లెస్ ఇయర్‌బడ్‌లు, బడ్స్ 3తో కూడా ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరచవచ్చని భావిస్తున్నారు. -
గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: సెలబ్రిటీలు ఉపయోగించే స్మార్ట్ఫోన్లపై ఆసక్తి ఉంటుంది. అందులోనూ టెక్ నిపుణులు, స్వయంగా స్మార్ట్‌ఫోన్ మేకర్స్ తమ సొంత ఫోన్లనే వాడతారా లేక వేరే కంపెనీలవి వాడతారా అనేది ఆరా తీస్తాం. తాజాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ దీనికి సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించారు. గూగుల్ కంపెనీ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘పిక్సెల్ ఫోల్డ్’ను ఇటీవల లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వార్షిక డెవలపర్ల సమావేశంలో పిక్సెల్ ఫోల్డ్ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సందర్ పిచాయ్ స్వయంగా పిక్సెల్‌ని ఉపయోగిస్తున్నారా? లేదా అనుమానం రాకమానదు. ఈ క్రమంలో అడిగిన ప్రశ్నకు సుందర్ పిచాయ్ తనదైన శైలిలో జవాబు చెప్పారు. గూగుల్ ఉత్పత్తులను వినియోగించే తొలి యూజర్లలో తానూ ఒకడినని వెల్లడించారు. గూగుల్ ఇటీవల విడుదల అయిన పిక్సల్ ఫోల్డ్ , పిక్సల్ 7ఏ ఫోన్లను (టెస్టింగ్) వినియోగిస్తున్నట్టు చెప్పారు. (Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ) యూట్యూబర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పిచాయ్ తాను పిక్సెల్ ఫోల్డ్‌ను చాలా కాలంగా పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు. అయితే గూగుల్ పిక్సల్ 7 ప్రోను తన ప్రైమరీ ఫోన్‌గా వినియోగిస్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. అలాగే శాంసంగ్ గెలాక్సీ నుంచి, కొత్త గూగుల్ పిక్సెల్ ఫోల్డ్, ఐఫోన్దాకా దాదాపు అన్ని ఫోన్లను టెస్టింగ్ కోసం వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. మల్టీటాస్కింక్, ఒకేసారి వివిధ యాప్‌లలో పని చేయడానికి పిక్సెల్ ఫోల్డ్ వాడడాన్ని ఇష్టపడతారట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వేర్వేరు సిమ్ కార్డులకు వేర్వేరు ఫోన్లను వినియోగిస్తానన్నారు. (Infosys: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం, షాక్‌లో ఉద్యోగులు!) ఇక స్మార్ట్ఫోన్ల భవిష్యత్తుపై మాట్లాడిన సుందర్ పిచాయ్ ప్రజల అవసరాలకు అనుగుణంగా వారు మెచ్చే స్మార్ట్ఫ్లోన్లను అందించాలనుకుంటున్నామని, ఇందులో ఫోల్డబుల్ ఫోన్లు మాత్రమే తమ అంతిమ లక్ష్యం కాదని చెప్పుకొచ్చారు. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) సాంకేతికత ప్రారంభ దశలో ఉన్న ఈనాటిలా కాకుండా ఏఐ మరింత నేచురల్‌గా ఉండబోతోందన్నారు. రానున్న సంవత్సరాల్లో మరింత ఇంటరాక్టివ్‌గా, సహజమైన భాషలతో ఫోన్లు ప్రతిదీ అర్థం చేసుకునేలా ఉంటుందన్నారు. అలాగే ఇప్పటివరకు మానవులు ఏఐకి అనుగుణంగా ఉన్నారు.కానీ అయితే భవిష్యత్తులో ఏఐ అనేది మానవులకు అనుగుణంగా మారిపోయేలా కంప్యూటర్లను ఎనేబుల్ చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, సక్సెస్ స్టోరీలు, ఇతర అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి,బిజినెస్ View this post on Instagram A post shared by Arun Maini (@mrwhosetheboss) -
రూ. 1.50 లక్షల గూగుల్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ - ప్రత్యేకతలివే!
ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్లు కొత్త కొత్త అవతారాలలో పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఫోల్డబుల్ మొబైల్స్ మార్కెట్లో విడుదలవుతున్నాయి. కానీ గూగుల్ సంస్థ మొదటి సారి తన ఫిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ దేశీయ విఫణిలోకి లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మొబైల్ ప్రైస్, ఫీచర్స్ వంటి వాటితో పాటు ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి. ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ భారతదేశంలో తన కొత్త ఫోల్డబుల్ మొబైల్ లాంచ్ చేసింది. 'గూగుల్ ఫిక్సెల్ ఫోల్డ్' అని పిలువబడే ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో విడుదలైంది. అవి 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్. వీటి ధరలు వరుసగా రూ. 1,47,500 & రూ. 1,57,300. ఈ మొబైల్స్ అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌లో మొదలయ్యాయి. ఒబ్సిడియన్, పోర్సెలాయిన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో విడుదలైంది. గూగుల్ ఫోల్డబుల్ మొబైల్ 7.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ OLED ఇన్నర్ డిస్ప్లేతో పాటు 5.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఔటర్ డిస్ప్లే కూడా పొందుతుంది. ఈ డిస్ప్లేలు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో ఔటర్ డిస్ప్లే పొందుతాయి. (ఇదీ చదవండి: నిండా 18 ఏళ్ళు లేవు..! రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన కారు కొనేసాడు - వీడియో) ఈ లేటెస్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో మూడు రియర్ కెమెరాలను పొందుతుంది. అవి 48 మెగాఫిక్సల్ ప్రైమరీ కెమెరా, 10.8 మెగాఫిక్సల్ అల్ట్రావైడ్, 10.8 మెగాఫిక్సల్ డ్యూయెల్ పీడీ టెలిఫోటో లెన్స్ కెమెరా. అయితే సెల్ఫీలు, వీడియోల కోసం ఔటర్ డిస్ప్లేకి 9.5 మెగాఫిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అంతే కాకుండా ఈ మొబైల్ ఫోల్డ్ చేసినప్పుడు 8 మెగాఫిక్సల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు) ఇక బ్యాటరీ, ఛార్జింగ్ వంటి విషయాలకు వస్తే.. ఇందులో 4821mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 30 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఫోన్ మొత్తం బరువు 283 గ్రాములు మాత్రమే. ఇందులో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. -
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్-3 5జీ పై ఊహించని డిస్కౌంట్
సాక్షి, ముంబై: శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఇపుడు ఐఫోన్ 13 కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇపుడు రూ.44,999కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్‌లో భాగంగా గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై ఈ తగ్గింపు లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,250 వరకు తక్షణ తగ్గింపు అదనం. రూ. 95,999 ధరతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పటికే Android 13 OS అప్డేట్ను పొందిన దీనికి రానున్న Android 14 OSకి అప్డేట్ పొందొచ్చు. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, ఒప్పో ఎన్ 2 ఫ్లిప్ ధరలు రూ. 89,999కిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 తక్కువ ధరకు లభిస్తున్నట్టే. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫీచర్లు 1.9-అంగుళాల కవర్ డిస్ప్లే 6.7-అంగుళాల డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్ డ్యుయల్ 12-మెగాపిక్సెల్ కెమెరాలు రెండో డిస్ప్లే ప్యానెల్లో 10మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3300mAh బ్యాటరీ -
Tecno Phantom V Fold వచ్చేసింది: అతి తక్కువ ధరలో, అదిరిపోయే పరిచయ ఆఫర్
సాక్షి, ముంబై: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో, టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ లాంచ్ అయింది. స్మార్ట్‌ఫోన్ దిగ్గజం టెక్నో ఫాంటమ్ నుంచి భారత మార్కెట్లో ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌ను దేశంలోనే అతి చవకైనదిగా కంపెనీ ప్రకటించింది ఆకట్టుకునే ప్రీమియం డిజైన్, వర్చువల్లీ క్రీజ్ ఫ్రీ ఫోల్డబుల్ మెయిన్ డిస్ప్లేతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని కంపెనీ తెలిపింది. టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ భారత మార్కెట్లో రూ.88,888 ప్రారంభ ధరతో విడుదలంది. సింగిల్ వేరియంట్లో మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌పై పరిచయ ఆఫర్ కూడా ఉంది. స్పెషల్ డిస్కౌంట్‌తో ధర రూ.77,777 వద్ద ఏప్రిల్ 12న అందుబాటుల ఉంది. దీంతో పాటు హెచ్డీబీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేల డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే రెండు సంవత్సరాల వారంటీతో పాటు, ఫాంటమ్ వీ ఫోల్డ్ రూ. 5,000 విలువైన ఉచిత ట్రాలీ బ్యాగ్, కొనుగోలు చేసిన ఆరు నెలల్లోపు వన్-టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్, స్టాండ్‌తో కూడిన ఉచిత ఫైబర్ ప్రొటెక్టివ్ కేస్ లభించనుంది. ఫాంటమ్ వీఫోల్డ్కి గట్టి పోటీగా భావిస్తున్న శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 ధర రూ. 1,54,998గాఉంది. ఫాంటమ్ వీఫోల్డ్స్పెసిఫికేషన్స్: 6.42-అంగుళాల LTPO, ఔటర్ AMOLED డిస్ప్లేను. ప్రాథమిక లోపలి స్క్రీన్ 2296 X 2000 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 7.65-అంగుళాల 2K LTPO AMOLED ఫోల్డబుల్ డిస్ప్లే. ఫోన్ కంటెంట్ ఆధారంగా 120Hz రిఫ్రెష్ రేట్ వరకు వేరియబుల్తో వస్తుంది.ఏరోస్పేస్-గ్రేడ్ ఇన్నోవేటివ్ డ్రాప్-షేప్ కీ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. స్టేబుల్-రేషియో రొటేట్, స్లైడ్ టెక్, రివర్స్ స్నాప్ స్ట్రక్చర్‌ను కలిగి ఉంది. ఫోల్డ్, క్రీజ్-ఫ్రీ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని టెక్నో కంపెనీ చెప్పింది. హుడ్ కింద MediaTek ఫ్లాగ్షిప్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ ఉంది. ఈ చిప్సెట్ గరిష్టంగా 12GB LPDDR5 RAM, 512GB UFS 3.1 స్టోరేజీతో లభ్యం. ట్రిపుల్ రియర్ కెమెరా 50 ఎంపీ ప్రైమరీ కెమెరా , 13ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 50ఎంపీ 2x పోర్ట్రెయిట్ కెమెరాతో వచ్చింది. అలాగే ఔటర్ డిస్ప్లేలో 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇన్నర్ ఫోల్డబుల్ డిస్ప్లేలో 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాలున్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సెక్యూరిటీ , చక్కటి ఆడియో అనుభవం కోసం స్టీరియో స్పీకర్లను పొందుపరిచింది. (బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్: కీవే బైక్స్‌పై భారీ ఆఫర్) కాగా టెక్నో ఇటీవల MWC 2023లో తన తొలి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్వ వీ ఫోల్డ్‌ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజగా కంపెనీ ఎట్టకేలకు దీనిని భారతదేశంలో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఫాంటమ్ వీ ఫోల్డ్ దేశంలో అత్యంత సరసమైన ఫుల్-స్క్రీన్ ఫోల్డింగ్ స్మార్ట్ఫోన్లలో ఒకటిగా నిలిచింది. ( ఇదీ చదవండి: మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత) -
ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్: శాంసంగ్ మరో వినూత్న ఆవిష్కారం!
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ మరో కీలక ఆవిష్కారానికి సిద్ధమవుతోంది. మూడు ఫోల్డింగ్స్తో ఒక స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సన్నద్ధమవుతోందిట. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ షేర్ చేసిన వివరాల ప్రకారం, శాంసంగ్ ట్రై-ఫోల్డ్ డిస్ప్లేతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. మరోవైపు ఈ ఏడాది చివర్లో లాంచ్ చేయనుందని భావిస్తున్న ఫ్లాగ్షిప్ గెలాక్సీ S23 సిరీస్ స్మార్ట్‌ఫోన్ 'ఫ్యాన్ ఎడిషన్’ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ సంస్థ డెవలప్ మెంట్లో లేదని టిప్‌స్టర్ తెలిపింది. మూడు మడతలతో కాన్సెప్ట్ డిస్ప్లే పిక్స్‌ను షేర్ చేసింది. గతంలో CES 2022లో ట్రై-ఫోల్డ్ డిస్ప్లేలతో కాన్సెప్ట్ పరికరాలను ప్రదర్శించింది. జెడ్ సిరీస్ ఫోల్డబుల్ ఫోన్ల మెరుగైన వెర్షన్‌పై పని చేస్తోందనీ, ముఖ్యంగా జెడ్ ఫోల్డ్ 5 గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5గా తోపాటు మూడు మడతల ఫోన్ తీసుకు రానుందని తెలిపింది. ఫ్లెక్స్ ఎస్, ఫ్లెక్స్ జీ పేరుతో ఇవి రానున్నాయని అంచనా. కాగా జనవరిలో Samsung CES 2023లో 360-డిగ్రీల రొటేటింగ్ స్క్రీన్‌తో “ఫ్లెక్స్ ఇన్ అండ్ అవుట్” డిస్ప్లే కోసం ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. డిస్ప్లే లోపలికి బుక్ కవర్లా, లేదా వార్తాపత్రికలా బయటకి మడవగలదు. సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్తో ఫంక్షనల్ “ఫ్లెక్స్ ఇన్ అండ్ అవుట్” డిస్ప్లే జోడిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. There is no Galaxy S23 FE in the development chain unlike what the recent rumours have been pointing.. Samsung is instead working on the improved Z Fold 5 & Flip 5 along with a Tri-Fold that might finally ship this year FE fans should look elsewhere... — Yogesh Brar (@heyitsyogesh) March 24, 2023 -
వివో నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది - వివరాలు
రోజు రోజుకి మార్కెట్లో కొత్త మొబైల్ ఫోన్స్ విడుదలవుతుండటంతో వినియోగదారులు కూడా కొత్త ఉత్పత్తులను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వివో కంపెనీ ఎక్స్ ఫ్లిప్ ఫోల్డబుల్ అనే స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా శాంసంగ్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ తరహా మొబైల్స్ లాంచ్ చేశాయి. కాగా ఈ విభాగంలో వివో కూడా చేరనుంది. ఇందులో భాగంగా కంపెనీ విడుదలకానున్న కొత్త మొబైల్ మోడల్ నెంబర్ కూడా (V2256A) తెలిపింది. దీన్ని బట్టి చూస్తే ఇది త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. భారతీయ మార్కెట్లో విడుదలకానున్న వివో ఎక్స్ ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్, 50MP సోనీ IMX8606 ప్రైమరీ కెమెరా వంటి వాటితోపాటు 6.8 ఇంచెస్ 120Hz మెయిన్ డిస్ప్లే, పైన చిన్న సెకండరీ డిస్ప్లేను పొందుతుంది. మొత్తం మీద ఇది కొనుగోలుదారులను ఆకర్శించే విధంగా తయారైవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. (ఇదీ చదవండి: వేల కోట్ల కంపెనీకి బాస్ 'జయంతి చౌహాన్' గురించి ఆసక్తికర విషయాలు) వివో ఎక్స్ ఫ్లిప్ అనేది చైనీస్ ఉత్పత్తి అయినప్పటికీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్‌లో 1,695 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్‌లో 4,338 పాయింట్లను స్కోర్ చేసింది. ఇది ఆధునిక ఫీచర్స్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ మొబైల్ ఫోన్ ధరలు ఇంకా వెల్లడి కాలేదు, కానీ దీని ధర సుమారు రూ. 79,990 వరకు ఉంటుందని అంచనా, ఇది ఏప్రిల్ 17న విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వచ్చేసింది! భారీ డిస్కౌంట్ కూడా
సాక్షి,ముంబై: ఒప్పో తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఎ ట్టకేలకు భారత మార్కెట్లో లాంచ్ చేసింది. పలు ప్రపంచ మార్కెట్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం ఆవిష్కరించింది. మరీ ముఖ్యంగా రూ. 10వేల తగ్గింపుతో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్4 కంటే బిగ్ డిస్ప్లేతో దీన్ని తీసుకొచ్చింది. అంతేకాదు 3.26 అంగుళాల అతిపెద్ద వెర్టికల్ కవర్ స్క్రీన్ డిస్ప్లే ఎపుడూ ఆన్‌లోనే ఉంటుందట. ఇండియాలో దీని ప్రారంభ ధర రూ. 89,999గా ఉంనుంది. అయితే క్యాష్‌బ్యాక్‌లు ,ఇతర ప్రోత్సాహకాల ద్వారా కస్టమర్లు దీన్ని రూ. 79,999 కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. (ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ) ఒప్పో స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్ ,మెయిన్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్స్‌లో మార్చి 17, మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్‌లు, కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీబి ఫైనాన్షియల్ సర్వీసెస్, వన్ కార్డ్ , అమెక్స్పై కస్టమర్లు రూ. 5000 వరకు క్యాష్‌బ్యాక్, 9 నెలల వరకు నో-కాస్ట్ EMIని ఆస్వాదించవచ్చు. అలాగే ఒప్పో కస్టమర్లు రూ. 5000 వరకు ఎక్స్ఛేంజ్ + లాయల్టీ బోనస్‌ను పొందవచ్చు. ఇంకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరో రూ. 2000 వరకు తగ్గింపు లభ్యం. ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫీచర్లు 6.8-అంగుళాల e6 ఫోల్డింగ్ డిస్ప్లే 4nm MediaTek డైమెన్సిటీ 9000+ చిప్సెట్ ColorOS 13 ఆండ్రాయిడ్ 13 16జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ 50+ 8(ఫిక్స్డ్-ఫోకస్ అల్ట్రావైడ్ షూటర్) ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 32ఎంపీ ఆటో ఫోకస్ సెల్ఫీ కెమెరా 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,300mAh బ్యాటరీ -
రియల్మీ దూసుకొస్తోంది..దిగ్గజాలకు గట్టి షాకిస్తుందా?
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్మీ కూడా త్వరలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించ నున్నది. ఈ విషయాన్ని రియల్మీ సీఈవో మాధవ్ సేథ్ సోషల్‌మీడియాలో వెల్లడించారు. తద్వారా ఇప్పటికే ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లతో ఆకట్టు కుంటున్న శాంసంగ్, హువావే వివో, ఒప్పో, టెక్నో, మోటరోలా, షావోమీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సీఈవో మాధవ్ సేథ్ తమ ఫోల్డబుల్ ఫోన్ గురించి ట్వీట్ చేశారు రియల్మీఫోల్డ్, రియల్మీ ఫ్లిప్ ఈ రెండింటిలో ఏది కావాలి అని ప్రశ్నించారు. తద్వారా రియల్మీ ఫోల్డ్‌బుల్ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌పై కీలక సంకేతాలిచ్చారు. మరోవైపు 2022 నవంబరులోనే రియల్మీ చైనా వైస్ ప్రెసిడెంట్ జుక్వి భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ ఎఫర్డబుల్ ఫోల్డబుల్‌పై పనిచేస్తోందని హింటిచ్చారు. ప్రతీ ఏడాది రెండు GT నియో-బ్రాండెడ్ ఫోన్లు, నంబర్ సిరీస్ ఫోన్లు రెండు, ఒక GT సిరీస్ మోడల్‌ను విడుదల చేయనున్నామని ప్రకటించారు. కాగా శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ , Z ఫ్లిప్ తోపాటు, షావోమీ మిక్స్ ఫోల్డ్2, మోటరోలా రేజర్, ఒప్పో ఫైండ్ ఎన్2 ప్లిప్, టెక్నో పాంథమ్ వీ ఫోల్డ్ వంటి ఆప్షన్లతో ఫోల్డబుల్ ఫోన్లు స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే వన్‌ప్లస్, పిక్సెల్ ఫోల్డబుల్ త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ జాబితాలో ఇకపై రియల్మీ కూడా చేరనుంది. What do you want next… #realmeFlip or #realmeFold? — Madhav Sheth (@MadhavSheth1) March 9, 2023 -
Samsung Galaxy Z Fold 5: మడత అంటే ఇదీ.. పర్ఫెక్షన్ అంటే ఇదీ!
రకరకాల మోడళ్లతో స్మార్ట్ ఫోన్ బిజినెస్‌లో దూసుకుపోతున్న శాంసంగ్.. త్వరలో విడుదల చేయనున్న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 మడత ఫోన్‌కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ మడత కీలు(హింజ్) ఇది 2 లక్షల మడతలను తట్టుకోగలదని తెలిసింది. ప్రస్తుతం ఈ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 వాటర్‌డ్రాప్ హింజ్ డిజైన్ ఆఖరి పరీక్ష జరుపుకోబోతోందని 9టు5గూగుల్ అనే సంస్థ పేర్కొంది. ఈ ఫోన్ కొత్త ఫీచర్ ప్రత్యేకత ఏంటంటే ఎంత మడిచినా స్క్రీన్‌పై ఎటువంటి తేడా ఉండదు. అలాగే మడతపెట్టినప్పుడు కూడా గ్యాప్ కనిపించదు. ఇక ఫోన్ కొత్త డిజైన్ మునుపటి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4తో పోలిస్తే సన్నగా ఉంటుంది.మ ఇదీ చదవండి: ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ పెళ్లి.. ఆహ్వానితుల్లో అత్యంత ప్రముఖులు! ఎవరెవరు వస్తున్నారో తెలుసా? త్వరలో లాంచ్ కానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన మడత కీలు(హింజ్), డిస్ప్లే ప్యానెల్ 2 లక్షల నుంచి 3 మడతల వరకు తట్టకునేలా శాంసంగ్ విశ్వసనీయత పరీక్ష నిర్వహిస్తున్నట్లు 9టు5గూగుల్ నివేదిక పేర్కొంది. శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 5 డ్రాప్లెట్ స్టైల్ హింజ్‌ను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ గత జనవరిలో తెలిపింది. అది ఫోన్ డిస్ప్లే క్రీజ్‌ను తగ్గిస్తుందని వివరించింది. దీనికి 108 ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా, అంతర్నిర్మిత స్టైలస్ పెన్ (ఎస్ పెన్) స్లాట్‌ను కలిగి ఉంటుందని గతంలో పుకారు వచ్చింది. -
త్వరలోనే మోటరోలా కొత్త వర్షన్ మడత ఫోన్లు.. ప్రకటించిన సీఈవో
మోటరోలా కొత్త వర్షన్ మడత ఫోన్లు త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఈ ఏడాదిలోనే మోటరోలా రేజర్ (Motorola Razr) ఫోల్డబుల్ కొత్త వర్షన్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు లెనోవో సీఈవో యువాన్‌కింగ్ యాంగ్ తెలిపారు. దశాబ్దాల క్రితం బాగా పాపులరైన మడత ఫోన్ మోడళ్లు ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో మళ్లీ ఆదరణ పొందుతున్నాయి. 2000 సంవత్సరంలో మోటరోలా రేజర్ మడత ఫోన్ బాగా పాపులర్ అయిన ఫోన్లలో ఒకటి. మోటరోలా సంస్థను గూగుల్ నుంచి 2014లో లెనోవో సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా సీఎన్‌బీసీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లెనోవో సీఈవో యువాన్‌కింగ్ యాంగ్ మోటరోలా రేజర్ ఫోన్ గురించి మాట్లాడారు. కొత్త వర్షన్ మడత ఫోన్‌ను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించిన వివరాలను ఎక్కువగా ప్రస్తావించని ఆయన ఆ ఫోన్లో అప్లికేషన్లు, ఇతర ఫీచర్లు మాత్రం అందరికీ నచ్చేలా ఉంటాయన్నారు. ఫోల్డబుల్ ఫోన్ల ధరలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో తగ్గుతాయని పేర్కొన్నారు. చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో ట్రావెల్ క్రెడిట్ కార్డ్! కాగా ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో మోటరోలా తన ‘రోలబుల్’ కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా ప్రదర్శించింది. ఇందులో రోల్ అప్ డిస్ప్లే ఉంటుంది. అంటే ఫోన్ డిస్ప్లేను కింది నుంచి పైకి జరపవచ్చన్న మాట. చదవండి: WTW Report: పెరగనున్న జీతాలు.. ఆసియా-పసిఫిక్‌లో భారత్ టాప్! -
టెక్నో ఫస్ట్ ఫోల్డబుల్ ‘ఫాంటమ్ వీ ఫోల్డ్’ లాంచ్, తక్కువ ధరలో
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ తన తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ బార్సిలోనా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఆవిష్కరించింది.ఫ్లాగ్షిప్ 4nm MediaTek డైమెన్సిటీ 9000+ SoC స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో ముందుగా లాంచ్ కానుందని ప్రకటించింది. టెక్నో MWC 2023లో అలాగే టెక్నో స్పార్క్ 10 ప్రో, మెగాబుక్ ఎస్1 2023ని ఆవిష్కరించింది. అలాగే ధరను కూడా ధృవీకరించింది. 15 నిమిషాల్లో 40 శాతానికి రీఛార్జ్, 55 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుందని, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్4 కంటే స్క్రీన్ కంటే పెద్దగా ఉందని వెల్లడించింది. అల్ట్రా-క్లియర్ 5-లెన్స్ కెమెరాలతో, ప్రపంచంలోనే మొదటి లెఫ్ట్-రైట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అని పేర్కొన్నారు ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధరలు రూ.89,999(ఆఫర్ ధర) వరుసగా రూ. 99,999. నలుపు, తెలుపు అనే రెండు కలర్ వేరియంట్లలో అందిస్తోంది. ముందుగా తీసుకున్నవారికి 10 వేల డిస్కౌంట్ కూడా అందిస్తోంది. క్యూ2లో సేల్స్ మొదలు పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ స్పెసిఫికేషన్స్ 6.42-అంగుళాల LTPO AMOLED కవర్ డిస్ప్లే 1080x2550 రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ 7.85-అంగుళాల (2000x2296) ప్రధాన డిస్ప్లే 1080x2550 రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ 50+50+13 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 32+ 16 మెగాపిక్సెల్ రెండు సెల్ఫీ కెమెరాలు -
విడుదల కానున్న ఒప్పో మడత ఫోన్.. ధర ఎంతంటే?
ఒప్పో తొలి ఫ్లిప్ఫోన్ ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. గత ఏడాది చైనా మార్కెట్లో అడుగుపెట్టిన ఈ మడత ఫోన్‌ను ఈనెల 15వ తేదీన లాంచ్ చేయనున్నట్టు ఒప్పో అధికారికంగా ప్రకటించింది. అయితే ఫ్లిప్ కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటుండగా ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌లో 3.26 అంగుళాల అమోలెడ్ సెండరీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండే 6.8 అంగుళాల అమోలెడ్ ప్రైమరీ అమోలెడ్ డిస్ప్లేతో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వస్తోంది. 5జీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమన్సిటీ 9000+ను కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఒప్పో ఇస్తోంది. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే చైనాలో 5,999 యువాన్లు (సుమారు రూ.71,200)గా ఉంది. భారత్‌లో సుమారు ఇదే ధరతో విడుదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మడత ఫోన్ పర్పుల్, బ్లాక్, గోల్డ్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. -
Tecno Phantom V Fold అద్బుత ఫీచర్లతో టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ కమింగ్ సూన్
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ కంపెనీ టెక్నో తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే విడుదల చేసింది. ఫాంటమ్ వీ ఫోల్డ్ పేరుతో దీన్ని ఈ నెల ఫిబ్రవరి 27 నుండి స్పెయిన్‌లోని బార్సిలోనాలో ప్రారంభమయ్యే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో పరిచయం చేయనుంది. ఫిబ్రవరి 28న లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ధృవీకరించింది. టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ లాంచ్ పేజీ ఇప్పటికే MWC 2023 వెబ్సైట్లో లిస్ట్ అయి ఉంది. మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ఫాం టమ్ వీ ఫోల్డ్‌ను ఫిబ్రవరి 28న MWC 2023 సందర్భంగా ఆవిష్కరిస్తున్నట్లు అధికారికంగా టెక్నో ప్రకటించింది. అంతేకాదు ప్రపంచంలోని మొట్టమొదటి లెఫ్ట్-రైట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా కూడా ఉంటుందని తెలిపింది. MediaTek డైమెన్సిటీ 9000+ SoC ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణ అనీ, చిప్సెట్ మొత్తం AnTuTu టెస్ట్ స్కోర్‌ను 1.08 మిలియన్లకు పైనే కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ లీక్ చేశారు. దీని ప్రకారం వీ ఫోల్డ్ డిస్ప్లేను సెంట్రల్-ప్లేస్డ్ హోల్-పంచ్ హౌసింగ్ సెల్ఫీ కెమెరాను, ట్రిపుల్ రియర్ కెమెరాను అమర్చినట్టు తెలుస్తోంది. ఫాంటమ్ వీ ఫోల్డ్ అంచనా ఫీచర్లు 7.1, 5.54 అంగుళాల అమెలెడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 56+16+8 ఎంపీ రియర్ కెమెరా 32+32 సెల్ఫీ కెమెరా 12 జీబీ ర్యామ్, 256/512 జీబీ స్టోరేజ్ 4500 బ్యాటరీ 67 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ Tecno Phantom V Fold 🔥 pic.twitter.com/mEnzA7whn3 — Sudhanshu Ambhore (@Sudhanshu1414) February 2, 2023 -
ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త ..‘ఫోల్డ్’పై యాపిల్ కన్ను, శాంసంగ్‌కు ధీటుగా
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్న శాంసంగ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా యాపిల్ సంస్థ ఫోల్డబుల్ ఐఫోన్‌ను మార్కెట్‌కి పరిచయం చేయాలని భావిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. శాంసంగ్..! ఫోల్టబుల్ సెగ్మెంట్లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్, జెడ్ ఫ్లిప్ సిరీస్‌తో మార్కెట్‌ను శాసిస్తుంది. దీంతో శాంసంగ్ బాటలో ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో అడుగు పెట్టాయి. మంచి మంచి ఫీచర్లు, డిజైన్లతో కొనుగోలు దారుల్ని గణనీయంగా ఆకట్టుకుంటున్నాయి. విక్రయాలు జోరుగా సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ సైతం ఫోల్డబుల్ మార్కెట్లోకి అడుగు పెట్టబోతుందంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా అల్ట్రా థిన్ కవర్ గ్లాస్‌ను తయారు చేసేందుకు.. ఎల్జీతో యాపిల్ కలిసి పనిచేయనుంది. ఇప్పటికే 20 ఇంచ్ ఫోల్డబుల్ డిస్ప్లే సప్లై చేసే తయారీ సంస్థలతో యాపిల్ మంతనాలు జరుపుతుంది. చర్చలు సఫలమైతే మరో రెండేళ్లలో ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో విడుదల కానుంది. -
గుడ్‌న్యూస్: గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ కమింగ్ సూన్
సాక్షి,ముంబై: ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో గూగుల్ తన యూజర్లకు తీపి కబురు అందించనుంది. త్వరలోనే గూగుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోనును గూగుల్ తీసుకు రానుంది. గూగుల్ తొలి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను ‘పిక్స్ల్ ఫోల్డ్’ పేరుతో దీన్ని లాంచ్ చేయనుంది. దీనిపై గూగుల్ అధికారికంగా ప్రకటించక పోయినప్పటికి ఆన్లైన్లో తాజా లీకులు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ప్రీమియం విభాగంలో గూగుల్ ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొస్తోందని యూట్యూబ్, టిప్‌స్టర్ ఫ్రంట్ పేజ్ టెక్ జాన్ ప్రాస్సెర్ వెల్లడించారు. 2023, మే నెలలో దీన్ని గూగుల్ విడుదల చేయనుందని పిక్సల్ ఫోల్డ్ ఫోన్ బ్లాక్, సిల్వర్ రంగుల్లో రానుందని తెలపారు. అలాగే పిక్సెల్ 7 ప్రొ మాదిరిగానే ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు ఉంటాయని అంచనా. ఇంకా రియర్ ట్రిపుల్ కెమెరా,బెజెల్స్‌తో కవర్ స్క్రీన్, సెల్ఫీ కెమెరా సెన్సార్ కోసం హోల్డ్-పంచ్ పిల్-ఆకారపు కటౌట్‌తో రానుంది. దీని ధర రూ.1,799 డాలర్లు అంటే సుమారు రూ.1.45 లక్షలుగా ఉండనుంది. -
శాంసంగ్ గెలాక్సీ జెడ్ మోడల్స్ , డిస్కౌంట్లు, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ ఇండియా ఫోల్డేబుల్ విభాగంలో గెలాక్సీ జడ్ ఫ్లిప్4, ఫోల్డ్4 మోడళ్లను ఆవిష్కరించింది. ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ ఇక్కడి మార్కెట్లో వీటిని పరిచయం చేశారు. వేరియంట్‌నుబట్టి ధర రూ.90 వేల నుంచి రూ.1.85 లక్షల వరకు ఉంది. ప్రీ-బుకింగ్‌లు భారతదేశంలో 50,000 దాటినట్లు దక్షిణ కొరియా దిగ్గజం ఇటీవల ప్రకటించింది. గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 అడాప్టివ్ 120 హెట్జ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ–ఓ డిస్ప్లేతో 6.7 అంగుళాల డైనమిక్ అమోలెడ్ మెయిన్ స్క్రీన్, 1.9 అంగుళాల సూపర్ అమోలెడ్ 60 హెట్జ్ కవర్ డిస్ప్లేతో ఫ్లిప్4 రూపుదిద్దుకుంది. 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 512 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ పొందుపరిచారు. గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 8GB/256GB వేరియంట్ ధర రూ. 94,999గాను, బెస్పోక్ ఎడిషన్ 8GB/256GB రూ. 97,999 గా ఉంది. గెలాక్సీ జడ్ ఫోల్డ్4 ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లేతో 7.6 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 1-120 హెట్జ్ మెయిన్ స్క్రీన్, ఇన్ఫినిటీ–ఓ డిస్ప్లేతో 6.2 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 48–120 హెట్జ్ కవర్ స్క్రీన్‌తో ఫోల్డ్4 తయారైంది. 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ ఏర్పాటు ఉంది. Galaxy Z Fold 4 బేస్ వేరియంట్ (12GB/256GB) రూ. 1,54,999గా నిర్ణయించింది. ఇక 12GB/512GB , 12GB/1TB ధరలు వరుసగా రూ. 1,64,999 రూ. 1,84,999గాఉన్నాయి. ఆఫర్లు HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై జడ్ ఫోల్డ్4 ప్రీ-బుకింగ్‌తో రూ 8,000 క్యాష్‌బ్యాక్ లేదా జడ్ ఫ్లిప్4 బుగింగ్పై రూ. 7,000 తగ్గింపు పొందవచ్చు. దాని కోసం మీకువసరం. పాత ఫోన్‌తో exchange చేసుకుంటే 7 వేల నుంచి 8 వేల రూపాయల దాకా ప్రయోజనం లభిస్తుంది. Galaxy Z Fold 4ని ప్రీ-బుక్ చేసే కస్టమర్లు రూ. 34,999 విలువైన Galaxy Watch 4 Classic (46mm బ్లూటూత్)ని కేవలం రూ. 2,999కి కొనుగోలు చేయవచ్చు You have truly unfolded your world with the all-new foldables. We are delighted to share that #GalaxyZFold4 and #GalaxyZFlip4 have crossed 50,000+ pre-bookings! Thank you for your great response. pic.twitter.com/nyIbMtJPY0 — Samsung India (@SamsungIndia) August 18, 2022 -
షావోమీ నుంచి అదిరిపోయే మడత ఫోన్, శాంసంగ్‌కు దెబ్బే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ ఆగస్ట్ 11న (గురువారం) సెకండ్ జనరేషన్ ఫోల్డబుల్ (మడత ఫోన్) ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. 'షావోమీ మిక్స్ ఫోల్డ్2' పేరుతో గతంలోనే విడుదల కావాల్సి ఉండుగా..కోవిడ్ నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తుంది. ఈ తరుణంలో గురవారం ఫోల్డబుల్ ఫోన్‌ను యూజర్లకు పరిచయం చేస్తున్నట్లు షావోమీ ప్రతినిధులు తెలిపారు. గత కొన్నేళ్లుగా శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో సత్తా చాటుతుంది. కానీ మిక్స్ ఫోల్డ్ 2తో ఈక్వేషన్ త్వరగా మారే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేకించి శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ కంటే షావోమీ ఫోన్ ధర తక్కువ ఉంటే ►షావోమీ సైతం శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ తరహాలో ఈ మిక్స్ ఫోన్2 ఫోన్లో ఆల్ట్రా థిన్ స్క్రీన్‌తో వస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హై రిఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్ స్క్రీన్లు యూజర్లను అట్రాక్ట్ చేయనున్నాయి. ►ఫ్లాగ్ షిప్ వెర్షన్ కాపోయినప్పటికీ పవర్ ఫుల్ హార్డవేర్ యూనిట్‌గా పేరొందిన స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 1 చిప్ సెట్‌తో రానుంది. ►షావోమీ ఫోల్డబుల్ ఫోన్ స్లీక్ డైమన్షన్ (పాలిష్డ్ స్మూత్ గ్లాస్)తో హైక్వాలిటీ డిస్ప్లే ఉందని షావోమీ విడుదల చేసిన ఫోన్ టీజర్‌ను చూస్తే అర్ధం అవుతుంది. ►ఆగస్టు 10న (నేడు) శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్4ని ఆవిష్కరించనుంది. రేపు షావోమీ మిక్స్ ఫోల్డ్ 2ని విడుదల చేస్తుండడం ఈ ఫోన్ మరి ఆసక్తిని రేకెత్తిస్తుంది. ►దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ 4జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తుంది. ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్ విభాగంలో మార్కెట్‌ను శాసిస్తున్న శాంసంగ్‌కు పోటీగా ఒప్పో, షావోమీలు ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. చదవండి👉 వన్‌ఫ్లస్ నుంచి మడత ఫోన్.. త్రీ ఫోల్డ్స్, ఇక గెలాక్సీకి గట్టి పోటీనే! -
వచ్చేస్తోంది..వివో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..లాంచ్ ఎప్పుడంటే..?
ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ భారీ ఆదరణను నోచుకుంటున్నాయి. ఇప్పటికే శాంసంగ్ లాంటి కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల మార్కెట్లను యేలుతున్నాయి. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లపై వస్తోన్న ఆదరణపై దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పటికే ఒప్పో ఫోల్డబుల్ ఎన్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రేసులోకి వివో కూడా వచ్చి చేరనుంది. త్వరలోనే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది వివో. ఏప్రిల్ 11 న లాంచ్..! మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను వివో ఏప్రిల్ 11న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. వివో ఎక్స్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పలు వివరాలను కంపెనీ టీజ్ చేసింది. Vivo X ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ భారీ స్క్రీన్, బ్యాటరీతో రానున్నుట్లు సమాచారం. దీంతో పాటుగా ఏప్రిల్‌లో జరిగే లాంచ్ ఈవెంట్లో...వివో ప్యాడ్ టాబ్లెట్, Vivo X ఫోల్డ్ ఫోల్డబుల్ ఫోన్, Vivo X నోట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ వంటి మూడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది. చైనీస్ సోషల్‌మీడియా విబో ప్రకారం..వివో ఎక్స్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్+ 256జీబీ, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది. బ్లూ, క్రిమ్సన్, ఆరేంజ్ కలర్ వేరియంట్స్‌లో రానుంది. Vivo X ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్ ప్రాసెసర్‌తో రానున్నట్లు సమాచారం. చదవండి: ఆస్కార్ గెలిచిన ‘డూన్’.. అవార్డు రావడంలో మనోడిదే కీలక పాత్ర -
పాకెట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన హువావే..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువావే పాకెట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. హువావే లాంచ్ చేసిన మొదటి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా హువావే పీ50 పాకెట్ నిలవనుంది. ఈ ఫోన్ సాధారణ ఫ్లిప్ ఫోన్‌లాగా ఉండనుంది. హువావే పీ50 పాకెట్ తొలుత చైనా మార్కెట్లలో లభించనుంది. వచ్చే ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా లభించనుంది. క్రిస్టల్ వైట్ , అబ్సిడియన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఎడిషన్‌ను డచ్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ ఐరిస్ వాన్ హెర్పెర్తో హువావే జతకట్టింది. 8జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్; ప్రీమియం ఎడిషన్ 12జీబీ + 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. హువావే పీ50 పాకెట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ. 1.06 లక్షల నుంచి ప్రారంభం కానుంది. హువావే పీ50 పాకెట్ ఫీచర్స్..! 6.9-అంగుళాల ప్రైమరీ OLED డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ హర్మోని ఆపరేటింగ్ సిస్టమ్ 40ఎంపీ+ 13ఎంపీ + 32ఎంపీ రియర్ కెమెరా 10.7ఎంపీ ఫ్రంట్ కెమెరా 8జీబీ ర్యామ్+ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 4000mAh బ్యాటరీ కెపాసిటీ 40W ఫాస్ట్ ఛార్జింగ్ చదవండి: షిప్మెంట్లో దుమ్ము లేపుతుంది, షావోమీకి షాకిచ్చిన 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే! -
వచ్చేసింది ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..! శాంసంగ్ కంటే తక్కువ ధరకే..!
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లలోకి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో కూడా ప్రవేశించింది. ‘ఒప్పో ఫైండ్ ఎన్’ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 15న కంపెనీ లాంచ్ చేసింది. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లలో ప్రఖ్యాతిగాంచిన శాంసంగ్ కంపెనీ స్మార్ట్ఫోన్లకు తక్కువ ధరలోనే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో తీసుకువచ్చింది. కంపెనీ నిర్వహించిన ఇన్నో 2021 ఈవెంట్ రెండో రోజున ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ తొలుత చైనా మార్కెట్లలో అందుబాటులో ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేసేందుకు ఒప్పో సన్నాహాలను చేస్తోంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 92,000 నుంచి ప్రారంభమవుతుంది. ఒప్పో ఫైండ్ ఎన్ స్మార్ట్‌ఫోన్ 33 వాట్ సూపర్ఫ్లాష్ టెక్నాలజీతో పనిచేయనుంది. అయితే 33W SUPERVOOC ఫ్లాష్ ఛార్జ్ 30 నిమిషాల్లో 55 శాతానికి , 70 నిమిషాల్లో 100 శాతానికి బ్యాటరీ ఛార్జ్ అవ్వనుంది. ఒప్పో ఫైండ్ ఎన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్..! 7.1-అంగుళాల లోపలి డిస్ప్లే, 5.49-అంగుళాల ఔటర్ డిస్ప్లే 50ఎంపీ+16ఎంపీ+13ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా క్వాలకం స్నాప్‌డ్రాగన్ 888 12జీబీ ర్యామ్+512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 33W SUPERVOOC ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ డ్యూయల్ స్పీకర్ సిస్టమ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ 10W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ 4,500 mAh బ్యాటరీ చదవండి: ఇక సులభంగా రిలయన్స్ జియో రీఛార్జ్ సేవలు..! -
ఇది స్మార్ట్‌ఫోనా..ల్యాప్‌ట్యాపా...! వివో నుంచి కళ్లుచెదిరే గాడ్జెట్..!
ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ భారీగా ఆదరణను నోచుకుంటున్నాయి. ఇప్పటికే శాంసంగ్ లాంటి కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల మార్కెట్లను యేలుతున్నాయి. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లపై వస్తోన్న ఆదరణతో ఒప్పో, వివో లాంటి కంపెనీలు కూడా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను తయారుచేసే పనిలో నిమగ్నమైనాయి. ఇది స్మార్ట్‌ఫోనా..లేదా ల్యాప్‌ట్యాపా...! ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో అద్బుతమైన ఆవిష్కరణకు సిద్ధమైంది. ఫోల్టబుల్ స్మార్ట్ఫోన్లలో సరికొత్త ఆవిష్కరణతో వివో ముందుకురానుంది. స్మార్ట్‌ఫోనా లేదా ల్యాప్‌ట్యాపా అన్నట్లుగా వివో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఉండనుంది. సాధారణంగా మనం వాడే ల్యాప్‌ట్యాప్‌లో స్క్రీన్‌తో పాటుగా కీబోర్డు హింజ్ సహయంతో కనెక్ట్ అయ్యి ఉంటాయనే విషయం తెలిసిందే. ప్రస్తుతం వివో ఇలాంటి ఆవిష్కరణను ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో తెచ్చేందుకు సన్నాహాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. వివో హింజ్లెస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..! వివో మూడు మడతలతో ఫోల్టబుల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పేటెంట్ కోసం ఈ ఏడాది జూన్‌లో USPTO (యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్)కి ఫైల్ చేసినట్లు లెట్స్ గో డిజిటల్ వెల్లడించింది. ఇది మడతపెట్టినప్పుడు సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా కన్పిస్తూ టాబ్లెట్లా మారిపోతుంది. ఈ ఆవిష్కరణలో వర్చువల్ ప్రొజెక్షన్ కీబోర్డు హైలెట్‌గా నిలవనున్నుట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చిన ప్రొజెక్టర్ ద్వారా వర్చువల్ కీబోర్డు కన్పించనుంది. లెట్స్‌గోడిజిటల్ భాగస్వామ్యంతో పర్వేజ్ ఖాన్ అనే గ్రాఫిక్ డిజైనర్ వివో పేటెంట్‌కు అప్లై చేసిన మోడల్ స్మార్ట్‌ఫోన్ వీడియోను తయారుచేశారు. చదవండి: అదిరిపోయే ఫీచర్లతో షావోమీ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్..! -
సూపర్ ఫీచర్స్‌తో ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..!
ఒప్పో తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెలలో విడుదల చేయనుంది. రాబోయే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఒప్పో వెల్లడించనప్పటికీ, టిప్‌స్టర్ ఇటీవల ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి Weiboలో కొన్ని ఆసక్తికరమైన పోస్ట్‌లను షేర్ చేసింది. టిప్‌స్టర్ షేర్ చేసిన పోస్ట్‌లో ఒప్పో ఎన్3 స్మార్ట్‌ఫోన్ ఉంది. ‘Oppo Find N 5G’ పేరుతో ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒప్పో నుంచి వస్తోన్న మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్/ఫ్లిప్ సిరీస్ మాదిరిగానే ఇన్వర్డ్ ఫోల్డింగ్ డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ (అంచనా) 7.8 నుంచి 8 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే క్వాలకం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఆడ్రినో 660జీపీయూ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 32-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ పాప్ అప్ కెమెరా 4,500mAh బ్యాటరీ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చదవండి: 200 ఎంపీ కెమెరాతో సూపర్ స్మార్ట్‌ఫోన్..!.. వచ్చేది ఎప్పుడంటే? -
OnePlus: ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు స్క్రీన్లు!!
OnePlus Foldable Phone: స్మార్ట్ ఫోన్ మార్కెట్ పోటీలో వైవిధ్యం ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది వన్‌ఫ్లస్ బ్రాండ్. జనాల్లో క్రేజ్ పెంచుకునేందుకు ఇప్పటికే ఆకర్షణీయమైన ప్రొడక్టులను ప్రకటించి.. టైం చూసి మార్కెట్లోకి వదలడానికి ఎదురుచూస్తోంది. తాజాగా మరో ముఖ్యమైన అప్డేట్ను ప్రకటించింది. వన్‌ఫ్లస్ నుంచి త్వరలో ఫోల్డబుల్ ఫోన్ (మడత ఫోన్) మార్కెట్లోకి తీసుకురానుంది. లెట్స్‌గోడిజిటల్ ప్రకారం.. ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురాబోతోందట. అంతేకాదు అది రెండు మడతలతో కాకుండా మూడు మడతలతో ఉండబోతోదట!. కిందటి ఏడాదిలోనే చైనాలో పేటెంట్ డాక్యుమెంట్లను bbk electronics కంపెనీ సమర్పించిందని, ఈ ఏడాది జులైలో ఆ డాక్యుమెంట్ పబ్లిష్ కూడా అయ్యిందని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ డేటాబేస్ వివరాల ద్వారా వెల్లడైంది. ప్రతీకాత్మక చిత్రం ఇక వన్‌ఫ్లస్ తేబోతున్న ఫోల్డబుల్ ఫోన్ వేర్వేరు దిశలో(ట్రయాంగిల్.. రోటేటింగ్ టర్నింగ్ ప్లేట్) మడతపెట్టేదిగా ఉంటుందని, యూజర్ అప్లికేషన్లు సైతం ఎక్కువగా అందిస్తుందని ఆ డాక్యుమెంట్లలో ఉంది. స్లైడింగ్ కీ ప్యాడ్‌తో ఇది రానుంది. అంతేకాదు డబుల్ హింగ్డ్ టెక్నాలజీతో సరికొత్త ఒరవడి సృష్టించేందుకు సిద్ధమైంది. నిజానికి వన్‌ఫ్లస్ నుంచి మడత ఫోన్ రానుందనే వార్త చాలాకాలమే వినిపించింది. శాంసంగ్ పోటీని తట్టుకునేందుకు ముఖ్యంగా గెలాక్సీ జీ ఫోల్డ్ సిరీస్‌ను బీట్ చేసేందుకు తీసుకొస్తుందని వార్తలు వినిపించాయి. కానీ, ఆ టైంలో వన్‌ఫ్లస్ ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే తాజా నిర్ధారణతో త్రీ ఫోల్డ్స్ ఫోన్ ద్వారా స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో గేమ్ ఛేంజర్‌గా నిలవాలని వన్‌ఫ్లస్ ప్రయత్నాలు చేస్తోంది. స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లపై బంపరాఫర్! ఏకంగా 40 శాతం తగ్గింపు!.. వివరాలు -
ఒప్పో నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్..! లాంచ్ ఎప్పుడంటే..?
ప్రపంచ వ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ భారీ ఆదరణను నోచుకుంటున్నాయి. మడతపెట్టే స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్ భారీ లాభాలనే ఆర్జిస్తోంది. కాగా ఆపిల్, గూగుల్ లాంటి పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లపై దృష్టిసారించాయి. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను తయారుచేసే కంపెనీ జాబితాలోకి తాజాగా ప్రముఖ చైనీస్ కంపెనీ ఒప్పో కంపెనీ కూడా చేరింది. చదవండి: టెస్లా కార్లలో ‘కలకలం..!’ పాత దానినే వాడండి..! వచ్చే నెలలో లాంచ్..! మడతపెట్టే స్మార్ట్ఫోన్లను ఓప్పో త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెల నవంబర్‌లో ఒప్పో లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన లాంచ్ ఈవెంట్‌ను ఒప్పో ఇంకా ప్రకటించలేదు. 8 అంగుళాల ఫోల్డబుల్ ఇంటర్నల్ డిస్ప్లే స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే ఒప్పో రిలీజ్ చేయనుందని ప్రముఖ టెక్నికల్ ఎక్స్పర్ట్ టిప్‌స్టర్ వీబోతో పంచుకున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే కోసం ఎల్టీపీవో అమ్లోడ్ ప్యానెల్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ని ఉపయోగిస్తుందని టిప్‌స్టర్ ధృవీకరించింది. టిప్‌స్టర్ ప్రకారం....ఒప్పో మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ చైనాలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాల్లో ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఆలస్యంగా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. శాంసంగ్ తన ఫోల్డబుల్ ఫోన్లలో భాగంగా గెలాక్సీ జెడ్ ఫోల్డ్ , గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసింది. ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ. 1.5 లక్షలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Alibaba: చైనాపై విమర్శ..! జాక్ మా కొంపముంచింది..! -
శాంసంగ్‌కు చెక్‌పెట్టేందుకు పెద్దప్లానే వేసిన ఎల్జీ...!
ప్రపంచవ్యాప్తంగా పలు మొబైల్ కంపెనీల రాకతో మార్కెట్లలో ఎల్జీ తన స్థానాన్ని పదిలంగా కాపాడుకోలేకపోయింది. పలు మొబైల్ కంపెనీల దెబ్బకు ఎల్జీ స్మార్ట్ఫోన్ల బిజినెస్‌ను వీడింది. స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తులను నిలిపివేసిన స్మార్ట్ఫోన్లకు ఉపయోగపడే టెక్నాలజీని మాత్రం ఎల్జీ వీడలేదు. తాజాగా శాంసంగ్ మొబైల్స్‌కు చెక్ పెట్టేందుకు ఎల్జీ సరికొత్త ప్లాన్‌తో ముందుకురానుంది. ఎల్జీ కంపెనీలలో ఒకటైన ఎల్జీ కెమ్ (LG Chem) భవిష్యత్తులో వాడే స్మార్ట్ఫోన్లకు కొత్త రకం ఫోల్డబుల్ స్క్రీన్‌తో ముందుకు వచ్చింది. ఈ కొత్త రకం ఫోల్డబుల్ స్క్రీన్ అధిక ధర గల శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 3, గెలాక్సీ ఫోల్డ్ 2 ఫోన్లలో ఉపయోగించే టెక్నాలజీని ప్రభావితం చేసే అనేక సమస్యలను పరిష్కరిస్తోందని ఎల్జీ భావిస్తోంది. చదవండి: India’s First Electric Vehicle : భారత తొలి ఎలక్ట్రిక్ కారు ఇదేనండోయ్..! మన్నిక ఎక్కువ..! ప్లాస్టిక్ లాగా... ఎల్జీ కెమ్ తయారు చేసిన ఫోల్డబుల్ స్క్రీన్ అత్యంత శక్తివంతంగా, మన్నికగా, గాజు తరహాలో అనుభూతిని కలిగించే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్ మెటిరియల్ ప్లాస్టిక్ గుణాన్ని పోలీ ఉండనుంది. ఈ స్క్రీన్‌ను రియల్ ఫోల్డింగ్ విండో స్క్రీన్‌గా ఎల్జీ పిలుస్తోంది. స్క్రీన్ మెటీరియల్‌ని టెంపర్డ్ గ్లాస్‌తో ఎల్జీ పోల్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఎల్జీ తన కంపెనీ నుంచి రోలబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయాలనే ప్రణాళికలను నిలిపివేసింది.ఎల్జీ స్మార్ట్ఫోన్ల తయారీ నుంచి వైదొలిగినా.. గూగుల్, ఆపిల్, షావోమీ, వన్‌ప్లస్ వంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ దారులకు తన స్క్రీన్లను సరఫరా చేయాలనే లక్ష్యాన్ని ఎల్జీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ధరలు తగ్గే అవకాశం..! శాంసంగ్ కొన్ని సంవత్సరాల క్రితం ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేయగా , ఆ స్మార్ట్ఫోన్ల ధర గణనీయంగా ఉన్నాయి. ఎల్జీ కెమ్ తయారుచేసిన స్క్రీన్‌తో ఫోల్డబుల్ ఫోన్ల ధరలు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందనీ ఎల్జీ తెలిపింది. ఎల్జి కెమ్ స్క్రీన్ మెటీరియల్ తక్కువ మిల్లీమీటర్ల మందాన్ని మాత్రమే కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. మన్నిక విషయానికి వస్తే ఈ స్క్రీన్‌ను సుమారు 2 లక్షల సార్లు మడత పెట్టవచ్చునని ఎల్జీ పేర్కొంది. ఎల్జీ కెమ్ వచ్చే ఏడాది నుంచి రియల్ ఫోల్డింగ్ విండో స్క్రీన్‌ను భారీ సంఖ్యలో ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తోంది. చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో దిగ్గజ కంపెనీ..! -
అదిరిపోయిన మడత ఫోన్లు.. సెప్టెంబర్ 10 నుంచి అమ్మకానికి!
సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ తన దూకుడు పెంచింది. అదిరిపోయే ఫీచర్లతో కాంపీటీటర్ల ఫోన్లకు పోటీగా మడత(ఫోల్డబుల్ ) ఫోన్లను మన దేశంలో విడుదల చేసింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 మడత (ఫోల్డబుల్ )ఫోన్లను హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. భారతదేశంలోని వినియోగదారులు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3లను శామ్సంగ్ పోర్టల్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 09, 2021 వరకు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లు సెప్టెంబర్ 10, 2021 నుంచి అమ్మకానికి రానున్నాయి. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 రెండు డిస్ ప్లేలు ప్రధాన ఫోల్డబుల్ ఇన్నర్ డిస్ ప్లే, ఔటర్ సెకండరీ డిస్ ప్లేతో వస్తాయి. ప్రధాన స్క్రీన్ 7.6 అంగుళాల క్యూఎక్స్ జీఎ+ డైనమిక్ అమోల్డ్ ప్యానెల్ తో వస్తుంది. ఇది 120హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేటుతో 2208×1768 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. రెండో ప్యానెల్ 6.2 అంగుళాల హెచ్ డీ+ డైనమిక్ అమోల్డ్ డిస్ ప్లేతో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వస్తుంది. దీనిలో 4,400 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. 12 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 12 ఎంపీ కెమెరా ఉంది. 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ బరువు 271 గ్రాముల. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 12జీబీ ర్యామ్, 256జీబీ/ 512 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. 12 జీబీ/256 జీబీ వేరియంట్ ధర రూ.1,49,999, 12 జీబీ/512 జీబీ రూ.1,57,999కు లభిస్తోంది. శామ్సంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3 శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 రెండు వేరియెంట్లలో లభ్యం కానుంది. ఇందులో 8జీబి ర్యామ్/128జీబి స్టోరేజ్ వేరియెంట్, 8జీబి ర్యామ్/256జీబి స్టోరేజ్ వేరియెంట్ ఉన్నాయి. 8జీబీ/128జీబీ వేరియంట్ ధర రూ.84,999, 8 జీబీ/256 జీబి వేరియంట్ ధర రూ.88,999కు లభిస్తాయి. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3లో 6.7 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ డైనమిక్ అమోల్డ్ డిస్ ప్లే, 425పీపీఐ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11, శామ్సంగ్ వన్ యుఐ 3.1తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 12 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. దీనిలో 3,300 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. -
Samsung: ఈ స్మార్ట్‌ఫోన్ ప్రి-బుక్ చేస్తే స్మార్ట్‌ట్యాగ్ ఉచితం...!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ను అందించింది. కొద్ది రోజుల్లోనే శాంసంగ్ భారత మార్కెట్లోకి నెక్ట్స్ జనరేషన్ ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. కాగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లలోకి ఆగస్టు 11 న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ స్మార్ట్ఫోన్ల ప్రీ బుకింగ్‌ను నేటి (ఆగస్టు 6) నుంచి ప్రారంభం కానుంది. ఫ్రీ బుకింగ్ కోసం కస్టమర్లు రూ. 2000 చెల్లించాల్సి ఉంటుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను శాంసంగ్ ఇండియా ఈ-స్టోర్లలో లేదా శాంసంగ్ షాప్ యాప్‌లో బుక్ చేసుకోవచ్చును. ప్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు శాంసంగ్ ఉచితంగా శాంసంగ్ స్మార్ట్ట్యాగ్ను అందించనుంది. మార్కెట్లో శాంసంగ్ స్మార్ట్‌ట్యాగ్ ధర రూ. 2,699 గా ఉంది. రెండువేలతో ప్రీ బుక్ చేసుకున్న అమౌంట్‌ను ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో అడ్జస్ట్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ ధర రూ. 1,49,990గా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర సుమారు రూ. 80 వేల నుంచి రూ. 90 వేల మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ధరలు నిజమైతే మునుపటి శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లకంటే తక్కువ ధరలు ఉండనున్నాయి. -
Xiaomi: మరో ఫోల్డబుల్ ఫోన్..త్వరలోనే
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి అతి త్వరలోనే మరో ఫోల్డబుల్ మొబైల్‌ను లాంచ్ చేయనుంది. హై ఎండ్ ఫీచర్స్‌తో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో తీసుకురానుంది. తన కంపెనీ నుంచి ఎంఐ మిక్స్ ఫోల్డ్ సిరీస్‌లో భాగంగా ఏంఐ మిక్స్ ఫోల్డ్ 2ను కొనసాగింపుగా మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది. కాగా ఈ ఫోల్డబుల్ ఫోన్లో ఆప్గ్రేడేడ్ హింజ్ మెకానిజం రానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఏంఐ మిక్స్ ఫోల్డ్ 2 శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 కు పోటీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎంఐ మిక్స్ ఫోల్డ్ 2 స్పాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో కంపెనీ రిలీజ్ చేయనుంది. వీటితో పాటుగా 108 ఎంపీ రియర్ కెమరాను అమర్చనుంది. అత్యధికంగా 120హెర్జ్ రిఫ్రెష్ రేటుతో ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ మొబైల్‌ను 2021 క్యూ4లో లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. చదవండి: ఐటెల్ నుంచి అతి తక్కువ ధరకే 4జీ ఫోన్ -
షావోమి : మూడు మడత ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి తన దూకుడును మరింత పెంచేస్తోంది. 2021 ఏడాదిలో కొత్తగా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుందని తెలుస్తోంది. మూడు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లతో 2021లో హల్ చల్ చేయనుంది. అవుట్-ఫోల్డింగ్, ఇన్-ఫోల్డింగ్ మరియు క్లామ్‌షెల్ వంటి డిజైన్లతో ఆవిష్కరిస్తుందని భావిస్తున్నారు.అనలిస్ట్ రాస్ యంగ్ అందించిన సమాచారంప్రకారం మూడు వేర్వేరు డిజైన్లలో షావోమి మెయిన్ స్ట్రీమ్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయబోతోంది. ఈ అవుట్-ఫోల్డింగ్ ఫోల్డబుల్ ఫోన్ హువావే మేట్ ఎక్స్ లాగా ఉంటుందని యంగ్ అంచనావేశారు. అవుట్-ఫోల్డింగ్, ఇన్-ఫోల్డింగ్, క్లామ్‌షెల్ వంటి డిజైన్లతో ఆవిష్కరించనుందని తెలిపారు. అంతేకాదు ఒప్పో, వివో షావోమి కూడా ఫోల్డ్‌బుల్ ఫోన్లను తీసుకొస్తాయన్నారు. అంతేకాదు గూగుల్ కూడా వచ్చే ఏడాది ఆరంభంలో ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లోకి వచ్చే తదుపరి ఫోల్డబుల్ ఫోన్ షియోమి నుండి కావచ్చునని యంగ్ పేర్కొన్నారు. సుమారు 8 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ఉందని ఆయన సూచించారుషావోమి ఫోల్డబుల్ ఫోన్ గురించి మనం వినడం ఇదే మొదటిసారి కాదు. స్నాప్‌డ్రాగన్ చిప్సెట్ మరియు 108 మెగాపిక్సెల్ కెమెరా లాంటి ఫీచర్లతో సెటస్ పేరుతో ఫోల్డబుల ఫోన్ ను ఈఏడాది ఆరంభంలోతీసుకొస్తుందని పలు నివేదికలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి సెటస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కారం ఎలాంటి స్పష్టత లేదు. -
శామ్సంగ్ మల్టీ-ఫోల్డబుల్ ఫోన్‌ను చూశారా..
ఎప్పటి నుండో శామ్సంగ్ రెండు మడతల ఫోన్ ని తీసుకొస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. అప్పుడప్పుడు ఈ ఫోన్ కి సంబందించిన కొన్ని డ్రాయింగ్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా శామ్సంగ్ కంపెనీ త్వరలో విడుదల చేయబోయే రెండు మడతల ఫోన్ యొక్క యానిమేటెడ్ ఫొటోలు శామ్సంగ్ డిస్ప్లే వెబ్సైట్లో దర్శనిమిచ్చాయి. ఈ ఫొటోల ప్రకారం రెండు మడతల ఫోన్ స్క్రీన్ పూర్తిగా తెరిచినప్పుడు ఒక ట్యాబ్ స్క్రీన్ లా మారిపోనుంది. తిరిగి దాన్ని మడతబెడితే సాధారణ ఫోన్ స్క్రీన్ తరహాలోనే ఉంటుంది. ఈ ఫోటోలో మడత పెట్టినప్పుడు Z- స్టైల్ మెకానిజం లాగా కనిపించింది. ఈ ఫోన్లో ఓఎల్ఈడీ డిస్ప్లేని ఉపయోగిస్తున్నారని సమాచారం. మీరు ఇంకా మడతపెట్టినప్పుడు ఈ ఫొటోని దీర్ఘాంగ పరిశీలించినట్లయితే ఎడమ వైపు ఉన్న భాగం ఫోన్ లోపలికి వెల్లగా, కుడి భాగం మాత్రం సాధారణ ఫోన్ స్క్రీన్ లాగా పనిచేయనుంది. (చదవండి: వచ్చే వారంలో రానున్న టెక్నో పోవా మొబైల్) ప్రస్తుత ఫోల్డబుల్‌తో పోల్చితే, మడతపెట్టినప్పుడు వినియోగదారుకు చాలా పెద్ద టాబ్లెట్ అనుభవాన్ని కలిగిస్తుంది. శామ్సంగ్ తీసుకొస్తున్న ఈ రెండు మడతల ఫోన్ యొక్క ప్రధాన సమస్య దాని యొక్క జీవితకాలం, మడతపెట్టినప్పుడు స్క్రీన్ దెబ్బతినడం. మొదటి తరం ఫోల్డబుల్ ఫోన్లలో ప్రధాన సమస్య మడత పెట్ట్టెటప్పుడు స్క్రీన్ దెబ్బతినడం. అందుకని దీనిని మార్కెట్ లోకి తీసుకోని రావడానికి ముందు మొదటి తరం ఫోల్డబుల్ ఫోన్లలో ఉన్న సమస్యలను ఇందులో రాకుండా చూసుకుంటున్నట్లు సమాచారం. ధర కనుక అందుబాటులో ఉంటే శామ్సంగ్ నుండి వచ్చిన ఈ మల్టీ-ఫోల్డబుల్ ఫోన్‌నుకొనడానికి యూజర్లు ఆసక్తి చూపవచ్చు. ఇంతక ముందు శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 పేరుతొ వచ్చిన మొబైల్ మంచి క్రెజ్ ని సొంతం చేసుకుంది. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చిన మొదటి సంస్థగా శామ్సంగ్ నిలిచింది. -
జూన్‌కల్లా శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 3 ఫోన్
ముంబై, సాక్షి: వచ్చే జూన్‌కల్లా గెలాక్సీ జెడ్ ఫోల్డ్3 పేరుతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను శామ్సంగ్ విడుదల చేయనున్నట్లు దక్షిణ కొరియన్ అజు న్యూస్ పేర్కొంది. ఈ ఫోల్డబుల్ ఫోన్.. ఎస్ పెన్ సపోర్ట్‌తో లభించనున్నట్లు తెలియజేసింది. తద్వారా ప్రీమియం విభాగంలోని గలాక్సీ నోట్ సీరిస్ ప్రొడక్టులను ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్.. నిలిపివేసే అవకాశముట్లు అభిప్రాయపడింది. ఆధునిక టెక్నాలజీలతో కూడిన అంటే.. ఎస్ పెన్(ఎలక్ట్రానిక్ పెన్) సపోర్ట్‌తోపాటు.. అండర్ డిస్ప్లే కెమెరా(యూడీసీ) ఫీచర్‌ను సైతం జెడ్ ఫోల్డ్3లో ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ఆధునిక సాంకేతికలో భాగంగా కెమెరాను ఓలెడ్ స్ర్కీన్ అడుగుభాగాన అమర్చనున్నట్లు తెలుస్తోంది. దీంతో కెమెరాకు డిస్ప్లేలో హోల్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉండదని వివరించింది. యూడీసీ ఫీచర్‌తో జెడ్ ఫోల్డ్3 స్క్రీన్ ట్యాబ్లెట్ పీసీని పోలి ఉంటుందని అభిప్రాయపడింది. పెద్ద డిస్ప్లేలు.. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ వచ్చే జనవరిలో విడుదల చేయ తలపెట్టిన గలాక్సీ ఎస్21 అల్ట్రా(అంచనా)లోనూ ఎస్ పెన్ ఫీచర్‌ను అందించనున్నట్లు అజు న్యూస్ పేర్కొంది. ఈ ఫోన్ 6.8 అంగుళాల డిస్ప్లేలో లభించనున్నట్లు తెలియజేసింది. కాగా.. గలాక్సీ ఎస్ 21 సిరీస్‌లో 3 ఫోన్లను 2021 జనవరి నుంచీ విడుదల చేసే వీలుట్లు తెలియజేసింది. ఎస్21 6.2 అంగుళాలు, ఎస్21 ప్లస్ 6.7 అంగుళాల స్క్రీన్లతో విడుదలకానున్నట్లు వెల్లడించింది. -
తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌పై ఆపిల్ కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ : ఐఫోన్ మేకర్ ఆపిల్ మరో కీలక దిశగా అడుగులు వేస్తోంది. తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. ఫోల్డబుల్ ఫోన్లకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో యూజర్లను ఆకర్షించేందుకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకొచ్చేందుకు చురుకుగా పనిచేస్తోందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అద్భుతమైన పెరఫామెన్స్, ఆకట్టుకునే ఫీచర్లు, విలాసవంతమైన స్మార్ట్ఫోన్లతో యూజర్లను ఆకర్షించిన ఆపిల్ ఇకపై ఫోల్డబుల్ హ్యాండ్సెట్ ద్వారా మరింత ఎట్రాక్ట్ చేసేందుకు రడీ అవుతోంది. 2022 సెప్టెంబరులో ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేయాలని చూస్తోందని తైవాన్ మీడియా సంస్థ మనీ.యూడీఎన్.కామ్ నివేదించింది. ప్రస్తుతం ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ స్క్రీన్ బేరింగ్లను పరీక్షిస్తోంది. ఇందుకోసం నిప్పాన్ నిప్పాన్ మెటీరియల్ సరఫరాదారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. నిక్కో మెయిన్ సరఫరాదారుగా ఉండనుంది. హాన్ హై ఈస్మార్ట్ఫోన్నుఅసెంబుల్ చేయనుంది అలాగే ఓఎల్ఈడీ లేదా మైక్రోలెడ్ స్క్రీన్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని అంచనా. డిస్ప్లే ప్యానెల్‌ను శాంసంగ్నుంచి స్వీకరించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త డిజైన్‌కోసం పేటెంట్ పొందిన ఆపిల్, రెండు డిస్ప్లేల మధ్య మడతపెట్టేందుకు వీలైనంత స్పేస్ ఉండేలా జాగ్రత్తలుతీసుకుంటోంది. ఇప్పటికే లక్ష ఫోన్లను పరిశీలించిందట. ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ గురించి గతంలో కూడా పలు నివేదికలు వెలువడ్డాయి. ప్రధానంగా తన ప్రత్యేకతను చాటుకునేలా అన్ని అడ్డంకులను తొలగించుకుని ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయాలని భావిస్తోంది. కాగా గత ఏడాది శాంసంగ్ తొలి కమర్షియల్ ఫోల్డబుల్ ఫోన్ గెలాక్సీ ఫోల్డ్‌ను ఆవిష్కరించింది. ఇందులోని లోపాలను, సమస్యలను సమీక్షించుకున్న అనంతరం గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
మోటో రేజర్ 5జీ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!
సాక్షి, న్యూఢిల్లీ: లెనోవాకు చెందిన మోటరోలా కంపెనీ మోటో రేజర్ 5జీ ఫోల్డబుల్ ఫోన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. మోటో రేజర్ కి కొనసాగింపుగా ఆండ్రాయిడ్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. “క్విక్ వ్యూ” డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జీ సాక్ ప్రధాన ఫీచర్లుగా ఈ సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటరోలా రేజర్ 5జీ ధర, లాంచ్ ఆఫర్లు భారతదేశంలో మోటరోలా రేజర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ 1,24,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. గ్రాఫైట్ కలర్ ఆప్షన్లో లభ్యం. ఈ రోజు నుండి ప్రీ-బుకింగ్స్ మొదలు పెట్టింది. అక్టోబర్ 12 నుంచి ఫ్లిప్‌కార్ట్, అన్ని ప్రముఖ రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుల ఈఎంఐ లావాదేవీలపై 10,000 తక్షణ తగ్గింపు. జియో కస్టమర్లు రూ. 4,999 వార్షిక ప్రణాళికలో డబుల్ డేటా ఆఫర్ చేయనుంది. మోటో రేజర్ 5జీ ఫీచర్లు 6.2 అంగుళాల ఓఎల్ఈడీ ఫోల్డ్ డిస్ప్లే వెనుక 2.7 అంగుళాల ఫోల్డ్ సెకండరీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ 48 మెగాపిక్సెల్ కెమెరా 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 15వాట్స్ టర్బోపవర్ ఛార్జర్ 2800 ఎంఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 : ప్రీ బుకింగ్స్
సాక్షి, ముంబై: సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన అద్భుతమైన గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ ను ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంచుతోంది. "జెడ్ ఫోల్డ్ 2 '' భారత్‌లో ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇండియాలో ఈఫోన్ ధరను శుక్రవారం ప్రకటించింది. ప్రీ బుకింగ్ కోసం అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. ధర, లభ్యత, ఆఫర్లు సెప్టెంబర్ 14 నుండి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు కొన్ని ఆఫర్లు కూడా లభించనున్నాయి. నాలుగు నెలల ఉచిత యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉచితం. అలాగే ఈ ఫోన్‌ను కొన్నవారికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 22 శాతం తగ్గింపు లభిస్తుంది. 12 నెలల పాటు నో-కాస్ట్ ఇఎంఐ ప్లాన్లను కూడా అందిస్తోంది. మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ బ్రాంజ్ కలర్ ఆప్షన్లలో భారత్‌లో రూ.1,49,999కు దీన్ని విక్రయించనుంది. (భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ ఎం51) గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 ఫీచర్లు 7.6అంగుళాల క్యూఎక్స్‌జీఏ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే 1768 x 2208 పిక్సెల్స్ రిజల్యూషన్ 6.2 అంగుళాల హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్పినిటీ ఫ్లెక్స్ కవర్ డిస్ప్లే 816 x 2260 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ చిప్సెట్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ/ 512జీబీ స్టోరేజ్ 12+12+12 మెగాపిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరా 10+10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ -
మోటో రేజర్ 5జీ ఫోల్డబుల్ ఫోన్ : ధర?
సాక్షి, న్యూఢిల్లీ: లెనోవాకు చెందిన మోటరోలా కంపెనీ మోటో రేజర్ 5జీ ఫోల్డబుల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. మోటో రేజర్ కి కొనసాగింపుగా ఆండ్రాయిడ్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. కొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు, కెమరాల్లో మార్పులు, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్‌తో ముందు మొబైల్ కంటే చాలా చౌకగా దీన్ని విడుదల చేసింది. అలాగే కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ 11కి అప్‌గ్రేడ్ చేయవచ్చని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సుమారు రూ .102,600 ధరతో లాంచ్ చేసింది. (మోటో రేజర్ ధర రూ.1,24999). గ్రాఫైట్, బ్లష్ గోల్డ్ లిక్విడ్ మెర్క్యురీ మూడు రంగుల్లో లభ్యం. మోటో రేజర్ 5జీ ఫీచర్లు 6.2 అంగుళాల ఫోల్డ్ డిస్ప్లే వెనుక 2.7 అంగుళాల ఫోల్డ్ సెకండరీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ 48 మెగాపిక్సెల్ కెమెరా 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 15వాట్స్ టర్బోపవర్ ఛార్జర్ 2800 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రస్తుతానికి చైనా, యూరోపియన్ మార్కెట్లో లభించనుంది. ఇండియాలో లాంచింగ్ తేదీని మోటరోలా ఇంకా ప్రకటించలేదు. -
మరో సంచలనం దిశగా షావోమి
సాక్షి,న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ విభాగంలో రికార్డు అమ్మకాలతో దూసుకుపోతున్న చైనా మొబైల్ తయారీ దారు షావోమి మరోమెట్టు పైకి ఎదగాలని భావిస్తోంది. స్మార్ట్‌ఫోన్ రంగంలో తదుపరి సెగ్మెంట్ ఫోల్డింగ్ ఫోన్ల తయారీలో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రూపకల్పనకు సంబంధించి డిజైన్ పేటెంట్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ ఫోన్లో రొటేటింగ్ క్వాడ్-కెమెరా ప్రధాన ఫీచర్‌గా వుండటం ఆసక్తికరంగా మారింది. (రెడ్మి ఎక్స్ సిరీస్ స్మార్ట్‌టీవీలు త్వరలో) గిజ్మో చైనా నివేదిక ప్రకారం షావోమి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కెమెరా సెల్ఫీల కోసం ముందుకి, సాధారణ ఫోటోల కోసం వెనక్కి రొటేట్ అవుతుందట. దీనికి సంబంధించిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు 48 చిత్రాలను కూడా రీలీజ్చేసినట్టు తెలిపింది. అయితే సాధారణ స్మార్ట్ఫోన్లలో రొటేటింగ్ కెమెరా ఇప్పటికే ఉన్నప్పటికీ మడతఫోన్లలో ఇదే మొదటిది. ఇప్పటికే మోటరోలా రాజర్ మడతపోన్తో పాటు, శాంసగ్ గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లలో గెలాక్సీ జెడ్ ఫ్లిప్ విజయవంతమైన నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు తరువాతి సెగ్మెంట్లోకి షావోమి జంప్ చేయనుంది. అయితే ఈ అంచనాలపై షావోమి అధికారికంగా స్పందించాల్సి వుంది. -
శాంసంగ్ జెడ్ ప్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్
శాన్ఫ్రాన్సిస్కో: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన సత్తాను చాటుకుంటోంది. తాజాగా రెండవ మడత ఫోన్‌ను లాంచ్ చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలో శాంసంగ్ నిర్వహించిన ఈవెంట్లో గెలాక్సీ జెడ్ ఫ్లిప్ పేరుతో ఈ స్మార్ట్‌పోన్‌ను లాంచ్ చేసింది. అలాగే నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు గెలాక్సీ ఎస్20, ఎస్20 ప్లస్, ఎస్20 అల్ట్రాలను కూడా ఇదే ఈవెంట్లో విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫీచర్లు లోపలి భాగంలో 6.7-అంగుళాల :ఫుల్ హెచ్డీ + డైనమిక్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే 1.1-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే 7 ఎన్ఎం 64బిట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 8 జీబీ ర్యామ్ 256 స్టోరేజ్ 12+ 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ 10ఎంపీ సెల్పీ కెమెరా 25వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు 3300 ఎంఏహెచ్ బ్యాటరీ మిర్రర్ పర్పుల్ , మిర్రర్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది, గెలాక్సీ జెడ్ ఫ్లిప్‌ను ఒకే వేరియంట్లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్తోలబ్యం. ఫిబ్రవరి 14, 2020 నుంచి అమెరికా, 1380 డాలర్లు ప్రారంభ ధరలో కొరియాతో సహా ఎంచుకున్న మార్కెట్లలో ప్రారంభమవుతుంది. భారతదేశంలో దాని లభ్యతపై ఎలాంటి సమాచారం లేదు. చదవండి: శాంసంగ్ ప్రభంజనం, అద్భుత ఫీచర్లు, ఫోటోలు దారుణంగా పడిపోయిన పారిశ్రామికోత్పత్తి -
శాంసంగ్ 5జీ మడత ఫోన్ లాంచ్
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. శాంసంగ్ డబ్ల్యు 20 5జీ పేరుతొ దీన్ని బుధవారం లాంచ్ చేసింది. గెలాక్సీ ఫోల్డ్ రీబ్రాండెడ్ వెర్షన్ 5జీ అప్ గ్రేడ్ చేసి ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ సాక్ మినహా మిగిలిన ఫీచర్లను గెలాక్సీఫోల్డ్ మాదిరిగా ఉంచింది. ఎకెజి-ట్యూన్డ్ స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, బేరోమీటర్, జియోమాగ్నెటిక్, గైరోస్కోప్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్‌సెన్సర్ లాంటి ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. అలాగే వైర్లెస్ ఛార్జింగ్‌తో పాటు వైర్లెస్ పవర్ షేర్‌కు మద్దతు ఇస్తుంది. డిసెంబరునుంచి ఇది చైనాలో అందుబాటులోకి రానుంది.ధర వివరాలు, ఇతర మార్కెట్లలో దీని లభ్యత తదితర వివరాలను శాంసంగ్ ఇంకా వెల్లడించలేదు. అయితే దీని ధర సుమారు రూ. 1,73,000 గా వుంటుందని అంచనా. శాంసంగ్ డబ్ల్యూ 20 5జీ ఫీచర్లు ఫస్ట్ స్ట్రీన్ 4.2: 3 కారక నిష్పత్తి, 1536x2152 పిక్సెల్స్ రిజల్యూషన్ 7.3-అంగుళాల ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డైనమిక్ అమోలేడ్ డిస్ప్లే సెకండ్ స్క్రీన్ 840x1960 పిక్సెల్స్ రిజల్యూషన్ , 21: 9 కారక నిష్పత్తి 4.6 అంగుళాల సూపర్ అమోలెడ్ కవర్ డిస్ ప్లే ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఎస్డి కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను విస్తరించుకునే సదుపాయం 16+12+12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 10 + 8 ఎంపీ డబుల్ సెల్ఫీ కెమెరా 4235 ఎంఏహెచ్ బ్యాటరీ -
మోటరోలా ఫోల్డబుల్ ఫోన్ అంచనాలు హల్చల్
సాక్షి,న్యూఢిల్లీ: మోటరోలాకు చెందిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో ఫోల్డబుల్ డివైస్‌లపై భారీ క్రేజ్ నెలకొన్న నేపథ్యంలో మొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న మోటరోలా తన ఐకానిక్ మోడల్ మొబైల్‌ను మళ్లీ తీసుకొస్తోంది. అత్యుత్తమ ఫీచర్స్‌తో ఫోల్డబుల్ డిస్ప్లేతో తన పాపులర్ మోడల్ 'మోటరోలా రాజర్'ను తీసుకురాబోతోంది. మోటరోలా రాజర్ 2019 పేరుతో అదీ ఫ్లిప్ తరహాలోనే ఆ విష్కరించనుంది. లెనోవా యాజమాన్యంలోని సంస్థ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించే ఈవెంట్లో ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ తీసుకురానుందని భావిస్తున్నారు. మోటరోలా మీడియా ఆహ్వానంలో ఈ సంకేతాలను అందించింది. శాంసంగ్, హువావే ఫోన్లకంటే భిన్నంగా దీన్ని తీసుకొరానుంది. ధర విషయానికి వస్తే.. యూరో 1,500 (సుమారు రూ. 1,18,500) ధర ట్యాగ్‌తో వస్తుందని అంచనా. మోటరోలా రాజర్ 2019 ఫీచర్లపై అంచనాలు 6.2 అంగుళాల డిస్ప్లే 876x2142 పిక్సెల్స్ రిజల్యూషన్ కవర్ డిస్ప్లే 600x800 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710 సాక్ 6 జీబీ ర్యామ్/ 128జీబీ స్టోరేజ్ 2730 ఎంఏహెచ్ బ్యాటరీ -
మోటరోలాకు షాక్: శాంసంగ్ మరో మడత ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్దిగ్గజం శాంసంగ్‌లో మరో నూతన మడతబెట్టే ఫోన్‌ను ఆవిష్కరించనుంది. గెలాక్సీపోల్డ్ పేరుతో మడతబెట్టే ఫోనును మార్కెట్లోకి తీసుకువచ్చిన శాంసంగ్ రెండవ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. హువావే, మోటరోలా కూడా త్వరలో మడతబెట్టే ఫోన్లను తీసుకురానున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో సరికొత్త మోడల్‌ను విడదుల చేయనున్నామని శాంసంగ్ డెవలపర్స్ సదస్సులో కంపెనీ ప్రకటించింది. నూతన మోడల్ పొడవాటి డిసిప్లే నిలువుగా మడతబెట్డే విధంగా తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రధానంగా మోటరోలా ఈ నెల(నవంబరు) 13న లాంచ్ చేయనున్న ఫోల్డబుల్ ఫోన్ 'మోటరోలా రాజర్' తరహాలీ దీన్ని రూపొందించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు విడుదలచేయలేదు. దీనిని మడతబెట్టినప్పుడు చేతిలో ఒదిగిపోయేలా.. తెరిచినప్పుడు పొడవాటి డిసిప్లేతో ఆకర్షించేలా వుండనుందని అంచనా. మోడల్నెంబర్ ఎస్ఎం-ఎఫ్700ఎఫ్‌గా పిలిచే ఈ ఫోన్ 256 జీబీ అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తుంది. -
30 నిమిషాల్లో ఖతం..బుకింగ్స్ క్లోజ్
సాక్షి, ముంబై : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారీ వాటాను సొంతం చేసుకున్న భారత్ లగ్జరీ స్మార్ట్ఫోన్ల విక్రయంలో రికార్డు నెలకొల్పింది. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన లగ్జరీ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ విక్రయాల్లో కొత్త రికార్డు సృష్టించింది. ప్రీ బుకింగ్‌లు మొదలు పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే సూపర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ హాట్ కేకుల్లా బుక్ అయిపోయాయి. శుక్రవారం అధికారిక ఆన్లైన్ స్టోర్‌లో ప్రీ-బుకింగ్‌లు మొదలు పెట్టిన 30 నిమిషాల వ్యవధిలో మొత్తం 1,600 యూనిట్ల గెలాక్సీ ఫోల్డ్ ప్రీమియం ఫోన్లను కంపెనీ విక్రయించింది. దీంతో ప్రీ-బుకింగ్స్‌ను మూసివేసింది. వార్తా సంస్థ ఐఎఎన్ఎస్ అందించిన నివేదిక ప్రకారం, ఫోన్లను ముందే బుక్ చేసుకున్న కొనుగోలుదారులు మొత్తం రూ. 1,64,999 ముందస్తుగా చెల్లించి మరీ వీటిని సొంతం చేసుకోవడం విశేషం. అక్టోబర్ 20న ఇవి వినియోగదారుల చేతికి రానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ గెలాక్సీ ఫోల్డ్ ఆరు కెమెరాలతో వస్తుంది. 4.6-అంగుళాల సింగిల్ ఫోల్డ్ అమోలెడ్ డిస్ప్లే. ఇది విప్పినప్పుడు 7.3 అంగుళాల వరకు విస్తరిస్తుంది. బయటి 21: 9 స్క్రీన్ 840x1960 రిజల్యూషన్ , మరో స్క్రీన్ 1,536 x 2,152 రిజల్యూషన్ కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు 7.3 అంగుళాల ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే 12 జీబీ రామ్, 512 జీబీ స్టోరేజ్ కవర్ డిస్ప్లేపై 10 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇంటర్నల్ డిస్ప్లేపై 10 ఎంపీ, 8 ఎంపీ కెమెరాలు వెనుకవైపు 16 ఎంపీ, 12 ఎంపీ, 12 ఎంపీ ట్రిపుల్ కెమెరాలు 4380 ఎంఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్ ‘ఫోల్డ్’ వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలో తొలిసారిగా ఫోల్డబుల్ మొబైల్ డివైస్‌ను ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ అభివృద్ధి చేసింది. గెలాక్సీ ఫోల్డ్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌గానూ, ట్యాబ్లెట్ పీసీగా నూ వినియోగించుకునే వీలుగా ఈ ఉపకరణాన్ని తయారు చేసింది. మొత్తం ఆరు కెమెరాలు పొందుపరిచారు. ఉపకరణం తెరిచినప్పుడు 7.3 అంగు ళాల తెరతో ట్యాబ్లెట్ పీసీ మాదిరిగా, మూసినప్పు డు 4.6 అంగుళాల తెరతో స్మార్ట్‌ఫోన్ వలె ఉపయోగించొచ్చు. 5జీ టెక్నాలజీతో 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ మెమరీ, 7 నానోమీటర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ఆక్టాకోర్ చిప్ వంటి ఫీచర్లున్నాయి. 4,380 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. వారం రోజుల్లో భారత్‌కు..:శాంసంగ్ ఈ నూతన ఉపకరణాన్ని దక్షిణ కొరియాలో ఇటీవలే ఆవిష్కరించింది. యూఎస్‌లో ఈ నెల 27న అడుగుపెడుతోంది. భారత మార్కెట్లో అక్టోబరు 1న విడుదలకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇక్కడ గెలాక్సీ ఫోల్డ్ ధర సుమారు రూ.1.50 లక్షలు ఉండే అవకాశం ఉంది. గ్యాడ్జెట్ కావాల్సినవారు ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంపిక చేసిన ఔట్లెట్లలో కూడా లభిస్తుంది. స్పేస్ సిల్వర్, కాస్మోస్ బ్లాక్ రంగుల్లో రూపొందించారు. -
శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ విడుదలపై క్లారిటీ
ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై ఎట్టకేలకు తీపి కబురు అందింది. శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఫోల్డబుల్(మడత) స్మార్ట్‌ఫోన్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో త్వరలోనే దీన్ని తిరిగి ప్రారంభించనుంది. తుది పరీక్షల అనంతరం 2019 సెప్టెంబర్‌లో ఎంపిక చేసిన మార్కెట్లలో ఆవిష్కరించనున్నామని దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ తాజాగా ధృవీకరించింది. గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను పూర్తి మార్పులతో అన్ని రకాల కఠినమైన పరీక్షలను దాటిందని తెలిపింది. స్మార్ట్‌ఫోన్ డిజైన్, సెక్యూరిటీ ఫీచర్లలో మార్పులు, ఇతర కఠినమైన పరీక్షలను పూర్తి చేయడానికి సమయం పట్టిందని శాంసంగ్ పేర్కొంది. ప్రధానంగా అరచేతిలో సులువుగా ఇమిడిపోయేలా రూపొందించడంతోపాటు ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ ప్లే కింద అదనంగా మెటల్ లేయర్స్‌ని అమర్చింది. ఇతర భద్రతా పరమైన మార్పులకు తోడు మరిన్ని యాప్స్‌ను ఆప్టిమైజ్ చేసింది. విడుదల సందర్భంగా లభ్యత, ఇతర కీలక ఫీచర్లను వెల్లడిస్తామని శాంసంగ్ వెల్లడించింది. ముందుగా ఇండియా, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, యూకేలలో లాంచ్ చేయనుందని సమాచారం. -
షావోమీ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్: టీజర్
స్మార్ట్ఫోన్లలో భారీస్క్రీన్, భారీ కెమెరా, భారీ స్టోరేజ్, డబుల్, ట్రిపుల్ కెమెరా ఫీచర్ల హవాతో పాటు మడతపెట్టే ఫోన్లపై భారీ క్రేజ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ కంపెనీలన్నీ ఆ వైపుగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ షావోమీ తన ప్రోటోటైప్ టు-వే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి మరో వీడియోని షేర్ చేసింది. ఫోల్డబుల్ ప్రోటోటైప్ డబుల్ ఫోల్డింగ్ డిజైన్‌తో వస్తోంది. అయితే ఈ ఫోన్ ఫీచర్లు, తదితర వివరాలను వెల్లడించలేదు. కాగా ఈ ఫోన్‌కు సంబంధించి షావోమి వైస్ ప్రెసిడెంట్ వాంగ్ చాంగ్ ఈ ఏడాది జనవరిలో ఒక వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 10 సెకన్ల నిడివిగల మరో వీడియో టీజర్‌ను కంపెనీ షేర్ చేసింది. ఫీచర్లు, ధర వివరాలపై అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ సినిమా లెవల్లో టీజర్లు, రిలీజ్ డేట్ అంటూ భారీ హైప్ మాత్రం క్రియేట్ చేస్తోంది. 2019 రెండవ త్రైమాసికంలో దీన్ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఇక ధర విషయానికి వస్తే.. లక్షా 37వేల రూపాయల వరకు ధర నిర్ణయించవచ్చని అంచనా. ఫ్లాట్, డబుల్ ఫోల్డబుల్ డిజైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రానుంది. అంతేకాదు ఇప్పటి వరకు వచ్చిన ఇతర ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు ఇది పూర్తిగా విభిన్నంగా ఉండనుందట. -
హువావే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2019 లోటెక్ దిగ్గజాలు అద్భుతమైన స్మార్ట్ఫోన్లను పరిచయం చేస్తున్నాయి. ముఖ్యంగా 5జీ, ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లపై దృష్టిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా మొబైల్స్ తయారీదారు హువావే తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మేట్ ఎక్స్ ను పరిచయం చేసింది. స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతున్న ప్రదర్శనలో ఫోల్డబుల్ ఫోన్ ‘మేట్ ఎక్స్ ’ను హువావే లాంచ్ చేసింది. 6.6 ఇంచుల డిస్ప్లేను ముందు భాగంలో, 6.38 ఇంచుల డిస్ ప్లేను వెనుక భాగంలో అమర్చారు. ఈ రెండింటినీ మడత తీసినప్పుడు 8 అంగుళాల డిస్ప్లేతో బిగ్ ట్యాబ్‌లా ఉంటుంది. 5జీ సపోర్టు, ఫింగర్ ప్రింట్ సెన్సార్. ట్రిపుల్ రియర కెమెరా, ఎన్ఎం కార్డు స్లాట్ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అంతేకాదు 55 వాట్ల సూపర్ చార్జ్ ఫీచర్‌తో ప్రపంచంలో ఈ ఫీచర్ తో వచ్చిన ఫోన్ ఇదేనని హువావే వెల్లడించింది. అలాగే తమ పవర్ ఫుల్ ప్రాససర్ కారణంగా 1 గిగా బైట్ మూవీని కేవలం మూడు సెకన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ధర : ఈ ఫోన్ ధరను 2607 డాలర్లు (దాదాపుగా రూ.1,85,220) గా నిర్ణయించారు. 2019 మధ్య నాటికి అందుబాటులోకి రానుంది. మరోవైపు ఇటీవల లాంచ్ చేసిన శాంసంగ్ ఫోల్డబుల్ డివైస్ శాంసంగ్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌కు గట్టిపోటీ ఇస్తుందని అంచనా. హువావే మేట్ ఎక్స్ ఫీచర్లు 6.6 ఇంచ్ ఓలెడ్ డిస్ప్లే 2480 x 1148 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 6.38 ఇంచ్ సెకండరీ ఓలెడ్ డిస్ప్లే 2480 x 892 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 పై హువావే కైరిన్ 980 ప్రాసెసర్ 5జీ/8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 512 జీబీఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 40 +16 + 8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాలు 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 55 వాట్ల సూపర్ చార్జ్. -
శాంసంగ్ తొలి ఫోల్డబుల్ 5జీ స్మార్ట్‌ఫోన్
శాన్ఫ్రాన్సిస్కో : దక్షిణకొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ఎట్టకేలకు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 5జీ సపోర్టుతో శాంసంగ్ ఫోల్డ్‌ను తీసుకొచ్చింది. అలాగే గెలాక్సీ ఎస్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చి పదేళ్లు అయిన సందర్భంగా గెలాక్సీ ఎస్10 సిరీస్‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా 5 కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. గెలాక్సీ ఎస్10, ఎస్10 ప్లస్, ఎస్10ఇ, ఎస్10 ఫోల్డ్, ఎస్10 5జీ పేరుతో వాటిని శాన్ఫ్రాన్సిస్కోలో బుధవారం ఆవిష్కరించింది. ఏప్రిల్ 26వ తేదీనుంచి కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు గెలాక్సీ ఎస్10 సిరీస్‌లో కంపెనీ నుంచి వచ్చిన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్‌ను మడతపెట్టినప్పుడు 4.6 అంగుళాల స్క్రీన్, ఓపెన్ చేసినప్పుడు 7.3 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఒకేసారి మూడు యాప్స్‌ను మల్టీటాస్కింగ్ చేయవచ్చు. స్క్రీన్స్ స్విచింగ్‌లో యాప్ ఎక్కడ ఆగిందో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభమౌతుంది. అంటే రెండు ఫోన్ల పనిని ఇది చేస్తుంది. మొత్తం ఆరు కెమెరాలను ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చింది . 7 ఎన్ఎం ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ మెమరీ 16+8+12 ఎంపీ ఔట్ సైడ్ ట్రిపుల్ కెమెరా 10+8+10 ఎంపీ ఇన్సైడ్ ట్రిపుల్ కెమెరా 4380 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రారంభ ధర దాదాపు రూ.1,40,000. -
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. వచ్చే నెలలోనే
స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో ఫోల్డబుల్ డివైస్‌లపై భారీ ఆసక్తి నెలకింది. మరోవైపు మొబైల్ దిగ్గజాలు శాంసంగ్,ఎల్జీ, హువావే లాంటివి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల లాంచింగ్లపై యూజర్లను ఊరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న మోటరోలా తన ఐకానిక్ మోడల్ మొబైల్‌ను మళ్లీ తీసుకురాబోతోందన్న అంచనాలు మార్కెట్లో భారీగా వ్యాపించాయి. అత్యుత్తమ ఫీచర్స్‌తో తన పాపులర్ మోడల్ 'మోటరోలా రాజర్'ను తీసుకురాబోతోంది. అదీ ఫోల్డబుల్ డిస్ప్లేతో. ప్రీమియం ధరలో వచ్చే నెలలోనే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. అద్భుత ఫీచర్లతో పూర్తిగా పునరుద్ధరించబడిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు లక్ష రూపాయలుగా ఉండనుందని అమెరికా టెలికాం దిగ్గజం వెరిజాన్ నివేదించింది. అయితే ఈ వార్తలను మోటరోలా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటికే అల్ట్రా థిన్ స్టయిలిష్ డిజైన్‌తో మోటరోలా రాజర్ వి3 ను 2004లో మొదటిసారిగా తీసుకొచ్చి, యంగ్ మొబైల్ యూజర్లలో ట్రెండ్‌సెట్ చేసింది. దాదాపు నాలుగేళ్లలో 130 మిలియన్ల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. మధ్యలో కొంత ప్రాభవాన్నికోల్పోయిన మోటరోలా 2011, 2012 సంవత్సరాల్లో మళ్లీ ప్రపంచంలోనే పలుచనైన మొబైల్గా డ్రాయిడ్ రాజర్ పేరుతో విడుదల చేసింది. ఇపుడిక ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా మరోవైపు ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 'ఫ్లెక్స్‌పై'ను తీసుకొచ్చిన ఘనతను స్టార్టప్ కంపెనీ రాయొలే కార్పొరేషన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
ఫిబ్రవరి20న శాంసంగ్ బిగ్ ఈవెంట్
సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై అంచనాలు మరోసారి మార్కెట్లో వ్యాపించాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఫోల్డబుల్ ఫోన్‌ను ఇటీవల ప్రదర్శించిన శాంసంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరిలో ఆవిష్కరించనుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 20 ఉదయం 11 గంటలకు శాన్ఫ్రాన్సిస్కో లోని బిల్ గ్రాహం సివిక్ ఆడిటోరియంలో స్పెషల్ ఈవెంట్ వుందంటూ శాంసంగ్ మీడియా ఆహ్వానాలు పంపింది. ఈ సందర్భంగా శాంసంగ్ ఎస్ 10, ఎస్10లైట్, ఎస్ 10 ప్లస్ లాంటి ఫ్లాగ్షిప్ ఫోన్లను తీసుకురానుందని వార్తలు షికారు చేస్తున్నాయి. అంతేకాదు శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ (గెలాక్సీఎఫ్) తోపాటు 5జీ డివైస్‌ను కూడా లాంచ్ చేయనుందట. ఎస్9కి కొనసాగింపుగానేమాత్రమే కాకుండా గెలాక్సీ ఫోన్ల 10వ వార్షికోత్సవంగా ఈ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఫోన్ల ఫీచర్లు, ధరలపై అనేక అంచనాలు మార్కెట్లో షికారు చేస్తున్నాయి. ఎస్ 10 129 స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 60వేలు , ఎస్10 లైట్ ధర రూ.72వేలు, ఎస్10 ప్లస్ ధర రూ.81 వేలు హై ఎండ్ వెర్షన్ ధర దాదాపు లక్ష,27వేల రూపాయలుగా ఉండనుందని అంచనా. గెలాక్సీ ఎస్ 10 ఫీచర్లు 6.1అంగుళాల ఇన్ఫినిటీ డిస్ప్లే క్వాల్కం స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 3500 ఎంఏహెచ్‌బ్యాటరీ అలాగే గెలాక్సీ లైట్ 'లైట్' వెర్షన్ ఎస్10 5.8 అంగుళాల ఫ్లాట్ స్క్రీన్‌తో రానుంది. గెలాక్సీ ఎస్ 10 ఫోన్‌ను 6.1 అంగుళాల స్క్రీన్, ఎస్10 ప్లస్‌ను 6.4 అంగుళాల డిస్ప్లేతో రూపొందించింది. అయితే ఫ్రంట్, రియర్ కెమెరా స్పెసిఫికేషన్స్‌పై ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. -
16లెన్స్‌ల ఫోన్‌ను తయారుచేస్తోన్న ఎల్జీ
భారతీయ మార్కెట్లోకి తిరిగి అడుగు పెట్టిన నోకియా బడ్జట్ స్థాయి నుంచి హైఎండ్ వరకు మొబైల్ విడుదల చేసింది. నోకియా 9 ప్యూర్‌వ్యూను ఐదు రియర్ కెమెరాలతో త్వరలోనే రిలీజ్ చేయనుంది. కొద్ది రోజుల క్రితం శాంసంగ్ నాలుగు వెనుక కెమెరాలతో గెలక్సీ ఎ9 ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఈ మధ్య కెమెరాలను శక్తివంతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఎల్జీ 16 లెన్స్‌లతో ఫోల్డబుల్ ఫోన్ తయారు చేస్తున్నట్లు లెట్స్‌గో డిజిటల్ అనే డచ్ వెబ్సైట్ తెలిపింది. మాట్రిక్ ఫార్మాట్లో లెన్స్‌ను అమరుస్తున్న ఈ ఫీచర్‌పై ఎల్జీ పేటెంట్ రైట్స్ తీసుకుంది. ఈ ఫోన్లో ఏర్పాటు చేసిన అన్నీ లెన్స్‌ల నుంచి ఫోటో తీసి, అందులో నిర్ణీత లెన్స్ ద్వారా కాప్చర్ చేసిన పోటోలోని భాగాలను అవసరం లేదనుకుంటే తొలగించే ఆప్షన్‌ను ఇందులో ప్రవేశపెట్టనున్నారు. ఈ లెన్స్‌ల ద్వారా తీసే ఫోటోలోని భాగాన్ని మరో ఫోటొతో మెర్జ్ చేసే ఫీచర్ కూడా సాధ్యమవుతుందని ఆ వెబ్సైట్ వెల్లడించింది. మొబైల్ వెనుక వైపున టచ్‌పాడ్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఫోటోగ్రాఫర్లకు అవసరమయ్యే స్థాయి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఇది మాత్రమేగాక ఫోన్ బ్యాక్పానెల్లో స్పీకర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. -
శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ ఫస్ట్ లుక్
శాన్ఫ్రాన్సిస్కో: సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఫోల్డబుల్ ఫోన్‌ను ప్రదర్శించింది. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. దీనికోసం యాప్‌లను సిద్ధం చేయాల్సిందిగా ఆండ్రాయిడ్ డెవలపర్లను శాంసంగ్ కోరింది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా మొబైల్ ప్రోడక్ట్ స్ట్రాటజీ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ డెనిసన్ 7.3 అంగుళాలు స్క్రీన్‌తో ఈ డివైస్ మోడల్‌ను ప్రదర్శించారు. ప్రస్తుతానికి కేవలం ఫోను డిజైన్ మాత్రం విడుదల చేసిన కంపెనీ దీనిని ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేదీ స్పష్టం చేయలేదు. చూడ్డానికి పాకెట్ సైజ్‌లో ట్యాబ్లాగాన కనిపించే ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర, పేరు, ప్రత్యేకతల వివరాలు ఇంకా వెల్లడించ లేదు. అయితే 7.3 అంగుళాల తెరతో మధ్యకు మడతపెట్టేందుకు వీలుగా ఇది ఉంటుందట. కాగా.. ఇటీవలే చైనా సంస్థ రాయల్ కార్పొరేషన్ 7.8 అంగుళాల ఆండ్రాయిడ్ మడతపెట్టే ఫోనును ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. శాంసంగ్, ఎల్జీ, హువావేల కంటే ముందుగానే అద్భుత ఆవిష్కారం చేసి పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. -
శాంసంగ్‌కు పంచ్: తొలి ఫోల్డింగ్ ఫోన్ వచ్చేసింది
బీజింగ్: ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను చైనా కంపెనీ రాయొలే కార్పొరేషన్ విడుదల చేసింది. గత కొంతకాలంగా శాంసంగ్, ఎల్జీ, హువావే లాంటి సంస్థలు మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో చైనా కంపెనీ పైచేయి సాధించి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాయొలే కార్పొరేషన్ బీజింగ్‌లో అక్టోబర్31న ఈ ఫోన్‌ను తొలిసారిగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘ఫ్లెక్స్‌పై’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. చూడ్డానికి ట్యాబ్‌లా కనిపించినా.. మధ్యలోకి ఫోల్డ్ చేసే వాడుకునేలా దీన్ని రూపొందించింది. ఇందులో మరో విశేషమేమంటే రెండు కెమెరాలు వెనుక భాగాన ఉంటాయి. అయితే ఫోన్ మడిచినపుడు ఒక కెమెరా సెల్ఫీ కెమెరాగా ఉపయోగపడుతుంది. 7.8 అంగుళాలతో మినీ ట్యాబ్‌లా ఉండే ఈ ఫోన్‌ను సగానికి మడతబెట్టొచ్చు. మడిచిన తర్వాత ఇది డ్యుయల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌లా కనిపిస్తుంది. ఫ్లెక్స్ పై గా పిలుస్తున్న ఈ ఫోన్ 20మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్‌తో పాటు 16ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్ డ్యుయల్ కెమెరాలు ఇందులో ఉన్నాయి. దాదాపు 2లక్షల సార్లు పరీక్షించి ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశామని కంపెనీ ప్రకటించింది. సాంప్రదాయ స్మార్ట్ఫోన్లతో పోలిస్తే తమ ఫోల్డబుల్ ఫోన్లు వినియోగదారులకు వివాత్మక, విభిన్నమైన అనుభవాన్నందిస్తుందని రాయొలే సీఈవో, వ్యవస్థాపకుడు డాక్టర్ బిల్ లియూ అన్నారు. ఫ్లెక్స్ పై ఫీచర్లు 7.8 అంగుళాల డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8150 ప్రాసెసర్ 6జీబీ / 8జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ/512జీబీ స్టోరేజ్ 3800 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం royole.com/flexpai ద్వారా ఈ ఫోన్ ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి.128జీబీ ఇంటర్నల్ ఇంటర్నల్ స్టోరేజీ ఫోన్ ధర1,318 డాలర్లు, (సుమారు రూ.94,790) 256జీబీ స్టోరేజీ వేరియంట్ ధర 1,469 డాలర్లుగా (లక్షా డెబ్భై వేల రూపాయలు) నిర్ణయించింది. డిసెంబరులో ఈ ఫోన్ల డెలివరీ చేయనున్నారట. ఇక ఈ అమేజింగ్ ఫోన్ భారత మార్కెట్లో లాంచింగ్ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. మరోవైపు శాంసంగ్, ఎల్జీ కంపెనీలఫోల్డింగ్ ఫోన్ 2019, జనవరిలో లాంచ్ కానుందని భావిస్తున్నారు. This is the "world's first foldable screen phone" released by Rouyu Technology, which will use the Snapdragon 8150 processor, but its design is very rough, just to seize the "first", this is a futures product. pic.twitter.com/M0v9o2z0Bw — Ice universe (@UniverseIce) October 31, 2018 -
భారీ స్క్రీన్‌తో వస్తున్న శాంసంగ్ మడిచే ఫోన్
సియోల్ : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ మరో కొత్తరకం ఫోన్‌ను తీసుకురాబోతుంది. అదే మడతపెట్టే ఫోన్. ఈ ఫోన్ గురించి మార్కెట్లో వస్తున్న రిపోర్టులు అన్నీ ఇన్నీ కావు. ఈ ఏడాది చివరి వరకు శాంసంగ్ మడతపెట్టే ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతుందని తెలుస్తోంది. కంపెనీ ఈ ఫోన్ లాంచింగ్‌పై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా శాంసంగ్ తీసుకొస్తున్న మడతపెట్టే ఫోన్, అతిపెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంటుందని తెలిసింది. భారీ ఎత్తున 7 అంగుళాల డిస్ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంటుందని తాజా రిపోర్టు పేర్కొంది. వాలెట్ మాదిరే దీన్ని మడతపెట్టుకోవచ్చని రిపోర్టు తెలిపింది. మడతపెట్టి ప్యాకెట్లో పెట్టుకుని మరీ ఎక్కడికైనా ఈ ఫోన్‌ను తీసుకెళ్లచ్చని రిపోర్టు పేర్కొంది. భారీ స్క్రీన్‌తో పాటు ఈ ఫోన్‌కు ముందు వైపు రెండో డిస్ప్లే కూడా ఉంటుందట. ఈ రెండో డిస్ప్లే ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం యూజర్లకు నోటిఫికేషన్ల గురించి తెలియజేయడం కోసమేనని తెలిసింది. దీంతో వాట్సాప్ మెసేజ్‌లు వచ్చినప్పుడు, ఈమెయిల్స్ చదవాలనుకున్నప్పుడు హ్యాడ్‌సెట్‌ను పూర్తిగా తెరవాల్సిన పనిలేదట. అన్ని నోటిఫికేషన్లను రెండో డిస్ప్లే నుంచే చెక్ చేసుకోవచ్చని రిపోర్టు చెబుతోంది. ఫోన్‌కు టాప్‌లో ముందు వైపు ఈ రెండో డిస్ప్లేను కంపెనీ అందిస్తుంది. ‘విన్నర్’ అనే కోడ్‌నేమ్‌తో ఈ శాంసంగ్ మడతపెట్టే ఫోన్ వస్తుందని, గేమింగ్ ఔత్సాహికులను, వినియోగదారులను టార్గెట్ చేసుకుని ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ ధర కూడా తక్కుమేవీ లేదట. ఇంచుమించు ఐఫోన్ ఎక్స్ మాదిరి లక్ష రూపాయల ధరను కలిగి ఉంటుందని లీకైన రిపోర్టులు చెబుతున్నాయి. తొలుత ఈ ఫోన్ పరిమిత పరిమాణంలోనే అందుబాటులో ఉంటుందట. ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌కు ఇది గట్టిపోటీగా నిలువబోతుందని టాక్. తొలుత శాంసంగ్ ఈ ఫోన్‌ను తన స్వదేశంలో లాంచ్ చేసుకుని, అనంతరం ఇతర మార్కెట్లకు తీసుకొస్తుందట. అయితే భారత స్టోర్లలోకి ఇది వస్తుందా? రాదా? అన్నది ఇంకా క్లారిటీగా తెలియరాలేదు. -
2020 నాటికి ఆ ఫోన్లు
శాన్ఫ్రాన్సిస్కో: స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ రాబోయే సంవత్సారాల్లో ఫోల్డబుల్ డివైస్‌లను లాంచ్ చేయనుంది. ఐఫోన్లతో కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ టెక్ దిగ్గజం 2020నాటికి మడిచే ఐ ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. తాజా మీడియా నివేదికల ప్రకారం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు తయారీకు సంబంధించి సరఫరాదారులతో ఆపిల్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఐఫోన్ తయారీదారు తన ఆసియా భాగస్వాములతో ఒక ఐప్యాడ్ టాబ్లెట్ లాగా ఉపయోగించగలిగే మడవగల ఐఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ డివైస్‌లలో ఫోల్డబుల్ ఓఎల్ఈడీ ప్యానళ్లను వాడనున్నట్టు, 2020 నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ విశ్లేషకుడు వంశీ మోహన్ పేర్కొన్నారు. కాగా 2017, నవంబర్లోనే అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ కార్యాలయంలో పేటెంట్ దరఖాస్తును కూడా ఫైల్ చేసింది ఆపిల్. మరోవైపు ప్రత్యర్థి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు శాంసంగ్, లెనోవో సైతం ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నట్టు, ఈ మేరకు ప్రయోగాలు కూడా నిర్వహించినట్టుగా పలు అంచనాలు ఇప్పటికే మార్కెట్ వర్గాల్లో భారీగా నెలకొన్నాయి. -
రెండు స్క్రీన్లతో మడతపెట్టే స్మార్ట్‌ఫోన్.. ధర మాత్రం
న్యూయార్క్: చైనాకు చెందిన మొబైల్ పరికరాలను అందించే జెడ్‌టీసీ మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను అమెరికాలో ప్రారంభించింది. డ్యూయల్-స్క్రీన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడం ద్వారా మరొక మైలురాయిని అధిగమించామని సంస్థ ప్రకటించింది. ‘జెడ్‌టీఈ ఆక్సాన్ ఎం’ పేరుతో ఎటీ అండ్ టీ ద్వారా దీన్ని ప్రత్యేకంగా లాంచ్ చేసింది. అమెరికాలో తదుపరి నెలలో అందుబాటులోకి వస్తుందనీ, అనంతరం , చైనా, ఐరోపా, జపాన్‌లతో సహా ఇతర మార్కెట్లకు కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ నిర్ధారించింది. వివిధ యూజర్లకు అనుగుణంగా త్రీ మోడ్స్(డ్యూయల్ ఎక్స్టెండెడ్, మిర్రర్)లతో ఇది లభ్యం కానుంది. అమెరికాలో దీని ధర కేవలం 24.17డాలర్లు( సుమారు రూ.1600) మంగళవారం విడుదలైన తాజా ఫ్లాగ్షిప్ డివైస్‌ను మడిచినపుడు సులభంగా జేబులో సరిపోతుంది. మడత పెట్టే సౌలభ్యంతో పాటు ఒకేసారి రెండు స్ర్రీన్లను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు వినియోగదారులు ఒక తెరపై క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించవచ్చు.. మరో స్క్రీన్ ద్వారా ఇష్టమైన పిజ్జాను ఏకకాలంలో ఆర్డర్ చేసుకోవచ్చు. అవసరం లేనపుడు టాబ్లెట్ మాదిరిగా పెద్ద స్క్రీన్ (6.75-అంగుళాల పూర్తి హెచ్డీ)పై వీడియో గేమ్ ఆడకోవచ్చు. మిర్రర్ మోడ్‌లో వినియోగదారులు సేమ్ కంటెంట్‌ను ఒకేసారి ఒకచోట కూర్చుని వీక్షించవచ్చు. మరోవైపు ఈ స్మార్ట్‌ఫోన్‌లోని రియర్ కెమెరానే సెల్ఫీ కెమెరాగా కూడా ఉపయోపడుతుంది. జెడ్‌టీఈ ఆక్సాన్ ఎం ఫీచర్లు 5.20 అంగుళాల డిస్ప్లే 2.15గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1080x1920 పిక్సెల్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1.2 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 20 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 3180 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
శాంసంగ్ మడతపెట్టే ఫోన్ల రాక అప్పుడేనట!
స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కుతూ మడతపెట్టే ఫోన్లపై కంపెనీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఇక త్వరలోనే దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఈ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయబోతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే శాంసంగ్ మాత్రం ఇంకొంచెం ఆలస్యంగా 2017 చివరి త్రైమాసికంలో మడతపెట్టే తొలి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుందట. ఈ విషయాన్ని డిజిటైమ్స్ రిపోర్టు చేసింది. అలాగే తొలుత కొంతమొత్తంలోనే ఉత్పత్తి చేపట్టి వినియోగదారుల ముందుకు తీసుకురావాలని యోచిస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నట్టు డిజిటైమ్స్ పేర్కొంది. ఒకేసారి పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేపట్టడానికి కంపెనీకి వీలుపడటం లేదని, టెక్నికల్ సమస్యల వల్ల ఈ ఫోన్లను చిన్నమొత్తంలోనే తయారుచేయనున్నారని తెలుస్తోంది. 2018 రెండో త్రైమాసికం వరకు పెద్ద మొత్తంలో ఈ మడతపెట్టే డివైజ్‌లను తయారుచేయరని టాక్. చాలా అనువుగా ఉండే అమోలెడ్ డిస్ప్లేతో వీటిని రూపొందించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ దక్షిణ కొరియా దిగ్గజం మడతపెట్టే డివైజ్‌లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఇప్పటికే పలు రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ ఫోన్లపై కంపెనీ కూడా అదే స్థాయిలో హాడ్వర్క్ చేస్తుందట. ముందస్తు రూమర్ల ప్రకారం కంపెనీ విడుదల చేయబోయే మడతపెట్టే డివైజ్ గెలాక్స్ ఎక్స్ అని తెలిసింది. ఈ నెల చివరిలో జరుగబోయే ఎండబ్ల్యూసీ ఈవెంట్లో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు తీసుకొస్తుందని అంచనావేశారు. కానీ ఈవెంట్ దగ్గరపడే కొద్ది గెలాక్సీ ఎక్స్‌ను ఇప్పుడు ప్రవేశపెడతారు, అప్పుడు ప్రవేశపెడతారు అంటూ పలు రిపోర్టులు వస్తున్నాయి. చివరికి శాంసంగ్ మడతపెట్టే డివైజ్‌లు ఈ ఏడాది చివరి త్రైమాసికంలోనే మన ముందుకు రాబోతున్నాయని తెలుస్తోంది.