బీజింగ్: ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను చైనా కంపెనీ రాయొలే కార్పొరేషన్ విడుదల చేసింది. గత కొంతకాలంగా శాంసంగ్, ఎల్‌జీ, హువావే లాంటి సంస్థలు మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో చైనా కంపెనీ పైచేయి సాధించి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాయొలే కార్పొరేషన్ బీజింగ్‌లో అక్టోబర్31న ఈ ఫోన్‌ను తొలిసారిగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘ఫ్లెక్స్‌పై’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. చూడ్డానికి ట్యాబ్‌లా కనిపించినా.. మధ్యలోకి ఫోల్డ్ చేసే వాడుకునేలా దీన్ని రూపొందించింది. ఇందులో మరో విశేషమేమంటే రెండు కెమెరాలు వెనుక భాగాన ఉంటాయి. అయితే ఫోన్ మడిచినపుడు ఒక కెమెరా సెల్ఫీ కెమెరాగా ఉపయోగపడుతుంది.
7.8 అంగుళాలతో మినీ ట్యాబ్‌లా ఉండే ఈ ఫోన్‌ను సగానికి మడతబెట్టొచ్చు. మడిచిన తర్వాత ఇది డ్యుయల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌లా కనిపిస్తుంది. ఫ్లెక్స్ పై గా పిలుస్తున్న ఈ ఫోన్ 20మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్‌తో పాటు 16ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్ డ్యుయల్ కెమెరాలు ఇందులో ఉన్నాయి. దాదాపు 2లక్షల సార్లు పరీక్షించి ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశామని కంపెనీ ప్రకటించింది. సాంప్రదాయ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే తమ ఫోల్డబుల్ ఫోన్లు వినియోగదారులకు వివాత్మక, విభిన్నమైన అనుభవాన్నందిస్తుందని రాయొలే సీఈవో, వ్యవస్థాపకుడు డాక్టర్ బిల్ లియూ అన్నారు.
ఫ్లెక్స్ పై ఫీచర్లు
7.8 అంగుళాల డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8150 ప్రాసెసర్
6జీబీ / 8జీబీ ర్యామ్,
128జీబీ/256జీబీ/512జీబీ స్టోరేజ్
3800 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
royole.com/flexpai ద్వారా ఈ ఫోన్ ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి.128జీబీ ఇంటర్నల్ ఇంటర్నల్ స్టోరేజీ ఫోన్ ధర1,318 డాలర్లు, (సుమారు రూ.94,790) 256జీబీ స్టోరేజీ వేరియంట్ ధర 1,469 డాలర్లుగా (లక్షా డెబ్భై వేల రూపాయలు) నిర్ణయించింది. డిసెంబరులో ఈ ఫోన్ల డెలివరీ చేయనున్నారట. ఇక ఈ అమేజింగ్ ఫోన్ భారత మార్కెట్లో లాంచింగ్ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. మరోవైపు శాంసంగ్, ఎల్‌జీ కంపెనీలఫోల్డింగ్ ఫోన్ 2019, జనవరిలో లాంచ్ కానుందని భావిస్తున్నారు.
This is the "world's first foldable screen phone" released by Rouyu Technology, which will use the Snapdragon 8150 processor, but its design is very rough, just to seize the "first", this is a futures product. pic.twitter.com/M0v9o2z0Bw
— Ice universe (@UniverseIce) October 31, 2018
Comments
Please login to add a commentAdd a comment