ఎప్పటి నుండో శామ్‌సంగ్ రెండు మడతల ఫోన్ ని తీసుకొస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. అప్పుడప్పుడు ఈ ఫోన్ కి సంబందించిన కొన్ని డ్రాయింగ్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా శామ్‌సంగ్ కంపెనీ త్వరలో విడుదల చేయబోయే రెండు మడతల ఫోన్ యొక్క యానిమేటెడ్ ఫొటోలు శామ్‌సంగ్ డిస్‌ప్లే వెబ్‌సైట్లో దర్శనిమిచ్చాయి. ఈ ఫొటోల ప్రకారం రెండు మడతల ఫోన్ స్క్రీన్ పూర్తిగా తెరిచినప్పుడు ఒక ట్యాబ్ స్క్రీన్ లా మారిపోనుంది. తిరిగి దాన్ని మడతబెడితే సాధారణ ఫోన్ స్క్రీన్ తరహాలోనే ఉంటుంది. ఈ ఫోటోలో మడత పెట్టినప్పుడు Z- స్టైల్ మెకానిజం లాగా కనిపించింది. ఈ ఫోన్‌లో ఓఎల్ఈడీ డిస్‌ప్లేని ఉపయోగిస్తున్నారని సమాచారం. మీరు ఇంకా మడతపెట్టినప్పుడు ఈ ఫొటోని దీర్ఘాంగ పరిశీలించినట్లయితే ఎడమ వైపు ఉన్న భాగం ఫోన్ లోపలికి వెల్లగా, కుడి భాగం మాత్రం సాధారణ ఫోన్ స్క్రీన్ లాగా పనిచేయనుంది. (చదవండి: వచ్చే వారంలో రానున్న టెక్నో పోవా మొబైల్)
ప్రస్తుత ఫోల్డబుల్‌తో పోల్చితే, మడతపెట్టినప్పుడు వినియోగదారుకు చాలా పెద్ద టాబ్లెట్ అనుభవాన్ని కలిగిస్తుంది. శామ్‌సంగ్ తీసుకొస్తున్న ఈ రెండు మడతల ఫోన్ యొక్క ప్రధాన సమస్య దాని యొక్క జీవితకాలం, మడతపెట్టినప్పుడు స్క్రీన్ దెబ్బతినడం. మొదటి తరం ఫోల్డబుల్ ఫోన్‌లలో ప్రధాన సమస్య మడత పెట్ట్టెటప్పుడు స్క్రీన్ దెబ్బతినడం. అందుకని దీనిని మార్కెట్ లోకి తీసుకోని రావడానికి ముందు మొదటి తరం ఫోల్డబుల్ ఫోన్‌లలో ఉన్న సమస్యలను ఇందులో రాకుండా చూసుకుంటున్నట్లు సమాచారం. ధర కనుక అందుబాటులో ఉంటే శామ్‌సంగ్ నుండి వచ్చిన ఈ మల్టీ-ఫోల్డబుల్ ఫోన్‌నుకొనడానికి యూజర్లు ఆసక్తి చూపవచ్చు. ఇంతక ముందు శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 పేరుతొ వచ్చిన మొబైల్ మంచి క్రెజ్ ని సొంతం చేసుకుంది. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చిన మొదటి సంస్థగా శామ్‌సంగ్ నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment