శాన్‌ఫ్రాన్సిస్కో : దక్షిణకొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ఎట్టకేలకు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 5జీ సపోర్టుతో శాంసంగ్ ఫోల్డ్‌ను తీసుకొచ్చింది. అలాగే గెలాక్సీ ఎస్ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చి పదేళ్లు అయిన సందర్భంగా గెలాక్సీ ఎస్10 సిరీస్‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా 5 కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. గెలాక్సీ ఎస్10, ఎస్10 ప్లస్, ఎస్10ఇ, ఎస్10 ఫోల్డ్, ఎస్10 5జీ పేరుతో వాటిని శాన్‌ఫ్రాన్సిస్కోలో బుధవారం ఆవిష్కరించింది. ఏప్రిల్ 26వ తేదీనుంచి కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.
గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు
గెలాక్సీ ఎస్10 సిరీస్‌లో కంపెనీ నుంచి వచ్చిన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్‌ను మడతపెట్టినప్పుడు 4.6 అంగుళాల స్క్రీన్, ఓపెన్ చేసినప్పుడు 7.3 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఒకేసారి మూడు యాప్స్‌ను మల్టీటాస్కింగ్ చేయవచ్చు. స్క్రీన్స్ స్విచింగ్‌లో యాప్ ఎక్కడ ఆగిందో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభమౌతుంది. అంటే రెండు ఫోన్ల పనిని ఇది చేస్తుంది. మొత్తం ఆరు కెమెరాలను ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చింది .
7 ఎన్ఎం ప్రాసెసర్
12 జీబీ ర్యామ్, 512 జీబీ మెమరీ
16+8+12 ఎంపీ ఔట్ సైడ్ ట్రిపుల్ కెమెరా
10+8+10 ఎంపీ ఇన్‌సైడ్ ట్రిపుల్ కెమెరా
4380 ఎంఏహెచ్ బ్యాటరీ
ప్రారంభ ధర దాదాపు రూ.1,40,000.
Comments
Please login to add a commentAdd a comment