న్యూయార్క్: చైనాకు చెందిన మొబైల్ పరికరాలను అందించే జెడ్‌టీసీ మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను అమెరికాలో ప్రారంభించింది. డ్యూయల్-స్క్రీన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడం ద్వారా మరొక మైలురాయిని అధిగమించామని సంస్థ ప్రకటించింది. ‘జెడ్‌టీఈ ఆక్సాన్ ఎం’ పేరుతో ఎటీ అండ్ టీ ద్వారా దీన్ని ప్రత్యేకంగా లాంచ్ చేసింది. అమెరికాలో తదుపరి నెలలో అందుబాటులోకి వస్తుందనీ, అనంతరం , చైనా, ఐరోపా, జపాన్లతో సహా ఇతర మార్కెట్లకు కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ నిర్ధారించింది. వివిధ యూజర్లకు అనుగుణంగా త్రీ మోడ్స్(డ్యూయల్ ఎక్స్‌టెండెడ్, మిర్రర్)లతో ఇది లభ్యం కానుంది. అమెరికాలో దీని ధర కేవలం 24.17డాలర్లు( సుమారు రూ.1600)
మంగళవారం విడుదలైన తాజా ఫ్లాగ్‌షిప్ డివైస్‌ను మడిచినపుడు సులభంగా జేబులో సరిపోతుంది. మడత పెట్టే సౌలభ్యంతో పాటు ఒకేసారి రెండు స్ర్రీన్లను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు వినియోగదారులు ఒక తెరపై క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించవచ్చు.. మరో స్క్రీన్ ద్వారా ఇష్టమైన పిజ్జాను ఏకకాలంలో ఆర్డర్ చేసుకోవచ్చు. అవసరం లేనపుడు టాబ్లెట్ మాదిరిగా పెద్ద స్క్రీన్ (6.75-అంగుళాల పూర్తి హెచ్‌డీ)పై వీడియో గేమ్ ఆడకోవచ్చు. మిర్రర్ మోడ్‌లో వినియోగదారులు సేమ్ కంటెంట్‌ను ఒకేసారి ఒకచోట కూర్చుని వీక్షించవచ్చు. మరోవైపు ఈ స్మార్ట్‌ఫోన్‌లోని రియర్ కెమెరానే సెల్ఫీ కెమెరాగా కూడా ఉపయోపడుతుంది.
జెడ్‌టీఈ ఆక్సాన్ ఎం ఫీచర్లు
5.20 అంగుళాల డిస్‌ప్లే
2.15గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
1080x1920 పిక్సెల్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 7.1.2
4జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
20 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
3180 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
Comments
Please login to add a commentAdd a comment