dual-screen
-
ప్రీమియం ఫీచర్లతో ఆసస్ ల్యాప్టాప్స్: ధర ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీ రంగ కంపెనీ తైవాన్‌కు చెందిన ఆసస్ జెన్‌బుక్ శ్రేణిలో డ్యువో 14, ప్రో డ్యువో 15 ఓఎల్ఈడీ మోడళ్లను భారత్‌లో ప్రవేశపెట్టింది. డ్యూయల్ డిస్ప్లే వీటి ప్రత్యేకత. డ్యూయల్ స్క్రీన్ టెక్నాలజీతో, ప్రీమియం అనుభవంతో ప్రొఫెషనల్ వినియోగదారుల వర్క్‌ను మరింత సులభం చేస్తుందని కంపెనీ తెలిపింది. జెన్‌బుక్ ప్రో డ్యువో 15 ఓఎల్ఈడీకి 15.6 అంగుళాల 4కే యూహెచ్డీ నానోఎడ్జ్ టచ్ డిస్ప్లే, స్టైలస్ సపోర్ట్‌తో సెకండరీ 14.1 అంగుళాల స్క్రీన్‌ప్యాడ్ పొందుపరిచారు. 32జీబీ ర్యామ్, 1టీబీ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ (ఎస్ఎస్డీ), ఇంటెల్ కోర్ ఐ 9 ప్రాసెసర్‌తో వస్తున్న దీని ధర రూ.2,39,990. (ఆరేళ్లలో కోటి స్మార్ట్ఫోన్లు) జెన్‌బుక్ డ్యువో 14 మోడల్‌కు 14 అంగుళాల ఎల్ఈడీ బ్యాక్‌లైట్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 12.65 అంగుళాల స్క్రీన్‌ప్యాడ్ ఏర్పాటు ఉంది. 2 జీబీ ర్యామ్‌తో ఎన్విడియా జిఫోర్స్ ఎంఎక్స్ 450 గ్రాఫిక్స్ కార్డ్ కూడా లభ్యం. విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇవి పనిచేస్తాయి. ధర రూ.99,990. లభ్యత : జెన్‌బుక్ డ్యువో 14 కొనుగోలుకు అందుబాటులో ఉండగా, ప్రో డుయో 15 వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. -
రెండు స్క్రీన్లతో మడతపెట్టే స్మార్ట్‌ఫోన్.. ధర మాత్రం
న్యూయార్క్: చైనాకు చెందిన మొబైల్ పరికరాలను అందించే జెడ్‌టీసీ మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను అమెరికాలో ప్రారంభించింది. డ్యూయల్-స్క్రీన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడం ద్వారా మరొక మైలురాయిని అధిగమించామని సంస్థ ప్రకటించింది. ‘జెడ్‌టీఈ ఆక్సాన్ ఎం’ పేరుతో ఎటీ అండ్ టీ ద్వారా దీన్ని ప్రత్యేకంగా లాంచ్ చేసింది. అమెరికాలో తదుపరి నెలలో అందుబాటులోకి వస్తుందనీ, అనంతరం , చైనా, ఐరోపా, జపాన్‌లతో సహా ఇతర మార్కెట్లకు కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ నిర్ధారించింది. వివిధ యూజర్లకు అనుగుణంగా త్రీ మోడ్స్(డ్యూయల్ ఎక్స్టెండెడ్, మిర్రర్)లతో ఇది లభ్యం కానుంది. అమెరికాలో దీని ధర కేవలం 24.17డాలర్లు( సుమారు రూ.1600) మంగళవారం విడుదలైన తాజా ఫ్లాగ్షిప్ డివైస్‌ను మడిచినపుడు సులభంగా జేబులో సరిపోతుంది. మడత పెట్టే సౌలభ్యంతో పాటు ఒకేసారి రెండు స్ర్రీన్లను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు వినియోగదారులు ఒక తెరపై క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించవచ్చు.. మరో స్క్రీన్ ద్వారా ఇష్టమైన పిజ్జాను ఏకకాలంలో ఆర్డర్ చేసుకోవచ్చు. అవసరం లేనపుడు టాబ్లెట్ మాదిరిగా పెద్ద స్క్రీన్ (6.75-అంగుళాల పూర్తి హెచ్డీ)పై వీడియో గేమ్ ఆడకోవచ్చు. మిర్రర్ మోడ్‌లో వినియోగదారులు సేమ్ కంటెంట్‌ను ఒకేసారి ఒకచోట కూర్చుని వీక్షించవచ్చు. మరోవైపు ఈ స్మార్ట్‌ఫోన్‌లోని రియర్ కెమెరానే సెల్ఫీ కెమెరాగా కూడా ఉపయోపడుతుంది. జెడ్‌టీఈ ఆక్సాన్ ఎం ఫీచర్లు 5.20 అంగుళాల డిస్ప్లే 2.15గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1080x1920 పిక్సెల్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1.2 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 20 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 3180 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
సామ్ సంగ్ తొలి డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్!
తొలి డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ ను దక్షిణ కోరియా టెక్నాలజీ సంస్థ సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ ఆవిష్కరించింది. డ్యూయల్ స్క్రీన్ ఆప్సన్ ద్వారా వినియోగదారులు రెండు డిస్ ప్లేలతో ఫోన్ వాడుకోవడానికి వీలుంటుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. గెలాక్సీ నోట్ ఎడ్జ్ ఫోన్ లో 5.6 ఇంచుల డిస్ ప్లే ఉంటుందని తెలిపారు. ఎస్ఎంఎస్ ఓ స్క్రీన్ లో, ఈమెయిల్స్ మరో స్క్రీన్ లో చూసుకోవడానికి వీలుగా ఉంటుందని తెలిపారు. బిల్ట్ ఇన్ ఎడ్జ్ సిస్టమ్ ద్వారా వాతవరణ సమాచారం, న్యూస్ హెడ్ లైన్స్ తెలుసుకోవచ్చనే అవకాశం ముందని తెలిపారు. స్క్రీన్ ను రెండుగా విభజించి ఆప్స్, కెమెరాను ఉపయోగించుకోవచ్చని సామ్ సంగ్ వెల్లడించింది. ఈ ఫోన్ ను త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.