సామ్ సంగ్ తొలి డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్!
సామ్ సంగ్ తొలి డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్!
Published Thu, Sep 4 2014 1:06 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
తొలి డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ ను దక్షిణ కోరియా టెక్నాలజీ సంస్థ సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ ఆవిష్కరించింది. డ్యూయల్ స్క్రీన్ ఆప్సన్ ద్వారా వినియోగదారులు రెండు డిస్ ప్లేలతో ఫోన్ వాడుకోవడానికి వీలుంటుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. గెలాక్సీ నోట్ ఎడ్జ్ ఫోన్ లో 5.6 ఇంచుల డిస్ ప్లే ఉంటుందని తెలిపారు. ఎస్ఎంఎస్ ఓ స్క్రీన్ లో, ఈమెయిల్స్ మరో స్క్రీన్ లో చూసుకోవడానికి వీలుగా ఉంటుందని తెలిపారు.
బిల్ట్ ఇన్ ఎడ్జ్ సిస్టమ్ ద్వారా వాతవరణ సమాచారం, న్యూస్ హెడ్ లైన్స్ తెలుసుకోవచ్చనే అవకాశం ముందని తెలిపారు. స్క్రీన్ ను రెండుగా విభజించి ఆప్స్, కెమెరాను ఉపయోగించుకోవచ్చని సామ్ సంగ్ వెల్లడించింది. ఈ ఫోన్ ను త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
Advertisement