
సాక్షి, ముంబై: సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన అద్భుతమైన గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ ను ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంచుతోంది. "జెడ్ ఫోల్డ్ 2 '' భారత్‌లో ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇండియాలో ఈఫోన్ ధరను శుక్రవారం ప్రకటించింది. ప్రీ బుకింగ్ కోసం అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది.
ధర, లభ్యత, ఆఫర్లు
సెప్టెంబర్ 14 నుండి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు కొన్ని ఆఫర్‌లు కూడా లభించనున్నాయి. నాలుగు నెలల ఉచిత యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితం. అలాగే ఈ ఫోన్‌ను కొన్నవారికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 22 శాతం తగ్గింపు లభిస్తుంది. 12 నెలల పాటు నో-కాస్ట్ ఇఎంఐ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ బ్రాంజ్ కలర్ ఆప్షన్లలో భారత్‌లో రూ.1,49,999కు దీన్ని విక్రయించనుంది. (భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ ఎం51)
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 ఫీచర్లు
7.6అంగుళాల క్యూఎక్స్‌జీఏ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లే
1768 x 2208 పిక్సెల్స్ రిజల్యూషన్
6.2 అంగుళాల హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్పినిటీ ఫ్లెక్స్ కవర్ డిస్‌ప్లే
816 x 2260 పిక్సెల్స్ రిజల్యూషన్
స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ చిప్‌సెట్
12 జీబీ ర్యామ్, 256 జీబీ/ 512జీబీ స్టోరేజ్
12+12+12 మెగాపిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరా
10+10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4500 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment