అబ్దుల్లాపూర్‌మెట్‌ జంట హత్యల కేసులో మరో ట్విస్ట్‌ | Abdullapurmet Couple Murder Case Husband Reveal New Twist | Sakshi
Sakshi News home page

అబ్దుల్లాపూర్‌మెట్‌ హత్యలు: జ్యోతి కళ్ల ముందే యశ్వంత్‌ను చంపి, ఆపై..

Published Wed, May 4 2022 1:51 PM | Last Updated on Wed, May 4 2022 1:51 PM

Abdullapurmet Couple Murder Case Husband Reveal New Twist - Sakshi

వివాహేతర సంబంధం.. శివారులో నగ్నంగా పడి ఉన్న జంట హత్యల కేసులో మరో ట్విస్ట్‌ వెలుగు చూసింది. 

హైదరాబాద్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ కొత్తగూడెం పరిధిలో జంట హత్యల కేసులో మరో విషయం వెలుగు చూసింది. జ్యోతి-యశ్వంత్‌ల వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని తెలిసిందే.  భార్య ప్రియుడైన యశ్వంత్‌తో పాటు భార్యను కూడా చంపాలనే తీవ్రంగా యత్నించినట్లు జ్యోతి భర్త శ్రీనివాస్‌ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. 

సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించి యశ్వంత్‌ తో పాటు ఆమె ప్రియుడ్ని చంపించాడు భర్త శ్రీనివాస్‌. భార్య కళ్ల ముందే యశ్వంత్‌ను దారుణంగా హతమార్చిన భర్త.. అక్కడితో ఆగలేదు. తనను చంపొద్దని బతిమాలినా భార్య జ్యోతిని సైతం వదలకుండా హతమార్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఆపై శవాలను అక్కడే పడేసి సుపారీ గ్యాంగ్‌తో పాటు వెళ్లిపోయాడు.

ఈ కేసుకు సంబంధించి.. శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత కొంతకాలంగా యశ్వంత్‌, జ్యోతి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండగా.. ఆ విషయం తెలిసి భరించలేక ఇలా ఇద్దరినీ హతమార్చాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్త: యశ్వంత్‌-జ్యోతి వివాహేతర సంబంధం భరించలేక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement