శరద్‌ పవార్‌పై అనుచిత పోస్ట్‌.. నటిపై కేసు | Derogatory FB Post On Sharad Pawar Case Filed On Ketaki Chitale | Sakshi
Sakshi News home page

శరద్‌ పవార్‌పై అనుచిత పోస్ట్‌ షేరింగ్‌.. నటిపై కేసు

Published Sat, May 14 2022 7:00 PM | Last Updated on Sat, May 14 2022 7:02 PM

Derogatory FB Post On Sharad Pawar Case Filed On Ketaki Chitale - Sakshi

బ్రహ్మణులను ద్వేషిస్తున్న నీ కోసం నరకం ఎదురు చూస్తోందంటూ.. పవార్‌ను ఉద్దేశించి చేసిన ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో.. 

ముంబై: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌పై అనుచిత పోస్ట్‌ షేర్‌ చేసినందుకు నటిపై కేసు నమోదు అయ్యింది. 

మరాఠీ టీవీ, సినీ నటి కేతకి చిటలే మీద శనివారం థానే పోలీసులు కేసు నమోదు చేశారు. పవార్‌ను కించపరిచేలా ఉన్న పోస్ట్‌ ఎవరో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా.. శుక్రవారం ఆ పోస్ట్‌ను నటి కేతకి షేర్‌ చేశారు. దీనిపై ఎన్సీపీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె చర్యలు తీసుకోవాలని థానే పోలీసులను డిమాండ్‌ చేశారు. 

దీంతో.. ఆమెపై కేసు నమోదు అయ్యింది. మరాఠీలో ఉన్న సదరు పోస్ట్‌లో నేరుగా ఎన్సీపీ ఛీఫ్‌ పేరును ప్రస్తావించకపోయినా.. ఆయన ఇంటి పేరును, వయసును ప్రస్తావించారు. ‘‘బ్రహ్మణులను ద్వేషిస్తున్న నీ కోసం నరకం ఎదురు చూస్తోందంటూ’’ పవార్‌ను ఉద్దేశిస్తూ ఆ పోస్టులో రాశారు. ఈ పోస్ట్‌ను నటి చిటలే పోస్ట్‌చేయడంతో ఐపీసీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు థానేలోని కాల్వా పోలీసులు.

ఇదిలా ఉండగా.. ఈ పోస్ట్‌ వెనుక బీజేపీ, ఆర్సెస్‌ ‍ ప్రమేయం ఉందని ఎన్సీపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్‌, శివ సేనతో ఎస్పీపీ జట్టుకట్టడం బీజేపీకి సహించడం లేదని, ఈ క్రమంలోనే తమ పార్టీ, అధినేత శరద్‌ పవార్‌పై అభ్యంతర ప్రచారం సోషల్‌ మీడియాలో చేస్తోందని అంటున్నారు.

చదవండి: గుడ్‌ బై.. గుడ్‌ లక్‌.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన పీసీసీ మాజీ చీఫ్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement