facebook postings
-
నలుపు అంటే శక్తి
నాలుగు సంవత్సరాల అమ్మాయి తన తల్లిని ‘అమ్మా... నన్ను తిరిగి నీ గర్భంలోకి తీసుకొని తెల్లగా పుట్టించగలవా?’ అని అడిగింది. తల్లి ఆశ్చర్యంగా చూసి ‘ఎందుకమ్మా?’ అని అడిగింది. ‘నల్లపిల్ల అంటూ నన్ను అందరూ వెక్కిరిస్తున్నారు’ కళ్లనీళ్లతో చెప్పింది ఆ అమ్మాయి. ‘రంగుది ఏముందమ్మా! నువ్వు చదువుకొని పెద్ద స్థాయిలో ఉంటే రంగు గురించి ఎవరూ మాట్లాడరు’ అన్నది ఆ తల్లి ఓదార్పుగా.కట్ చేస్తే.... ఆ అమ్మాయి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలాంటి పెద్ద పదవిలోకి వచ్చింది. అయినా నల్లటి ఆమె ఒంటి రంగును హేళన చేస్తూ అయిదు దశాబ్దాలుగా ఆమెను బాధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్.‘నలుపు’ అనే ముద్ర వేసి వెక్కిరించడంపై శారదా మురళీధరన్ గొంతు విప్పారు. ‘ఇది విశ్వం యొక్క సర్వవ్యాప్త సత్యం అయినప్పుడు ఆ రంగును ఎందుకు కించపరుస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు. వర్ణ, లింగ వివక్షకు సంబంధించిన కామెంట్స్‌పై ఫేస్బుక్లో ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.శారదకు ఎంతోమంది నుంచి మద్దతు వెల్లువెత్తింది.‘ నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ అంటారు శారద.శారద 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆరేళ్ల పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘కుటుంబ శ్రీ’కి నేతృత్వం వహించారు. ఆ తర్వాత జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.త్రివేండ్రం జిల్లా కలెక్టర్‌గా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిషనర్‌గా... ఇలా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. గత సంవత్సరం భర్త డాక్టర్ వేణు నుంచి కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయినా సరే... ‘నలుపు’ పేరుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెక్కిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. కేరళ చీఫ్ సెక్రటరీగా తన భర్త నుంచి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రంగుతో పోల్చుతూ, ఆ పదవికి మీరేం సరిపోతారు? అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారు. వారి కామెంట్స్‌లో నలుపు రంగును తక్కువ చేసి వెక్కిరించడం ఉంది. ఆడవాళ్లకు పెద్ద పదవులు ఎందుకు? అనే పురుషాధిపత్య భావజాలం ఉంది. ఈ నేపథ్యంలోనే తన మనసులోని ఆవేదనను ఫేస్బుక్ పోస్ట్‌లో పెట్టారు శారద. ఆ పోస్ట్‌పై మొదట్లో కొందరి కామెంట్స్ చూసిన తరువాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. ‘మీ పోస్ట్ నేపథ్యంలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి’ అని శ్రేయోభిలాషులు చెప్పడంతో మరోసారి పోస్ట్ చేశారు. రీ–షేర్ చేసిన తరువాత ఆమె పోస్ట్‌కు మద్దతుగా ఎన్నో కామెంట్స్ వచ్చాయి. శారద ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను ప్రశంసించిన వారిలో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షనేత సతీశన్ కూడా ఉన్నారు.‘నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్నికీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ -
చీకట్లో ఉరిమిన చిరు స్వరం
ఒక్క పిలుపు ఇవ్వగానే వేలాదిమంది మహిళలు అర్ధరాత్రి వేళ వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఆమె ప్రఖ్యాత ఉద్యమ నాయకురాలు, రాజకీయ నాయకురాలు కాదు. సాధారణ మహిళ. కోల్‌కత్తాలోని జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై 29 ఏళ్ల రిమ్జిమ్ సిన్హా ఫేస్బుక్ పోస్ట్ వైరల్ కావడమే కాదు అర్ధరాత్రి వేళలో ఉద్యమ స్వరమై ప్రతిధ్వనించింది...కోల్కత్తా, ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన దారుణ హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌తో పాటు ఎన్నో రాష్ట్రాలలో ఎంతోమంది మహిళలు ఆగస్ట్ 14 అర్ధరాత్రి వీధుల్లోకి వచ్చారు. ‘రీక్లెయిమ్ ది నైట్: ది నైట్ ఈజ్ అవర్’ కాప్షన్‌తో రిమ్జిమ్ సిన్హా ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. అర్ధరాత్రి వేళ మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసన గళం వినిపించేలా చేసింది.‘మహిళల కొత్త స్వాతంత్య్ర పోరాటం’గా ‘రీక్లెయిమ్ ది నైట్’ క్యాంపెయిన్‌ను అభివర్ణించింది రిమ్జిమ్ సిన్హా. రీక్లెయిమ్ ది నైట్’ చిహ్నమైన నెలవంక పట్టుకున్న ఎర్ర చేతి పోస్టర్ వైరల్ అయింది.రిమ్జిమ్ సిన్హా కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సోషల్‌సైన్స్ రిసెర్చర్. జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నన్ను బాధ పెట్టడమే కాదు అభధ్రతాభావానికి గురి చేసింది. నగరాల్లో మహిళలు ఎంత సురక్షితంగా ఉన్నారు? అని ఆలోచిస్తేనే భయంగా ఉంది. వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు కోరుతూ ఆగస్ట్ 14 అర్ధరాత్రి నిరసన ప్రదర్శన చేయాలనుకున్నాను. రాత్రిపూట బయటకు వెళ్లే హక్కు మహిళలకు ఎందుకులేదు?’ అంటున్న రిమిజిమ్ సిన్హా సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది మహిళలను ఐక్యం చేసింది.మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై రిమ్జిమ్ సిన్హా మండిపడింది. ‘జూనియర్ డాక్టర్ ఒంటరిగా సెమినార్ హాల్‌కు ఎందుకు వెళ్లింది?’ అని ఆయన ప్రశ్నించాడు.‘బాధితురాలిపై నిందలు మోపే కుసంస్కారాన్ని అంగీకరించబోము. రాత్రివేళ బయట ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు’ అంటుంది సిన్హా. తన పిలుపు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, దేశవ్యాప్తంగా వేలాది మంది అర్ధరాత్రి వేళ వీధుల్లోకి వస్తారని ఆమె ఊహించలేదు.‘వందమంది వరకు వస్తారనుకున్నాను. ఒకవేళ ఎవరూ రాకుంటే నేను ఒక్కదానినే బయటికి రావాలనుకున్నాను. ఇంతమంది మహిళలు అర్ధరాత్రి ఇల్లు దాటి బయటికి వస్తారని నేను ఊహించలేదు. వారి స్పందన నాకు సంతృప్తిని ఇచ్చింది’ అంటుంది సిన్హా. రిమ్జిమ్ సిన్హా పేరు సంచలనం కావడం మాట ఎలా ఉన్నా ఎంతోమంది రాజకీయ నాయకులకు టార్గెట్‌గా మారింది. ‘రీక్లయిమ్ ది నైట్’ ఉద్యమ చిహ్నానికి రకరకాలుగా భాష్యం చెబుతూ విమర్శిస్తున్నవారు కూడా ఉన్నారు.‘అర్ధరాత్రిపూట బయటకు వస్తున్నారు. మీకేమైనా అయితే పూచీ మాది కాదు’ అంటున్న రాజకీయ నాయకులు ఉన్నారు. జాదవ్పూర్లోని 8బీ బస్‌స్టాండ్‌కు దగ్గర జరిగిన సభకు హాజరమైన రిమ్జిమ్ సిన్హా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన గురించి మాత్రమే కాదు రాత్రివేళలో మహిళలకు ఎదురయ్యే ట్సాన్స్పోర్ట్ సమస్యలు, పని ప్రదేశంలో మహిళలకు సెపరేట్ టాయిలెట్లు, బడులలో లింగ సమానత్వంపై ΄ాఠ్యాంశాలు, రాత్రి విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగులకు సురక్షితమై విశ్రాంతి గదులు... మొదలైన వాటి గురించి మాట్లాడింది. ‘రీక్లయిమ్ ది నైట్: ది నైట్ ఈజ్ అవర్స్’ను దృష్టిలో పెట్టుకొని ‘ఇది మహిళల కొత్త స్వాతంత్య్ర ΄ోరాటం’ అంటున్న రిమ్జిమ్ సిన్హా ఆ ΄ోరాటానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. -
మహిళా ఐపీఎస్, ఐఏఎస్‌ల గొడవ.. సర్కారు సీరియస్.. ఇద్దరికీ నోటిసులు
బనశంకరి: కర్ణాటకలో ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిపై ఐపీఎస్ రూపా మౌద్గిల్ బహిరంగ ఆరోపణలు, ఆమె ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంపై రగడ రాజుకుంది. దీంతో ప్రభుత్వం సోమవారం ఇద్దరికీ నోటీసులను జారీచేసింది. ఇద్దరూ వేర్వేరుగా రాష్ట్ర సీఎస్ వందిత శర్మను కలిసి వివరణ ఇచ్చారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు రోహిణిపై రూపా ఫేస్బుక్ ద్వారా తీవ్ర ఆరోపణలను గుప్పించారు. సోమవారం రోహిణి సింధూరి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న రూపాకు చికిత్స చేయించాలన్నారు. ప్రచారం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను గతంలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫొటోలను సేకరించి దుష్పచారం చేస్తున్నారని ఆరోపించారు. వీరి వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రమైందిగా భావిస్తోందని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. వారి వ్యవహారంపై తాము కళ్లు మూసుకుని కూర్చోలేదని, చర్యలు తీసుకుంటామని, ఇద్దరూ హద్దు మీరి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే ప్రజాసేవకులని, ఆ హోదాలకు అవమానం చేశారని అన్నారు. తనకు తెలిసిన మేరకు వారిద్దరూ వ్యక్తిగత సమస్యల వల్లే దూషణలకు దిగుతున్నారని తెలిపారు. రోహిణి భర్త సుధీర్ రెడ్డి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. తన కంటే పదేళ్లు జూనియర్ అయిన రోహిణీ సింధూరికి మంచి పేరు రావడం ఇష్టం లేకనే రూపా ఇలా ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రోహిణి ఫోన్‌ను బ్లూటూత్ ద్వారా హ్యాక్ చేసి వ్యక్తిగత ఫొటోలను రూపా కాజేశారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పవార్‌పై అనుచిత పోస్ట్.. 20 కేసులతో జైల్లోనే నటి
ముంబై: మహారాష్ట్ర సీనియర్ నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ షేరింగ్ చేసిన వ్యవహారంలో నటికి ఊరట దొరకడం లేదు. బెయిల్ దొరికినా.. మరాఠీ నటి కేతకి చిటలే(29) ఇంకా జైల్లోనే ఉన్నారు. అందుకు కారణం.. ఆమెపై ఏకంగా 20 దాకా కేసులు నమోదు కావడం. మరాఠీ టీవీ, సినీ నటి కేతకి చిటలే.. పవార్‌ను కించపరిచేలా ఉన్న పోస్ట్ ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ పోస్ట్‌ను నటి కేతకి షేర్ చేశారు. దీనిపై ఎన్సీపీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని థానే పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న థానే పోలీసులు.. మే 14వ తేదీన ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మధ్యలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించింది కోర్టు. ఇది జరిగి నెల కావొస్తోంది. అయితే.. థానే కోర్టు తాజాగా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఆమె ఇంకా జైల్లోనే ఉంది. అనుచిత పోస్ట్ షేరింగ్ విషయంలో ఆమెపై 20 కేసులు నమోదు అయ్యాయని, అందుకే ఆమె రిలీజ్ కుదరదని జైళ్ల శాఖ తెలిపింది. మరోవైపు బెయిల్ కోసం ఆమె బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వచ్చే వారం పిటిషన్ విచారణకు రానుంది. అదే విధంగా ఆయా కేసుల్లో విచారణపై స్టే విధించాలంటూ మరో పిటిషన్‌ను వేయగా.. ఆ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉంది. మరోవైపు.. కేతకి చిటలేతో పాటు పవార్ వ్యతిరేక పోస్టును ట్విటర్లో షేర్ చేసిన నిఖిల్ భర్మే(23) అనే ఫార్మసీ స్టూడెంట్ సైతం అరెస్ట్ అయ్యాడు. నిఖిల్‌పై సైతం ఆరు కేసులు నమోదుకాగా, నెలపైనే జైల్లో ఉన్నాడు. మరాఠీలో ఉన్న సదరు పోస్ట్‌లో నేరుగా ఎన్సీపీ ఛీఫ్ పేరును ప్రస్తావించకపోయినా.. ఆయన ఇంటి పేరును, వయసును ప్రస్తావించారు. ‘‘బ్రహ్మణులను ద్వేషిస్తున్న నీ కోసం నరకం ఎదురు చూస్తోందంటూ’’ పవార్‌ను ఉద్దేశిస్తూ ఆ పోస్టులో రాశారు. -
Texas shooting: ఫేస్బుక్లో ప్రకటించి మరీ...
హూస్టన్: హంతకుడు రామోస్ ఫేస్బుక్లో ముందుగా ప్రకటించి మరీ నరమేధానికి పాల్పడ్డాడు! ‘నానమ్మను కాల్చబోతున్నా’ అని మంగళవారం 11 గంటలప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆమెను కాల్చాక, ‘ఇప్పుడు స్కూల్లో షూటౌట్‌కు బయల్దేరుతున్నా’’ అంటూ మరో పోస్ట్ చేశాడు. అరగంటకే దారుణానికి తెగబడ్డాడు. దీనిపై ఉదయం నుంచీ పలు సంకేతాలిస్తూ వచ్చాడు. ‘ఓ చిన్న రహస్యం చెప్పాలనుకుంటున్నా’ అంటూ లాస్‌ఏంజెలెస్‌కు చెందిన ఓ యువతికి ఇన్‌స్టాగ్రాంలో మంగళవారం ఉదయమే మెసేజ్ చేశాడు. ‘‘ఇంకాసేపట్లో నేను...’’ అంటూ 9.16కు ఓ స్మైలీ ఎమోజీ పెట్టాడు. ‘‘11 గంటల లోపు చెప్తా’’ అంటూ ముగించాడు. 11.30కు నరమేధం సృష్టించాడు. తన టిక్‌టాక్ పేజీ పరిచయంలో ‘పిల్లలూ! నిజ జీవితంలో కూడా భయపడేందుకు రెడీగా ఉండండి’’ అని కూడా రాసుకున్నాడు! కాల్పులకు వాడిన తుపాకులను, మేగజైన్లను రామోస్ తన 18వ పుట్టిన రోజు సందర్భంగా గత వారమే కొన్నాడు. వాటితో పోజిస్తూ ఫొటోలు దిగడమే గాక ఇన్‌స్టాగ్రాంలో అప్లోడ్ చేశాడు. టెక్సాస్‌లో 18 ఏళ్లు నిండితే లైసెన్సుతో పని లేకుండా తుపాకులు కొనుక్కోవచ్చు. నానమ్మతో నిత్యం గొడవలే డిగ్రీ చదవలేకపోయానంటూ రామోస్ నిత్యం బాధపడేవాడని పొరుగువారు చెప్పారు. ఈ విషయమై నిత్యం నానమ్మతో గొడవ కూడా పడేవాడన్నారు. స్థానిక విండీస్ సరుకుల దుకాణంలో పని చేసే అతనిది దూకుడు మనస్తత్వమని సహోద్యోగులు చెబుతున్నారు. ‘‘ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు. మహిళా ఉద్యోగులకు అసభ్య మెసేజీలు పంపేవాడు. వాళ్లతో చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. స్థానిక పార్కులో పలువురితో బాక్సింగ్ చేసేవాడు’’ అన్నారు. అతనికి తల్లితోనూ సరిపడేది కాదని, అందుకే కొద్ది నెలల క్రితమే నానమ్మ ఇంటికి వచ్చాడని చెప్పారు. రామోస్ స్కూల్ మేట్స్ సోమవారం డిగ్రీ పూర్తి చేసి పట్టాలు తీసుకున్నారని సమాచారం. ఆ ఆక్రోశంతోనే దారుణానికి ఒడిగట్టాడని భావిస్తున్నారు. నానమ్మపై కాల్పులు జరిపి, ‘నన్ను కాల్చేస్తున్నాడు’ అని ఆమె అరుస్తుండగానే కారెక్కి స్కూలుకేసి దూసుకెళ్లాడు. నత్తితో బాధపడేవాడు రామోస్‌కు నత్తి ఉండేదని, దాంతో బాల్యంలో స్కూళ్లో తోటి పిల్లల చేతిలో చాలా అవమానాలకు గురయ్యాడని అతని సహ విద్యార్థి చెప్పాడు. ‘‘రామోస్ నత్తిని, అతను వేసుకునే నాసిరకం బట్టలను పిల్లలంతా బాగా వెక్కిరించేవారు. అతని పేదరికాన్ని కూడా హేళన చేసేవారు. చూట్టానికి గే మాదిరిగా కన్పిస్తున్నావంటూ ఆటపట్టించేవారు. అది భరించలేక అతను స్కూలు ఎగ్గొట్టేవాడు. చివరికి మొత్తానికే మానేశాడు’’ అని చెప్పుకొచ్చాడు. తర్వాత షూటింగ్ అంటే ఇష్టం పెంచుకున్నాడని, కాల్ ఆఫ్ డ్యూటీ అనే ఫైటింగ్ గేమ్‌కు వీరాభిమానిగా మారాడని వివరించాడు. -
శరద్ పవార్‌పై అనుచిత పోస్ట్.. నటిపై కేసు
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌పై అనుచిత పోస్ట్ షేర్ చేసినందుకు నటిపై కేసు నమోదు అయ్యింది. మరాఠీ టీవీ, సినీ నటి కేతకి చిటలే మీద శనివారం థానే పోలీసులు కేసు నమోదు చేశారు. పవార్‌ను కించపరిచేలా ఉన్న పోస్ట్ ఎవరో ఫేస్బుక్లో పోస్ట్ చేయగా.. శుక్రవారం ఆ పోస్ట్‌ను నటి కేతకి షేర్ చేశారు. దీనిపై ఎన్సీపీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె చర్యలు తీసుకోవాలని థానే పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో.. ఆమెపై కేసు నమోదు అయ్యింది. మరాఠీలో ఉన్న సదరు పోస్ట్‌లో నేరుగా ఎన్సీపీ ఛీఫ్ పేరును ప్రస్తావించకపోయినా.. ఆయన ఇంటి పేరును, వయసును ప్రస్తావించారు. ‘‘బ్రహ్మణులను ద్వేషిస్తున్న నీ కోసం నరకం ఎదురు చూస్తోందంటూ’’ పవార్‌ను ఉద్దేశిస్తూ ఆ పోస్టులో రాశారు. ఈ పోస్ట్‌ను నటి చిటలే పోస్ట్‌చేయడంతో ఐపీసీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు థానేలోని కాల్వా పోలీసులు. ఇదిలా ఉండగా.. ఈ పోస్ట్ వెనుక బీజేపీ, ఆర్సెస్ ప్రమేయం ఉందని ఎన్సీపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్, శివ సేనతో ఎస్పీపీ జట్టుకట్టడం బీజేపీకి సహించడం లేదని, ఈ క్రమంలోనే తమ పార్టీ, అధినేత శరద్ పవార్‌పై అభ్యంతర ప్రచారం సోషల్ మీడియాలో చేస్తోందని అంటున్నారు. చదవండి: గుడ్ బై.. గుడ్ లక్.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన పీసీసీ మాజీ చీఫ్ -
అఖిలేశ్ యాదవ్‌పై పోస్టు.. మార్క్ జుకర్‌బర్గ్‌పై కేసు!
మెటా కంపెనీ (ఫేస్బుక్) సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌పై ఉత్తర ప్రదేశ్‌లో కేసు నమోదు అయ్యింది. సమాజ్‌వాదీ పార్టీ ఛీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు వ్యతిరేకంగా చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదం కావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. కన్నౌజ్ జిల్లాలోని ఓ న్యాయస్థానంలో పరువుకు భంగం కలిగించే ప్రయత్నం కింద కేసు నమోదు అయ్యింది. జుకర్‌బర్గ్‌తో పాటు 49 మంది పేర్లను ఇందులో చేర్చినట్లు తెలుస్తోంది. జుకర్‌బర్గ్‌కు ఆ పోస్ట్‌కి ఎలాంటి సంబంధం లేకున్నా.. ఆయన సీఈవోగా ఉన్న ఫ్లాట్‌ఫామ్‌లో ఆ పోస్ట్ పడడం, అందులో అఖిలేష్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా కామెంట్లు పడడంతోనే ఎఫ్ఐఆర్లో జుకర్‌బర్గ్ పేరు చేర్చినట్లు తెలుస్తోంది. పీటీఐ రిపోర్ట్ ప్రకారం.. కన్నౌజ్ జిల్లా సారాహతి గ్రామానికి చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తి ఈ కేసును దాఖలు చేశాడు. అఖిలేష్ ఇమేజ్ను దెబ్బ తీసేందుకే అలాంటి పోస్ట్‌ను చేశారని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ అమిత్ కోర్టులో దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్లో పేర్కొన్నాడు. అంతకు ముందు పోలీసులకు ఈ వ్యవహారంపై పిటిషన్ అందజేసినా స్పందన లేదని కుమార్ కోర్టుకు వెల్లడించాడు. ‘బువా బాబువా’ పేరుతో రన్ అవుతున్న ఓ పేస్బుక్ పేజీలో అఖిలేష్ యాదవ్‌తో పాటు బీఎస్పీ ఛీఫ్ మాయావతిని ఉద్దేశిస్తూ సెటైరిక్ పోస్టులు పడుతుంటాయి. అయితే ఈ పిటిషన్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులు ఈ కేసు నుంచి జుకర్‌బర్గ్ పేరును తప్పించారు. పేజీ అడ్మిన్‌ని ప్రశ్నించి దర్యాప్తను వేగవంతం చేస్తామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇక ఈ పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. చదవండి: పర్మిషన్ లేకుండా ఆ ఫొటోలు పెడితే ఎలా? -
ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అకౌంట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్ 16 నుంచి జులై 31 మధ్య కాలంలో సుమారు 33.3 మిలియన్ల కంటెంట్ పీస్ (ఇమేజ్)లను అకౌంట్ల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. యూజర్లు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉండేందుకు ఫేస్ బుక్ గత కొంత కాలంగా యూజర్లు టెక్నాలజీ, ఏఐలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. తద్వారా ఫేస్ బుక్ యూజర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా ఇమేజెస్, కంటెంట్లపై కన్నేసింది. ఈ రెండింటిలో ఫేస్‌బుక్‌కు చెందిన 10 కంటెంట్ పాలసీ నిబంధనలతో పాటు ఆ సంస్థకు చెందిన మరో సోషల్ నెట్ వర్క్ ఇన్ స్టాగ్రామ్‌లో 8 పాలసీల నిబంధనల్ని ఉల్లంఘించిన అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. సోషల్ మీడియా వల్ల హింస పెరిగిపోతుందా? కరోనా కారణంగా సోషల్ మీడియా వినియోగం రోజురోజుకి పెరిగిపోయింది. సరైన అవగాహన ఉన్నవారు మనీ ఎర్నింగ్ కోసం ఫేస్‌బుక్‌ను ఓ వేదికగా మార్చుకుంటున్నారు. అదే సమయంలో మరికొందురు రెచ్చగొడుతూ హింసను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్లను భారీగా తొలగించామంటూ ఇటీవల ఫేస్బుక్ స్పోక్ పర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 16 నుంచి జులై 31 మధ్య కాలంలో 25.6 మిలియన్ల ఇమేజ్ కంటెంట్, హింసను రెచ్చగొట్టేలా ఉన్న 3.5 మిలియన్ల గ్రాఫికల్ ఇమేజెస్‌పై, 2.6 మిలియన్ల అడల్ట్ కంటెంట్ ఉన్న ఇమేజెస్‌లను తొలగించినట్లు తెలిపారు. వీటితో పాటు 1లక్షా 23,400 హరాస్ మెంట్ కంటెంట్ ఉన్న అకౌంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు,1504 రిపోర్ట్‌ల ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. ఫేస్బుక్కే కాదు.. ఇన్ స్టాగ్రామ్ లో కూడా.. ఫేస్బుక్కే కాదు..ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ యాజమాన్యం వెల్లడించింది. 1.1 మిలియన్ల హింసాత్మక పోస్ట్‌లు, 8,11,000 వేల సూసైడ్, సెల్ఫ్ ఇంజూరీ ఇమేజ్ కంటెంట్ లపై చర్యలకు ఉపక్రమించింది. జూన్ 16 నుంచి జులై 31 వరకు 265 అకౌంట్లపై యూజర్లు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. వాట్సాప్ లో సైతం ఫేస్బుక్ కు చెందిన మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్‌లో జూన్ 16 నుంచి జులై 31 వరకు 3 మిలియన్ కంటే ఎక్కువ అకౌంట్లును తొలగించింది. ఇదే సమయంలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు 36,934 ఫిర్యాదులు అందగా..95,680 ఇమేజెస్‌ను తొలగించింది. చదవండి: ఇకపై ఈజీగా ఎలక్ట్రిక్ వెహికల్‌ను సొంతం చేసుకోవచ్చు! -
మీ ఫోన్ డెడ్ అయ్యిందా? ఇలా వినియోగించుకోండి
వాట్సాప్ వినియోగదారులకు కోసం వాట్సాప్ మల్టీ డివైజ్ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. గత కొంతకాలంగా యూజర్లు మల్టీ డివైజ్ఆప్షన్ను ఎనేబుల్ చేయాలంటూ వాట్సాప్‌కు రిక్వెస్ట్ చేశారు. దీంతో ఆ ఆప్షన్‌పై వర్క్ చేస్తున్న వాట్సాప్ యాజమాన్యం యూజర్లకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పింది. వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ 'వాట్సాప్ బీటా' వివరాల ఆధారంగా.. వాట్సాప్‌ను వినియోగదారుడు తన ఫోన్‌తో పాటు మరో నాలుగు రకాల డివైజ్‌లలో వినియోగించుకోవచ్చు. వాట్సాప్ వినియోగంలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఫోన్ ఛార్జింగ్ దిగిపోయి డెడ్ అయినా మిగిలిన నాలుగు డివైజ్‌లలో వాట్సాప్ ఆన్‌లోనే ఉంటుంది. ఇది పూర్తి ఎండ్ టూ ఎండ్ స్క్రిప్ట్ తో సెక్యూరిటీ, ప్రైవసీని కలిగి ఉంటున్నట్లు పేర్కొంది. మల్టీ డివైజ్ ఫీచర్‌ను ఎలా వినియోగించాలి ఈ మల్టీ డివైజ్ ఫీచర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు కాబట్టి ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వినియోగించడం అసాధ్యం. వాట్సాప్ బీటా బ్లాగ్ పోస్ట్‌లో ప్రస్తుతం మల్టీ డివైజ్ ఆప్షన్‌ను కొంతమంది యూజర్లకు మాత్రమే అనుమతిస్తూ టెస్ట్ ట్రయిల్స్‌ను నిర్వహిస్తున్నట్లు పోస్ట్‌లో పేర్కొంది. దానికి తోడు అదనంగా మరిన్ని ఫీచర్స్‌ను యాడ్స్ చేయాలని భావిస్తోంది. ఇక ఈ ఆప్షన్‌ను ఆండ్రాయిడ్ ,ఐఓఎస్ యూజర్లు పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో క్లారిటీ ఇవ్వలేదు. Very excited to be launching a beta of our new multi-device capability for @WhatsApp. Now you can use our desktop or web experiences even when your phone isn't active and connected to the internet. All secured with end-to-end encryption. Learn more: https://t.co/AnFu4Qh6Hd — Will Cathcart (@wcathcart) July 14, 2021 -
మరో ఫీచర్, ఇన్ స్టాగ్రామ్ వినియోగదారులకు గుడ్‌న్యూస్
వినియోగదారులకు అనుగుణంగా సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్లకే పరిమితమైన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇప్పుడు డెస్క్ టాప్‌పై దర్శనమివ్వబోతున్నాయి."మాకు తెలుసు వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ తో పాటు డెస్క్‌టాప్‌లో రీల్స్‌ను షేర్ చేయాలని చూస్తున్నారు. వారి కోసమే డెస్క్‌టాప్ ఫీచర్‌ను అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రీల్స్‌ను రికార్డ్ చేసి.. డెస్క్ టాప్ ద్వారా అప్లోడ్ చేయోచ్చు"అని ఇన్స్టాగ్రామ్ స్పోక్ పర్సన్ అధికారికంగా ప్రకటించారు. రీల్స్‌ను ఎలా అప్లోడ్ చేయాలి. ♦ ఇన్స్టాగ్రామ్ ను మీకంప్యూటర్లో, లేదంటే ల్యాప్‌ట్యాప్ లో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తరువాత ఇన్ స్టాగ్రామ్ ఇంటర్ ఫేస్‌లో ప్లస్ సింబల్‌ను క్లిక్ చేయాలి ♦ క్లిక్ చేసి సెలక్ట్ ఫ్రమ్ కంప్యూటర్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. ♦ అనంతరం మీకు కావాల్సిన ఒరిజనల్ స్కైర్,ల్యాండ్ స్కేప్, పోట్రేట్ సైజ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ♦ సెలక్ట్ చేసుకున్న అనంతరం క్లిక్ నెక్ట్స్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. ♦ అలా ట్యాప్ చేస్తే ఫిల్టర్, ఎడిట్ బ్రైట్ నెస్, కాంట్రాస్ట్ ఆప్షన్లు మనకు కనిపిస్తాయి. ♦ అనంతరం మీ వీడియోలకు, ఫోటోలకు క్యాప్షన్ రాసి, లోకేషన్ యాడ్ చేయాలి. ఆ తరువాత వీడియోని షేర్ చేసుకునే సదుపాయాన్ని ఇన్ స్టాగ్రామ్ కల్పించింది. చదవండి: రేజర్‌పేతో ట్విటర్ జట్టు -
ఆ దొంగ ఎవరు?!
వసుధ (పేరు మార్చడమైనది) పేరున్న రేడియో జాకీ. రెండేళ్లుగా రేడియో ఎఫ్ఎమ్లో వర్క్ చేస్తోంది. ఎప్పుడూ సరదాగా ఉండే వసుధ అంటే టీమ్‌లో అందరికీ చాలా ఇష్టం. లీవ్ తీసుకొని వారం రోజులు తన సొంతూరుకు వెళ్లి వచ్చింది. తన పెళ్లి సెటిల్ అయ్యిందని టీమ్ అందరికీ పార్టీ ఇచ్చింది. అందరూ అభినందనలు తెలిపారు. ఉదయాన్నే వసుధకు ఫోన్ వచ్చింది. చూస్తే తన ఫ్రెండ్ రోజీ. ‘ఏంటే ఇంత పొద్దున్నే ఫోన్ చేశావ్’ అడిగింది వసుధ. ‘త్వరలో పెళ్లి అన్నావ్, ఎందుకా చెత్త ఫొటోలు అప్లోడ్ చేశావ్!’ కాస్త కటువుగానే అడిగింది రోజీ. నిద్రమత్తు ఎగిరి పోయింది వసుధకు. ఫొటోలా, ఏం ఫొటోలు?! అర్ధం కాక అడిగింది. ఒకసారి నీ ఎఫ్బి ఓపెన్ చేసి చూడు. ఎలాంటి ఫొటోలు ఉన్నాయో..!’ అంది రోజీ. పోస్ట్ చేసేది ఎవరు? తన అకౌంట్ ఓపెన్ చేసి చూసింది. అలాంటివేవీ లేవు. అదే విషయాన్ని రోజీకి ఫోన్ చేసి అడిగింది. వసుధ పేరుమీద అప్లోడ్ చేసిన ఫొటోలు, అకౌంట్ డీటెయిల్స్‌తో సహా స్క్రీన్ షాట్ చేసి వసుధకు పంపించింది రోజీ. అవి చూసిన వసుధ ఉలిక్కిపడింది. తన పేరు మీదనే ఉన్న మరో అకౌంట్లో ఫ్రెండ్స్‌తో పార్టీలో ఉన్నప్పుడు తీసిన ఫొటోలు. అసలా ఫొటోలు అంత వల్గర్‌గా ఎవరు తీశారో, ఎవరు అప్లోడ్ చేశారో.. ఏమీ అర్ధం కాలేదు. గంటకో ఫొటో అప్లోడ్ అవుతూనే ఉంది. అవి తన వ్యక్తిగత ఫొటోలు. ఎక్కడ నుంచి తన ఫొటోలు ఎవరు తీసి, అప్లోడ్ చేస్తున్నారో తెలియడం లేదు. వేలాదిగా వస్తున్న చెత్త కామెంట్లు. తను మార్కెట్‌కి, షాపింగ్‌కి వెళ్లినా.. పలానా చోట ఉన్నట్టు ఆ సమాచారం ఎఫ్‌బిలో పోస్ట్ అవుతుంది. నాలుగు రోజులుగా తిండీ, నిద్రకు దూరమైంది. ముక్కలైన బంధం కాబోయే భర్త రాఘవ ఫోన్ చేశాడు. ఆనందంగా ఫోన్ ఎత్తిన వసుధ అతని మాటలకు తల్లడిల్లిపోయింది. ‘ఆధునిక భావాలు కలదానివని తెలుసు. కానీ, మరీ ఇంత ఆధునికం అని తెలియదు. ఇక మన పెళ్లి జరగదు, సారీ’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఇంజనీరింగ్ చేసిన వసుధ, తనకు నచ్చిన రేడియో జాకీ జాబ్ చేస్తూ అందరి మెప్పు పొందింది. పెద్దలు కుదిర్చిన సంబంధానికే ఓకే చెప్పింది. ఇరువైపుల పెద్దలకు సంబంధం నచ్చడంతో సింపుల్‌గా ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. నెల రోజుల్లో పెళ్లి. ఓ పది రోజులు డ్యూటీ చేసి, ఆ తర్వాత షాపింగ్ పూర్తి చేసుకొని ఊరెళ్లిపోదామనే ఆలోచనలో ఉంది వసుధ. కానీ, అనుకోని ఈ అవాంతరం పెళ్లే ఆగిపోయేలా చేసింది. ఆ రోజంతా ఏడుస్తూనే కూచుంది వసుధ. రోజీ ఇచ్చిన ధైర్యంతో సైబర్ నిపుణులను సంప్రదించింది. మేకవన్నె పులి దీనికంతటికీ కారణం సూరజ్ అని తెలిసేసరికి షాక్ అయ్యింది వసుధ. సూరజ్ కూడా రేడియో జాకీగా వసుధ చేసే ఆఫీసులోనే వర్క్ చేస్తున్నాడు. వసుధ అంటే ఇష్టం పెంచుకున్నాడు. తన పెళ్లి గురించి వసుధ చెప్పగానే బాధపడ్డాడు. వసుధ పై అంతులేని ద్వేషం పెంచుకున్నాడు. ‘నాకు దక్కని వసుధ ఎవరికీ దక్కడానికి వీల్లేదు, ఆమె సంతోషంగా ఉండటానికి వీల్లేదు’ అనుకున్నాడు. అందులో భాగంగానే ఎవరికీ అనుమానం రాకుండా ఓ ప్లాన్ వేశాడు. తన ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆధార్‌కార్డుతో కొత్త సిమ్ తీసుకొని, ఆ ఫోన్ నెంబర్ నుంచి వసుధ పేరుతో ఆన్లైన్లో కొత్త అకౌంట్ ఓపెన్ చేశాడు. వసుధతో స్నేహంగా ఉన్నట్టు నటించి, ఆమె ఫోన్లో ఆమెకే తెలియకుండా స్పై యాప్ డౌన్లోడ్ చేసి, దానిద్వారా వసుధ ఎక్కడెక్కడ ఉంటుందో తెలుసుకుంటూ, ఆ సమాచారాన్ని పోస్ట్ చేసేవాడు. ఆమె వ్యక్తిగత ఫొటోలూ అప్లోడ్ చేస్తూ వచ్చాడు. కొన్ని ఫొటోలు మార్ఫింగ్ చేసి మరీ ఉపయోగించాడు. ఈ విధంగా వసుధ వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసి ఆమెను నలుగురిలో చులకన చేయాలన్నది సూరజ్ ప్లాన్. పులులు అడవుల్లో ఉంటాయి. కానీ, ఇలాంటి మేకవన్నె పులులు మన చుట్టూ ఉంటారు. గమనించి జాగ్రత్తపడాలన్న ఆలోచన అమ్మాయిల్లో పెరగాలి. ఎమెషనల్ ఫ్రాడ్స్‌కి దూరం ఐడెంటిటీ ఫ్రాడ్ అమ్మాయిల విషయాల్లోనే జరుగుతుంది. 90 శాతం దొంగ దొరికిపోతాడు. కానీ, అమ్మాయిలు ఏమరుపాటుతో ఉండాలి. తమ ఫోన్‌ని జాగ్రత్తపరుచుకోవాలి. వ్యక్తిగత సమాచారం దొంగిలించ బడకుండా బ్యాంకింగ్‌కు ఒక ఇమెయిల్ ఐడీ ఫోన్ నెంబర్, ఈ కామర్స్ అన్నింటికీ మరో కొత్త ఫోన్ నెంబర్, ఇ–మెయిల్ ఐడి ఉపయోగించడం వల్ల కొన్ని ఫ్రాడ్స్ని అరికట్టవచ్చు. మ్యాట్రిమోనియల్, డేటింగ్.. మొదలైన ఏ లింక్ ప్రొఫైల్‌లో అయినా వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదు. మహిళలను మానసికంగా వేధించేవారు ఎక్కువ మందే ఉంటారు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ పగ తీర్చుకోవాలనే.. కాలేజీలు, కార్యాలయాల నుంచి ఇలాంటి కంప్లైట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఫ్రెండ్స్, లవర్స్‌గా ముందు క్లోజ్‌గా ఉండి, బ్రేక్ అయినప్పుడు పగ తీర్చుకోవాలనుకుంటారు. దీంతో ఇలా ఇబ్బంది పెడుతుంటారు. ఇలాగే మరో ఇద్దరు సహోద్యోగుల మధ్య జరిగింది. స్నేహంగా ఉంటూనే ఉద్యోగిని ఫోన్లో ఒక బగ్ (ఐకాన్ కూడా కనపడదు) ఇన్ స్టాల్ చేశాడు. అక్కణ్ణుంచి ఆమె ఆన్లైన్ మానిటరింగ్ మొత్తం ఈ ఫ్రాడ్ చేసేవాడు. అవన్నీ ఆఫీసు గ్రూ‹ప్‌కు పంపించేవాడు. ఫోనోలో ఉన్న ఆ బగ్ ఏ మెయిల్ నుంచి ఆపరేట్ అవుతుందో కనిపెట్టి, ఆ ఫ్రాడ్‌ని పట్టుకున్నాం. కాబట్టి, ఫోన్ వాడకంలో జాగ్రత్త అవసరం. – వి. గోపీనాథ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సైబర్ క్రైమ్, విశాఖపట్నం -
మధురైలో ఎన్ఐఏ సోదాల కలకలం
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేరళ నుంచి వచ్చిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు మధురైలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇద్దరు తీవ్రవాద అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. శ్రీలంక చర్చిలో మూడేళ్ల క్రితం జరిగిన మారణహోమంలో తమిళనాడుకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందని భారత్‌కు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు లోతుగా విచారణ చేపట్టగా తమిళనాడు పాత్రను గుర్తించారు. అనాటి నుంచి తమిళనాడులోని అనుమానితులపై నిఘాపెట్టారు. ఫేస్బుక్లో సందేహాస్పద పోస్టింగ్‌లను గమనించిన మధురై పోలీసులు అదే ప్రాంతానికి చెందిన సెంథిల్‌కుమార్ అలియాస్ మహమ్మద్ ఇక్బాల్‌కు తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉండవచ్చని అనుమానించి గతంలో కేసు పెట్టారు. ఈ కేసు ఏప్రిల్‌లో ఎన్ఐఏకు బదిలీకాగానే ఇక్బాల్‌ను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, కేరళ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందం ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మధురై కాజీమర్ వీధి, కే పుత్తూరు, పెత్తానియాపురం, మగప్పాళయం తదితర ప్రాంతాల్లో ఇక్బాల్ అతని స్నేహితుల ఇళ్లలో మధ్యాహ్నం 1 గంట వరకు తనీఖీలు సాగాయి. ఇక్బాల్ ఇంటి నుంచి పెన్ డ్రైవ్, సిమ్‌కార్డు సహా 16 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక తిరుప్పూరుకు చెందిన ఒక యువకుడు ఇక్బాల్‌తో ఎక్కువసేపు వాట్సాప్‌లో చాటింగ్ చేసిన విషయం బయటపడింది. సుమారు 8 గంటలపాటూ ఆ యువకుడిని విచారించి విడిచిపెట్టారు. (చదవండి: Covid-19: తలైవా విరాళం రూ. 50 లక్షలు) -
‘ఇళ్లల్లోకి వెళ్లండి, రోడ్లపై కనిపిస్తే కాల్చిపడేస్తాం’
భోపాల్: ఆకతాయిలు వీరంగం సృష్టించారు. పట్టపగలే బైకులపై తిరుగుతూ తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ‘రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. రోడ్లమీద కనిపిస్తే కాల్చిపడేస్తాం’ అంటూ కొందరు ఆకతాయిలు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటన మొరెనా జిల్లా బంఖండి ప్రాంతం కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గుర్తు తెలియని 25మంది దుండగులు మాస్క్ ధరించి గన్స్‌తో వీరంగం సృష్టించారు. బైక్‌పై డ్రైవ్ చేసుకుంటూ 100 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. తుపాకీ గుళ్ల శబ్దంతో ఉలిక్కిపడ్డ ప్రజలు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఇళ్లు, బస్సులు ద్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న అడిషనల్ ఎస్పీ రాయ్ సింగ్ నార్వారియా పరిస్థితిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. కాల్పులకు పాల్పడ్డ నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. అయితే, పోలీసుల వెర్షన్ ఇలా ఉంటే స్థానికుల వెర్షన్ మరోలా ఉంది. ఈ కాల్పులు లాక్డౌన్ నిబంధనల్ని పాటించనందుకు కాదు. ఓ యువతి ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ వల్ల రెండు సామాజిక వర్గాల మధ్య అగ్గిరాజేసిందని చెప్తున్నారు. ఓ వర్గం మరో వర్గంవారిని టార్గెట్ చేస్తూ కాల్పులకు దిగిందని అంటున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో ఇదే అంటూ స్థానికులు ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలాఉండగా.. మధ్యప్రదేశ్‌లో కరోనావైరస్ విజృంభిస్తుండడంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా కేసుల్ని కట్టడి చేయాలంటే లాక్డౌన్ ఒక్కటే శరణ్యం.. అందుకే రాష్ట్రంలో మే15 వరకు జనతాకర్ఫ్యూ పేరుతో లాక్డౌన్ విధిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. #CoronaCurfew not in Morena! dozens masked riding mobikes openly firing targeting the other caste over a social media post! @GargiRawat @ndtv @ndtvindia pic.twitter.com/B7GG8tXAa1 — Anurag Dwary (@Anurag_Dwary) May 8, 2021 -
కాల్పుల్లో మరణిస్తే జవాన్లు అమరులా? రచయిత్రి వ్యాఖ్యలు దుమారం
గౌహతి: ఛత్తీస్‌గడ్‌లో ఇటీవల మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అసోంకు చెందిన రచయిత్రి శిఖా శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ఫేసుబుక్‌లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. దీనిపై తీవ్ర దుమారం రేపడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ‘జీతాలు తీసుకుని పని చేసే ఉద్యోగులు కాల్పుల్లో మరణిస్తే అమరులా? అని ప్రశ్నించింది. అలాగైతే మిగతా సిబ్బంది కూడా అమరవీరులే అవుతారని రచయిత్రి శిఖాశర్మ పేర్కొన్నారు. గౌహతికి చెందిన ఉమి దేకా బరువా, కంకణ గోస్వామి ఆమె ఫేసుబుక్ పోస్టు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు గౌహతి పోలీసులు శిఖాశర్మపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 294 (ఏ, 124 (ఏ), 500, 506, ఐటీ చట్టం 45 కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందగానే రచయిత్రి శిఖాశర్మను డిస్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. శిఖాశర్మ ఫేస్బుక్లో చేసిన పోస్టు ఇదే.. ‘జీతం పొందేవారు మృతి చెందేవారిని అమరవీరులుగా గుర్తించొద్దు. ఆ విధంగా భావించాలనుకుంటే విద్యుత్ ఉద్యోగులు కూడా ప్రమాదాల్లో మృతి చెందుతారు. వారిని కూడా అమరవీరులుగా ప్రకటించొచ్చు కదా? ప్రజలను భావోద్వేగాలకు గురి చేయొద్దు మీడియా! ’ అని స్థానిక భాషలో ఆమె రాసింది. శిఖా శర్మ ఇటీవల జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసింది కూడా. -
ట్రంప్ ఫేస్బుక్, ట్విటర్ ఖాతాలు బంద్
వాషింగ్టన్: నిబంధనలు ఉల్లంఘిస్తూ పోస్టులు పెట్టినందుకు ఫేస్బుక్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఖాతాను 24 గంటలపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ట్విటర్ సైతం ట్రంప్ చేసిన మూడు ట్వీట్లను తొలగించమని కోరుతూ తాత్కాలికంగా ఖాతాను నిలిపివేసింది. అధ్యక్ష ఎన్నికలపైనా, వాషింగ్టన్ డీసీలో కొనసాగుతున్న హింసాత్మక నిరసనల పట్ల ఆధారరహిత వ్యాఖ్యలు చేయడంతో ఫేస్బుక్, ట్విటర్ ట్రంప్ ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలియజేశాయి. రెండు రకాల పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ట్రంప్ పోస్టులు పెట్టడంతో ఖాతాకు తాత్కాలికంగా చెక్ పెట్టినట్లు ఫేస్బుక్ పేర్కొంది. ఇదే విధంగా కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్‌ను నియామకాన్ని నిలిపివేయమంటూ ట్రంప్ మద్దతుదారులు కాంగ్రెస్‌పై నిరసనలను వ్యక్తం చేస్తున్న అంశంపై ట్విటర్ 12 గంటలపాటు ఖాతాను నిలిపివేస్తున్నట్లు తెలియజేసింది. ఈ అంశాలపై చేసిన మూడు ట్వీట్లను తొలగించవలసిందిగా సూచించింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ ట్వీట్లను తొలగించకపోతే.. ట్రంప్ ఖాతా నిలిపివేత కొనసాగుతుందని ట్విటర్ పేర్కొంది. (చైనా పేమెంట్ యాప్‌లకు ట్రంప్ చెక్) -
తిరిగిచ్చేసింది
ఎంత ధైర్యం గల మహిళ! డ్రగ్ లార్డ్‌ని అరెస్ట్ చేసింది. సీఎంని క్వొశ్చన్ చేసింది. చీఫ్ జస్టిస్‌ని ప్రశ్నించింది. ఇప్పుడు.. తన గ్యాలెంట్రీ మెడల్నే విసిరికొట్టేసింది. నీతి, నిబద్ధత గలవాళ్లంతే! వాళ్లకు డ్యూటీ ఫస్ట్. బృందాకైతే డ్యూటీనే సర్వస్వం. థోనావ్జామ్ బృందా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ‘ఫియర్ లెస్’ అని ఆమెకు పేరు. ఐదు నెలల క్రితం సంచలనాత్మకమైన ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు ఆమె. అధికారంలో ఉన్నవారితో నేరుగా డీకొనడమే అది. మణిపూర్ ఏమైపోతోంది? బాలలకు మనం ఎలాంటి భవిష్యత్తును ఇవ్వబోతున్నాం.. అని పాలక పక్షాన్నే భుజాలు తడుముకునేలా చేశారు బృందా. ఇక మొన్నటి శుక్రవారం అయితే ఆమె తన ‘శౌర్య అవార్డు’ను ప్రభుత్వం ముఖాన దాదాపుగా విసరికొట్టేసినంత పనిచేశారు. డ్రగ్స్ మాఫియా యుద్ధంలో పై చేయి సాధించినందుకు ప్రశంసగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ రెండేళ్ల క్రితం బృందాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ పోలీస్ గ్యాలెంట్రీ అవార్డు ప్రదానం చేశారు. శౌర్య అవార్డు అందుకున్న రాష్ట్ర ‘నార్కోటిక్స్ అండ్ అఫైర్స్ ఆఫ్ బోర్డర్ బ్యూరో’ (న్యాబ్) తొలి పోలీస్ ఆఫీసర్ బృందా. 2018 జూన్‌లో ‘న్యాబ్’ అధికారిగా డ్యూటీలోకి రాగానే ఆమె మొదట చేసిన పని డ్రగ్ లార్డ్ లుకోసీ జౌ ఇంటికి వెళ్లి ఆయనతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్‌ని, నగదును స్వాధీనం చేసుకున్నారు. జూన్‌లో ఆమె అరెస్ట్ చేస్తే, ఆగస్టులో ఆమెకు గ్యాలెంట్రీ అవార్డు వచ్చింది. అవార్డును ఇచ్చినట్లే ఇచ్చి, లుకోసీ జౌను కేసు నుంచి తప్పించమని బృందాపై ఒత్తిడి తెచ్చారు ముఖ్యమంత్రి. ఆమె వినలేదు. అరెస్ట్ అయిన నాలుగో రోజు నుంచే లుకోసీ బెయిల్ పై తిరుగుతున్నాడు. చివరికి గురువారం ఇంఫాల్ హైకోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. అతడికి బెయిల్ ఇవ్వడంపై కోర్టును ప్రశ్నిస్తూ వస్తున్న బృందాను కోర్టు తీవ్రంగా మందలించింది. ఎఎస్పీ సరైన సాక్ష్యాధారాలు చూపించకపోవడంతో లుకోసీని వదిలేయడం జరిగిందని తీర్పు చెప్పింది. దీనంతటి వెనుక ఎవరున్నారో బృందాకు తెలుసు. అందుకే తన మెడల్‌ను తిరిగి ఇచ్చేశారు. ‘‘నేను ఈ మెడల్‌కు అనర్హురాలిని. సమర్థులైన మరొకరికి దీనిని ఇవ్వండి’’ అని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ రెండేళ్లలోనూ.. చెబుతున్నా వినకుండా లుకోసీని అరెస్టు చేసినందుకు మణిపుర్‌లోని బి.జె.పి. ప్రభుత్వం బృందాను అనేక విధాలుగా వేధించింది. ఉద్యోగం తీయించడమే ఒక్కటే తక్కువ. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న అర్థరహితమైన ఆరోపణతో కూడా ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం ఆమెను నిర్బంధించింది! అదే నెలలో బృందా మామగారు 76 ఏళ్ల రాజ్‌కుమార్ మేఘన్‌కు భద్రత కల్పించే నెపంతో ఆ కుటుంబాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. మేఘన్ మణిపుర్‌లోని తిరుగుబాటు ‘యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్’ ఛైర్మన్. ఆయన 44 ఏళ్ల తర్వాత గత ఏడాది నవంబరులో గౌహతి సెంట్రల్ జైలు నుంచి విడుదలై వచ్చారు. బృందా 2012 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఇద్దరు పిల్లల తల్లి. ఆమె తన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారో మణిపుర్‌నూ అంతగా ప్రేమిస్తారు. మణిపుర్ భవిష్యత్ తరాల భద్రత, సంరక్షణల కోసమే ఆమె ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నానంటారు. -
రాజుకున్న రాజధాని
ఎమ్మెల్యే సమీప బంధువైన యువకుడు ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ మూకదాడులకు కారణమైంది. వేలాది మంది పోలీస్‌స్టేషన్, ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి విధ్వంసకాండకు పాల్పడ్డారు. ఐటీ సిటీలో గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ అల్లర్లు పెను ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. సాక్షి, బెంగళూరు: బెంగళూరు నడిబొడ్డున పులకేశినగర నియోజకవర్గం కాడుగొండన (కేజీ) హళ్లి, దేవరజీవన (డీజే) హళ్లిలో దావాగ్నిలా అల్లర్లు, హింస చెలరేగాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో 24 గంటల పాటు 144 సెక్షన్ విధించారు. ఘటనలో 60 మంది పైగా పోలీసులు గాయపడ్డారు. సుమారు 145 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా ఆస్తినష్టం దాడుల్లో 26 ఇళ్లు దెబ్బతిన్నాయి. రెండు ఆటోలు, మూడు కార్లు, 40 పైగా ద్విచక్రవాహనాలు కాలిపోయాయి. దాడుల్లో ఏటీఎం పగలగొట్టారు. ఉన్నత స్థాయి పోలీసు అధికారుల కార్లకు కూడా నిప్పు పెట్టారు. ఇక పోలీసుల కాల్పుల్లో పది మంది వరకూ గాయపడ్డారు. ఆస్తినష్టం కోట్ల రూపాయల్లో ఉండవచ్చని అంచనా. ఎలా మొదలైందంటే పులకేశినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి మేనల్లుడయ్యే నవీన్ అనే యువకుని ఫేస్బుక్ ఖాతాలో మంగళవారం సాయంత్రం అనుచితమైన పోస్టింగ్‌లు వచ్చాయి. దీంతో కొందరు మైనారిటీ వర్గాల యువకులు మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో డీజే హళ్లి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. అవహేళనగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారని ఫిర్యాదు చేశారు. ఇంతలో వేలాది మంది అక్కడికి చేరుకుని పోలీస్‌స్టేషన్‌లోని వాహనాలకు నిప్పు పెట్టి భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. కొన్ని గంటలపాటు ఈ తతంగం కొనసాగింది. పోలీసులు కూడా అదుపు చేయలేక తలోదిక్కుకు పరుగులు తీశారు. మరికొందరు పోలీసులు స్టేషన్‌లోపల దాక్కున్నారు. పదుల సంఖ్యలో వాహనాలు భస్మీపటలం అయ్యాయి. ఆ వీధిలో ఉన్న ప్రజల వాహనాలు, ఇళ్లను కూడా వదిలిపెట్టలేదు. కార్లు, బైక్‌లు బూడిదయ్యాయి. తరువాత ఎమ్మెల్యే ఇంటిపైకి ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి అండతోనే నవీన్ ఇలా చేస్తున్నాడని భావించి కావల్ బైరసంద్రలోని ఎమ్మెల్యే నివాసంపై దాడికి దిగారు. అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టగా.. ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఎమ్మెల్యే గానీ, కుటుంబం కానీ లేకపోవడంతో ముప్పు తప్పింది. కానీ అక్కడ కూడా భారీ విధ్వంసమే చోటుచేసుకుంది. అల్లరిమూకల్ని అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు యువకులు మరణించారు. అల్లర్లలో 60 మంది వరకూ పోలీసులు గాయపడ్డారు. కాగా అల్లర్లకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం యడియూరప్ప ప్రకటించారు. పోలీసుల అదుపులో పాషా ఎస్డీపీఐ (సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) సంస్థ ఆధ్వర్యంలోనే దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్డీపీఐ బెంగళూరు నేత ముజామిల్ పాషాను పోలీసులు అరెస్టు చేశారు. అతడే మొదటి నిందితుడని డీజే హళ్లి పోలీసులు పేర్కొన్నారు. ఘటన జరుగుతున్న సమయంలో అతడు మైక్ పట్టుకుని గుంపునుద్దేశించి మాట్లాడుతున్న దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. పాషాపై డీజే హళ్లి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఐదు కేసులు ఉన్నాయి. సీసీ కెమెరాల చిత్రాలు, సోషల్ మీడియాలో వస్తున్న చిత్రాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వందలాది మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పులకేశినగరలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. -
భగ్గుమన్న బెంగళూరు!
సాక్షి, బెంగళూరు: ప్రశాంతతకు పెట్టింది పేరుగా ఉండే కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ వ్యక్తి ఫేస్బుక్లో షేర్ చేసిన పోస్టు బెంగళూరులో కల్లోలానికి దారి తీసింది. పులకేశినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై దాడికి ప్రేరేపించింది. మంగళవారం సాయంత్రం చిన్నపాటి గొడవగా ఆరంభమై రాత్రికి అల్లర్లు ఉధృతమయ్యాయి. వేల సంఖ్యలో జనాలు వచ్చి పోలీస్‌స్టేషన్, ఎమ్మెల్యే ఇంటిపై దాడులకు తెగబడ్డారు. గంటలపాటు విధ్వంసకాండ కొనసాగింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఫేస్బుక్లో పోస్టు చేసిన వ్యక్తి పులకేశినగర ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి సమీప బంధువు. ఎమ్మెల్యే అండతోనే అతడు ఇలా చేస్తున్నాడని భావించి మరో గుంపు కావల్ బైరసంద్రలోని ఎమ్మెల్యే నివాసంపై దాడి చేసింది. అక్కడి వాహనాలకు నిప్పు పెట్టగా ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఫైరింజన్లు వెళ్లకుండా అడ్డుపడ్డారు. పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో అనేక హెచ్చరికల అనంతరం కాల్పులు జరిపినట్లు బెంగళూరు నగర కమిషనర్ కమల్‌పంత్ తెలిపారు. కాల్పుల్లో వాజిద్ ఖాన్ (20), యాసిమ్ పాషా (22), వాసిం (40) అనే వారు చనిపోయారు. దాడుల్లో 60 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. వివాదాస్పద పోస్టు పెట్టిన నవీన్‌ను, అల్లర్లకు పాల్పడిన మరో 110 మందిని అరెస్టు చేశారు. ఈ సంఘటనలో ఎమ్మెల్యే కుటుంబం క్షేమంగా బయటపడింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం యెడియూరప్ప ఆదేశించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి, సీఆర్పీఎఫ్ను మోహరించారు. ఏం జరిగిందంటే? శివాజీనగరకు చెందిన ఓ వర్గం వారు 15 మంది మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో డీజే హళ్లి పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లారు. మతపరమైన అంశాల్లో నవీన్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు చేశారని ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ కేశవమూర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేస్తామని చెప్పారు. అయితే తక్షణమే అరెస్టు చేయాలంటూ వాగ్వాదానికి దిగారు. అంతలోనే సుమారు 4 వేల మంది అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులను లోపలికి వెళ్లకుండా అడ్డుకుని, పలు వాహనాలకు నిప్పు పెట్టారు. స్టేషన్‌పై రాళ్లురువ్వారు. అర్థరాత్రి 2 గంటల తర్వాత కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. అప్పటికే ఆ మార్గంలో 26 ఇళ్లు దెబ్బ తిన్నాయి. 2 ఆటోలు, 3 కార్లు, 40 ద్విచక్రవాహనాలు కాలిపోయాయి. ఆరంభంలోనే సీసీటీవీలు ధ్వంసం చేశారు. ఏటీఎం పగలగొట్టారు. -
నేను బతికి ఉండటం అద్భుతం: శ్రీనివాసమూర్తి
బెంగళూరు: ఫేస్బుక్లో షేర్ చేసిన ఓ పోస్టు కర్ణాటకలో కల్లోలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు ఒకరు ఓ వర్గాన్ని కించపరిచే విధంగా పోస్టు చేశారు. ఎమ్మెల్యే అండతోనే సదరు వ్యక్తి ఇలా చేస్తున్నాడని భావించి మంగళవారం రాత్రి నిరసనకారులు బెంగళూరులో శ్రీనివాస మూర్తి నివాసంపై దాడి చేశారు. దీనిపై ఎమ్మెల్యే తాజాగా స్పందించారు. తాను బతికుండటం నిజంగా అద్భుతం అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ క్షణం నేను బతికి ఉండటం నిజంగా అద్భుతం. దాడి జరిగినప్పుడు నేను బయట ఉన్నాను. నా శ్రేయోభిలాషులు ఫోన్ చేసి దాడి గురించి ముందుగానే నన్ను హెచ్చరించారు. దాంతో తప్పించుకోగలిగాను. లేదంటే ఇప్పుడు నేను ఇలా బతికి ఉండేవాడిని కాదు’ అన్నారు శ్రీనివాస మూర్తి. (బెంగళూరు అల్లర్లు: ముస్లింల సాహసం) అంతేకాక ‘గుర్తు తెలియని వ్యక్తులు నా ఇంటికి నిప్పంటించారు. పెట్రోల్ బాంబులను విసిరారు. పోలీసులు సకాలంలో రాకపోతే నా ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ను పేల్చేసేవారు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడి. పోలీసులు దీనిపై విచారణ చేయాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి’ అని శ్రీనివాస మూర్తి డిమాండ్ చేశారు. ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న తనకే ఇలా జరిగితే... ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. దాడులు చేసిన వారు తమ నియోజకవర్గానికి చెందిన వారు కాదని, బయటి వ్యక్తులన్నారు. ఈ విషయంపై హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడానని, తమ పార్టీ వారితో కూడా మాట్లాడినట్టు శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. 100మంది గాయపడ్డారు. వీరిలో 60 మంది పోలీసులు ఉన్నారు. -
కన్నవారిని కలిపిన ఫేస్బుక్
పాతపట్నం (శ్రీకాకుళం): నాలుగేళ్ల వయసులో తప్పిపోయి అమ్మానాన్నలకు దూరమైంది. చిన్ననాటి జ్ఞాపకాలను పదిలపర్చుకుని.. పదమూడేళ్ల అనంతరం వారి జాడ తెలుసుకుంది. కన్నవారిని కలుసుకోబోతున్నాననే ఆనందం ఒకవైపు.. 13 ఏళ్లపాటు సొంత బిడ్డలా పెంచి.. చదువు చెప్పించిన తల్లి దూరమవుతోందనే బాధ మరోవైపు ఆమెను చుట్టుముట్టాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామానికి చెందిన కోడిపెంట్ల మాధవరావు, వరలక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లారు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. మాధవరావు, వరలక్ష్మి దంపతులు 2006 నవంబర్‌లో ముగ్గురు బిడ్డల్ని ఇంటివద్దే ఉంచి కూలి పనులకు వెళ్లారు. వారి కుమార్తె భవానీ తన అన్నయ్యలు సంతోష్, గోపీతో ఆడుకుంటూ తప్పిపోయింది. రోడ్డుపై బిక్కుబిక్కుమంటూ రోదిస్తున్న భవానీని జయరాణి (జయమ్మ) అనే మహిళ చేరదీసి ఆమె తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల వాకబు చేసింది. ఫలితం లేకపోవడంతో అప్పట్లోనే సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. భవానీ సంబంధీకులు వచ్చేవరకు ఆమెను తానే సాకేందుకు ముందుకొచ్చింది. భవానీని పెంచి ఇంటర్మీడియెట్ వరకు చదివించింది. భవానీకి ప్రస్తుతం 17 ఏళ్లు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన జయరాణి (జయమ్మ) గతంలో హైదరాబాద్‌లో ఉంటూ అక్కడి ఇళ్లల్లో పని చేస్తుండేది. కొంతకాలం క్రితం కుటుంబ సభ్యులు, భవానీతో కలిసి విజయవాడ వచ్చి ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తాను పని చేస్తున్న ఇంట్లోనే భవానీని కూడా పనిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని వంశీ, భార్య కృష్ణకుమారి వద్దకు భవానీని తీసుకెళ్లింది. భవానీ వివరాలను ఇంటి యజమాని వంశీ ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని తెలిపిన భవానీ తల్లిదండ్రుల పేర్లు, అన్నల పేర్లను, గుర్తున్న చిన్ననాటి సంగతులను చెప్పింది. ఆ వివరాలను, భవానీ ఫొటోను వంశీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. శనివారం ఆ పోస్ట్‌ను చూసిన భవానీ అన్న.. వంశీకి వీడియో కాల్ చేశాడు. అన్నయ్యను భవానీ గుర్తు పట్టింది. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులు కూడా భవానీతో వీడియో కాల్ మాట్లాడారు. కుమార్తెను తీసుకెళ్లడానికి చీపురుపల్లి నుంచి తల్లిదండ్రులు మాధవరావు, వరలక్ష్మి, సోదరులు సంతోష్, గోపీ విజయవాడ బయలుదేరారు. ఇదిలావుంటే.. గతంలో హైదరాబాద్‌లో జీవనోపాధి పొందిన భవానీ తల్లిదండ్రులు ప్రస్తుతం చీపురుపల్లిలోనే ఉంటున్నారు. తమ బిడ్డ ఆచూకీ తెలిసి భవానీ తల్లిదండ్రులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఇంత కాలం తల్లిగా మారి భవానీని కంటికి రెప్పలా చూసుకుంటూ చదువు చెప్పించిన జయమ్మకు రుణపడి ఉంటామని చెప్పారు. ఇన్నాళ్లకు భవానీ అమ్మా నాన్నలకు దగ్గరవుతుండటంతో చీపురుపల్లి గ్రామమంతా సంతోషం వ్యక్తం చేసింది. -
ఇంటర్నెట్తో ప్రజాస్వామ్యానికి విఘాతం!
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ఇంటర్నెట్ ప్రమాదకారిగా పరిణమించిందని, ఇది ఊహించనంత విఘాతాన్ని కలిగిస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వినియోగదారులు పెరిగే కొద్దీ దేశం ముందుకు వెళుతోందని కేంద్రం తరఫున వాదలను వినిపించిన రజత్ నాయర్ తెలిపారు. ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో చేసే పోస్టుల వల్ల మేలుతో పాటు అంతకు మించిన కీడు జరుగుతోందని తెలిపారు. ద్వేష భావాలు, నిరాధార వార్తలు, వ్యక్తిత్వ హననం, దేశ వ్యతిరేక కామెంట్లు, పోస్టులు పెరుగుతున్నాయన్నారు. సామాజిక మాధ్యమాల నియంత్రణ కోసం నిబంధనలను ఖరారుచేసి నోటిఫై చేసేందుకు మరో మూడు నెలల గడువు కావాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. మూడు నెలల్లో నిబంధనలతో కూడిన సమాచార ముసాయిదాను 2020 జనవరి నాటికల్లా సిద్ధం చేస్తామని ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ అదనపు కార్యదర్శి పేర్కొన్నారు. త్వరలో మార్గదర్శకాలు తయారుచేస్తామన్నారు. -
ఆ పోస్టింగులతో నాకు సంబంధం లేదు: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, చిరంజీవి భేటిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరిటి ప్రచారంలోకి వచ్చిన ఫేస్బుక్ పోస్ట్ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పోస్ట్‌పై స్పందించారు చెవిరెడ్డి. మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. చిరంజీవిపై తన అభిమాన సంఘం పేరిట సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తల్ని చెవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తిరుపతిలో శనివారం మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి... తన అభిమాన సంఘం పేరిట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టింగులకూ తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకు ట్విట్టర్ అక్కౌంట్లు కాని, ఫేస్బుక్ అక్కౌంట్లుగాని లేవని తెలిపారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) ఛైర్మన్‌గా ఉన్న రోజుల్లో చిరంజీవి ఎమ్మెల్యేగా ఉండేవారని గుర్తుచేశారు చెవిరెడ్డి. అప్పటినుంచి ఆయనతో తనకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు. జగన్, చిరంజీవి మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశం పార్టీయే ఈ దుష్ప్రచారం చేస్తుందని చెవిరెడ్డి ఆరోపించారు. తనకు ఎలాంటి అభిమాన సంఘాలు లేవన్నారు చెవిరెడ్డి. అభిమాన సంఘాలు అంటూ ఉంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉంటాయన్నారు. తాను కూడా జగనన్న అభిమానియే అన్నారు. తన అభిమాన సంఘం పేరుమీద చలామణి అవుతున్న పోస్టింగుల్ని తక్షణం తొలగించాల్సిందిగా పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. చిరంజీవి గారితో నాకు ఎలాంటి గొడవలు లేవు. చిరంజీవిపై నా అభిమాన సంఘం పేరిట సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా అభిమాన సంఘం పేరిట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టింగులకూ నాకు ఎటువంటి సంబంధం లేదు. — Chevireddy Bhaskar Reddy (@ChevireddyYSRCP) October 12, 2019 మెగాస్టార్ చిరంజీవిగారిపై.. నా పేరిట ప్రచారం అవుతున్న పోస్టింగులకు నాకు ఎటువంటి సంబంధం లేదు. తుడా ఛైర్మన్‌గా ఉన్నప్పటి నుంచి చిరంజీవిగారితో సత్సంబంధాలు ఉన్నాయి. వైఎస్ జగన్‌కి, చిరంజీవికి సత్సంబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుంది. — Chevireddy Bhaskar Reddy (@ChevireddyYSRCP) October 12, 2019 -
‘నాన్న ప్రత్యక్ష నరకం చూపించేవాడు’
భారతీయ సంస్కృతికి విదేశాలు జేజేలు పలకడానికి ముఖ్య కారణం ఇక్కడున్న వివాహ, కుటుంబ వ్యవస్థలే. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే బంధం ఒక కుటుంబంగా రూపాంతరం చెందుతుంది. అది క్రమేణా వృద్ధి చెంది సంస్కారవంతమైన సమాజానికి బీజం వేస్తుంది. అయితే ఇదంతా సవ్యంగా సాగడం అనేది భార్యాభర్తలుగా మారిన ఆ ఇద్దరు వ్యక్తుల మీదే ఆధారపడి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. జంటలో ఏ ఒక్కరూ బాధ్యతగా, బంధం నిలుపుకొనే విధంగా మసలుకోకపోయినా ఆ ప్రభావం కుటుంబం మొత్తం మీద పడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోతే వారి పిల్లలు అనుభవించే మానసిక వేదన వర్ణనాతీతం. ఆ గొడవల తాలూకు ఛాయలు జీవితాంతం వారిని వెంటాడుతాయి. అంతేకాదు ఆ చేదు ఙ్ఞాపకాలు ఒక్కోసారి ఆత్మహత్యకు కూడా ప్రేరేపిస్తాయి. అయితే ప్రతీ సమస్యకు చావే పరిష్కారం కాదని బలంగా విశ్వసించిన వారు..అటువంటి ప్రయత్నాల నుంచే పాఠాలు నేర్చుకుని అందమైన జీవితాన్ని సొంతం చేసుకుంటారు. ముంబైకి చెందిన ఓ యువతి జీవితానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్న ఆమె స్టోరీని ప్రఖ్యాత హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ పేజీ షేర్ చేసింది. ‘కష్టాలను తట్టుకుని విధిని ఎదిరించి నిలబడగలిగే నీలాంటి వాళ్లు.. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను విరమించుకునేందుకు స్ఫూర్తిగా నిలుస్తారు’ అంటూ నెటిజన్లు ఆమె స్టోరీని వైరల్ చేస్తున్నారు. సమకాలీన పరిస్థితుల్లో రెండు కోణాలను స్పృశిస్తున్న ఆ పోస్టు సారాంశం ఇది... ‘చిన్నపాటి, ఇరుకైన అపార్టుమెంటులోని ఓ ఇంట్లో పుట్టిపెరిగాను. పెరిగి పెద్దవుతున్న కొద్దీ తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలు నాకు అర్థమవసాగాయి. తరచుగా తగువులాడుకునే వారు. మా నాన్నకు అక్రమ సంబంధం ఉందని అమ్మ ఆరోపణ. ఆ వేదనతో తానెంతో కుంగిపోయేది. బాధ భరించలేక ఓ రోజు నాన్నతో తీవ్రంగా గొడవపడింది. దీంతో నాన్నకు పట్టలేనంత కోపం వచ్చింది. బెల్టు తీసుకుని అమ్మను దారుణంగా కొట్డాడు. ఆ మరుసటి రోజు నుంచి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, సరుకులు తేవడం మానేశాడు.నాన్న ప్రవర్తనతో విసిగిపోయిన అమ్మ చచ్చిపోదామని నిర్ణయించుకుంది. నన్ను తనతో పాటు బీచ్‌కు తీసుకువెళ్లి ఇద్దరం చనిపోదాం అని చెప్పింది. కానీ ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుంది. తన ఆలోచన తప్పు అని తెలుసుకుని ఇంటికి తీసుకువచ్చింది. నాన్న మారతాడేమోనని ఎదురుచూసింది కానీ అలా జరుగలేదు. ఇక లాభం లేదనుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాన్న మీద కేసు పెట్టింది. కాసేపటి తర్వాత నాన్న హాయిగా ఇంటికొచ్చేశాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు.ఆనాటి నుంచి మాకు ప్రత్యక్ష నరకం చూపించే వాడు. అమ్మ మరోసారి పోలీసులను ఆశ్రయించింది. అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను. అక్కడే నాకొక వ్యక్తి పరిచయమయ్యాడు. నాకన్నా ఐదేళ్లు పెద్దవాడు. ఎంతో చక్కగా మాట్లాడేవాడు. ఈ క్రమంలో తనతో ఎప్పుడు ప్రేమలో పడిపోయానో నాకే తెలియదు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా తను వెళ్లిపోతున్నానని, ఇక ఇక్కడ ఉండటం కుదరని చెప్పేశాడు. దాంతో అతనితో బాగా గొడపపడ్డాను. అచ్చం అమ్మానాన్నల గొడవలాగే అనిపించింది. నా గుండె పగిలిపోయింది. ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. ఆరోజు బాధతో వీధి వెంట పిచ్చిగా పరిగెత్తాను. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. దగ్గర్లో ఉన్న ఓ షాపులోకి వెళ్లి ఫినాయిల్ బాటిల్ కొనుక్కుని అక్కడే తాగేశాను. తెల్లవారి మెలకువ వచ్చింది. ఆస్పత్రి బెడ్ మీద ఉన్నాను. 24 గంటల పాటు ఐసీయూలో ఉంచారు. అప్పుడు మా నాన్న నా దగ్గరికి వచ్చాడు. నిజంగా చావాలనుకుంటే కాస్త గట్టిగా ప్రయత్నం చేయవచ్చు కదా అన్నాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక నా స్నేహితులు ఎవరూ నన్ను చూడటానికి రాలేదు. నాలాంటి వాళ్లతో వాళ్లకు స్నేహం అక్కర్లేదట. ఇరుగుపొరుగు వారికి నేనొక గాసిప్ అయిపోయా. నా జీవితం మరింత కఠినంగా మారింది. వాళ్ల కారణంగా ఎంతో వేదన అనుభవించా. కనీసం ఒక్కరైనా నా బాధను అర్థం చేసుకుని ఆత్మీయంగా పలకరిస్తే చాలు అనుకున్నా. అలా జరగలేదు. అయితే ఆ సంఘటనలే నాలో మార్పునకు కారణమయ్యాయి. నేనెందుకు చావాలి అనే ప్రశ్నను రేకెత్తించాయి. కౌన్సిలింగ్‌కి వెళ్లాను. ధ్యానం చేశాను. జీవితాన్ని కొత్తగా చూడటం మొదలుపెట్టాను. కొన్నాళ్ల తర్వాత అమ్మా, నేను ఇళ్లు వదిలి వచ్చేశాము. జర్నలిజంలో మాస్టర్స్ చేశాను. ప్రస్తుతం ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేస్తున్నా. ఇదంతా జరిగి చాలా ఏళ్లు అవుతుంది. ఇప్పుడు నాకంటూ ఒక ప్రత్యేక ఆర్గనైజేషన్ ఉంది. నాకు తోడుగా కొంతమంది ఉన్నారు. మేమంతా కలిసి చిన్న చిన్న సామాజిక కార్యక్రమాలు చేపడతాము. సరదాగా బయటికి వెళ్తాం. అయితే ఇప్పటికీ నా గతానికి సంబంధించిన మరకలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. కానీ వాటి వల్లే కదా ఎలా ఉండకూడదో అన్న విషయం తెలిసింది కదా అని సర్దిచెప్పుకొంటాను. నిజానికి ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీలేదు’ అంటూ తన గతం, వర్తమానం గురించి చెప్పుకొచ్చింది సదరు యువతి. ఎదుటివారి గురించి మాట్లాడే ముందు, వారిని జడ్జ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించమని సలహా కూడా ఇచ్చింది. ఎందుకంటే కనిపించేదంతా నిజం కాకపోవచ్చు... ఎదుటి వారు మన నుంచి ప్రేమ, దయ, ఆప్యాయత కోరుకుంటూ ఉండవచ్చు. బహుశా మీరు చూపించే చొరవ వారి చావుబతుకులను నిర్ధేశించేదిగా ఉండవచ్చు అనేది ఆమె భావన. అంతేకదా.. బాధలో ఉన్న వారి వైపు ఆత్మీయంగా చూసే చూపు...చిందించే ఓ చిరునవ్వు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఎదుటి వారిలో ఆత్మన్యూనతను పోగొట్టి.. సానుకూల దృక్పథంతో కొత్త జీవితానికి పునాదులు వేసే ప్రేరణా శక్తిని కలిగి ఉంటాయి. -
హోం మంత్రిపై అభ్యంతరకర పోస్టింగ్‌లు; వ్యక్తి అరెస్ట్
సాక్షి, పట్నంబజారు (గుంటూరు): రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఫేస్బుక్లో పోస్టింగ్‌లు పెట్టిన వ్యక్తిని గుంటూరు పట్టాభిపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వెస్ట్ సబ్‌డివిజన్ డీఎస్పీ జె.కులశేఖర్ తెలిపిన మేరకు.. రామ్మహారాజ్ అనే ఫేస్బుక్ అకౌంట్‌తో హోం మంత్రి సుచరితపై అభ్యంతరకర పోస్టింగ్‌లు వచ్చాయి. పోస్టింగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దారం అశోక్‌కుమార్ పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన డీఎస్పీ కులశేఖర్ విశాఖ జిల్లా రోగుగుంట మండలం ఎం.కొత్తపట్నంకు చెందిన సర్వశుద్ధి రాము ఆ పోస్టింగ్‌లు పెట్టినట్లు దర్యాప్తులో ధృవీకరించారు. మంగళవారం బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద తిరుగుతున్న అతడ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్లతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. -
తనయుడు: హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అమ్మా!
‘‘అసలు ఇలాంటి ఒక నోట్ రాసేముందు నేను ఎంతగానో ఆలోచించాను. ఆధునిక సమాజంలో కూడా ఒక మహిళ రెండో పెళ్లి చేసుకుంటే వింతగా చూసే మనస్తత్వంలో మనం ఉన్నాం. ఎవరైతే అనుమానం, జాలి, వంటి భావనలు కలిగి ఉంటారో దయచేసి అటువంటి వాళ్లు ఈ పోస్టు వంక చూడకపోవడమే మంచిది. ఇది మా అమ్మ పెళ్లి గురించి.’’ కేరళకు చెందిన గోకుల్ శ్రీధర్ అనే యువకుడు ఫేస్బుక్లో పెట్టిన పోస్టు ప్రారంభ వాక్యాలే పైన మీరు చదివినవి. వితంతువు, భర్త వదిలేసిన లేదా భర్తను వదిలేసిన స్త్రీ రెండో పెళ్లి చేసుకోవడాన్ని ఆమె సంతానం హర్షిస్తుందనడానికి తార్కాణంగా నిలిచిన పోస్ట్ అది. ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది. తల్లిదండ్రులు మాత్రమేనా?! దైవభూమిగా పేరుగాంచిన కేరళలోని కొల్లాంకు చెందిన గోకుల్ శ్రీధర్ తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. అయితే వారిద్దరు తనకు తల్లిదండ్రులే ఉంటున్నారే తప్ప.. భార్యభర్తలుగా మెలగడం లేదని అర్థం చేసుకోవడానికి.. ఆ చిట్టి గుండెకు కొంత సమయం పట్టింది. తన భవిష్యత్తు కోసం.. భర్త పెట్టే చిత్రహింసలను సైతం చిరునవ్వుతో భరించే తల్లి ఆవేదన.. పెరిగి పెద్దవుతున్న కొద్దీ అర్థం చేసుకోసాగాడు. కేవలం తన కారణంగా.. స్త్రీని ఒక బొమ్మలా భావించే తండ్రి మూర్ఖత్వానికి అమ్మ జీవితం బలైపోతుందనే అపరాధ భావన... గోకుల్‌కు మనశ్శాంతి లేకుండా చేసింది. అయితే కొన్ని రోజుల క్రితం అతడి మానసిక సంఘర్షణకు తెరపడింది. హింసించే భర్త నుంచి విముక్తి పొందిన తన తల్లి.. రెండో పెళ్లి చేసుకోవడంతో గోకుల్ సంతోషంగా ఉన్నాడు. ఈ క్రమంలో తన తల్లి గురించి అతడు ఫేస్ బుక్‌లో రాసుకొచ్చిన మాటలు.. బిడ్డ భవిష్యత్తు కోసం ఒక తల్లి ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుందనే విషయాన్ని మరోసారి గుర్తుచేశాయి. రక్తం కారుతున్నా అమ్మ లెక్కచేయలేదు ‘‘అమ్మ.. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. ఆమె తన వైవాహిక జీవితంలో ఎంతో హింసను భరించింది. భర్త కొట్టే దెబ్బలకు ఒక్కోసారి నుదుటి నుంచి రక్తం ధారాపాతంగా కారుతూ ఉండేది. అయినా ఆమె ముఖంలో బాధ కంటే భయమే ఎక్కువగా ఉండేది. ‘ఇవన్నీ ఎందుకు భరిస్తున్నావు?’ అని ఎన్నోసార్లు ఆమెను అడిగాను. ‘నీ కోసమే నాన్నా.. నువ్వు బాగుండాలంటే ఇవన్నీ భరించక తప్పదు’ అన్న ఆమె మాటలు నన్నెంతో అపరాధ భావానికి గురిచేసేవి. ఒకరోజు అమ్మతో కలిసి నేను కూడా నరకం లాంటి ఆ ఇంటిని వదిలి వచ్చేసాను. మేము ఇల్లు విడిచిన నాడే ఈ విషయం గురించి ఒక నిర్ణయానికి వచ్చేసాను. నా మాటపై అమ్మ పెళ్లి చేసుకున్నాక.. ‘అమ్మా.. కొత్త భాగస్వామి సాన్నిహిత్యంలో నువ్వు సంతోషంగా ఉండాలి. శుభాకాంక్షలు’ అంటూ.. గోకుల్ తన తల్లి, ఆమె రెండో భర్త ఫొటోను సగర్వంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అమ్మ గొప్పదనం, ఆమె త్యాగం ఎరిగిన వాళ్లంతా ప్రస్తుతం గోకుల్ తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూనే.. అతడి మనస్తత్త్వాన్ని అభినందిస్తున్నారు. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లైకులు, షేర్లతో దూసుకుపోతోంది. – సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ -
నకిలీ ఎస్సై హల్చల్
సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : పోలీస్ యూనిఫాం అంటే ఇష్టం ఉన్న యువకులు కష్టపడి చదివి పోలీస్ ఉద్యోగాన్ని సాధిస్తారు. కాని ఈ ఇద్దరు యువకులు మాత్రం అలా కష్టపడి చదవే ఓపిక లేక ఇష్టపడే పోలీస్ యూనిఫాంను వేసుకోవడం మొదలు పెట్టారు. అలా పోలీస్ యూనిఫాం వేసుకోవడం అలవాటుగా చేసుకుని తొలుత ఫేస్బుక్, వాట్సాప్‌ల్లో ఫొటోలు పెట్టడం తర్వాత ఏకంగా యూనిఫాంతో పబ్లిక్‌లో రావడం మొదలుపెట్టారు. ఇలా సమాజాన్ని మాత్రమే కాదు ఏకంగా వారిని కన్న తల్లిదండ్రులను కూడా తాము పోలీసులమే అంటూ నమ్మించి మోసం చేశారు. అందులో ఒకరు చీపురుపల్లి మండలంలోని గొల్లలపాలెం గ్రామానికి చెందిన బంకపల్లి ప్రసాద్ అలియాస్ ప్రశాంత్ కాగా.. మరొకరు మచిలీపట్నంనకు చెందిన అంకాల బాబు. ప్రసాద్ ఎస్సై అవతారం ఎత్తగా... అంకాలబాబు కానిస్టేబుల్ అవతారం ఎత్తాడు. ఫేస్బుక్ ఖాతాల్లో వీరి ఫొటోలు చూసి పరిచయమైన ఓ ముగ్గురు యువకులకు హోంగార్డ్ ఉద్యోగాలు వేయిస్తామని వారి నుంచి అడ్వాన్స్‌గా రూ.24 వేలు తీసుకున్నారు. ఉద్యోగాల్లో చేరాక మిగిలిన డబ్బు ఇవ్వాలని ఒ ప్పందం కుదుర్చుకున్నారు. ఇంతలో నకిలీ ఎస్సై ప్రసాద్ తన స్వగ్రామానికి రావడంతో చీపురుపల్లి పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం వ్యవహారం బయిటకొచ్చింది. దీనికి సంబంధించి ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తుపాకీ, వాహనంతో గొల్లలపాలెంలో ప్రత్యక్షం.... గొల్లలపాలెం గ్రామానికి చెందిన బంకపల్లి ప్రసాద్ అలియాస్ ప్రశాంత్ గతంలో ఓ చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అదే సమయంలో ఊరి నుంచి వెళ్లిపోయిన ప్రసాద్ భీమవరంలో డీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో 2017లో డిగ్రీలో చేరాడు. అక్కడ ఎన్సీసీలో ఉంటూ భీమవరం పోలీస్ స్టేషన్లో కమ్యూనిటీ పోలీస్‌గా స్వచ్ఛంద సేవలు అందించేవాడు. అదే సమయంలో పోలీస్ యూనిఫాంపై ప్రసాద్‌కు మక్కువ పెరిగింది. అయితే ఒక ఏడాది మా త్రమే డిగ్రీ చదివి తర్వాత మానేసి విజయవాడ వెళ్లిపోయి అక్కడ సర్కార్‌గ్రాండ్ అనే హోటల్లో ఎగ్జిక్యూటివ్‌గా పనిలో జాయిన్ అయ్యాడు. అయితే ఎస్సై యూనిఫాంతో ఫొటోలు తీసుకుని ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేస్తుం డడం ప్రసాద్‌కు అలవాటుగా మారింది. అంతా ఎస్సై అనుకుంటుండడంతో ప్రసాద్ కూడా తాను ఎస్సైననే అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అకస్మాత్తుగా ఈ నెల 13న ఎస్సై యూనిఫాంలో, తుపాకీతో పోలీస్ అని రాసి ఉన్న సుమో వాహనంలో గొల్లలపాలెంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ గ్రామంలో కొం తమంది అనుమానించి చీపురుపల్లి ఎస్సైకు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది వెళ్లి ప్రసాద్‌ను చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా అసల కథ బయిటకొచ్చింది. డబ్బులు వసూలు.. ఎస్సైగా చలామణీలో ఉన్న బంకపల్లి ప్రసాద్‌కు ఫేస్బుక్ ద్వారా మచిలీపట్నానికి చెందిన అంకాల బాబు పరిచయమయ్యాడు. ఆయన కూడా అప్పటికే కాని స్టేబుల్ దుస్తులు వేసుకుని నకిలీ కాని స్టేబుల్‌గా విజయవాడలో అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఈ ఇద్ద రు కలిసి ఫేస్బుక్ ఖాతాలో విపరీతంగా ఫొటోలు పెడుతుండడంతో పశ్చిమగోదావరి జి ల్లా భీమవరం మండలంలోని గొట్లపాడు గ్రామానికి చెందిన కె.స్వామి అనే డిగ్రీ విద్యార్థికి వీరు ఫేస్బుక్లో పరిచమయ్యారు. వీరు స్వామికి హోమ్‌గార్డు ఉ ద్యోగాలిప్పిస్తామని చెప్పారు. ఒక్కో పోస్టుకు రూ. లక్ష అవుతుందని, అడ్వాన్స్‌గా రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని చెప్పారు. దీంతో స్వామితో పాటు మరో ఇద్దరు మిత్రులు కలిసి ఒక్కొక్కరు రూ.8 వేలు చొప్పున 24 వేలు నకిలీ ఎస్సై ప్రసాద్ పంపించిన భాను అనే వ్యక్తి చేతికి ఈ నెల 11న ఇచ్చారు. హోమ్‌గార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని అడ్వాన్స్ తీసుకున్న అభ్యర్థులకు నిందితులు డీజీపీ కార్యాలయం పేరుతో నకిలీ ఉత్తరాలు కూడా పంపించారు. అయితే ఉత్తరాల్లో తప్పులు ఉండడంతో అప్పటికే వారికి అనుమానం వచ్చింది.చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌లో నకిలీ ఎస్సై ప్రసాద్‌ను విచారించే సమయంలో ఆయన మొబైల్లో బాధితుల ఫోన్ నంబర్లు స్థానిక ఎస్సైకు లభించాయి. దీంతో ఎస్సై వారితో ఫోన్లో మాట్లాడగా.. ఇదంతా మోసం అని తెలుసుకున్న స్వామి అనే యువకుడు భీమవరం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసి చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌కు వివరాలు పంపించారు. అంతేకాకుండా హోంగార్డు ఉద్యోగం కోసం డబ్బులు సమర్పించుకున్న స్వామి కూడా చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన వాంగ్మూలాన్ని స్థానిక పోలీసులకు ఇచ్చాడు. -
కేశినేని పోరాటం ఎవరిపై?
-
‘ఫన్ మొదలైంది.. త్వరలోనే కలుస్తాను శ్రీలంక’
కొలంబో : అమెరికాకు చెందిన ఓ టెకీ శ్రీలంక బాంబు పేలుళ్లలో చనిపోవడానికి ముందు తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన చివరి మెసేజ్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. డైటర్ కోవల్స్కి(40) అనే వ్యక్తి బ్రిటన్‌కు చెందిన విద్యా, ప్రచురణ సంస్థ పియర్సన్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత శుక్రవారం ఆఫీస్ పని నిమిత్తం శ్రీలంక బయలుదేరాడు. ప్రయాణం ప్రారంభం కావడానికి ముందు డైటర్ తన ఫేస్బుక్లో ‘ఫన్ మొదలైంది. వర్క్ ట్రిప్స్‌ని నేను చాలా ఇష్ట పడతాను. 24 గంటల ప్రయాణం. శ్రీలంక.. త్వరలోనే నిన్ను చూస్తాను’ అంటూ పోస్ట్ చేశాడు. శ్రీలంకలో దిగిన తరువాత కంపెనీ తన కోసం రూమ్ బుక్ చేసిన హోటల్‌కు చేరుకున్నాడు. ఫోన్ చేసి ఈ విషయాన్ని సీఈవోకు తెలియజేశాడు. ఓ వారం రోజుల్లో పని ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతానని తెలిపాడు డైటర్. కానీ ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లలో అతను మృతి చెందాడు. ఈ విషయం గురించి ఆ కంపెనీ సీఈవో మాట్లాడుతూ.. ‘డైటర్ ఎప్పుడూ తాను నవ్వుతూ ఉండటమే కాక.. తన చుట్టూ ఉండే వారిని కూడా సంతోషంగా ఉంచుతాడు. అతని మంచితనం వల్ల ఎక్కడి వెళ్తే అక్కడ కొత్త స్నేహితులను తయారవుతుంటారు. ఎలాంటి సమస్యనైనా ఓర్పుతో పరిష్కరిస్తాడు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి డైటర్ కొలంబో వెళ్లాడు. అక్కడ ఓ వారం రోజుల పాటు ఉండి.. తన స్థానిక స్నేహితులతో కలిసి ఈ సమస్యలను పరిష్కరించాలనుకున్నాడు. కానీ దుష్టులు చేసిన దాడిలో చాలా మంది అమాయకుల్లానే డైటర్ కూడా కన్ను మూశాడు. డైటర్ లాంటి వారు కొత్తవి సృష్టించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఉగ్రదాడికి పాల్పడిని వారికి కేవలం నాశనం చేయడం మాత్రమే తెలుసు’ అంటూ సదరు సీఈవో విషాదం వ్యక్తం చేశారు. -
‘హలో, నేను రాహుల్ గాంధీని మాట్లాడుతున్నాను’
తిరువనంతపురం : అభిమాన సినీ తారలు, ఆటగాళ్ల కోసం ఫ్యాన్స్ ఎదురు చూడటం సహజంగా చూస్తూనే ఉంటాం. కానీ రాజకీయ నాయకుల కోసం గంటల తరబడి ఎదురుచూసే ఫ్యాన్స్ కాస్తా అరుదుగానే ఉంటారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఓ ఫేస్బుక్ పోస్ట్‌ను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ తొలిసారి దక్షిణాది నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్ ప్రస్తుతం మూడు రోజుల పాటు కేరళలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం వయనాడ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తన ప్రియతమ నాయకుడిని కలవడం కోసం ఓ పదేళ్ల బాలుడు దాదాపు 5 గంటల పాటు ఎదురు చూశాడు. కానీ భద్రతా కారణాల వల్ల కలవలేకపోయాడు. పాపం నిరాశతో వెనుదిరిగాడు. ఆ చిన్నారి బాధ చూడలేక అతని తండ్రి ఈ విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఫేస్‌బుక్‌ను ఆశ్రయించాడు. ఈ క్రమంలో తన కుమారినికి రాహుల్ గాంధీ పట్ల ఉన్న అభిమానాన్ని తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. దానిలో ‘నా కుమారుని పేరు నందన్. తన వయసు 10 సంవత్సరాలు. తను రాహుల్ గాంధీకి చాలా పెద్ద అభిమాని. ఈ రోజు రాహుల్ వయనాడ్‌లో పర్యటిస్తున్నారని తెలిసి తనను కలిసేందుకు ఉదయం 5 గంటలకే సభా ప్రాంగణానికి వచ్చాడు. నందన్‌తో పాటు నేను కూడా ఉన్నాను. అంతేకాక రాహుల్ గాంధీ అంటే తనకు ఎంత అభిమానమో తెలిపేందుకు ఓ లేటర్లో ‘మోస్ట్ ఫేవరెట్ పర్సన్’ అని రాసుకుని మరీ తీసుకువచ్చాడు. తన చొక్కా జేబుకు రాహుల్ గాంధీ ఫోటోను కూడా పెట్టుకున్నాడు. నందన్.. తన అభిమాన నాయకున్ని కలవడం కోసం దాదాపు 5 గంటల సేపు నిరీక్షించాడు. కానీ భద్రతా కారణాల వల్ల రాహుల్‌ని కలిసే అవకాశం లభించలేదు. దాంతో నా కుమారుడు చాలా నిరాశకు గురయ్యాడు’ అని పేర్కొన్నాడు. ఇలా ఫేస్బుక్లో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే.. ఈ స్టోరి తెగ వైరలయ్యింది. స్థానిక మీడియా సాయంతో ఈ విషయం కాస్తా రాహుల్ గాంధీ దృష్టికి చేరింది. తన కోసం అన్ని గంటల పాటు ఎదురు చూసిన ఆ చిన్నారిని నిరాశ పర్చకూడదనే ఉద్దేశంతో రాహుల్.. నందన్ తండ్రికి కాల్ చేశారు. ‘హాయ్.. నేను రాహుల్ గాంధీని మాట్లాడుతున్నాను. నేను నా అభిమానితో మాట్లాడవచ్చా’ అని అడిగారు. అనంతరం తన చిన్నారి ఫ్యాన్‌తో కాసేపు మాట్లాడి.. అతన్ని సంతోషపెట్టారు. రాహుల్ గాంధీ నందన్‌కు ఫోన్ చేసి మాట్లాడిన విషయాన్ని ఆ పార్టీ నాయకురాలు రమ్య ట్విటర్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. రాహుల్ చేసిన పనిని తెగ అభినందిస్తున్నారు నెటిజన్లు. A young boy in Kannur waited to see Rahul ji but couldn’t, read what happened next or get a Malayalam speaking friend to translate :) I did too. Such a sweet gesture by @RahulGandhi https://t.co/M7Nl01Bn9U — Divya Spandana/Ramya (@divyaspandana) April 18, 2019 -
అభినందన్ నిజంగా ఓటేశారా!?
సాక్షి, న్యూఢిల్లీ : భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ భారతీయ జనతా పార్టీకి మద్దతుగా బయటకు వచ్చి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేశారంటూ ఓ ఫేస్బుక్ పోస్ట్ వైరల్ అవుతోంది. బీజేపీకి మద్దతు తెలియజేస్తున్న ఫేస్బుక్ పేజీలు, గ్రూపులు ఈ పోస్ట్‌ను తెగ షేర్ చేస్తున్నాయి. షేర్ చేయాల్సిందిగా మిత్రులను కోరుతున్నాయి. (చదవండి: ఇదొక నకిలీ వార్తల ఫ్యాక్టరీ!) ‘వింగ్ కమాండర్ అభినందన్ బీజేపీకి బహిరంగంగా మద్దతు తెలిపారు. నరేంద్ర మోదీని మరోసారి ప్రధాన మంత్రిని చేయడం కోసం ఆయన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు కూడా వేశారు. మోదీకి మించిన మంచి ప్రధాని మరొకరు లేరన్నారు. మిత్రులారా! ఈ విషయం జిహాదీలు, కాంగ్రెసీలకు చేరే వరకు షేర్ చేయండి’ అన్న వ్యాఖ్యలతో వర్థమాన్‌ను కాస్త పోలిన వ్యక్తి ఫొటోను పోస్ట్ చేశారు. మెడలో కమలం గుర్గు కలిగిన కాషాయ కండువాను ధరించిన ఆ ఫొటోలోని వ్యక్తికి అభినందన్‌కు ఒక్క మీషాల విషయంలోనే పోలిక ఎక్కువ ఉంది. భారత వైమానిక దళం తరఫున పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయిన అభినందన్ విమానాన్ని పాక్ సైనికులు కూల్చివేయడం, రెండు రోజుల నిర్బంధం అనంతర అభినందన్ హీరోలాగా దేశానికి తిరిగి రావడం తదితర పరిణామాలు తెల్సినవే. (చదవండి: ప్రచారం కోసం ఇంత అబద్ధమా!) పోలికల్లో తేడాలు 1. అభినందన్ వర్థమాన్ వయస్సుకన్నా ఆ ఫొటోలోని వ్యక్తి వయస్సు ఎక్కువగా ఉంది. 2. ఫొటోలోకి వ్యక్తి బుగ్గల కింద, మీసాలపైన ముడతలు ఉన్నాయి. వయస్సు రీత్యా, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల అలాంటి ముడతలు వస్తాయి. అభినందన్‌కు వృత్తిరీత్యా వ్యాయామం ఉంటుంది కనుక అలాంటి ముడతలు లేవు. 3. ఫొటోలోని వ్యక్తి భుజాలు జారీ పోయినట్లుగా ఉన్నాయి. అభినందన్ భుజాలు అలా లేవు. 4. ఫొటోలోని వ్యక్తి మెడపైన ముడతలు ఉన్నాయి. అభినందన్‌కు లేవు. పైగా అభినందన్ మెడ పొడుగ్గా ఉంటుంది. 5. ఫొటోలోని వ్యక్తి ముక్కు కొద్దిగా లావుగా కూడా ఉంది. 6. అన్నింటికంటే అభినందన్ పెదవుల కింద పుట్టుమచ్చ ఉంది. ఫొటోలోని వ్యక్తికి కుడికన్ను దిగువున పుట్టుమచ్చ ఉంది. అభినందన్‌కు లేదు. 7. కళ్లను చూసి మనిషిని ఇట్టే గుర్తు పట్టవచ్చ. అందుకని కళ్లు కనపడకుండా ఫొటోలోని వ్యక్తికి కళ్లజోడు టోపీ పెట్టి మనల్ని బురడీ కొట్టించేందుకు ప్రయత్నించారు. భారత వైమానిక దళంలో ఉన్న వాళ్లు సాధారణంగా విధుల్లో ఉన్నప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటారు. అభినందన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడం వల్ల ఆయన ఓటు హక్కు ఉంటే తమిళనాడులో ఉంటుంది. తమిళనాడులో ఇంతవరకు పోలింగే జరగలేదు. ఈ నెల 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. వర్ధమాన్ ఒక్కరి కోసం పోలింగ్ నిర్వహించారా? (చదవండి: మార్ఫింగ్ ఫొటోలతో సోనియాపై దుష్ప్రచారం) 1969, ఎయిర్స్ ఫోర్స్ రూల్స్ 1969 నాటి వైమానిక దళం నిబంధనల ప్రకారం ‘ఎలాంటి రాజకీయ పార్టీలు లేదా రాజకీయ ఉద్దేశంతో నిర్వహించే సభలు, సమావేశాలకు హాజరుకారాదు. వాటిని ఉద్దేశించి ప్రసంగించరాదు. అసలు రాజకీయ కార్యకలాపాలతోనే ప్రమేయం ఉండరాదు. ఉద్యమాల్లోను పాల్గొనరాదు. సహాయం చేయరాదు. ఓటర్లను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు’ ఈ నిబంధన ఉల్లంఘించిన వారిపైన శాఖాపరంగా కఠిన చర్యలు ఉంటాయి. అంటే అభినందన్ ఉద్యోగానికి ఎసరు తీసుకరావడం కోసమే బీజేపీ వర్గాలు ఈ నకిలీ వార్తను సృష్టించాయా? -
ఫేస్బుక్ పోస్ట్..‘సీ విజిల్’ అలర్ట్
రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాల్సిన ఎన్నికల నియమావళిని 2013 నుంచి సామాజిక మాధ్యమాలకు కూడా వర్తింప చేశారు. కానీ తగిన యంత్రాంగం లేక సామాజిక మాధ్యమాలను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు తొలిసారిగా ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఫేస్‌బుక్‌పై కొరడా ఝుళిపించింది. పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడి విడుదలయిన వైమానిక దళం పైలట్ అభినందన్‌తో బీజేపీ నేతలు ఉన్న రెండు పోస్టర్లను వెంటనే తొలగించాలని ఈసీ ఫేస్‌బుక్‌ను ఆదేశించింది. ఆ పోస్టర్లలో అభినందన్‌తో పాటు బీజేపీ నేతలు మోదీ, అమిత్ షా, ఢిల్లీ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ శర్మ తదితరులు ఉన్నారు. అభినందన్‌ను, మోదీని పొగుడుతూ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. వీటిని మార్చి 1న ఫేస్బుక్లో షేర్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి చెందిన ‘సి విజిల్’ యాప్‌కు ఫిర్యాదు అందింది. పరిశీలించిన ఎన్నికల సంఘం సైనికుల ఫొటోలు ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోవడం నియమావళికి విరుద్ధం కాబట్టి ఆ పోస్టర్లను ఉపసంహరించుకోవాలని ఫేస్బుక్ భారత్, దక్షిణాసియా డైరెక్టర్ శివనాథ్ తుక్రాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాజకీయ ప్రచారం కోసం సాయుధ దళాల ఫొటోలను ఉపయోగించకూడదని ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశించినా కూడా చాలా పార్టీలు ముఖ్యంగా బీజేపీ బాలాకోట్ దాడి, అభినందన్ ఫొటోలను ఉపయోగించుకుంటోందని ద వైర్ పత్రిక పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అభినందన్ విడుదలను ప్రచారానికి ఉపయోగించుకుంటోందని తెలిపింది. -
‘45 మంది ధైర్యవంతులే.. కర్మకు ఫలితం అనుభవించారు’
గువాహటి : 43 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై యావత్ భారతదేశం ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు కొంతమంది ఆ ఘటనను సమర్థించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో జవాన్ల మరణాన్ని ఉటంకిస్తూ రెచ్చగొట్టే విధంగా ఫేస్బుక్ పోస్టు పెట్టిన పాప్రీ బెనర్జీ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పాప్రీ బెనర్జీ గువాహటిలోని ఐకాన్ కామర్స్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పుల్వామా దాడి అనంతరం... ‘నిన్నటి ఘటనలో 45 మంది సాహసవంతులైన యువకులు హత్యకు గురయ్యారు. ఇదేమీ యుద్ధం కాదు. దాడి చేసిన వారిపై ప్రతిదాడి చేసేందుకు వారికి సమయం దొరకలేదు. నిజంగా పిరికి పంద చర్యకు పరాకాష్ట ఈ ఘటన. ఇది ప్రతీ ఒక్క భారతీయుని హృదయాన్ని కకావికలం చేసింది... కానీ... కానీ.. కానీ.. లోయలో భద్రతా బలగాలు చేయని అకృత్యాలు ఉన్నాయా! అక్కడి మహిళలపై మీరు అత్యాచారం చేశారు... వాళ్ల పిల్లల్ని చంపారు... వాళ్ల భర్తలను హతమార్చారు.. మీ మీడియా వారందరినీ తక్కువగా చూపే ప్రయత్నమే చేసింది... అయినంత మాత్రాన ప్రతీకారం ఉండదని భావించారా??? అసలు మీకో విషయం తెలుసా.. ఉగ్రవాదం ఇస్లాంకు చెందినదే కావొచ్చు.. కానీ కర్మ అనేది హిందూ సనాతన ధర్మంలోనిది.. ఇప్పుడు ప్రతిఫలం అనుభవించండి’ అంటూ పిప్రీ ఫేస్బుక్లో రెచ్చగొట్టే కథనాన్ని రాసుకొచ్చారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆదివారం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. -
రాహుల్ ఫెయిలైన విద్యార్థి : జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానిపై వ్యక్తిగత ద్వేషంతోనే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ రఫేల్ ఒప్పందంలో అక్రమాలు అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. రక్షణ బలగాలు, న్యాయవ్యవస్థ, ఆర్బీఐ వంటి వ్యవస్థలపై కాంగ్రెస్ బూటకపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఫెయిలైన విద్యార్ధి నిత్యం క్లాస్ టాపర్‌పై ద్వేషం వెళ్లగక్కుతాడని రాహుల్‌ను ఎద్దేవా చేశారు. వ్యవస్ధలను కాపాడతామంటూ ముందుకొస్తున్న విధ్వంసకుల నుంచి వాటిని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జైట్లీ పేర్కొన్నారు. ఆర్బీఐ, న్యాయవ్యవస్ధ, సీబీఐల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఎంతలా తలదూర్చాయో తెలుసుకోవాలని జైట్లీ ఫేస్బుక్ పోస్ట్‌లో కాంగ్రెస్‌కు చురకలు వేశారు. అమెరికాలో వైద్య చికిత్స అనంతరం శనివారం భారత్‌కు చేరుకున్న అరుణ్ జైట్లీ వ్యవస్థలపై దాడి జరుగుతున్నదంటూ తన ఫేస్బుక్ పోస్ట్‌లో విపక్షాలను టార్గెట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష నేతలు మొసలికన్నీరు కారుస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని తిరిగి వారసత్వ నేతల చేతిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. -
సత్యమే గెలుస్తుంది : రాబర్ట్ వాద్రా
సాక్షి, న్యూఢిల్లీ : లండన్‌లో అక్రమాస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన క్రమంలో తానెలాంటి తప్పూ చేయలేదని వాద్రా ఆదివారం పేర్కొన్నారు. ఈడీ తనను ప్రశ్నించిన ఉదంతంపై స్పందించిన వాద్రా చివరికి సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా తనకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, మద్దతుదారులకు ధన్యవాదాలని, తాను ధైర్యంగా, క్రమశిక్షణతో దేన్నైనా ఎదుర్కొంటానని వాద్రా ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మనీల్యాండరింగ్ కేసులో వాద్రాను ఈనెల 6, 7 తేదీల్లో విచారించిన ఈడీ శనివారం మరోసారి సుదీర్ఘంగా ప్రశ్నించింది. వాద్రా లండన్‌లో వరుసగా 5 మిలియన్ పౌండ్లు, 4 మిలియన్ పౌండ్ల విలువ చేసే రెండు ఇళ్లను, ఆరు ఫ్లాట్స్, ఇతర ఆస్తులను కొనుగోలు చేశారని, వీటిలో కొత్తగా చేజిక్కించుకున్న ఆస్తులు సైతం ఉన్నాయని ఈడీ ఢిల్లీ కోర్టుకు నివేదించింది. కాగా తనకు విదేశాల్లో అక్రమాస్తులు లేవని, రాజకీయ కక్ష సాధింపుతోనే తనపై దాడులు చేస్తున్నారని వాద్రా చెబుతున్నారు. -
‘ఆధార్‌తో రూ 90 వేల కోట్లు ఆదా’
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ దేశ ముఖచిత్రంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆధార్‌తో ఆదా అయిన డబ్బుతో ఆయుష్మాన్ భారత్ వంటి మూడు భారీ కార్యక్రమాలను చేపట్టే వెసులుబాటు కలిగిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధార్‌ను సమర్ధంగా అమలు చేస్తే, గత యూపీఏ సర్కార్ దీని అమలును సరిగ్గా పర్యవేక్షించలేదన్నారు. ఆధార్ ప్రయోజనాల పేరుతో జైట్లీ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ సబ్సిడీల పంపిణీలో ఆధార్ వాడకంతో గత కొన్నేళ్లుగా రూ 90 వేల కోట్లు ఆదా అయ్యాయని వెల్లడించారు. ఆధార్ వినియోగంతో భారత్ ఏటా రూ 77,000 కోట్లు ఆదా చేయవచ్చని వరల్డ్ బ్యాంక్ తన డిజిటల్ డివిడెండ్ నివేదికలో పొందుపరిచిందన్నారు. ఆధార్ ద్వారా ఇప్పటివరకూ రూ 1,69,868 కోట్ల సబ్సిడీ బదిలీ జరిగిందని చెప్పారు. ఆధార్ వినియోగంతో దళారుల ప్రమేయం లేకుండా నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వెళుతోందన్నారు. భారత్‌లోనే ఈ వినూత్న టెక్నాలజీ అందుబాటులో ఉందన్నారు. ఆధార్ వాడకం ద్వారా ఆదా అవుతున్న మొత్తం పేదల సంక్షేమానికి చేరుతోందని చెప్పుకొచ్చారు. ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే 21 కోట్ల పాన్‌కార్డు కలిగిన వారిని వారి ఆధార్ నెంబర్లతో అనుసంధానించిందన్నారు. -
భారీ మాల్ చిన్నబోయింది..
కోల్‌కతా : బహిరంగ ప్రదేశాల్లో చంటి పిల్లలకు పాలివ్వడం తల్లులకు ఇప్పటికీ నరకప్రాయమేననే ఘటన చోటుచేసుకుంది. ఆకలితో మారాం చేస్తున్న చిన్నారికి పాలుపట్టేందుకు సైతం ఆ భారీ మాల్లో అవకాశం లేకుండా పోయింది. కోల్‌కతాలోని భారీ షాపింగ్ మాల్లో తన చిన్నారికి పాలుపట్టేందుకు అనువైన ప్రదేశం చూపాలని కోరిన మహిళకు సిబ్బంది నుంచి నిర్ఘాంతపోయే సమాధానం వచ్చింది. కోల్‌కతాలో అత్యంత ప్రముఖ షాపింగ్ మాల్ సౌత్ సిటీ మాల్లో 29 ఏళ్ల మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన ఏడు నెలల పసికందుకు పాలుపట్టేందుకు సరైన ప్రదేశం కోసం మాల్ మొత్తం కలియదిరిగానని ఆమె ఫేస్బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు. అంత పెద్ద మాల్లో చిన్నారికి తాను పాలిచ్చేందుకు సరైన స్థలమే లేదని, పైగా అక్కడి సిబ్బంది టాయ్లెట్లో పాలివ్వాలని సూచించారని తెలిపారు. ఇది భారీ మాల్ కాదని..యూజ్లెస్ మాల్ అంటూ మండిపడ్డారు. సిబ్బంది తీరుతో అవాక్కైన తనకు వారి నుంచి మరింత నిర్లక్ష్య సమాధానం ఎదురైందని చెప్పుకొచ్చారు. ప్రజల గోప్యతను గౌరవించాలని, ఇలాంటి పనులన్నీ ఇంట్లో చక్కబెట్టుకుని రావాలని, మాల్లో కాదని ఉచిత సలహాలిచ్చారని చెప్పారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఆ భారీ మాల్ తన నిర్వాకంతో చిన్నబోయిందని నెటిజన్లు స్పందిస్తున్నారు. -
లైంగిక వేధింపులు : తగిన బుద్ధి చెప్పిన నటి
మలయాళ, కన్నడ నటి నేహా సక్సేనా తనపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించిన వ్యక్తికి భలే బుద్ధి చెప్పారు. లైంగిక వాంఛ తీర్చాలంటూ అతని వక్రబుద్ధిని సోషల్ మీడియా సాక్షిగా బహిర్గతంచేయడంతో సదరు వ్యక్తి కక్కలేక మింగలేక, తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నెటిజన్లు మాత్రం అతగాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ , తెలుగు, బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన నేహా సక్సేనా స్వయంగా ఈ విషయాన్ని ఫేస్బుక్ పోస్ట్‌ద్వారా వెల్లడించారు. అబుదాబిలో షైన్ సిస్టం సర్వీసెస్‌లో పనిచేసే ఎల్సన్ లోహి దక్షన్ అనే వ్యక్తి ఒక రాత్రికి తన కోరిక తీర్చాల్సిందిగా వాట్సాప్‌ద్వారా ప్రతిపాదన పెట్టాడు. దీంతో ఎంత అవుతుందో తెలపాలని కోరాడు. దీంతో ఆమె లోహిదక్షన్ ఫోన్ సంబరుతో సహా అతని వాట్సాప్ సంభాషణకు సంబంధించిన స్ర్కీన్లను ఫేస్బుక్ పోస్ట్‌లో షేర్ చేశారు. మరోవైపు ఈఆరోపణలను లోహిదక్షన్ ఖండించాడు. తన ఫోన్ హ్యాక్ అయిందనీ, మహిళల పట్ల తాను ఎపుడూ అలా పవర్తించలేదని ఫేస్బుక్లోవివరణ ఇచ్చుకున్నాడు. దీనిపై అబుదాబి సీఐడీకి ఫిర్యాదు చెసినట్టువెల్లడించాడు. అంతేకాదుతన కరియర్ నాశనమవుతుంది, కుటుంబానికి తెలిస్తే తన పరువు పోతుందంటూ లబోదిబోమంటున్నాడు. -
ప్రాణం తీసిన ఫేస్బుక్ పోస్ట్
ముంబై : ఫేస్బుక్ పోస్ట్ ప్రాణం తీసింది. వివరాలు.. ముంబైకి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మనోజ్ దుబే(45) అనే వ్యక్తిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. దుబే తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఓ పొలిటికల్ పోస్ట్ ఈ దాడికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అయితే దాడి చేసిన వ్యక్తుల గురించి పూర్తి సమాచారం తెలియలేదు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుబే మృతి పట్ల మహారాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు సంతాపం తెలిపారు. బీజేపీ కార్యకర్తలే ఈ దాడి చేశారంటూ ఆరోపించారు. Shocking! Manoj Dubey, a staunch Congress worker was murdered for his facebook post by BJP goons. We strongly condemn such a coward act! The culprits should be brought to justice. Our deepest condolences to his family, Congress party stands with his family at this hour of grief. pic.twitter.com/BcVhzZdtD0 — Maharashtra Congress (@INCMaharashtra) October 22, 2018 -
శబరిమలపై మహిళ పోస్టు.. తీవ్ర ఉద్రిక్తత
కన్నూర్ : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలకు అనుమతిస్తూ సుప్రీం తీర్పునిచ్చిన నేపథ్యంలో కేరళ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. కోర్టు తీర్పుని కొందరు సమర్ధిస్తుండగా పలు హిందూ ధార్మిక సంస్థలు మాత్రం అయ్యప్ప ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా కోర్టు తీర్పు ఉందని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, శబరిమల ఆలయంలోకి ప్రవేశిస్తే అడ్డంగా నరికేస్తానని కేరళకు చెందిన సినీ నటుడు, బీజేపీ సానుభూతిపరుడు కొల్లం తులసి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (‘అయ్యప్ప గుళ్లోకి ప్రవేశిస్తే నరికేస్తా’) మరోవైపు.. శబరిమల ఆలయంలోకి ప్రవేశిస్తాననీ, 18 మెట్లెక్కి అయ్యప్ప దర్శనం చేసుకుంటానని కేరళకు చెందిన రేష్మా నిశాంత్ (32) ప్రకటించారు. సుప్రీం కోర్టు 10 నుంచి 50 ఏళ్ల వయసు వారికి శబరిమల ఆలయంలోకి అనుమతి ఇచ్చినందున అయ్యప్ప దర్శనం చేసుకుంటానని ఆదివారం తన ఫేస్బుక్ అకౌంట్లో పేర్కొన్నారు. దీంతో పలు హిందూ సంస్థల కార్యకర్తలు ఆమె ఇంటిని చుట్టుముట్టారు. ఎట్టిపరిస్థితుల్లోను అమెను అయ్యప్ప ఆలయానికి వెళ్లనివ్వమని హెచ్చరికలు జారీ చేశారు. వీటన్నిటిపై స్పందించిన రేష్మా... మహిళగా పుట్టడం తన తప్పుకాదనీ, కోర్టు అందరికీ సమాన హక్కులుండాలనే మహిళలు శబరిమలకు వెళ్లొచ్చొనే తీర్పునిచ్చిందని తెలిపారు. పవిత్రమైన అయ్యప్ప మండల దీక్ష (41 రోజులు) ధరించినా కూడా అయ్యప్ప దర్శనం చేసుకోకుండా మహిళలను అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. తను గతంలో మండల దీక్ష వేసుకున్నప్పుడు రుతుస్రావం అయిన రోజులను మినహాయించి 55 రోజులు దీక్షలో ఉన్నానని గుర్తు చేశారు. ఏదేమైనా శబరిమలలోని అయ్యప్ప దర్శనం చేసుకుంటానని స్సష్టం చేశారు. రేష్మా డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. (చదవండి : ‘శబరిమల’ తీర్పుపై రివ్యూ పిటిషన్లు) -
మహిళలు చెప్పుతో కొట్టింది నన్ను కాదు
-
మహిళలు చెప్పుతో కొట్టింది నన్ను కాదు
హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్ పూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేను ఇద్దరు మహిళలు చెప్పుతో కొట్టారంటూ... ఫేస్బుక్లో ఓ పోస్ట్ తెగ చక్కర్లు కొట్టింది. 32 సెకన్ల నిడివి గల దీనికి సంబంధించిన వీడియో ఫేస్బుక్లో 5000 సార్లకు పైగా షేర్ కూడా అయింది. మధ్యప్రదేశ్‌లోని కైలారస్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర శుక్లా ఈ వీడియోను షేర్ చేశారు. అయితే ఆ వీడియోలో చెప్పినట్టు బీజేపీ ఎమ్మెల్యే కాకుండా.. హిమాచల్ రహదారుల రవాణా సంఘ నాయకుడు ఈ చెప్పు దెబ్బలు తిన్నారు. వీడియోలో ఒక మహిళా.. సన్మాన కార్యక్రమంలో ఓ వ్యక్తికి దండ వేస్తూ ఉండగా... మరో మహిళ తన చెప్పు తీసుకొని అతన్ని కొడుతూ ఉంటుంది. ఈ వీడియోలో వెనుక కనిపిస్తున్న పోస్టర్లో ‘హిమాచల్ పరివాహన్ మజ్దూర్ సంఘ్’ అని ఉంది. అయితే హమీర్ పూర్‌కు చెందిన సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే నరిందర్ థాకూర్‌ను సంప్రదించగా.. తనకు అలాంటి అవమానకర సంఘటన ఎదురు కాలేదని చెప్పారు. కానీ హమీర్ పూర్లో ఆ సంఘటన జరిగిందన్నారు. హిమాచల్ రహదారుల రవాణా సంఘ నాయకుడిపై ఈ దాడి జరిగిందని, మహిళలు కొట్టింది తనని కాదని చెప్పేశారు. 2018 జూలై 22న ఇద్దరు ట్రైనీ మహిళా కండక్టర్లు అతనిపై ఈ దాడికి పాల్పడట్టు తెలిసింది. ఆ తర్వాత వారిద్దర్ని వారి వారి ఉద్యోగాల నుంచి తొలగించినట్టు కూడా రిపోర్టుల వచ్చాయి. ఇదే విషయాన్ని హిమాచల్ రహదారుల రవాణా సంఘ నాయకుడు శంకర్ సింగ్ కూడా ధృవీకరించారు. 2018 జూన్ 22న కొంతమంది మహిళలు తనపై దాడి చేశారని, సన్మాన కార్యక్రమంలో శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు మహిళా కండక్టర్లు తనను ఈ విధంగా చెప్పుతో కొట్టారని చెప్పారు. వారికి కార్పొరేషన్లో శాశ్వత ఉద్యోగాలు ఇవ్వలేదని ఈ సంఘటనకు పాల్పడ్డారని తెలిపారు. అయితే మీకు బీజేపీతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు, తాను ఓ ఆర్ఎస్ఎస్ వర్కర్‌ను అని, తనకు బీజేపీతో ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నారు. అయితే ఫేస్బుక్లో షేర్ అవుతున్నట్టు బీజేపీ హమీర్పూర్ ఎమ్మెల్యేపై ఆ ఈవెంట్లో ఎలాంటి దాడి జరగలేదని, ఈ అవమానకర సంఘటనను హిమాచల్ రోడ్డు రహదారుల కార్పొరేషన్ లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ శంకర్ సింగ్ ఈ దాడికి గురయ్యారని చెప్పారు. -
వాజ్‌పేయిని విమర్శించాడని ప్రొఫెసర్‌ను చితకబాదారు
-
చదువుల తల్లికి ‘సోషల్’ వేధింపులు
కొచ్చి: హానన్ హమీద్ ... ఉన్నట్టుండి ఈ పేరు కేరళలోని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. కేరళలోని త్రిసూరుకి చెందిన డిగ్రీ చదువుతోన్న 19 ఏళ్ళ ఈ అమ్మాయి బతుకుబండిని లాగేందుకు చేపలు అమ్మింది. ఈవెంట్ మేనేజ్మెంట్ చేసింది. ట్యూషన్లు చెప్పింది. రేడియో ప్రోగ్రామ్స్ కూడా చేసింది. సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా కూడా చేసింది. ఇంకా చెప్పాలంటే తను బతకడం కోసం, తన తల్లిని బతికించుకోవడం కోసం తనకొచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకుంది. తన కాళ్ళపై తాను నిలబడేందుకు హానన్ హమీద్ చేసిన బతుకు పోరాటాన్ని కొనియాడుతూ కేరళ ‘మాతృభూమి’ దిన పత్రిక కథనం ప్రచురించడంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. పలువురు రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు హానన్‌కు మద్దతుగా ఉంటామని ప్రకటించారు. రంగంలోకి పోకిరీలు హానన్ పేరు పత్రికల్లో రావడం సహించలేని కొందరు వ్యక్తులు ఆమెను సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టారు. ఫేస్ బుక్‌లోకి చొరబడి ఆమె ఫొటోలు, ప్రముఖులతో దిగిన సెల్ఫీలూ, డబ్స్మాష్ వీడియోలపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. హానన్ నిజాయితీని శంకిస్తూ పోస్ట్‌లు పెట్టి వ్యక్తిగతంగా దాడికి దిగారు. హానన్ నిజంగా పేదరాలైతే ఆమె వేలికున్న ఉంగరం ఎక్కడిది? అని ఒకరు, ప్రచారం కోసం ఇదంతా చేస్తోందని మరొకరు. ఇలా నానా రకాలుగా ఆమెను వేధించారు. చివరికి తనకు ఎవ్వరి సాయం అక్కర్లేదనీ, తన మానాన తనను వదిలేయాలని హానన్ రెండు చేతులు జోడిస్తూ కన్నీళ్లతో అర్థించినా ఈ నీచులు వెనక్కి తగ్గలేదు. హానన్‌కు కేంద్ర మంత్రి అల్ఫోన్స్ మద్దతు.. ఆకతాయిలు ఓ యువతిని లక్ష్యంగా చేసుకోవడంపై కేంద్ర పర్యాటక సహాయమంత్రి అల్ఫోన్స్ తీవ్రంగా స్పందించారు. ‘కేరళ సొర చేపల్లారా.. హానన్‌పై దాడిచేయడాన్ని ఆపండి. మీ చర్యల పట్ల నేను సిగ్గుపడుతున్నా. చెదిరిన తన జీవితాన్ని చక్కదిద్దుకునేందుకు ఆ యువతి పోరాడుతుంటే మీరు మాత్రం రాబందుల్లా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఫేస్బుక్లో మండిపడ్డారు. హానన్‌ను సోషల్‌మీడియాలో వేధించిన ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ పోలీసుల్ని ఆదేశించారు. మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్‌తో తాను చేయబోయే సినిమాలో హానన్‌కు అవకాశం ఇస్తానని దర్శకుడు అరుణ్ గోపి ప్రకటించారు. ఎంబీబీఎస్ చదవాలన్నదే లక్ష్యం.. ఎర్నాకులం జిల్లా ఇడుక్కి తోడుకోళలోని అల్ అజహర్ కాలేజ్‌లో హనన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఉదయాన్నే చేపల్ని కొనుక్కుని వచ్చి ఫ్రిజ్‌లో దాచడం, కాలేజీకి వెళ్లివచ్చిన వెంటనే వాటిని చంపెక్కరా మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మడం ఆమె దినచర్య. ఈ చేపల అమ్మకాలతో వచ్చిన డబ్బులతో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పోషిస్తూ హానన్ చదువుకుంటోంది. కేవలం చేపలే కాదు.. యాంకరింగ్, ట్యూషన్లు, రేడియో ప్రోగ్రాములు ఒక్కటేమిటీ వీలైన ప్రతివిభాగంలో హానన్ పనిచేసింది. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గానూ రాణించింది. ఎప్పటికైనా ఎంబీబీఎస్ చదవడమే తన జీవిత లక్ష్యమని చెబుతున్న హానన్ కోరిక నెరవేరాలని ఆశిద్దాం. చేపలు అమ్ముతున్న హానన్ (ఫైల్). -
ఎమ్మెల్యేపై ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారని కేసు నమోదు
సాక్షి, పశ్చిమగోదావరి: చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతపై ఫేస్బుక్లో పోస్ట్‌లు పెట్టారని వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు సురేష్‌పై చింతలపూడి స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి సురేశ్‌ని అరెస్ట్ చేసినట్టు తన కుంటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే చింతలపూడి పోలీసులు సురేశ్‌ని అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. దీంతో అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు అక్రమంగా వ్యవహరిస్తున్నారంటూ అరోపణలు చేస్తున్నారు. -
కత్తికి శ్రీరెడ్డి చురకలు
ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. శ్రీరాముడిని దూషించాడని మహేష్‌పై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. ‘జై శ్రీరామ్.. దేవుడ్ని దూషించటం మంచిది కాదు. మా హిందూ ధర్మాన్ని హేళన చేయకండి’ అంటూ ఫేస్బుక్లో పరోక్షంగా కత్తిని ఉద్దేశించి ఆమె ఓ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఓ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా ఫోన్ ఇన్‌లో మాట్లాడుతూ..‘ రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో, ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’ అంటూ రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిందూ జనశక్తి నేతలు ఆయనపై నగరంలోని కేబీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు హిందూ సంఘాలు వేర్వేరు చోట్ల కేసులు నమోదు చేశాయి కూడా. -
ఫేస్బుక్లో పోస్టింగ్‌లు పెట్టాడని దాడి
భీమడోలు/ఏలూరు టౌన్ : వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఫేస్బుక్లో పోస్టింగులు పెడుతున్నాడనే అక్కసుతోపాటు, పాత కక్షల నేపథ్యంలో టీడీపీ నేత తన అనుచరులతో కలిసి వైఎస్సార్ సీపీకి చెందిన నాయకుడిపై దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా కొట్టటంతోపాటు కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. గొడవ జరగటం చూసి అక్కడికి జనాలు రావటంతో టీడీపీ నేతలు జారుకున్నారు. తల, శరీరబాగాలపై తీవ్రంగా కొట్టటంతో పడిపోయిన అతడిని స్థానికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి కథనం మేరకు.. భీమడోలు మండలం వడ్లపట్ల గ్రామానికి చెందిన రామిశెట్టి శ్రీనుబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. ఇటీవల భీమడోలులో కాపునేత ముద్రగడ పద్మనాభం కార్యక్రమానికి హాజరైన అతను ఆ సభలోని అంశాలతోపాటు కొంత కాలంగా వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఫేస్ బుక్కులో పోస్టింగులు పెడుతున్నాడు. దీంతో శ్రీనుబాబుపై కక్షపెంచుకున్న భీమడోలు మండల టీడీపీ అధ్యక్షుడు గంజి మాజేష్చౌదరి సమయం కోసం వేచిఉన్నాడు. వ్యవసాయ కూలీ అయిన శ్రీనుబాబు గురువారం సాయంత్రం డీజిల్ కోసమని భీమడోలు పెట్రోల్ బంకుకు వెళ్లి డీజిల్ కొట్టించుకుని బయటకు వస్తుండగా అతడిని అడ్డుకుని మాజేష్, అతని సోదరుడు మనోజ్, ఉయ్యాల సాయి, అలజింగి హరిష్, మోపిదేవి శివ, తుమ్మగుంట పవన్‌కల్యాణ్ తదితరులు తీవ్రంగా కొట్టారు. తనను ఎందుకు కొడుతున్నారని శ్రీనుబాబు ప్రశ్నించగా, ఈ మధ్య బాగా అతి చేస్తున్నావనీ, పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరించారు. ఈలోగా మరో వ్యక్తి కత్తి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా జనాలు గుమిగూడటంతో వారు అక్కడి నుంచి జారుకున్నారు. శ్రీనుబాబును ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. తనను కొట్టిన వారిపై శ్రీనుబాబు భీమడోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెనువెంటనే టీడీపీ నాయకులు బాధితుడు రామిశెట్టి శ్రీనుబాబు, వైఎస్సార్ సీపీ నేతలు తుమ్మగంట రంగాతో పాటు పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రావిపాటి సత్యశ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు భీమడోలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. రామిశెట్టి శ్రీనివాసరావును దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన టీడీపీకి చెందిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ వద్ద బైఠాయించారు. గాయపర్చిన వ్యక్తులను ఎందుకు వదిలేస్తున్నారని ఎస్సై శ్రీరామగంగాధర్ను ప్రశ్నించారు. నేరస్తులైన టీడీపీ నాయకులకు కొమ్ముకాస్తున్నారన్నారు. దీంతో పోలీసులు, వైఎస్సార్ సీపీ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం సీఐ బీఎన్ నాయక్, ఎస్సై శ్రీరామగంగాధర్ వైఎస్సార్ సీపీ నేతలతో చర్చించారు. రెండు కేసులను నమోదు చేసి విచారణ చేస్తామని చెప్పారు.బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ నాయకులు వెనుతిరిగారు. -
లిఫ్ట్ ఇవ్వటం ‘మహా’ పాపం
పాపం పోనీ అని లిఫ్ట్ ఇవ్వటం ఆ వ్యక్తి పాలిటే శాపంగా మారింది. హఠాత్తుగా ఊడిపడ్డ ట్రాఫిక్ అధికారి చలాన్ రాసి చేతిలో పెట్టాడు. ముంబైకి చెందిన నితిన్ నాయర్ అనే వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్బుక్లో ఓ పోస్టు రూపంలో తెలియజేశాడు. జూన్ 18న ముంబై ఐరోలి సర్కిల్లో నితిన్ వెళ్తున్నాడు. ఆ సమయంలో వర్షం భారీగా పడుతుండటం, పైగా రవాణా సదుపాయం లేకపోవటంతో ముగ్గురు వ్యక్తులు కష్టపడుతుండటం అతని కంట పడింది. వెంటనే వారిని తన కారులో ఎక్కించుకున్నాడు. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ వెంటనే నితిన్ వద్దకు వచ్చి రూ. 1500 చలాన్ రాసిచ్చాడు. అంతేకాదు నితిన్ డ్రైవింగ్ లైసెన్స్ లాక్కుని ఛలాన్ కట్టి వాహనం తీసుకెళ్లాలని సూచించాడు. అయితే ఆ టైమ్‌లోనూ నితిన్ సాయం చేయటం మానలేదు. వారిని వారి వారి గమ్యస్థానంలో వదిలి మరుసటి రోజు కోర్టుకు వెళ్లి ఫైన్ కట్టి బయటపడ్డాడు. తన అనుభవాన్ని నితిన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. నితిన్‌కు ఎదురైన చేదు అనుభవాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. సెక్షన్ 66/192 ప్రకారం అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం నేరమని, అందుకే అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ పేరుతో సాయం చేసి తనలా బుక్ కాకండని సూచిస్తూ ఆ పోస్టును పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఫేస్బుక్ యూజర్లకు మరోసారి షాక్
-
ఎక్స్ట్రా చేస్తే తాట తీస్తా: బాలకృష్ణ
‘‘సార్.. మేము దళితులం. మీకు పూలదండ వేసేందుకు కూడా పనికిరామా.. వచ్చిన ప్రతిసారీ మమ్మల్ని పక్కకు లాగేస్తున్నారు. ఏళ్లుగా పార్టీ జెండా మోసినందుకు మాకిచ్చే గౌరవం ఇదేనా.’’ ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నాం. పనులు మాత్రం పర్సెంటేజీలు ఇచ్చిన వారికే కట్టబెడుతున్నారు. ఇదేం న్యాయం. మనోడైనా.. ప్రశ్నిస్తే పగోడే! అసలే బాలయ్య. కోపమొస్తే ఎవరి చెంప చెల్లుమంటుందో తెలియదు. రాకరాక ఊరికొస్తే.. ఆయనను ప్రశ్నిస్తే ఇంకేమైనా ఉందా! తనకు అంతా తెలుసనీ, ఎక్స్ట్రా చేస్తే తాట తీస్తానని తనదైన శైలిలో సినిమా డైలాగ్ చెప్పేశారు. సాక్షి, హిందూపురం అర్బన్: చుట్టపుచూపుగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయే ఎమ్మెల్యే బాలకృష్ణ... నాలుగేళ్ల తర్వాత... క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవాలని భావించారు. ఈక్రమంలోనే గురువారం ఆయన స్థానిక సాయిరాం ఫంక్షన్ హాలులో చిలమత్తూరు మండలంలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశం కాగా కార్యకర్తలు, నేతలు బాహాబాహీకి దిగడంతో బాలయ్య దిమ్మదిరిగింది. బయటపడ్డ విభేదాలు చిలమత్తూరు మండలంలోని పంచాయతీల వారీగా సమస్యలపై చర్చిస్తుండగా నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కోడూరు పంచాయతీ గురించి ప్రస్తావన రాగానే.. నాయకుల మధ్య విభేదాలతో పార్టీ నాశనం అయిపోతోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేశారు. పనులన్నీ పర్సంటేజిలు ఇచ్చినవారికే ఇచ్చుకుంటున్నారనీ.. కార్యకర్తలకు న్యాయం చేయడంలేదన్నారు. పాపన్న అన్నింటికీ అడ్డుపడుతూ వర్గాలు సృష్టిస్తున్నాడని ముద్దçపల్లి వెంకటసుబ్బయ్య ఆరోపించారు. దీంతో పాపన్న స్పందిస్తూ... పార్టీ అభివృద్ధికోసం పనిచేస్తున్న తనపై ఆరోపణలు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే ఇరువురూ వాగ్వాదానికి దిగారు. వారికి బాలకృష్ణ పీఏ వీరయ్య, శివప్పలు నచ్చచెప్పి కుర్చోబెట్టారు. ఇంతలో మరో కార్యకర్త స్పందిస్తూ..నేతలుæకార్యకర్తల రక్తం తాగుతున్నారనీ, కనీసం విలువ కూడా ఇవ్వడం లేదన్నారు. దళితులంటే చులకన అనంతరం గంగాధర్ అనే కార్యకర్త మాట్లాడుతూ, దళితులందరూ పార్టీ అభివృద్ధికి పనిచేస్తూ ప్రతిసారి గెలిపించుకుంటూ వస్తున్నామన్నారు. అయితే తమకు గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు. కనీసం మీకు పూలదండ వేయడానికి వచ్చినా పక్కకు లాగేస్తున్నారని బాలకృష్ణ ఎదుట వాపోయారు. ఎస్సీ కాలనీలో అనేక సమస్యలున్నా.. తీర్చేవారు లేరన్నారు. అనంతరం పాతసామర్లపల్లికి చెందిన మంజు మాట్లాడుతూ, చాలాకాలంగా తాను స్టోరు డీలరుగా ఉన్నాననీ, అయితే జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణ తన స్టోరుపై అధికారులతో దాడిచేయించి స్టోరును లాగేసుకున్నాడన్నారు. ఇక అధికారులే తనపై లేనిపోనివి చెప్పి జనంతో ధర్నాలు చేయిస్తున్నారని చిలమత్తూరు సర్పంచ్ శ్రీకళ వాపోయారు. వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు కూడా ఇలా చేయలేదనీ, టీడీపీలోకి వచ్చాక ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఎక్స్ట్రా చేస్తే తాటతీస్తా... అన్నీ విన్న ఎమ్మెల్యే బాలకృష్ణ... ఏ పంచాయతీలో ఏం జరుగుతుందో అన్నీ తనకు తెలుసనీ...ఎక్స్ట్రా చేస్తే తాట తీస్తా నంటూ అక్కడున్న వారందరినీ హెచ్చరించారు. 20తేదీ నుంచి పంచాయతీల్లో పర్యటిస్తాననీ...అన్నీ చూచి ఒక్కొక్కరికి ఏంచేయాలో అది చేస్తానన్నారు. సమావేశంలో టీడీపీ ఎంపీపీ నౌజియాభాను, జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణ, సర్పంచి శ్రీకళ, టీడీపీ బీసీసెల్ జిల్లా అ«ధ్యక్షుడు శివప్ప, మండల కన్వీనర్ బాబురెడ్డి పాల్గొన్నారు. రోడ్డులేదని చెప్పడానికొస్తే ఈడ్చిపడేశారు చిలమత్తూరు మండలం మరుసనపల్లి పంచాయతీ ఎస్.ముద్దిరెడ్డిపల్లి గ్రామంలో రోడ్డు లేదు. వర్షం వస్తే మట్టిరోడ్డు బురదమయం అవుతోంది. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్దామని ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టా. బాలయ్య వచ్చాడు కదా అని చెప్పేందుకు వెళ్తే చుట్టూ చేరిన వారి మాటలు విని నాకు వ్యతిరేకంగా పోస్టులు పెడతావా అంటూ నానా దుర్భాషలాడాడు. బయటికిపో అంటూ గద్దించాడు. పోలీసులు బలవంతంగా బయటకు ఈడ్చేశారు. – బత్తుల బాలాజి, ముద్దిరెడ్డిపల్లి టీడీపీ కార్యకర్త -
మరో ప్రమాదంలో ఫేస్బుక్ యూజర్లు
వాషింగ్టన్ : డేటా స్కాండల్ విషయంలో ఫేస్బుక్ యూజర్లు ఇప్పటికే తమ అకౌంట్ సురక్షితమా? కాదా? అని సతమతమవుతుంటే, తాజాగా మరో ప్రమాదం పొంచుకొచ్చింది. తమ సాఫ్ట్‌వేర్‌లో బగ్‌ను గుర్తించామని, అది యూజర్ల ప్రైవసీ సెట్టింగ్స్‌ను మార్చేసిందని సోషల్ మీడియా దిగ్గజం వెల్లడించింది. ఈ బగ్‌కు మే నెలలో 1.4 కోట్ల మంది యూజర్లు ప్రభావితమయ్యారని తెలిపింది. దీంతో మరోసారి ఫేస్బుక్ ప్రైవసీపై తీవ్ర ఆందోళన రేకెత్తుతోంది. ఫేస్బుక్ తన సాఫ్ట్‌వేర్‌లో గుర్తించిన బగ్ వల్ల.. కేవలం స్నేహితులకు లేదా మీకు మాత్రమే షేర్ చేసుకున్న అంతకముందు పోస్టులు.. పబ్లిక్‌గా వెళ్లిపోయాయి. ఒకవేళ యూజర్లు ప్రైవసీ సెట్టింగ్స్ మారుతున్నట్టు గుర్తించలేకపోతే, వారు ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా.. ప్రమాద పరిస్థితుల్లో వారి పోస్టులు పబ్లిక్‌గా వెళ్లిపోతాయి. అయితే ఈ బగ్ అంతకముందు పోస్టులపై ప్రభావితం చూపలేదని ఫేస్బుక్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ ఎరిన్ ఈగన్ చెప్పారు. బగ్ యాక్టివ్‌లో ఉన్న సమయంలో షేర్ చేసుకున్న పోస్టులకు మాత్రమే ఇది ప్రభావితమైందని తెలిపారు. ఒక్కసారి యూజర్లు తమ పోస్టులను సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు ఫేస్బుక్ మరింత డేటా స్కాండల్ వివాదంలో కూరుకుపోతోంది. ఆపిల్, శాంసంగ్ వంటి 60కి పైగా కంపెనీలతో ఫేస్బుక్ తన యూజర్ల డేటా షేర్ చేసిందని న్యూయార్క్ టైమ్స్ బహిర్గతం చేసింది. కేవలం ఆ కంపెనీలు మాత్రమే కాక, నాలుగు చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కూడా యూజర్ల డేటాను షేర్ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ విషయంలో ఈ కంపెనీ తీవ్ర ఇరకాటంలో పడగా.. తాజా డేటా షేరింగ్ స్కాండల్స్ కూడా ఫేస్‌బుక్‌ను దెబ్బకొడుతున్నాయి. తాజాగా కంపెనీ గుర్తించిన బగ్ మే 18 నుంచి మే 27 వరకు యాక్టివ్‌లో ఉన్నట్టు ఫేస్బుక్ తెలిపింది. ఆ సమయంలో ప్రభావితమైన పోస్టులను ఒరిజినల్ ప్రైవసీ పారామీటర్స్‌కు మళ్లీ మార్చలేమని తెలిపింది. యూజర్లు ‘ఫీచర్ ఐటమ్స్’ను తమ ప్రొఫైల్స్‌లోకి షేర్ చేసేందుకు కొత్త ఫీచర్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తున్న సమయంలో ఈ తప్పిదం జరిగిందని, దీంతో ఆటోమేటిక్‌గా పోస్టులు, ఫోటో ఆల్బమ్స్ పబ్లిక్కు వెళ్లిపోయాయని పేర్కొంది. -
పోస్ట్ చేశారు.. పోలీసులకు పట్టుబడ్డారు!
కర్నూలు: జిల్లాలో పార్థి, చెడ్డీ, బిహార్ గ్యాంగ్‌లున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ముగ్గురు బాలురను నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా వారి నుంచి మూడు సెల్ఫోన్లు, సిమ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ గోపీనాథ్ జట్టి నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ, రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్బీ డీఎస్పీ నజీముద్దీన్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. పోస్ట్ ఇలా..: ‘పిల్లలను చంపి మెదడు తినే మద్రాసుకు చెందిన 50 మంది గ్యాంగ్‌లో ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టాం. అతడి పేరు జాన్‌కొల్లి, ఇంకొందరు వ్యక్తులను కోడూరులో పట్టుకున్నారు. మహానంది మండలం తిమ్మాపురం వాసులు వ్యక్తిని పట్టుకొని విచారిస్తున్న ఫొటోను జతపరిచి దానికి వాయిస్‌ను పైవిధంగా జతచేసి వాట్సప్, సామాజిక మాధ్యమాల ద్వారా సుమా రు 31 మంది పరిచయస్తులకు షేర్ చేశారు. పుకార్లు నమ్మొద్దు...: సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి గ్యాంగులు జిల్లాలో తిరగడంలేదన్నారు. వదంతుల నమ్మి మానసిక స్థితి సరిగా లేనివారిపైనా, అమాయకులపైనా భౌతిక దాడులకు పాల్పడి హాని కలిగించవద్దన్నారు. జిల్లా ప్రశాంతంగా ఉందని సాయుధులైన ప్రత్యేక పోలీసు బృందాలతో గస్తీ ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన సంఘటనలపై విచారించగా ఆయా గ్రామాల్లో ప్రజలకు పట్టుబడిన వారంతా మతిస్థిమితం లేనివారు, భిక్షగాళ్లు, చిన్నచిన్న వ్యాపారులుగా గుర్తించామన్నారు. ఇక ఆదోనిలో ప్రజల సామూహిక దాడిలో మృతి చెందిన వ్యక్తి కూడా ఓ అమాయకుడేనని తేలిందన్నారు. గ్యాంగ్‌ల గురించి సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించిన బాలురపై మహానంది పోలీసు స్టేషన్లో కేసు నమోదుచేసి కర్నూలు బీక్యాంపులోని జువైనల్ హోమ్‌కు అప్పగించినట్లు ఎస్పీ వెల్లడించారు. -
ఫేసు బుక్కయ్యాడు..
ప్రొద్దుటూరు క్రైం : పార్థీ గ్యాంగ్ తిరుగుతోందని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి తద్వారా తన కుక్కల వ్యాపారాన్ని పెంచుకోవాలని ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టిన యువకుడిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో పార్థీ గ్యాంగ్ సంచారం లేకున్నా ప్రజలు జంకుతున్నారు. ఒక వైపు పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తరుణంలో వినోద్‌కుమార్‌రెడ్డి అనే కుక్కుల వ్యాపారి ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. రూరల్ పోలీస్ స్టేషన్లో గురువారం సీఐ ఓబులేసు అరెస్ట్ విరాలను వెల్లడించారు. పాతకోట వినోద్‌కుమార్‌రెడ్డి ఆరేళ్ల నుంచి ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లెలో భైరవ కెన్నల్ పేరుతో కుక్కల వ్యాపారం నిర్వహించేవాడు. ఇటీవల జిల్లాలో పార్థీ గ్యాంగ్ గురించి పుకార్లను, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తన కుక్కల వ్యాపారాన్ని పెంచుకోవాలని చూశాడు. పార్థీ గ్యాంగ్ లేదని చెప్పిన పోలీసుల మాటలను నమ్మవద్దని, జిల్లాలో పార్థీ గ్యాంగ్ ముఠా సంచరిస్తోందని, ఇంటికి కాపలాగా ప్రతి ఒక్కరూ కుక్కను పెట్టుకోవాలని ప్రజలు నమ్మేలా ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టాడు. ఫేస్బుక్ ద్వారా ప్రజలను నమ్మించే విధంగా తప్పుడు ప్రచారం చేసిన అతన్ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇప్పటికే ప్రజల్లో ఉన్న పార్థీ గ్యాంగ్ భయాన్ని పోగొట్టేందుకు పోలీసులు శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో పార్థీ గ్యాంగ్ ఉందని ప్రజల్లో భయాన్ని కలిగించడం నేరమని సీఐ తెలిపారు. యువకుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో పార్థీ గ్యాంగ్ కదలికలు లేవు.. జిల్లాలో పార్థీ గ్యాంగ్ సంచారం లేదని సీఐ ఓబులేసు అన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో పార్థీ గ్యాంగ్ చేసిన నేరాలు, ఇతర సంఘటనలు ఒక్కటి కూడా లేదని చెప్పారు. ఎక్కడో జరిగిన సంఘటనలను జిల్లాలో జరిగినట్లు వాట్సప్, ఫేస్బుక్ ద్వారా కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి పోస్టులను ఇతరులకు పంపరాదని సీఐ సూచించారు. ఇలాంటి పుకార్లను, వదంతులను నమ్మరాదని కోరారు. పట్టణంలోనూ, గ్రామాల్లోనూ నిరంతరం పోలీసులు గస్తీ తిరుగుతున్నారని ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ ప్రజలను కోరారు. -
కేటీఆర్ సార్.. స్పందించండి: శ్రీరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై మూడు, నాలుగుసార్లు తెలంగాణ మంత్రి కేటీఆర్‌గారికి తాను ట్వీట్ చేశానని అయినా ఆయన ఏమాత్రం స్పందించడం లేదని, మూవీలకు మాత్రం దగ్గరుండి ప్రచారం కల్పిస్తున్నారని నటి శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తమ సమస్యలను బయటపెడుతున్నా సినీ పెద్దలు పట్టించుకోవడం లేదని, అందుకే ఇండస్ట్రీలో తమపై వేధింపులపై నేరుగా కలుసుకుని చర్చించాలని భావిస్తున్నట్లు శ్రీరెడ్డి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ట్వీట్లను స్క్రీన్ షాట్లు చేసి శ్రీరెడ్డి తాజాగా చేసి ఎఫ్బీ పోస్ట్ వైరల్‌గా మారింది. 'కొన్ని నెలలుగా క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్నాం. మాకు న్యాయం కావాలి. మూవీకి సంబంధించిన పెద్ద కుటుంబాలు మా సమస్యలపై సరైన రీతిలో స్పందించడం లేదు. వారి నిర్ణయాలపై మేం సంతృప్తి చెండడం లేదు. తెలుగు మహిళలు, యువతులకు సినిమాలో ఆఫర్లు రావడం లేదు. మేం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం.' 'సార్, ఇటీవల విడుదలైన మహేష్ బాబు మూవీ 'భరత్ అనే నేను'కు మీరు ప్రమోషన్లు ఇచ్చారు. కానీ ఇండస్ట్రీలో మహిళల సమస్యలపై స్పందించేందుకు మాత్రం సమయంలో ఎందుకు కేటాయించడం లేదు. మీ పీఏ మొబైల్‌కి పలుమార్లు మెస్సేజ్‌లు చేశాను. కానీ స్పందన కరువైంది. మా సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెప్పండి సార్' అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేశారు. (సంబంధిత కథనం: ‘సీఎం భరత్’కు కేటీఆర్ ఫిదా) -
రిపోర్టర్లు, యాంకర్లపై అభ్యంతర వ్యాఖ్యలు
చెన్నై: మహిళా జర్నలిస్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలున్న ఓ పోస్ట్‌ను తమిళనాడు బీజేపీ నేత, నటుడు ఎస్వీ శేఖర్ గురువారం తన ఫేస్బుక్లో షేర్ చేశారు. ‘చదువుకోని దుర్మార్గులు ఇప్పుడు మీడియాలో ఉన్నారు. విద్యా సంస్థల్లో కన్నా మీడియాలోనే లైంగికవేధింపులు ఎక్కువ. పెద్ద మనుషులతో పడుకోకుండా మీడియా సంస్థల్లో ఎవ్వరూ రిపోర్టర్లు, న్యూస్ యాంకర్లు కాలేరు. సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మి సుబ్రమణియన్‌ను తాకినందుకు గవర్నర్ పురోహిత్ తన చేయిని ఫినాయిల్‌తో కడుక్కోవాలి. తమిళనాడులో నేరస్తులు, నీచులు, బ్లాక్ మెయిలర్ల చేతిలో చిక్కుకున్న మీడియా తిరోగమిస్తోంది. ఇక్కడి మీడియా ప్రతినిధులు దిగజారిన, అసహ్యమైన, సభ్యతలేని జీవులు’ అని ఉన్న పోస్ట్‌ను షేర్ చేశారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో శేఖర్ వెంటనే క్షమాపణలు కోరారు. చదవకుండానే పోస్టును షేర్‌చేశానన్నారు. -
రేప్ చేస్తామంటూ కాల్స్.. ఆర్టిస్ట్ ఆందోళన!
తిరువనంతపురం: కథువా హత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందించి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఆర్టిస్ట్ దుర్గా మాలతి ఇంటిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాహనంతో పాటు ఇంట్లో వస్తువులు ధ్వంసమయ్యాయని పట్టాంబి పోలీస్ స్టేషన్లో ఆర్టిస్ట్ ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పలక్కడ్ జిల్లా పట్టాంబిలో ఆర్టిస్ట్ దుర్గా మాలతి కుటుంబంతో పాటు నివాసం ఉంటున్నారు. అయితే జమ్మూకశ్మీర్‌లోని ఉన్నావాలో 8 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, ఆపై హత్య ఘటన దుర్గను కలచివేసింది. దీంతో బాలికపై దారుణానికి పాల్పడ్డ నిందితులు హిందువులు కావడంతో.. హిందూ దేవుళ్లను కించపరిచేలా ఆమె కొన్ని పెయింటింగ్స్ వేశారు. వాటిని తన ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మర్మాంగం బొమ్మకు తమ దేవుళ్లను లింక్ చేసి అవమానించిందని.. తమ మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు చేసిందన్న కారణంగా కొందరు వ్యక్తులు గురువారం రాత్రి ఆమె ఇంటిపై రాళ్లదాడి చేసి కొన్ని వస్తువులు ధ్వంసం చేశారు. అత్యాచారం చేస్తామని, హత్య చేస్తామని బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని ఆర్టిస్ట్ దుర్గా మాలతి ఆందోళన వ్యక్తం చేశారు. రేప్ చేస్తామని కొందరు, హత్య చేస్తామని మరికొంత మంది నెటిజన్లు తన పోస్టులకు కామెంట్లు చేస్తున్నారని తన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. -
స్పందించిన వర్మ.. పవన్‌కు సుదీర్ఘ లేఖ
నటుడు పవన్ కల్యాణ్‌తో వివాదంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. పవన్ కల్యాణ్‌పై ఇకనుంచి నెగటివ్ కామెంట్లు చేయనని తన తల్లిపై ఒట్టేశానని చెప్పిన వర్మ.. ఆపై పవన్ చేసిన ట్వీట్లకు తాను లాజికల్‌గా సమాధానం ఇవ్వాల్సి ఉందని సోషల్ మీడియా ద్వారా అభిప్రాయపడ్డాడు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే.. ప్రాస్టిట్యూషన్‌ను చట్టబద్ధం చేయడం మీకు ముఖ్యమైందా అని పవన్ అడుగుతున్నారు. కానీ ప్రత్యేక హోదా కంటే మీకు ఎవరో వ్యక్తి తిట్టారన్న విషయమే జాతీయ సమస్యగా కనిపించిందా అని తన పోస్ట్‌లో ప్రశ్నించాడు. హోదా కోసం ఏపీ సీఎం చంద్రబాబు దీక్ష చేస్తున్న రోజే మీరు ఇలా నిరసన తెలపడం సమంజసమా అని లాజికల్‌గా పవన్‌ను అడుగుతున్నట్లు వర్మ తెలిపారు. పవన్ తల్లిని తిట్టించడానికి తాను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదన్న వర్మ.. ఈ వివరాలు తాను విడుదల చేసిన వీడియోలో క్లియర్‌గా ఉన్నాయంటూ కొన్ని విషయాలు డైరెక్టర్ వర్మ పోస్ట్ చేశారు. వర్మ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు శుక్రవారం కొన్ని గంటల పాటు ఫిల్మ్ ఛాంబర్ లో చర్చలు జరిపిన అనంతరం ఒక్కరోజు గడువు ఇస్తున్నానని అంతలోపు తనకు న్యాయం చేయాలని సినీ పెద్దలను పవన్ కోరిన విషయం తెలిసిందే. పవన్‌కు దర్శకుడు వర్మ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన లేఖ యథాతథంగా... పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు నేను పవన్ కళ్యాణ్ గారిని నెగటివ్ గా కామెంట్ చెయ్యనని మా మదర్ మీద ఒట్టేసాను..కానీ ఆ తర్వాత ఆయన పెట్టిన ట్వీట్ల మూలాన ఇక్కడ నేను నెగటివ్ గా కాకుండా ,లాజికల్ గా సమాధానాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. పవన్ కళ్యాణ్ CBNని ఉద్దేశించి “మీ ప్రభుత్వం రావటానికి అండగా నిలబడినందుకు ప్రతిఫలంగా మీ కొడుకు అతని స్నేహితులు ఆధ్వర్యంలో 6 నెలలుగా మీ మీడియా సంస్థాలైన TV9 ABN ANDHRA JYOTHI ద్వారా నా మీద అత్యాచారం జరుపుతూ వచ్చారు ..దాంట్లో భాగంగానే..10 కోట్లు ఖర్చు పెట్టి నాకు సంబంధంలేని విషయాల్లోకి నన్ను లాగి నాకు జన్మనిచ్చిన తల్లిని నడి రోడ్డులో అసభ్యంగా బూతు తిట్టించి దానిని పదే పదే ప్రసారం చేసి డిబేట్లు పెట్టి దానిని మీ పార్టీ వ్యక్తులు సర్క్యూలేషన్లో పెట్టారు..Ram gopal Varma,Tv 9 owner srini raju ,Ravi Prakash ,Lokesh Naidu ,అతని ఫ్రెండ్ Rajesh kilaru కలిసి చేయిస్తున్నారని మీకు తెలియదంటే నన్ను నమ్మమంటారా RGV: పవన్ కళ్యాణ్ గారు,నేను విశ్వ ప్రసిద్ధ రచయిత ఆగతా క్రిస్టీ నవలల్లో కూడా ఇంత క్లిష్టమైన కాన్స్పిరసీ థియరీ చదవలేదు.. ఇప్పుడు మీరు అర్జెంటుగా పెట్టిన ఈ మీటింగ్ CBN స్పెషల్ స్టేటస్ దీక్ష నుంచి డైవర్ట్ చెయ్యడానికి భరత్ అనే నేను కలెక్షన్స్ తగ్గించడానికని నేనూ అనగలను కానీ అనను. మీడియాలో మీటింగ్‌లు బదులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని శ్రీరెడ్డి కి సలహా ఇఛ్చిన మీరు అదే పని మీరెందుకు చేస్తున్నట్టు ? అదలా ఉంచితే, అసలు ఏ.పి స్పెషల్ స్టేటస్ కంటే లీగలైజేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అనే టాపిక్ ముఖ్యమయ్యిందా అని మీరు అడిగినప్పుడు, ఒక పక్కన చంద్రబాబుగారు స్పెషల్ స్టేటస్ కోసం దీక్ష చేస్తుంటే మీరు సరిగ్గా ఇదే రోజు చేస్తున్న దీని మాటేమిటి? ఏపీ స్పెషల్ స్టేటస్ కంటే మీకు ఎవరో ఆఫ్ట్రాల్ వ్యక్తి తిట్టారన్న విషయమే మీకు జాతీయ సమస్యా? మీరు చెప్పిన వివిధ పేర్లు వేరే విషయాల్లోఒక మూకుమ్ముడి ముఠా అయితే అయ్యుండచ్ఛేమో నాకు తెలియదు గాని, నా విషయంలో వాళ్లకి ఏ విధమైన సంబంధమూ లేదు..మీరన్న దానికి పాయింట్లు గా నా వివరణ ఇస్తాను 1.సురేష్ బాబు కొడుకు అభిరాం మీద ఇంకా ప్రొసీడ్ అవ్వకపోతే నాలుగో ఐదో కోట్లు ఇప్పిచించటానికి ట్రై చేస్తానని శ్రీరెడ్డికి చెప్పాను కానీ మిమ్మల్ని తిట్టానికి కాదు..ఇది నేను రిలీజ్ చేసిన వీడియోలోచాలా క్లియర్ గా వుంది 2.ఈ విషయం నేను ప్రస్తావించిన సందర్భం, అంత డబ్బు ఆఫర్ ఇచ్చినా వద్దన్న ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి తెలపటానికి 3.పెద్దవాళ్ళని అన్నప్పుడే చిన్నవాళ్లు వెలుగులోకి వస్తారనేది అనాదిగా తెలిసిన సత్యం.. మహేష్ కత్తి example ఇఛ్చి తనకి సలహా ఇచ్చింది నేను ..ఇక్కడ ముఖ్యమైన విషయం ఇది వేరెవరో ఇన్వెస్టిగేషన్ చేసి బయటకి తియ్యలేదు... ఎవరూ అడగకుండా నాకు నేనే నా వీడియో ద్వారా ఒప్పుకుని క్షమాపణ కూడా చెప్పాను 4.ఇక పోతే మీ అమ్మగారిని తిట్టటమన్నది కరక్ట్ కాదు.. ఆ పదానికి అర్ధం అమ్మ గురించి కూడా అలా ఆలోచించే ఒక మగాడిని వర్ణించడం.. అది చాలా విరివిగా సరదాగా ఫ్రెండ్స్ మధ్యలో కూడా వాడే పదం.. అమ్మని తిట్టేది సినిమాలలో కూడా చాలా విరివిగా వాడే ల కొడుకు అనే పదం 5.మీకదే మీరెప్పుడూ విననంత ఘోరమైన తిట్టు అనిపిస్తే సోషల్ మీడియాలో మీ ఫాన్స్ వాడే తిట్లు వింటే మీరు మూర్ఛచిపడిపోతారు 6.ఒకవేళ నిజంగా నేను, మీరన్న మిగతా ఆ కూటమి కలిసి ఆ అమ్మాయికి 5 కోట్లు ఇఛ్చి తిట్టించమనుకుందాం.. కేవలం క్రెడిబిలిటీ లేని ఒక మామూలు అమ్మాయి మిమ్మల్ని ఆ పదం వాడి తిడితే దాని మూలాన ఎవరికి ఏం లాభం వస్తుంది.. మీ అంత సూపర్ స్టార్ లీడర్ ని రోడ్డు మీద ఒక తిట్టు తిడితే ఆ తిట్టులో వున్న అర్ధం నిజమనుకుంటారా?, మీ క్రెడిబిలిటీ తగ్గిపోతుందా ? మీ కొచ్చే ఓట్లు తగ్గిపోతాయా? 7.ఈ విషయంలో మీరు వూహించుకుంటున్న పేర్లుగల వారెవరూ లేరు.. ఇది కేవలం నా ఒక్కడి తప్పే అని ఇంకొకసారి చెప్పి 20వ సారి మళ్ళీ క్షమాపణ చెప్పుకుంటున్నాను PK: ఈ రోజు నుంచి నేను ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడి ముందుకు వెళ్తున్నాను, ఒక వేళ నేను ఈ పోరాటంలో చనిపోతే..మీరు గుర్తుంచుకోవాల్సింది "నేను ఎంతోకొంత నిస్సహాయులకు అండగా..అధికారం అనేది అండదండలు ఉన్నవారికే పని చేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన విధానాలు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలు." RGV: కళ్యాణ్ గారు, హీరో అయినా మీరు మీ శత్రువులని చంపాలి కానీ మీ చావు గురించి మాట్లాడటం మీకు తగదు.. మీరిలా మాట్లాడటం మీ ఫ్యాన్ గా నాకు బాధ కలిగిస్తోంది. రేపు ఒక రాష్ట్రానికి నాయకుడిగా పోటీ చేయబోయే మీరు.. ఇలా మీ చావు గురించి మాట్లాడటం మీకు కానీ మీరు వచ్చి ఏదో చేస్తారన్న ఆశ నమ్మకాలను పెట్టుకున్న కోట్లమంది మీ అభిమానులకు కానీ మంచిది కాదు అని నా ఉదేశ్యం. పవన్ కళ్యాణ్ గారు వేసిన కొన్ని ఇంగ్లీష్ ట్వీట్లు PK: Hon C M For these channels, legalisation of prostitutes are more important than special status ..what is your priority as you control the media? RGV: I am shocked that you are calling all the unfortunate girls who are victims of casting couch and male abused as prostitutes..this is far worse than what Sri reddy said ..You mean to say just because he is close to your family , all the women whoever complained about the atrocities on your man Vaakadu Apparao are prostitutes ? Never heard anything more deameaning to women. PK: Interesting fact ,The current dream team also has mothers,sisters and daughters..But their women are secured and safe but my poor fragile 70 year old mother had to be abused for TRPs and political benifits RGV: What’s more interesting is I don’t understand how TRPs and political benifits can come to your opponents because of abuses? .. Do you mean to say that tv viewers and voters want to listen to mothers being abused ? Is that how bad you think of telugu people? If at all there’s any political benefit in this whole issue ,it’s only for you because you are dragging your mother into this to gain sympathy which might convert to votes And with regard to the so called dream team’s mothers,sisters and daughters you can always unleash many of ur fans in the social media and you very well know that no one in the world can match their exemplary language skills..in comparison to their abuses what Sri reddy said will sound like a pure morning prayer -your ardent fan RAM GOPAL VARMA -
ఫేస్బుక్ షేర్: వివాదంలో ప్రముఖ నటుడు
సాక్షి, చెన్నై: మహిళా జర్నలిస్టు పట్ల తమిళనాడు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ అనుచిత చర్య వివాదం ఇంకా ముగియకుండానే రాష్ట్రానికి చెందిన నటుడు, బీజేపీ నేత ఎస్వీ శేఖర్ (సత్తనాతపురం వరదరాజ శేఖర్) చిక్కుల్లో పడ్డారు. మహిళా పాత్రికేయులపై అసభ్య పదజాలంతో, అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన ఓ బీజేపీ అభిమాని ఫేస్బుక్ పోస్ట్‌ను షేర్ చేసి మరో వివాదానికి తెర తీశారు. ‘మదురై యూనివర్సిటీ, గవర్నర్ అండ్ ది వర్జిన్ చీక్స్ ఆఫ్ ఎ గర్ల్’ అనే పేరుతో తిరుమలై.ఎస్ అనే ఫేస్బుక్ యూజర్ ఈ పోస్ట్ పెట్టాడు. మహిళా జర్నలిస్టులపై చాలా అవమానకరమైన పదజాలంతో విరుచుకుపడిన ఫేస్బుక్ పోస్ట్‌ను బీజేపీ నేత షేర్ చేశారు. విశ్వవిద్యాలయాల కన్నా ఎక్కువ లైంగిక వేధింపులు మీడియా సంస్థల్లో ఉన్నాయని ఆ పోస్ట్‌లో ఆరోపించాడు. అంతేకాదు మీడియా పెద్దలతో పడుకోకుండా..ఏ మహిళ రిపోర్టర్ లేదా న్యూస్ రీడర్ కాలేదంటూ రెచ్చిపోయాడు. దీంతోపాటు తమిళనాడు మొత్తం మీడియాపై కూడా తన అక్కసును వెళ్లగక్కాడు. మీడియా మొత్తం నేరస్థులు, రాస్కల్స్, బ్లాక్‌మెయిలర్ల చేతిలో చిక్కి తిరోగమన మార్గంలో ఉందని వ్యాఖ్యానించాడు. అయితే ఈ వివాదంపై స్పందించిన శేఖర్ తానా పోస్ట్‌ను పూర్తిగా చదవకుండానే పోస్ట్ చేశాననీ, ఎవర్నీ కించపరిచే ఉద్దేశం తనకు లేదంటూ శేఖర్ వివరణ ఇచ్చుకున్నారు. అమెరికాకు వెళ్ళినప్పుడు మోదీ అభిమానిగా తిరుమలై తనకు పరిచయమయ్యాడని చెప్పారు. ఇపుడు ఆ పోస్ట్‌ను తొలగించాలనుకున్నా.. ఫేస్బుక్ బ్లాక్ చేయడంతో అది సాధ్యం కావడంలేదని చెప్పొకొచ్చారు. (ప్రస్తుతం ఈ పోస్ట్ డిలీట్ అయింది) కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాగా బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా పాత్రికేయులపై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు, తాజాగా శేఖర్ చర్యకు నిరసనగా మహిళా జర్నలిస్టులు, ఇతర మీడియా ప్రముఖులు చెన్నైలోని బీజీపీ కార్యాలయం ముందు నిరసనకు దిగనున్నారు. -
మంచు లక్ష్మిపై రేణూ దేశాయ్ పోస్ట్.. వైరల్
సాక్షి, హైదరాబాద్: సేవా కార్యక్రమాలు చేసే నటి మంచు లక్ష్మిని మరోనటి, దర్శకురాలు రేణూ దేశాయ్ ప్రశంసించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి లక్ష్మి చాలా కృషి చేస్తున్నారని రేణు కొనియాడారు. ఆమెతో కలిసి ఓ మంచి పనిలో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియా సైట్ ఫేస్బుక్లో రేణు ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా ‘మేము సైతం’ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ షోలో రేణు పాల్గొన్నారు. ఎలాంటి నగదు తీసుకోకుండా అవసరాల్లో ఉన్న వారి కోసం పనిచేయడం తృప్తి నిచ్చిందన్నారు. ‘బొమ్మలు అమ్మి 30 వేల రూపాయాలు సంపాదించా. వాటికి మరో 20 వేల రూపాయలు కలిపి ఇచ్చాను. ఆ నగదుకు మంచు లక్ష్మి మరో లక్ష రూపాయలు జత చేశారు. 35 మంది విద్యార్థుల చదువు కోసం 1.5 లక్షల రూపాయలు లక్ష్మి విరాళంగా ఇచ్చేశారు. అవసరాల్లో ఉన్న వారికి మీకు తోచినంతలో సాయం చేయండి. మహిళల చదువు, ఆహారం, వైద్య సదుపాయాల కోసం సాయం అందించాలి. మీరు ఇచ్చే చిన్నమొత్తం అయినా వేరొకరి జీవితాల్లో అది ఎంతో పెద్ద విషయమంటూ’ నటి రేణూ తన పోస్టులో పేర్కొన్నారు. హ్యుమానిటీ, రెస్పాన్సిబిలిటీ, రెస్పాన్సిబుల్ సిటిజన్, బీయింగ్ హ్యుమన్ అనే హ్యాష్‌ట్యాగ్స్‌తో రేణు చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. -
నెటిజన్ల ఆగ్రహం.. స్పందించిన కొటక్ మహీంద్రా
తిరువనంతపురం : సోషల్ మీడియాలో తమ బ్యాంక్ ఉద్యోగిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తటంతో కొటక్ మహీంద్రా స్పందించింది. ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. కొచ్చిలోని పలారివట్టోమ్ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ విష్ణు నందకుమార్ ఈ మధ్య ఫేస్బుక్లో మళయాళంలో ఓ పోస్ట్ చేశాడు. అందులో కథువా హత్యాచార ఘటనపై స్పందించిన విష్ణు.. ‘చిన్నారిపై జరిగిన ఘాతుకం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పడు ఆమె చావటం సరైందే. లేకపోతే భవిష్యత్‌లో మానవ బాంబుగా మారి వందల మందిని బలితీసుకునేదేమో’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీనిపై సోషల్ మీడియాలో ఆగ్రహజ్వాలలు వ్యక్తం అయ్యాయి. విష్ణును బండబూతులు తిడుతూ పలువురు పోస్టులు చేశారు. పనిలో పనిగా కొటక్ మహీంద్రా బ్యాంక్‌కు కూడా కొందరు హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని.. లేకపోతే బ్యాంకులపై దాడులు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన బ్యాంక్ యాజమాన్యం.. ‘ఏప్రిల్ 11న విష్ణు నందకుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించేశాం. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేసినా ఉపేక్షించేది లేదు’ అని పేర్కొంది. అయితే పనిలో మెరుగైన నైపుణ్యం ప్రదర్శించని కారణంగానే అతన్ని తొలగించినట్లు ఆ ప్రకటన పేర్కొనటం గమనార్హం. విష్ణు నందకుమార్.. పక్కనే అతను చేసిన పోస్ట్ -
‘ఆ’ పోస్ట్.. శేఖర్ కమ్ముల సీరియస్
టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల కోపం వచ్చింది. తనను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ పోస్ట్ గురించి తీవ్రంగా స్పందించారు. అందులో ఉన్నవి అవాస్తవాలని.. తక్షణమే అది పోస్ట్ చేసిన వారు క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఫేస్బుక్లో ఆయన చేసిన పోస్ట్... ‘నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది. నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం. స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఈ పోస్ట్‌పై జోరుగా చర్చసాగుతోంది. -
ఇంకా ప్రెషర్ కుక్కర్లోనే ఉన్నాం.. వైరల్!
సాక్షి, ముంబై: కొన్నేళ్ల కిందట వచ్చిన '3 ఇడియట్స్' మూవీ చూసి కాలేజీలు, స్కూళ్లల్లో ఎంతో మార్పు వచ్చిందని భావిస్తున్నారు కదా. కానీ అలాంటివేం జరడగం లేదని ముంబైకి చెందిన ఓ విద్యార్థిని తన ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఓ సందేశం ఫేస్బుక్లో వైరల్ అవుతోంది. తల్లిదండ్రులు, టీచర్లు, లెక్చరర్లు ఆ విద్యార్థి పోస్ట్ చేసిన పోస్టును ఒక్కసారైన చదవాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన '3 ఇడియట్స్' మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. ఆపై దక్షిణాదిలో దర్శకుడు శంకర్ స్నేహితుడు పేరుతో తీయగా విద్యార్థులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కొన్ని సినిమాల ప్రభావం అనంతరం విద్యావ్యవస్థలో ఎంతో మార్పు వచ్చిందని భావిస్తున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. చదివే చదువు వేరు, చేయాలనుకున్న ఉద్యోగం, స్థిరపడాలనుకున్న రంగం వేరుగా ఉంటున్నాయని హ్యుమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ పేజీలో ఓ విద్యార్థి పోస్ట్ చేశాడు. ఒకవేళ నేను సింగర్, నటుడు, డ్యాన్సర్, లేక డైరెక్టర్ అవ్వాలనుకుంటే చదువుకున్న పైథాగారస్ సిద్ధాంతం ఏ విధంగా ఉపయోగపడతాయని ప్రశ్నించాడు. ప్రస్తుతం ముంబై నెటిజన్లకు అది ఓ హాట్ టాపిక్‌గా మారింది. నవ్వుకునేందుకు కామిక్ పుస్తకాలు చదువుతుంటాం. అయితే కామిక్ పుస్తకాలు చదివిన వారికి పరీక్షలు పెడతామని చెప్పండి. ఒక్కరూ కూడా కామిక్ బుక్స్ వైపు కన్నెతి చూడరు. బాగా వేడిగా ఉన్న ప్రెషర్ కుక్కర్ లో పడ్డట్లు విద్యార్థుల పరిస్థితి తయారవుతుంది. అమ్మానాన్నలు మమ్మల్ని స్వేచ్ఛగా వదిలేయండి. మీరు అనుకున్న దాని కంటే గొప్పగా ఎదిగి మీరు గర్వపడేలా చేస్తామంటూ సందేశం ఇచ్చాడు. మరో గంటలో నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉందని, వెళ్తున్నానంటూ విద్యార్థి తన పోస్ట్‌ను ముగించాడు. -
అఫ్గాన్‌లో ‘ట్రంప్’కు కష్టాలు
కాబూల్: సాధారణంగా తల్లిదండ్రులు తమకు ఇష్టమైన, నచ్చిన పేర్లను పిల్లలకు పెడుతుంటారు. అయితే ఆ పేర్లు కొంచెం విచిత్రంగా ఉంటేమాత్రం అనవసర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అఫ్గానిస్తాన్‌కు చెందిన సయ్యద్ అసదుల్లాహ్, జమీలా దంపతులకు ఇదే ఇబ్బంది ఎదురైంది. ఎందుకంటే 2016లో పుట్టిన తమ రెండో కుమారుడికి వీరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు. అయితే చిన్నారి ట్రంప్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల్ని గుర్తుతెలియని వ్యక్తులెవరో ఫేస్బుక్లో పోస్ట్‌చేయడంతో అసలు వివాదం రాజుకుంది. ముస్లింపేరు పెట్టకపోవడంతో అసదుల్లాహ్ను చంపేస్తామని కొంతమంది ఫేస్బుక్లో హెచ్చరించగా.. మరికొందరు తీవ్ర అభ్యంతరకరమైన కామెంట్లు పెట్టేవారు. ఈ బాధ తట్టుకోలేక ఆయన ఫేస్బుక్ ఖాతాను క్లోజ్ చేశారు. ఇరుగుపొరుగువారు కూడా వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోవాలని అసదుల్లాహ్ను బెదిరించసాగారు. దీంతో ఆయన స్వస్థలమైన డైకుండీ ప్రావిన్సును వదిలి కాబూల్‌కు వలస వచ్చారు. ఈ విషయమై అసదుల్లాహ్ మీడియాతో మాట్లాడుతూ.. ట్రంప్ రాసిన ‘హౌ టు గెట్ రిచ్’ పర్షియన్ అనువాదాన్ని చదవడంతో పాటు చాలా పరిశోధన చేసిన తర్వాతే తన కుమారుడికి ట్రంప్ అని పేరుపెట్టినట్లు తెలిపారు. -
ఆమె పేరుతో నకిలీ ఇన్‌స్ట్రాగామ్..
మల్కాజిగిరి: ఫేస్బుక్ ద్వారా యువతిగా పరిచయం చేసుకుని మరో యువతిని వేధిస్తున్న యువకుడిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ కొమరయ్య కథనం ప్రకారం...మల్కాజిగిరి ఎస్పీనగర్‌కు చెందిన మహ్మద్ సొహైల్ హుస్సేన్ సికింద్రాబాద్‌లోని వెస్లీ కాలేజిలో డిగ్రీ చదువుతున్నాడు. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్ధిని ఫేస్బుక్ ద్వారా మహిళగా పరిచయం చేసుకున్నాడు. ఆమె ఫోటోలు తీసుకోవడమే కాకుండా చాటింగ్ చేసిన మెసేజ్‌లను ఆసరా చేసుకొని ఆమెను ప్రేమించమని వేధించడమే కాకుండా లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై గత ఏడాది బాధితురాలి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టు ద్వారా రాజీ చేసుకున్నాడు. ఇటీవల ఆమె పేరుతో నకిలీ ఇన్‌స్ట్రాగామ్ ఖాతాను తెరిచి ఫోటోలు ఉంచడమే కాకుండా అసభ్యకరమైన కామెం ట్లు చేస్తుండటంతో బాధితురాలి గత నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం సోహైల్ హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు. -
దేశం శ్రేణుల మధ్య ఫేస్బుక్ చిచ్చు
తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఫేస్బుక్ పోస్టింగ్ వివాదస్పదమైంది. ఎమ్మెల్యే, జెడ్పీటీసీ అనుచరుల మధ్య యుద్ధం మొదలైంది. చివరకు పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం...దానికి వ్యతిరేకంగా పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించడం ఒకదాని తరువాత ఒకటి వరుస పరిణామాలు మంగళవారం రాత్రి టీడీపీ శ్రేణుల్లో అంతర్గతంగా ఉన్న విబేధాలను బయటపెట్టాయి. వివరాల్లోకి వెళ్తే... చీపురుపల్లి: జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు అనుచరుడు కంచుపల్లి రమేష్ అలియాస్ అశోక్ ఎమ్మెల్యే కిమిడి మృణాళినిక క్యాంపు కార్యాలయంపై అసభ్యకరమైన పదజాలంతో ఫేస్బుక్ పోస్టింగ్ చేశాడంటూ పోలీసు శాఖ సుమోటోగా దాన్ని భావించి పోస్టు చేసిన అశోక్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకొంది. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ వర్గీయులు, మహిళలు పెద్ద ఎత్తున అర్ధరాత్రి పోలీస్‌స్షేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. న్యాయవాది పూచీకత్తుపై అర్ధరాత్రి 12 తరువాత విడుదల చేసిన పోలీసులు బుధవారం ఉదయం స్టేషన్‌కు రావాలని ఎస్ఐ కాంతికుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం అశోక్‌తో సహా పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన అశోక్‌తో పాటు జెడ్పీటీసీ వరహాలనాయుడు వర్గీయులు ఎమ్మెల్యే మృణాళిని కార్యాలయంలో పని చేసే ఉద్యోగి బొత్స గోపీనాధ్, ఆర్ఈసీఎస్ చైర్మన్ కారు డ్రైవర్ గవిడి శ్రీనివాసరావు, పిన్నింటి వివేక్, రాకేష్, రామ్స్లపై ఫిర్యాదు చేశారు.ఆ ఐదుగురు తనను సహనం కొల్పోయేలా ప్రేరేపించారని, భయపెడుతున్నారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం మరింత వివాదస్పదమైంది. హార్ట్ పేషెంట్ అని చెప్పినా.... ఫేస్బుక్లో పోస్టింగ్ వివాదాన్ని ఎదుర్కొంటున్న కంచుపల్లి రమేష్ అలియాస్ అశోక్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తనపై ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా స్టేషన్‌కు తీసుకొచ్చి కొట్టారని ఆరోపించాడు. తాను హార్ట్ పేషెంట్‌నని చెప్పినా ఎస్ఐ వినిపించుకోలేదన్నారు. ఫేస్బుక్లో తాను ఎమ్మెల్యేను ఉద్దేశించి పోస్టింగ్‌లు పెట్టలేదని చెప్పాడు. ఐదుగురు యువకులు తనను హింసిస్తున్నారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మెసేజ్‌లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు... ఫేస్బుక్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై అసభ్యకరమైన పదజాలంతో పోస్టింగ్‌లు పెట్టినందుకు కంచుపల్లి రమేష్ అలియాస్ అశోక్‌ను ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు చె ప్పారు. ఫేస్బుక్లో అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెడితే ఫిర్యాదు లేకపోయినా చర్యలు ఉంటాయన్నారు. ఆ పోస్టింగ్‌లు తానే పెట్టినట్లు అశోక్ అంగీకరించినట్లు చెప్పారు. మంగళవారం అశోక్ ఇచ్చిన ఫిర్యాదులో నేరం పట్టదగ్గ అంశాలు లేనందున విచారణకు స్వీకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. -
రేయ్.. నేను సుప్రియను మోసం చేశా!
సాక్షి, ముంబై : ‘సుప్రియా.. నీ బాయ్ ఫ్రెండ్‌తో జాగ్రత్త!’... ఈ పోస్టు గత వారం రోజులుగా ముంబై నగరంలో చక్కర్లు కొడుతోంది. తన గర్ల్ ఫ్రెండ్‌ను మోసం చేసి వేరే అమ్మాయితో అఫైర్ కొనసాగిస్తున్న ఓ వ్యక్తి బండారాన్ని బయటపెడుతూ ఓ యువతి చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. అంధేరీకి చెందిన ఐశ్వర్య శర్మ వారం రోజుల క్రితం ఓ పబ్‌కు వెళ్లింది. అక్కడ ఇద్దరు యువకులు ఆమె వెనకాలే కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ యువకుడు ‘అరేయ్.. నేను సుప్రియను బోల్తా కొట్టించి.. నిధితో నిన్న రాత్రి బయటకు వెళ్లి ఎంజాయ్ చేశాను’ అని చెప్పాడు. దానికి మరో యువకుడు ‘సూపర్ రా...సుప్రియ ఆ విషయాన్ని కనిపెట్టలేదు’ అంటూ అన్నాడు. అయితే అది విన్న ఐశ్వర్య మాత్రం సుప్రియ నిన్ను కనిపెడుతుంది అంటూ ఓ పోస్ట్ చేసింది. ‘సుప్రియా. నీ ప్రియుడి పేరు అమన్. వాడు నిన్ను మోసం చేసి నిధితో కులుకుతున్నాడు. వాడో వెధవ (బూతులు కూడా...). నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. సుప్రియా పేరుతో ఉన్న అమ్మాయిలందరికీ విజ్ఞప్తి. మీ బాయ్‌ప్రెండ్‌లలో ఎవడైనా అమన్ పేరుతో ఉంటే... వెంటనే వాడితో బ్రేకప్ చెప్పేయండి’ అంటూ సూచించింది. ముంబైలో మీకు తెలిసిన సుప్రియలందరికీ ఈ సందేశాన్ని షేర్ చెయ్యండంటూ ఐశ్వర్య కోరింది. అప్పటి నుంచి సేవ్ సుప్రియ పేరిట యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ సుప్రియ ఆచూకీ దొరికిందో లేదో తెలీటం లేదుగానీ.. పబ్లిసిటీ కోసమే ఐశ్వర్య ఈ పోస్టు చేసిందని అనుమానం వ్యక్తం చేసేవాళ్లు లేకపోలేదు. ఆ సంగతి పక్కనపెడితే... 331 షేర్లతో.. 2 వేలకు పైగా రియాక్షన్లతో ప్రస్తుతానికైతే ఈ పోస్టు దూసుకుపోతుంది. -
కాస్గంజ్ అల్లర్లు.. కలెక్టర్ పోస్టుతో ప్రకంపనలు
లక్నో : కాస్గంజ్ మత ఘర్షణలపై బరేలీ కలెక్టర్ తన ఫేస్బుక్లో చేసిన ఓ పోస్టు ప్రకంపనలు రేపుతోంది. అల్లర్లపై కలెక్టర్ ఆర్ విక్రమ్ సింగ్ ఆదివారం అల్లర్లపై ఓ సందేశం పోస్టు చేశారు. ముస్లింల ప్రాంతాల్లోకి వెళ్లి వెళ్లి పాక్ వ్యతిరేక నినాదాలు చేయాల్సిన అవసరం ఏంటన్న? ప్రశ్నను ఆయన సంధించటంతో అది కాస్త వివాదాస్పదంగా మారింది. పోస్ట్ పూర్తి సారాంశం... ‘‘ఓ కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చింది. ఘర్షణలు చెలరేగినప్పుడల్లా కొందరు చేసే పనులు విచిత్రంగా ఉంటాయి. మాట్లాడితే ఇస్లాం ప్రజల ఇళ్ల ముందుకు వెళ్లి పాక్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? వారేమైన పాకిస్థాన్ వాసులా? కాదు కదా! అని పేర్కొంటూ ఫేస్బుక్లో సుదీర్ఘమైన పోస్టు ఒకదానిని పెట్టారు. గతేడాది బరేలీలో జరిగిన ఘర్షణల ప్రస్తావన కూడా ఆయన తీసుకొచ్చారు. కొందరు కన్వరియాలు(శైవ భక్తులు) ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలోకి పాక్ వ్యతిరేకంగా వెళ్లి నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలోనే నా నివాసం కూడా ఉంది. బయటికొచ్చిన నేను వారిని అలా చేయొద్దని వారించాను. కానీ, వారు నా మాట వినలేదు. ఇంతగా మత పిచ్చి వాళ్లకు ఎందుకు? ఇది దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తాయి అంటూ పోస్ట్ చేశారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. రాజ్యాంగబద్ధమైన పదవి హోదాలో మతపరమైన వ్యాఖ్యలు చేయటాన్ని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తప్పుబడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి రాజేష్ అగర్వాల్(బరేలీ ఎమ్మెల్యే కూడా) ‘సింగ్ పోస్టు’పై స్పందించారు. ‘‘ఆయన(ఆర్వీ సింగ్) చేసిన పోస్ట్‌ను చూడలేదు. ఆర్మీలో పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. సొంత దేశానికి వ్యతిరేకంగా.. పాక్‌కు అనుకూలంగా ఆయన మాట్లాడి ఉంటాడని నేను అనుకోను’ అని మంత్రి మీడియాతో చెప్పారు. విక్రమ్ సింగ్ అధికారిక ఫేస్ బుక్‌లోని కొంత భాగం స్క్రీన్ షాట్ ఇక విమర్శలపై సింగ్ స్పందించారు.‘ఇది చాలా చిన్న విషయం. అయినా భూతద్ధంలో చూస్తున్నారు. కాస్గంజ్ ఎస్పీని బదిలీ చేశారు. నిజాయితీగా పని చేస్తున్న నాలాంటి అధికారిపై విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ అభివృద్ధికి ఆటంకాలే’అని సింగ్ చెప్పారు. గణతంత్ర్య దినోత్సవ వేడుకలో భాగంగా విద్యార్థి సంఘాలు బద్దూ నగర్లో ‘తిరంగ ర్యాలీ’ నిర్వహించగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి అది కాస్త హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో యువకులు గాయపడ్డారు. మరుసటి రోజు చెలరేగిన ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ సేవలను నిలిపవేశారు. మొత్తం 80 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరిస్థితి సర్దుమణగటంతో మంగళవారం ఉదయం నుంచి కర్ఫ్యూను సడలిస్తున్నట్లు ప్రకటించారు. -
కాంగ్రెస్ నేత సంచలన పోస్టు.. ఉద్రిక్తత
తిరువనంతపురం : కేరళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చేసిన ఫేస్బుక్ పోస్టు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కమ్యూనిస్ట్ దిగ్గజం ఏకే గోపాలన్ వైవాహిక జీవితంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీటీ బలరామ్ తన ఫేస్బుక్లో ఓ సంచలన పోస్టు చేశారు. దీంతో గోపాలన్ అనుచరులు విధ్వంసకాండకు తెగబడటంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. పలుచోట్ల కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శుక్రవారం తన ఫేస్బుక్లో బలరామ్ ఇలా పోస్టు చేశారు. ‘‘ఏకే గోపాలన్ సుశీలను వివాహం చేసుకున్నారు. పైగా అది ప్రేమ వివాహం. అయితే అప్పటికి సుశీల వయసు 12-13 ఏళ్ల మధ్య ఉంటుంది. దీనికితోడు అప్పటికే ఆయనకు మరో భార్య ఉన్నారు. ఈ లెక్కన్న ఆయన చట్టాన్ని ఉల్లంఘించటంతోపాటు.. మైనర్‌పై వేధింపులకు పాల్పడినట్లే’’.. అంటూ ఓ సుదీర్ఘమైన పోస్టును ఉంచారు. దీంతో బలరామ్‌పై సోషల్ మీడియాలో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(DYFI) కార్యకర్తలు బలరామ్ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. మద్యం బాటిళ్లను ఆఫీసుపై విసిరి తగలబెట్టేందుకు యత్నించారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేయటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ప్రస్తుతం తీర్థల నియోజకవర్గంలోకి ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘‘గోపాలన్ గొప్పతనం గురించి మాట్లాడినప్పుడు.. ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపటం నేరం ఎలా అవుతుంది?’’ అని బలరామ్ నిరసనకారులను ప్రశ్నిస్తున్నారు. అసహనంతోనే వాళ్లు ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేయటం లేదు. నిరసనకారులు మాత్రం బలరామ్ క్షమాపణలు చెప్పేదాకా వెనక్కితగ్గబోమని హెచ్చరిస్తున్నారు. -
ఫేస్బుక్లో అసభ్యకర పోస్టింగ్..
హైదరాబాద్ : దేవుళ్లను కించపరుస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూ దేవుళ్లను కించపరుస్తూ ఫేస్బుక్లో అసభ్యకరంగా పోస్టులు చేస్తుండటంపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్బుక్ లో ఈ మేరకు పోస్ట్ చేసిన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వినయ్ అనే యువకుడిని రాచకొండ సైబర్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఎమ్మెస్సీ చదువుతున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ ..!
సాక్షి,బెంగళూరు: ‘నేను ఫ్రీ బర్డ్’ అంటూ హాయ్ బెంగళూరు వార పత్రిక సంపాదకుడు రవి బెళగెరె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సహచరుడు సునీల్ హెగ్గెరహళ్లిని చంపడానికి సుపారీ ఇచ్చిన కేసులో బెయిల్ లభించిన ఆయన ఈనెల 21 నుంచి పోలీసుల సమక్షంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆరోగ్యం కొంత మెరుగు పడటంతో ఆయన శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆసుపత్రి వైద్యుల సూచనమేరకు ఆయన్ను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన ఆయన నేను ఇక ఫ్రీ బర్డ్‌ను అంటూ పోస్ట్ చేశారు. నెటిజన్లు త్వరలోనే ఈ కేసులో కూడా ఫ్రీ బర్డ్ అవుతారు అంటూ ప్రతిస్పందించారు. -
ఆంగ్ల భాష.. ఆమె పాలిట శాపం
సాక్షి, న్యూఢిల్లీ : అర్హత ఎక్కువగా ఉన్నా ఇబ్బందేనని ఇక్కడో యువతి ఉదంతం నిరూపిస్తోంది. ఇంగ్లీష్ భాషపై పట్టు ఎక్కువగా ఉండటంతో బ్రిటన్ అధికారులు ఆమెకు వీసా నిరాకరించారు. పైగా అందుకు వారు ఇచ్చిన వివరణ మరీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్‌కు చెందిన చెందిన మహిళే ఇక్కడ బాధితురాలు కావటం విశేషం. వివరాల్లోకి వెళ్లితే... మేఘాలయా.. షిల్లాంగ్‌కు చెందిన అలెగ్జాండ్రియా రిన్టౌల్ ఐఈఎల్‌టీస్ ఉత్తీర్ణత సాధించింది. యూకే వెళ్లేందుకు ఆమె వీసా కోసం దరఖాస్తు చేసుకోగా.. అందుకు ఓ చిన్న నిబంధన అడ్డు వచ్చింది. యూకే ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం.. ఎంపిక చేసిన కేంద్రాల్లో సదరు అభ్యర్థులు ఆంగ్ల భాష ప్రావీణ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆమె పరీక్షకు హాజరుకావటంతోపాటు తన ఐఈఎల్టీఎస్ సర్టిఫికెట్‌ను వారికి పంపారు. కానీ, ఆమె వీసా తిరస్కరణకు గురైంది. దిగ్భ్రాంతికి గురైన ఆమె అధికారులను వివరణ కోరగా.. వారు విస్మయం కలిగించే వివరాలను వెల్లడించారు. ఆమె కావాల్సిన దానికంటే అధిక అర్హత కలిగి ఉన్నారని చెబుతూ... సమర్పించిన పత్రాలపై అనుమానం ఉన్నట్లు వారు తెలిపారు. పైగా ఆమె జాతీయతకు భంగం కలిగించేలా I am NOT SATISFIED your nationality is that of a MAJORITY English speaking country సదరు అధికారి ఓ లైన్ ను ఉంచారు. ఆంగ్ల భాష తక్కువగా మాట్లాడే దేశంలో అంత అనర్గళంగా ఆమె మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుందని.. పైగా యూకేవీకి ఆమె పంపిన సర్టిఫికెట్ చెల్లదని బదులు పంపింది. పీవీఎస్(ప్రయారిటీ వీసా సర్వీస్)కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రింటౌల్ తన ఫేస్బుక్లో ఓ సందేశాన్ని ఉంచారు. అన్ని అర్హతలు ఉన్నా వీసా తిరస్కరణకు గురికావటం బాధించిందని.. గృహిణిగా, ఓ బిడ్డకు తల్లిగా ఆమె పడుతున్న కష్టాలు అధికారులకు ఎందుకు అర్థం కావట్లేదో తెలీట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్కాట్ లాండ్ కు చెందిన బాబీ రింటౌల్ను ప్రేమ వివాహం చేసుకున్న ఆమె.. ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అంతేకాదు యూకేలో వారు ఓ ఇల్లును కూడా కొనుక్కున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ హోటల్లో ఉంటున్న ఆమె పెరిగిపోతున్న ఖర్చులు చూసి కంగారుపడిపోతున్నారు. దయచేసి ఎవరైనా జోక్యం చేసుకోవాలంటూ ఆమె అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఫేక్ పేస్బుక్ అకౌంట్‌తో వేధింపులు
సాక్షి, విజయవాడ : తన పేరుతో ఫేక్ పేస్బుక్ అకౌంట్‌ను క్రియేట్ చేసి తనను వేధిస్తున్నాడని ఓ యువతి అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సింగ్‌నగర్‌కు చెందిన ఓ యువతి డిగ్రీ చదువుతోంది. ఆమెకు కర్నూలుకు చెందిన చంద్రశేఖర్‌తో ఆగస్టులో నిశ్చితార్థం అయ్యింది. సెప్టెంబరులో పుట్టినరోజుకు చంద్రశేఖర్ ఫోన్ కొని ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇటీవల ఆమెకు వేరే అబ్బాయితో లవ్ ఎఫైర్ ఉందని చంద్రశేఖర్‌కు తెలిసింది. అ ప్పటి నుంచి చంద్రశేఖర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో తను కొనిచ్చిన ఫోన్ ఇచ్చేయాలని కోరగా ఆమె ఫోన్ ఇచ్చేసింది. ఆ ఫోన్లోని ఫొటోలతో పేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్‌ను క్రియేట్ చేసి అభ్యంతరకరంగా పోస్టింగ్‌లు పెట్టి వేధిస్తున్నాడని బాధితురాలు చేసిన ఫిర్యాదుమేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రొఫెట్ మహ్మద్‌పై పోస్టు.. హిందూ గ్రామానికి నిప్పు
కాక్స్‌బజార్ : ప్రొఫెట్(మత ప్రభోధకుడు)పై సోషల్‌మీడియాలో అభ్యంతకర పోస్టు చేసిన వ్యక్తి గ్రామానికి దుండగుల గుంపు నిప్పు అంటించింది. ఈ ఘటన శుక్రవారం బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. హిందూ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రొఫెట్ మహ్మద్‌ను ఉద్దేశించి ఫేస్బుక్లో అభ్యంతకరంగా పోస్టు చేశాడు. ఆ పోస్టు కాస్తా వైరల్‌గా మారింది. దీంతో ఆగ్రహించిన కొందరు గుంపుగా పోస్టు చేసిన వ్యక్తి గ్రామానికి వెళ్లి ఊళ్లోని ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్ధలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో టియర్ గ్యాస్ షెల్స్, రబ్బర్ బుల్లెట్లను వినియోగించారు. అప్పటికే గ్రామంలోని 30కి పైగా ఇళ్లు కాలిబూడిదయ్యాయి. పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించడంపై ఆగ్రహించిన దాడికి పాల్పడిన గుంపులోని వ్యక్తులు రంగ్‌పూర్ - దినాజ్‌పూర్ హైవేపై రాస్తారోకోకు దిగారు. -
మంజుల ఫెయిల్యూర్ స్టోరీ.. మహేష్ కూల్ రియాక్షన్
-
మంజుల ఫెయిల్యూర్ స్టోరీ.. మహేష్ కూల్ రియాక్షన్
సాక్షి, సినిమా : సినిమాల్లోకి స్టార్ల వారసులు వరదల్లా వెల్లువెత్తుతున్న వేళ సూపర్ స్టార్ కృష్ణ తనయ మంజుల మాత్రం ఎందుకనో కెరీర్లో రాణించలేకపోయింది. నీలకంఠ షో ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో మెరిశారే తప్ప పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే తాను ఎందుకు ఫెయిల్ కావాల్సి వచ్చిందో చెబుతూ తన పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫేస్బుక్ లో ఓ వీడియోను పోస్ట్ షేర్ చేశారు. ఫాలో యువర్ హార్ట్ అంటే మనస్సుకు నచ్చిందే చేయండి అంటూ మంజుల వీడియో ద్వారా తన భావాలను పంచుకున్నారు. ''మొదటినుండీ నటించాలనే అనుకున్నాను. కాని కుదర్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అయ్యాను. నేను నటించి ఫెయిల్ అవ్వడం వేరు. కాని అసలు నాకు అవకాశమే రాలేదు. దీనంతటికి కారణం మా ఫ్యామిలీ.. ఫ్యాన్స్ అనిపించింది.(అప్పట్లో కృష్ణ అభిమానులే ఆమెను హీరోయిన్ కాకుండా అడ్డుకున్నారనే టాక్ వినిపించింది). కానీ ఆలోచిస్తే దీనంతటికీ బాధ్యురాలిని నేనేనని ఇప్పుడు అర్థమౌతోంది. సమాజం కోసం కాదు నా కోసం నేను ఆలోచించటం మొదలుపెట్టా'' అంటూ మంజుల వివరించారు. ''ఆ తరువాత నాకు నచ్చింది నేను చేయడం మొదలెట్టాను. ఇప్పుడు నా హృదయాన్ని ఫాలో అవుతున్నాను. హ్యాపీగా ఉన్నాను. గమ్యం ముఖ్యంకాదు.. ప్రయాణమే ముఖ్యం. మనసుకు నచ్చింది చేస్తే ఏదైనా సాధించొచ్చు'' అంటూ ముగించింది. ఇక సోదరికి విషెస్ చెబుతూ ఆ వీడియోను సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. ఆలోచన అద్భుతంగా ఉందంటూ సందేశం ఉంచాడు. నటి రకుల్ ప్రీత్ కూడా ఈ వీడియోను షేర్ చేయటం విశేషం. -
ఫోర్ ఇడియట్స్.. ప్రాణాలతో చెలగాటం!
క్వీన్స్ లాండ్ : ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే అటువైపుగా వెళ్లేందుకు దాదాపుగా ఎవరూ సాహసించరు. కానీ, ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఇలాంటి వెకిలి వేషాలు వేస్తే మూర్ఖులు కాక ఏమంటారు చెప్పండి. క్వీన్స్ లాండ్‌లోని పోర్ట్ డగ్లస్ మెరీనా దగ్గర రెండు వారాల క్రితం వృద్ధురాలు మొసలి బారిన పడి చనిపోయింది. ఆ సరస్సులో మొసళ్ల బారిన పడి చాలా మంది గాయపడుతున్నారని ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోకపోవటంతో ఆ ఘోరం జరిగింది. అయితే ఆ తర్వాత వాటిని పట్టుకునేందుకు అక్కడక్కడా ఉచ్చులను(బోనులను) ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 20న నలుగురు యువకులు ఆ సరస్సులోకి దిగి సుమారు గంటకు పైగా గడిపారు. అక్కడే ఉన్న ఓ బోనులో కూర్చుని ఫోటోలు దిగారు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన వాళ్లు.. ఆ ఫోటోలను తమ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వారి వేషాలపై విమర్శలు గుప్పించారు. వారు ఫోటోలు దిగిన ప్రాంతానికి 4 మీటర్ల దూరంలోనే మొసలి ఇంతకు ముందు వృద్ధురాలిని చంపటం విశేషం. ఘటనపై డగ్లస్ షైర్ మేయర్ జూలీ ల్యూ స్పందిస్తూ... వారు సరదాగా చేసిన ఆ యత్నం చాలా చెండాలంగా ఉంది. ప్రాణాలతో చెలగాటం సాహసమని వారి భావించి ఉండొచ్చు. కానీ, వారి చేసిన పని మూర్ఖపు చర్యే. వారిని వదిలే ప్రసక్తేలేదు. చర్యలు తీసుకుని తీరతాం అని అన్నారు. నిబంధనల అతిక్రమించి నీటిలో దిగి బోను దగ్గరికి వెళ్లినందుకుగానూ వారికి 15 వేల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఫోటోను ముందుగా పోస్ట్ చేసిన స్టేసీ డబ్ల్యూ క్లేటన్ అనే యువకుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇడియట్స్ ఆఫ్ ది సెంచరీ యాష్ ట్యాగ్ తో ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Srsly? The meat we put in these traps is bait. For crocodiles. Don’t swim in them! It’s stupid, and illegal. @qldpol @7NewsCairns pic.twitter.com/nQsUZwI3Wc — Steven Miles (@StevenJMiles) 23 October 2017 -
వివాదాస్పదం: కట్నం వల్ల ఏడు లాభాలు
సాక్షి, బెంగళూర్ : సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ అంశంతో ఓ పోస్ట్ తెగ చక్కర్లు కొడుతోంది. బెంగళూర్‌లోని ఓ ప్రముఖ యూనివర్సిటీ పాఠ్యాంశమంటూ ఓ వ్యాసం ఫేస్ బుక్, వాట్సాప్‌లలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఉంది ఏంటంటే.. వరకట్నం తీసుకోవటం వల్ల లాభాలు. బెంగళూరులోని ప్రముఖ విద్యాసంస్థగా గుర్తింపు పొందిన సెయింట్ జోసెఫ్ కాలేజీ పేరిట ఈ వ్యాసం విడుదల అయ్యింది. వరకట్నం తీసుకోవడం వల్ల ప్రయోజనాలు, లాభాలను అక్కడ పాఠ్యాంశంగా వల్లె వేస్తున్నారంట. సోషియాలజీ సబ్జెక్ట్ లో భాగంగా ఈ అంశాలను బోధిస్తున్నారని చెబుతున్నారు. వరకట్నం తీసుకోవడం వల్ల ఉండే 7 ఉపయోగాలను పాఠ్యాంశంలో పేర్కొన్నారు. - ఎక్కువ కట్నం ఇవ్వడం వల్ల అందవిహీనంగా ఉన్న అమ్మాయిల పెళ్లి చేయవచ్చు - అందమైన అబ్బాయిలను ఎక్కువ కట్నం ఆశజూపి పెళ్లికి ఒప్పించవచ్చు - కట్నం వల్ల కొత్తగా పెళ్లైన వాళ్లు కలిసి జీవించడానికి కొంత ఆర్థిక సాయంగా ఉంటుంది - మెరిట్ విద్యార్థులు ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది - ఎక్కువ కట్నం తెచ్చిన అమ్మాయిని అత్తారింట్లో ఎక్కువ ప్రేమగా చూస్తారు - ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేసిన వారి స్థాయిని సమాజం గుర్తిస్తుంది - అమ్మాయికి తండ్రి ఆస్తిలో భాగం ఇవ్వడం కంటే.. కట్నం ఇచ్చి పంపించేస్తేనే ఉపయోగం ఉంది ఇలా ఆయా అంశాల గురించి అందులో కూలంకశంగా పేర్కొన్నారు. అయితే ఈ పాఠ్యాంశం వ్యవహారంతో తమకు సంబంధం లేదన్న యూనివర్సిటీ అధికారులు.. ఉతన్నస్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు. తమ కళాశాల ఇలాంటి వాటిని ప్రోత్సహించదని సెయింట్ జోసెఫ్ కళాశాల పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ కిరణ్ జీవన్ చెప్పగా, సోషియాలజీ విభాగం హెడ్ డాక్టర్ బెరిన్ కూడా ఆ ఆరోపణలను ఖండించారు. 1961 నుంచి భారత దేశంలో వరకట్న నిషేధం అమలులోకి వచ్చింది. అయినప్పటికీ ఇంకా అది ఓ దురాచారంగానే కొనసాగుతుండగా.. ప్రభుత్వాలు కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. -
ఈ ప్రశ్నలకే జైల్లో పెడతారా?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘గంగా నదికి ప్రాణి హోదా కల్పిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎవరైనా ఆ నదిలో మునిగిపోయి మరణిస్తే నదిపై క్రిమినల్ కేసులు దాఖలు చేస్తారా? అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పడం ఒట్టి జిమ్మిక్కు మాత్రమే. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్లీ మందిరం నిర్మాణ అంశాన్ని ముందుకు తీసుకొస్తారు. ఈ హామీ కూడా పాకిస్తాన్‌కు ముల్లాలను పంపిస్తామని చెప్పడం లాంటిదే. హజ్ యాత్ర కోసం ముస్లింలకు ఎయిర్ ఇండియాలో ఇస్తున్న సబ్సిడీలను కేంద్ర ప్రభుత్వం నిలిపి వేస్తుందా?’ ఈ మూడు ప్రశ్నల్లో.... ఓ మనిషిని 42 రోజుల పాటు జైల్లో పెట్టేంత నేరం దాగిందా? ఫేస్బుక్లో ఈ మూడు ప్రశ్నలను షేర్ చేసినందుకు ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్బాద్కు చెందిన జకీర్ అలీ త్యాగిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం తెల్సిందే. వాస్తవానికి త్యాగి కూడా తనంతట తాను ఈ ప్రశ్నలు వేయలేదు. ఇతరులు వేసిన ప్రశ్నలను షేర్ చేసినందుకే అయన్ని అరెస్ట్ చేసి కేసు పెట్టారు. ఏప్రిల్ రెండవ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు 42 రోజుల జైలు శిక్ష అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసును ఆయన హైకోర్టులో అప్పీల్ చేస్తానని చెప్పారు. అసలు ఏం జరిగిందో ఆయన మాటల్లోనే....‘నేను ముజాఫర్‌నగర్‌లో మా సమీప బంధువు వారిస్ ఖాన్‌తో ఉంటున్నాను. ఏప్రిల్ 2వ తేదీన ఏదోపనిమీద బయటకు వెళ్లిన వాడిని రాత్రి 8.45 గంటలకు ఇంటికొచ్చాను. అప్పటికే ఇంట్లో ఇద్దరు పోలీసులు ఉన్నారు. ఖాన్ విజ్ఞప్తిపై వారికి మంచినీళ్లు ఇచ్చాను. వారున్న గది నుంచి మరో గదిలోకి వెళుతుండగా ఓ పోలీసు వచ్చి నా చేతిని పట్టుకున్నారు. ఫేసుబుక్ పోస్టింగ్‌లకు సంబంధించి విచారించాలి, పోలీసు స్టేషన్‌కు రమ్మని పిలిచారు. విషయం ఏమిటన్ ఖాన్ ప్రశ్నించగా, చిన్న విషయమే గంటలో వదిలేస్తామని చెప్పారు. నన్ను కొత్వాలి నగర్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌నే విమర్శించేంత వాడివారా? అంటూ సివిల్ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి పోలీసు స్టేషన్ సెల్లో నన్ను చితక్కొట్టారు. ఆయనెవరో ఇప్పటికీ నాకు తెలియదు. ఎవరిని అడిగినా ఆయనెవరో చెప్పలేదు. పోలీసులు కూడా ఆదిత్యనాథ్‌ను విమర్శించినందుకే ఉన్నతాధికారులు ఆదేశం మేరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అయితే నేను ఏం విమర్శించానో అడగలేదు, చెప్పలేదు. ఎఫ్ఐఆర్లో మాత్రం నేను షేర్ చేసిన మూడు ప్రశ్నలను మాత్రమే పొందుపర్చారు. ఆ మరుసటి రోజున కోర్టుకు తీసుకెళ్లారు. జడ్జీ రాలేదన్న కారణంగా జైలుకు పంపించారు. వారం రోజుల తర్వాత మళ్లీ కోర్టులో హాజరుపర్చారు. ఎలాంటి విచారణ జరుగకుండానే కేసు వాయిదా పడడంతో మళ్లీ జైలుకు పంపించారు. 42 రోజుల తర్వాత మే 13వ తేదీన బెయిల్ మంజూరైంది. ఇంటికి తిరిగి వెళ్లాను. నేను షేర్ చేసిన ప్రశ్నల్లో తప్పేముందో, నాపై కేసు ఎందుకు పెట్టారో, ఎందుకు జైలుకు పంపించారో! నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు’ అని త్యాగి ఢిల్లీలోని ‘ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియాలో’ తన గోడును జర్నలిస్టులకు వినిపించారు. దేశంలోని దళితులు, మైనారిటీల పక్షాన న్యాయం కోసం పోరాడే ‘భీమ్ ఆర్మీ డిఫెన్స్ కమిటీ’ త్యాగిని యూపీ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ కమిటీ త్యాగి కేసును టేకప్ చేసింది. కాలిన్ గాన్సాల్వ్స్ లాంటి ప్రముఖ న్యాయవాదులు ఈ కమిటీలో ఉన్నారు. -
మగాళ్లు ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. కానీ: రేణు
సాక్షి, హైదరాబాద్ : నటి, దర్శకురాలు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ జరిగిన ప్రచారంపై ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన పిల్లల్ని చూసుకోవడానికి ఓ వ్యక్తి తోడుంటే బాగుంటుందని ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. రెండో పెళ్లికి సిద్ధమయ్యే ఆమె ఆ వ్యాఖ్యలు చేశారని భావించిన పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ కామెంట్లు చేశారు. మరో పెళ్లి చేసుకుంటే మీ గౌరవం తగ్గుతుందని కొందరు, మిమ్మల్ని అసహ్యించుకుంటామని మరికొందరు కామెంట్లు చేయడంపై రేణు వాటిని స్క్రీన్ షాట్లు తీసి తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. 'ఈ పోస్ట్ కేవలం నన్ను మాత్రమే ఉద్దేశించింది కాదు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం. ఇలాంటి ఆలోచన తీరున్న మగవాళ్ల మధ్య ఉన్నామని ఆందోళన చెందాల్సి వస్తుంది. సమాజంలో ఓ వైపు మహిళా సమానత, ఆడపిల్లలు శక్తి స్వరూపం, అత్యాచారాల నుంచి మహిళలను కాపాడాలి. వారి భద్రతకు చర్యలు తీసుకోవాలి అంటుంటాం. మరో వైపు ఏడేళ్లు ఒంటరిగా ఉన్న నేను ఇప్పుడు ఒకరి తోడు అవసరమని మాట్లాడితే అసహ్యించుకుంటున్నట్లు సందేశాలు పంపుతున్నారు. మన దేశంలో ఓ మగాడు ఏమైనా చేయొచ్చు. ఎన్నిసార్లయినా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఓ అమ్మాయి మరో బంధం గురించి ఆలోచించడం కూడా తప్పా? జీవితాంతం తప్పు చేశానన్న భావనతో ఏ తోడు లేకుండా బతకాలా? ఇవాళ నేను దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. మన దేశంలో అమ్మాయిల భవిష్యత్తు మెరుగ్గా ఉండాలంటే, తల్లులు వాళ్ల కొడుకులను పద్ధతిగా పెంచాలి. అప్పుడైనా మగవాళ్ల ఆలోచనా విధానంలో మార్పు వస్తుందేమో' అంటూ రేణు దేశాయ్ తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆగిన పెళ్లి.. ప్రధాని హర్షం!
► పెళ్లికి అడ్డంకిగా మారిన ఫేస్బుక్ పోస్ట్ సిడ్నీ: సోషల్ మీడియాలో తాను చేసిన ఓ పోస్ట్ ఏకంగా తన పెళ్లినే ఆపేస్తుందని ఆ యువతి భావించలేదు. ఆమె ఫేస్బుక్ పోస్టును సాకుగా చూపిస్తూ చర్చి నిర్వాహకులు మరికాసేపట్లో జరగబోయే యువతి వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో చోటుచేసుకుంది. ఇంతకు యువతి చేసిన పోస్ట్ ఏంటంటారా.. స్వలింగ సంపర్క వివాహాలకు మద్ధతు తెలుపుతూ తన అభిప్రాయాన్ని ఫేస్బుక్లో షేర్ చేయడమే. విక్టోరియాలోని బల్లారట్లో ఓ చర్చిలో యువతి, తన ప్రియుడిని వివాహం చేసుకోవడానికి వచ్చింది. చర్చి పెద్దలు వారి వివరాలు కనుక్కున్నారు. మరికాసేపట్లో వివాహం జరగనుండగా స్వలింగ సంప్కర వివాహానికి (గే మ్యారేజ్) మద్ధతుగా వధువు చేసిన ఫేస్బుక్ పోస్ట్ గురించి తెలుసుకున్న మత పెద్దలు కార్యక్రమాన్ని రద్దుచేశారు. వివాహాలకు సంబంధించిన చట్టాలలో మార్పులు తీసుకురావాలని తన పోస్ట్‌లో ఆమె పేర్కొంది. ఇలాంటి తరహా వివాహాలకు (గే, లెస్బియన్ వివాహాలు) ఇక్కడ చట్టబద్ధత లేదని చర్చి మినిస్టర్ ఎబెనజర్ సెయింట్ జాన్ వెల్లడించారు. వివాదానికి కారణమైన యువతి ఎఫ్బీ పోస్ట్‌పై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ స్పందించారు. పెళ్లిని నిలిపివేస్తూ చర్చి మినిస్టర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరం స్వాగతించాలి. ఇంకా చెప్పాలంటే చర్చికి ఉన్న ప్రత్యేక అధికారాల కారణంగా వారు ఆ వధువు పెళ్లిని నిలిపివేశారని చెప్పారు. క్యాథలిక్ చర్చిలో అయితే రెండోపెళ్లి చేసుకునేందుకు వచ్చిన వారి వివాహాన్ని సమ్మతించరని వెల్లడించారు. -
ఫేస్బుక్ పోస్టింగ్‌తో ఇరువర్గాల మధ్య ఘర్షణ
సాక్షి, ఆసిఫాబాద్: ఒక వర్గానికి చెందిన యువకుడు మరో వర్గం మనోభావాలు దెబ్బతినే రీతిలో ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఫేస్బుక్ పోస్టింగ్ విషయం తెలిసి ఓ వర్గం యువకులు కాగజ్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీచౌక్ వద్ద శుక్రవారం రాత్రి ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు. దీంతో వెంటనే రూరల్ ఎస్ఐ రాజేశ్, దహెగాం ఎస్ఐ రమేశ్‌లు వచ్చి యువకులను అక్కడ నుంచి పంపించేశారు. యువకులు ర్యాలీగా వెళ్తుం డగా మరో వర్గం యువకులు వీరిపై రాళ్లు రువ్వారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చెలరేగింది. ఇరువర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఎస్ఐ రాజేశ్ తలకు గాయాలయ్యా యి. ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, డీఎస్పీ హబీబ్‌ఖాన్‌లు సీఐ వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు దారి తీసిన సంఘటనలపై ఆయన ఆరా తీశారు. -
కొత్త కుబేరుడు బెజోస్ పడిపోయారు
న్యూడిల్లీ : ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను దాటేసి, ప్రపంచ కుబేరుడిగా అగ్రస్థానానికి ఎదిగిన అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ పడిపోయారు. ప్రపంచ కుబేరుడిగా నెంబర్ 1 టైటిల్‌ను దక్కించుకుని, వెంటనే దాన్ని కోల్పోయారు. అమెజాన్ శుక్రవారం ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాలు భారీగా దెబ్బకొట్టడంతో, ఆయనకి ఈ పరిస్థితి ఎదురైంది. ఫలితాల్లో కంపెనీ లాభాలు 77 శాతం మేర పడిపోవడంతో, షేర్లు కూడా ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో బెజోస్ సంపద 6 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది. అమెజాన్‌లో బెజోస్‌కు 16 శాతం మేర అంటే 80 మిలియన్ షేర్లున్నాయి. గురువారం మార్కెట్ ప్రారంభంలో అమెజాన్ షేర్లు దూసుకుపోవడంతో బెజోస్, బిల్‌గేట్స్‌ను దాటేసి, ప్రపంచ కుబేరుడిగా ఎదిగారు. కానీ నేటి ట్రేడింగ్‌లో షేర్లు అతలాకుతలం అవడంతో, ఆయన కూడా ఆ టైటిల్‌ను వదులుకోవాల్సి వచ్చింది. బెజెస్ కొన్ని గంటల్లోనే నెంబర్ 2 స్పాట్‌కు పడిపోవడంతో, పుణేకు చెందిన ఫెబిన్ బెంజమిన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ ఫన్నీ పోస్టు పెట్టాడు. ఆ పోస్టుకు విపరీతమైన లైక్స్, షేర్ల వెల్లువ కొనసాగుతోంది. '' హయ్ అమెజాన్, ఒక ప్రొడక్ట్‌ను నేను ఆర్డర్ చేశాను. వెంటనే జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడిగా నిలిచినట్టు వార్తవచ్చింది. కొంత సమయం తర్వాత నా ఆలోచన మారి, ఆర్డర్‌ను క్యాన్సిల్ చేశాను. అంతే వెంటనే జెఫ్ బెజోస్ మళ్లీ రెండో స్థానానికి పడిపోయినట్టు వార్త వచ్చింది. ఒక్కసారి చెక్ చేస్తారా? నా ఆర్డర్ క్యాన్సిలేషన్ వల్లే ఇదంతా జరిగిందని?'' అని పోస్టు చేశాడు. అంతే ఈ పోస్టుకు ఒక్కసారిగా వైరల్ అయింది. 3వేలకు పైగా షేర్లు వచ్చాయి. కానీ తాను 1000కి పైగా లైక్స్ వస్తాయని ఊహించలేదని ఫెబిన్ బెజామిన్ చెబుతున్నాడు. తన పోస్టుకు 4వేలకు పైగా కామెంట్లను తాకుతుందని ఆశిస్తున్నట్టు తెలిపాడు. అమెజాన్ నుంచి ఇప్పుడే తాను విండోస్ 10 కొన్నానని, ప్రస్తుతం ఇక ఎవరు ధనికవంతులవుతారో ఆ దేవుడికి తెలుసని ఫేస్బుక్ యూజర్ చెప్పాడు. -
పూరి జగన్నాథ్ అమాయక చక్రవర్తి!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు కొనసాగుతోంది. సినిమా పరిశ్రమ నుంచి దర్శకుడు పూరి జగన్నాథ్ సిట్ ఎదుట ముందుగా హాజరయ్యారు. దాదాపు 10 గంటలపైగా ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయనపై మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. వీటిపై వివరణ ఇస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తర్వాత రోజు ‘సాక్షి’ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా ఆయన తన అధికార పేస్బుక్ పేజీలో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. ఎవరో రాసిన దాన్ని ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. పూరి జగన్నాథ్ పోస్ట్ యథాతథంగా... పూరి చేసిన పాపం ఏంటి? రాజకీయ నాయకుడిలా అదిచేస్తాం ఇది ఇస్తాం...అని మభ్యపెట్టి గెలిచాక మాటమార్చాడా? మీ నోటికాడ కూడు లాగేసుకొని మీ ఉసురు పోసుకున్నాడా? లేదే. 17యేళ్ళ క్రింద ఇండస్ట్రీకి వచ్చాడు. గాడ్ ఫాదర్ లేకుండా ఇంతింతై వటుడింతై అన్న చందాన కష్టపడి తానెదుగుతూ తనతో వున్న వారిని ఎదగనిచ్చాడు, భవిష్యత్తునిచ్చాడు. అతనికి తెలిసిందల్లా ఒకటే ప్రేక్షకుడు 100రూపాయలు పెట్టి టికెట్ కొని, ఓ 3గంటలు తన విలువైన సమయాన్ని సినిమా చూడటం కోసం వెచ్చిస్తే... ఎలా ఆ ప్రేక్షకున్ని సినిమా చూస్తున్నంత సేపు తనే హీరో అయితే "అచ్చం ఇలాగే డైలాగులు చెప్తా, ఇలాగే విలన్లని ఇరగ్గొడుతా, హీరోయిన్స్ తోడాన్సులు చేస్తా"అని తన కష్టాన్ని మరిచిపోయి లీనమయ్యేలా సినిమాలు తీయటం తెలుసు. పూరి straight forwardగా వుంటాడు.అప్పటికీ ఇప్పటికీ అతనికి తెలియంది ఒకటే ఒకరికి భజన చేయటం,కొమ్ము కాయడం. బుల్లెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తాడు,సందేశాలు సమోసాలు అని సినిమా లో చెబితే ఎవ్వరూ వినరంటాడు. తను చేసే పనికి వందకి వంద శాతం న్యాయం చేశాడు.హిట్టు ఫట్టుతో సంభంధం లేదు.కాలంతో కలిసి ముందుకెళ్లాలనే రమణ మహర్షి సూక్తిని బాగా వంట పట్టించుకున్నాడు కాబట్టే మధ్యలో ఒకసారి నమ్మిన వాళ్లే మోసం చేస్తే.... మరేం పర్లేదు అన్నట్లుగా నష్టాల్ని, కష్టాల్ని ఎంతో ఇష్టంగా చిరునవ్వుతో స్వీకరించాడు. అందుకే కాబోలు పూరి తీసిన టెంపర్ సినిమా బిగినింగ్ లోనే "జీవితం ఎవ్వడ్నీ వదలదు అందరి సరదా తీర్చేస్తది" అన్న డైలాగ్ రాసి తనపై తనే సెటైర్ వేసుకున్న అమాయక చక్రవర్తి. బాణం బలంగా ముందుకు దూసుకెళ్లాలంటే వెనక్కే లాగాలి. సరిగ్గా అలాగే మండే సూర్యుడిలా పైకిలేచాడు...మళ్ళీ తెలివిగా సినిమాలు చేసి నిలబడ్డాడు.తనెంత మొండోడు అంటే ఒక్కసారి కమిటైతే తనమాట తనే వినడు. అందుకే ఎన్ని సమస్యలు రౌండప్ చేసి కన్ప్యూజ్ చేసినా తనేం చేయాలో తెలిసిన పిచ్చ క్లారిటీ వున్నోడు. అందుకే i love india i hate indians అంటూ మనకు పట్టిన బూజును దులపడానికి ఫిక్సైయ్యాడు. వినడు పూరీ ఎవరి మాటా వినడు. దర్శకుడంటే పూరిలా వుండాలి మనం కూడా వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయి దర్శకుడు అవ్వాలి అని పల్లెటూళ్లో వున్న కుర్రాళ్ళు సైతం కలలుగనే రేంజికి ఎదిగాడు. ప్రతి హీరో హీరోయిన్ ఆమాటకొస్తే ప్రతి ఆర్టిస్టు ఒక్కసారైనా పూరీ డైరెక్షన్ లో సినిమా చేయాలి అని టెంప్ట్ అయ్యేంతలా ఎదిగాడు. చరిత్రలో గొప్పోళ్ళకి తప్పలేదు అవమానాలు, నీలాపనిందలు. సరిగ్గా అదే ఇప్పుడు మన పూరీజగన్నాథ్ విషయంలో జరగబోతున్నట్లుంది! అయినా... ఏ రంగంలో లేవా బొక్కలు? ఇప్పుడు కోడై కూస్తున్న మీడియా వాళ్లేమైనా శ్రీరామచంద్రులా? పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదని అనే సామెతలా వుంది మీడియావాళ్ల యవ్వారం. కక్ష కట్టి మరీ రుద్దుతున్నారు. పూరీ అదనీ ఇదనీ చివరికి ప్రపంచాన్నే ఏదో చేయబోతున్నాడన్న ఒక భ్రమని అపోహని క్రియేట్ చేస్తున్నారు. జనాలు ఇదే నిజమని నమ్మేంతగా tvల్లో పొద్దు పొడిచింది మొదలు పొద్దుపోయేదకా పూరీ అండ్ కోని మర్డర్ చేసిన వాళ్ళుగా హైలెట్ చేసి చూపిస్తుండటంతో ఏ పాపం తెలియని వాళ్ల తల్లీతండ్రీ, భార్య పిల్లలు, అన్నాతమ్ముళ్లు అక్కాచెల్లెళ్లూ బంధుమిత్రులు ఎంతటి మనోవేదనని అనుభవిస్తున్నారో TRP రేటింగ్స్ కోసం కక్కుర్తి పడే మీడియా కి అది అనవసరం. సమాజంలో ఎన్ని సమస్యలు లేవు! రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, సంక్షేమ పథకాల్లో అవకతవకలు, మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కల్తీ అవుతూ మనిషి జీవితాల్ని సర్వనాశనం చేసే కుట్రలు, భూకబ్జాలు...ఇలా ఎన్నిలేవని! కానీ మీడియా నైతికవిలువలకి పాతరేసి మరీ అబద్దాల్ని నిజాలుగా నమ్మించాలని కంకణం కట్టుకొని శక్తివంచన లేకుండా ఈ డ్రగ్స్ గురించే ప్రచారం చేస్తుంది. ఇది న్యాయమా? పూరీకూడా మనలాగా సగటు మనిషే. తనకి బాధలుంటాయ్.. సంతోషాలుంటాయ్. బాదల్ని తగ్గించు కోవాలని వాటి నుంచి బయట పడాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఒత్తిడి తగ్గించుకునే క్రమంలో ఒక్కొక్కరు వాళ్లకు నచ్చినవి తీసుకుంటూ రిలాక్స్ అవుతుంటారు. అయినా, భూమి మీదున్న ప్రతోడు మనిషే, దేవుడు కాదు. మనిషన్నాక కొన్ని బలహీనతలు కూడా వుంటాయి. ఇందులో ఆశ్ఛర్య పోవాల్సింది ఏంలేదు. దెబ్బ తగిలినోడికే తెలుస్తుంది దాని నొప్పి. కొంతమందిని నమ్మినందుకు మోసం చేసి కింగ్ మేకర్ని అప్పులపాల్జేశారు. ఆ అప్పులు తీర్చడంకోసం కష్టపడి సంపాదించుకున్న కార్లూ, బంగ్లాలు అమ్ముకున్నోడికి ఇంకెంత నొప్పుండాలి. చీకటవ్వడమే ఆలస్యం, పబ్బుల్లో బార్లలో పీకలదాకా తాగి రోడ్ల మీద యాక్సిడెంట్స్ చేసే ఘనులు ఎంతమందో. చిన్న చిన్న ఓటమిలకే, మనస్పర్థలకే సూసైడ్ లు చేసుకునే పిరికివాళ్ళ కన్నా పూరీ చేశాడని చెబుతున్నది నీచమైందా? కాదు. కాబోదు. ఒకవేళ పూరీ మీడియాలో వస్తున్నట్లుగా డ్రగ్స్ తీసుకొని వుంటే అది తనకి నష్టం చేసేదే కానీ పక్కోడికి ఇసుమంతైనా హాని కలిగించేది కాదు. విధి రాతను తప్పించుకోవటం ఎవరివల్లా కాదు. కాబట్టి మీడియా సంయమనం పాటించాలి. రాబోయే కాలమే నిజాల్ని బయటపెడుతుంది. అప్పటిదాకా ఇంకొకరి మనసు గాయం చేయొద్దు. -
దుమారం రేపిన ఫొటో
న్యూఢిల్లీ: బీజేపీ నాయకురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోపై దుమారం రేగింది. పశ్చిమ బెంగాల్లో హిందువుల పట్ల తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా హర్యానా బీజేపీ నాయకురాలు విజేత మాలిక్ తన ఫేజ్‌బుక్ పేజీలో ఫొటో వివాదానికి కారణమైంది. భోజ్‌పురి సినిమా ‘ఔరత్ ఖిలోనా నహీ’లోని ఒక ఫోటోను ఫేస్బుక్లో షేర్ చేశారు. అందరూ చూస్తుండగా నడిరోడ్డులో ఒక రాజకీయ నాయకుడు మహిళ చీర లాగుతున్న ఫొటో పోస్ట్ చేసి.. బెంగాల్లో హిందువుల పరిస్థితి దారుణంగా ఉందని కామెంట్ పెట్టారు. హిందువులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఫొటోలో చూపినట్టుగా హిందువులను బహిరంగంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను ఎందుకు వెనక్కు ఇచ్చేయడం లేదని ప్రశ్నించారు. హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల మమతా బెనర్జీ సర్కారు ఉదాసీన వైఖరి చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను చిన్నచూపు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. అభ్యంతకర ఫొటో పోస్ట్ చేసిన విజేత మాలిక్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె పెట్టిన ఫొటో మహిళలను కించేపరిచేలా ఉందని పేర్కొన్నారు. హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్న మాలిక్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ స్పందించలేదు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి నటించిన సినిమాలోని ఫొటోనే మాలిక్ పోస్ట్ చేయడం కొసమెరుపు. -
ఐవైఆర్ పోస్టింగ్‌లు... షేరింగ్‌లు
జగన్నాథ రథచక్రం పేరుతో మే 12న ఫేస్బుక్లో అకౌంట్ పబ్లిష్ అయిన దాన్ని ఐవైఆర్ కృష్ణారావు షేర్ చేశారు. అందులో ఏముందంటే... ‘‘కమలనాథులందు కమ్మనాథులు వేరయా విశ్వదాభిరామ వినుర వేమా!!! జగన్‌ను ఎలా కలుస్తాడు అని టీడీపీ వాళ్లు పరోక్షంగా ప్రధాని మోదీని తిడుతుంటే ఎక్కడున్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభపాటి హరిబాబు చౌదరి, బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ చౌదరి, వెంకయ్యనాయుడు? పాచిపోయిన లడ్డూలు ఇస్తావా అని వెంకయ్యనాయుడిని అంటే రాష్ట్ర బీజేపీ అంతా పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడింది. మరి వెంకయ్య పాటి విలువ లేదా మోదీకి? అందుకే అంటారు బీజేపీ అంటే ‘బాబు జేబు పార్టీ’గా మార్చేశాడు వెంకయ్య నాయుడు అని’’ తెలుగు సినిమాల విషయంలో ప్రభుత్వ తీరుపై కృష్ణారావు ఫేస్బుక్లో ఏప్రిల్ 30న సొంతంగా ఒక పోస్ట్ పెట్టారు. ఇంగ్లీషులో ఉన్న ఆ పోస్ట్ సారాంశం ఏమిటంటే... కొన్ని నెలల క్రితం విడుదలైన గౌతమీపుత్ర శాతకర్ణి, ఇప్పుడు విడుదలైన బాహుబలి–2 సినిమాలు కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కొన్ని ఎంపిక చేసిన చిత్రాలపై ప్రభుత్వాలు ఏ విధంగా పక్షపాతం చూపిస్తున్నాయో తెలుస్తోంది. ఏ కారణాలతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారో ఎవరికీ తెలియదు. ఆ చిత్రంలో చూపించింది వాస్తవమేనా? అంటే కాదు. మరి ఏ లెక్కన పన్ను మినహాయింపు ఇచ్చారు. చరిత్రక వాస్తవాలను వక్రీకరించి చూపించిన వారిని వాస్తవంగా శిక్షించాలి. కాని దీనికి భిన్నంగా ప్రభుత్వం వారికి రివార్డులను ఇచ్చింది. దీనిపై కోర్టులో కేసు కూడా నమోదయ్యింది. ఇప్పుడు బాహుబలి–2 వంతు. టికెట్ల ధరలను పెంచు కోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందని ఆ నిర్మాతకు ముందే తెలుసా? ఇది అందరికీ వర్తింపజేస్తే రిస్క్ చేసి మరీ భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకొస్తారు. అలా కాకుండా ఈ ధరల పెంపు కేవలం కొందరికే పరిమితం చేస్తే సినిమాటోగ్రఫీ చట్టాన్ని పరిహాసం చేయడటమే. -
1000 లైక్స్ కొట్టండి.. లేదంటే కింద పడేస్తా
ఫేస్ బుక్ లో లైక్స్ కోసం ఎంత వికృత చేష్టలకైనా పాల్పడుతున్నారు కొందరు. ఓ తండ్రైతే ఏకంగా తను జన్మనిచ్చిన బాబునే ఈ లైక్స్ కోసం ప్రమాదంలోకి నెట్టేయాలని చూశాడు. చివరకు తానే వెళ్లి జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. అల్జెరియాలో ఓ తండ్రి తన బాబును 15వ ప్లోర్ విండ్ నుంచి కిందకి పడేయబోతున్నట్టు ఫోటో తీశాడు. ఆ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఆ పోస్టుకు 1000 లైక్స్ ఇవ్వాలని, లేదంటే అలానే ఆ బేబిని కిందకి పడేస్తానంటూ దారుణమైన క్యాప్షన్ పెట్టాడు. ఫేస్ బుక్ లో ఈ పోస్టు పెట్టిన వెంటనే అతనిపై నెటిజన్లు మండిపడ్డారు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలని సోషల్ మీడియా యూజర్లు డిమాండ్ చేశారు. ఆదివారం పోలీసులు అతన్ని అరెస్టు చేసి, అల్జెరియా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. దీనిపై సీరియస్ గా స్పందించిన కోర్టు వెంటనే అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని ఏఐ అరేబియా న్యూస్ సైట్ రిపోర్టుచేసింది.. -
సమాధిలో మొదటిరోజు ఏమవుతుందో...!
‘‘ఒక్కసారి ఊహించండి... సమాధిలో మీరు, కటిక చీకటిలో ఒంటరిగా. ఓ క్షణమాగి... ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా... సమాధిలో తొలిరాత్రి నాకేమవుతుందని? అంతిమయాత్ర కోసం మీ పార్థివదేహానికి స్నానం చేయిస్తున్న క్షణాన్ని ఊహించుకోండి. కుటుంబీకులు రోదిస్తుండగా... జనం మీ పార్థివదేహాన్ని మోస్తున్న రోజును ఊహించుకోండి. మిమ్మల్ని ఖననం చేస్తున్న క్షణాన్ని ఊహించండి’’ – 2013 జనవరి 18న సబ్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్ అహ్మద్ దార్ పెట్టిన ఫేస్బుక్ పోస్టు ఇది. కల్లోల కశ్మీరంలో శాంతి నెలకొనాలని ఆశించిన ఫిరోజ్ మనోనేత్రం మరణాన్ని ముందే చూసిందేమో. శుక్రవారం లష్కరే మిలిటెంట్లు పోలీసులపై దాడిచేసి ఆరుగురిని చంపేశారు. ఇందులో 32 ఏళ్ల ఫిరోజ్ అహ్మద్ దార్ ఒకరు. ‘‘ఓ దేవుడా...! ప్రశాంత కశ్మీర్‌ను చూసే రోజు ఎప్పుడొస్తుంది’’ – మార్చి 8, 2013న ఫిరోజ్ పెట్టిన మరో పోస్టు – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘తొలిరాత్రి సమాధిలో నాకేమవుతుంది?’
‘సమాధి లోపల ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. భూమి లోపల.. చీకటిలో ఒక్కడే ఉండటం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి’... ఇది తన మరణాన్ని ముందే ఊహిస్తూ ఫిరోజ్ అహ్మద్ రాసిన ఫేస్బుక్ పోస్టు. 32 ఏళ్ల ఫిరోజ్ అహ్మద్ దార్ జమ్మూకశ్మీర్ పోలీసుశాఖలో ఎస్సైగా పనిచేస్తున్నాడు. శుక్రవారం కిరాతక లష్కరే తోయిబా ఉగ్రమూక జరిపిన ఉగ్రవాద దాడిలో చనిపోయిన ఆరుగురు పోలీసుల్లో ఫిరోజ్ అహ్మద్ దార్ ఒక్కరు. ఆయనకు కుటుంబసభ్యులు, పోలీసుశాఖలోని సహోద్యోగులు శుక్రవారం రాత్రి కన్నీటి వీడ్కోలు పలికారు. పుల్వామా జిల్లాలోని డొగ్రిపూర గ్రామంలో ఉన్న తన పూర్వీకుల శ్మశానంలో ఆయనను ఖననం చేశారు. ఈ నేపథ్యంలో 2013 జనవరి 18న అహ్మద్ దార్ రాసిన ఫేస్బుక్ పోస్టు ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది. కలిచివేస్తోంది. ‘ మీరు ఎప్పుడైనా ఒక్కక్షణం ఆగి.. తొలిరాత్రి సమాధిలో ఉన్న మీకేం అవుతుందో.. మిమ్మల్ని మీరు అడిగిచూశారా? మీ శరీరాన్ని శుభ్రంచేసి.. మీ సమాధిని సిద్ధం చేసే క్షణాల గురించి ఆలోచించండి. మిమ్మల్ని ప్రజలు మీ సమాధుల వద్దకు మోసుకెళ్లే రోజు గురించి... మీ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యే రోజు గురించి ఆలోచించండి. మిమ్మల్ని మీ సమాధిలో పూడ్చిపెట్టే క్షణం గురించి ఆలోచించండి’ అని అహ్మాద్ దార్ రాశారు. తొలిరాత్రి సమాధిలో గడిపిన తమ హీరోకు డొగ్రీపూర ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడిలో కడతేరిన ఆయనను కడసారి చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన ఇద్దరు కూతుళ్లు ఆరేళ్ల అద్హా, రెండేళ్ల సిమ్రన్ ఒక్కసారిగా తమ ఇంటికి ఇంతజనం ఎందుకొచ్చారో తెలియక అమాయక కన్నుల్లో విస్మయంతో కనిపించారు. ఆయన భార్య ముబీనా అఖ్తర్, వయస్సు ఊడిగిన తల్లిదండ్రులు అహ్మద్ దార్ మృతదేహం వద్ద భోరున విలపించడం చూపరులను కలిచివేసింది. -
93 ఏళ్ల బామ్మ ఫేస్ బుక్ పోస్ట్ వైరల్!
సిడ్నీ: ప్రేమకు వయసుతో పని లేదంటారు. ఇందుకు ఆస్ట్రేలియా బామ్మ సిల్వియా ప్రేమ వివాహమే తాజా ఉదాహరణ. 93 ఏళ్ల బామ్మ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు. అందుకు కారణం ఆమె చేసిన ఓ చిన్న ప్రయత్నం. తాను పెళ్లి చేసుకోబోతున్నానని, పెళ్లి డ్రెస్ విషయంలో మీరు కాస్త సాయం చేయండని కోరుతూ సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేస్తూ పోస్ట్ చేశారు సిల్వియా. ఈ పోస్ట్ ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. 93 ఏళ్ల సిల్వియా, 88 ఏళ్ల ఫ్రాంక్ గత రెండు దశాబ్దాల నుంచి గాఢంగా ప్రేమించుకుంటున్నారు. పలుమార్లు పెళ్లి ప్రతిపాదన తెచ్చినా సిల్వియా అందుకు నో చెప్పేవారు. ఈ క్రమంలో ఇటీవల మరోసారి ఫ్రాంక్ చేసిన పెళ్లి ప్రతిపాదనకు బామ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫ్రాంక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నేళ్లుగా పెళ్లికి నో చెప్పిన బామ్మగారు, ఇప్పుడు పెళ్లికి ఒప్పుకునేందుకు ఓ కండీషన్ కూడా పెట్టారు. అదేమంటే.. తన మొదటి భర్త ఇంటిపేరును మార్చుకునే ప్రసక్తే లేదని చెప్పగా.. ఇది తనకు సమస్యే కాదని స్పష్టం చేయడంతో పెళ్లికి అంగీకరించారు. వచ్చే నెలలో ఫ్రాంక్, సిల్వియా దంపతులు కానున్నారు. ఈ క్రమంలో బామ్మగారు పెళ్లి షాపింగ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా షాపింగ్ మాల్ లో నాలుగు డ్రెస్సులు ట్రై చేసి, వాటి ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. 'నాకు కొంచెం సాయం చేయండి. పెళ్లికి ఏ డ్రెస్సు వేసుకోవాలో సూచించండి' అంటూ సిల్వియా చేసిన పోస్టుకు భారీగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించారు.. కంగ్రాట్స్ అంటూ బామ్మకు అభినందనల వెల్లువ మొదలైంది. -
ఆ నటివి పచ్చి అబద్ధాలు: స్కూల్‌మేట్ మండిపాటు
బాలీవుడ్ నటి పరిణీత చోప్రా మరోసారి చిక్కుల్లో పడింది. తాను చదువుకునే రోజుల్లో తమది పేద నేపథ్యమని, అప్పట్లో తమ కుటుంబానికి కారు కూడా ఉండేది కాదని పరిణీత పచ్చి అబద్ధాలు చెప్పిదంటూ స్కూల్మేట్గా భావిస్తున్న ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారిపోయింది. గతంలో లావుగా ఉన్న ఓ స్నేహితురాలిని సోషల్ మీడియాలో విమర్శించడంతో నెటిజన్లు ఆమె తీరుపై మండిపడ్డారు. ఇప్పుడు ఆమె తాను చదువుకున్న రోజుల గురించి అన్నీ అబద్ధాలే చెప్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. గత నెలలో పరిణీత చోప్రా, హీరో అక్షయ్‌కుమార్ కలిసి ముంబైలోని ఓ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్నాతకోత్సవ వేడుకలో విద్యార్థినులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పరిణీత మాట్లాడుతూ తాను స్కూల్లో ఉన్నప్పుడు తనది పేద నేపథ్యమని, పాఠశాలకు వచ్చేందుకు తనకు కారు కూడా ఉండేది కాదని, కాబట్టి సైకిల్ మీద తాను స్కూల్‌కు వచ్చేదానినని చెప్పింది. సైకిల్ మీద వస్తుంటే తనను తోటి విద్యార్థులు వేధించేవారని, అలాంటి వేధింపులే తనను శక్తివంతంగా మార్చాయని చెప్పుకొచ్చింది. అయితే, ఆమెతోపాటే ముంబై అంబాలాలోని సీజేఎం (కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మెరీ) పాఠశాలలో చదివిన కన్నూ గుప్తా పరిణీత వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ’సిగ్గుపడు పరిణీత.. బాగా కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నువ్వు ఈ విషయంలో పచ్చి అబద్ధాలు చెప్తున్నావు. సెలబ్రిటీలు అంటే ఇలాగే ఉంటారేమో. కారు లేదు, డబ్బు లేదంటూ కల్పిత కథలు చెప్తారేమో. నేను కూడా ఆమె చదివిన స్కూలోనే చదివాను. ఆమె తండ్రికి కారున్న సంగతి నాకు గుర్తే. అంతేకాకుండా ఆరోజుల్లో స్కూలుకు సైకిల్ మీద రావడమంటే చాలా గొప్పే. సైకిల్ లేనివాళ్లు కూడా చాలామంది ఉండేవాళ్లు. సీజేఎంలో చదివిన నా స్నేహితులకు ఆమె అబద్ధాలు ఇంకా బాగా అర్థమవుతాయి’ అని ఫేస్బుక్లో కామెంట్ చేశాడు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంబాలాలో పరిణీత ఇరుగుపొరుగువారు కూడా ఆమె చెప్పినవి చాలావరకు అబద్ధాలేనని ఈ పోస్టు మీద కామెంట్లు చేశారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బంధువులుగా అప్పటికే వారికి మంచి పేరు ఉండేదని, వారు మంచి స్థితిమంతులేనని అంటున్నారు. స్కూలు రోజుల నుంచి పరిణీత ఇలాగే అసంబద్ధంగా వ్యవహరించేదని మండిపడుతున్నారు. దీనిపై స్పందించాలని కోరినా పరిణీత ఇప్పటివరకు మౌనంగా ఉంది. -
‘లైక్స్’తో లాభం లేదు!
పరిపరిశోధన ఫేస్బుక్లో తాము పెట్టిన పోస్టింగ్‌కు ఎక్కువగా ‘లైక్స్’ వస్తే బాగా ఉద్వేగానికి, ఆనందానికి గురికావడం చాలా మందిలో కనిపించేదే. అదే కోవలో మీరు కూడా ఫేస్బుక్ ‘లైక్’లను కోరుకుంటున్నారా? అయితే... అదేమీ మీ మూడ్స్‌ను మెరుగుపరచవనీ, వాటితో మీ ఆత్మవిశ్వాసమూ పెద్దగా పెరగదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్‌కు చెందిన పరిశోధకులు. అంతేకాదు... మాటిమాటికీ ప్రొఫైల్స్ మార్చి, వాటికి వచ్చే లైక్స్‌ను చూసుకోవడం, వాటి ఆధారంగా మళ్లీ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చడం వంటి పనులు మీ ఆత్మవిశ్వాసలేమిని సూచిస్తుంటాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. దాదాపు 340 మందిపై అధ్యయనాన్ని నిర్వహించి వారు ఈ విషయాలను వెల్లడించారు. -
మహిళా ఎమ్మెల్యేపై డీఎస్పీ అసభ్య వ్యాఖ్యలు
అసోంకు చెందిన బీజేపీ మహిళ ఎమ్మెల్యేపై ఆ రాష్ట్ర డీఎస్పీ ఒకరు ఫేస్బుక్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. వివాదాస్పద డీఎస్పీ అంజన్ బోరా ఇటీవల అధికార బీజేపీకి చెందిన ఓ మహిళ ఎమ్మెల్యేపై ఫేస్బుక్లో అసభ్య పోస్టు చేశారు. ఆయన పోస్టుపై దుమారం రేగుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ ఆయనపై శాఖపరమైన చర్యలు ప్రారంభించింది. ఆయనపై డిపార్టమెంట్ పరిధిలో విచారణ ప్రారంభించడమే కాకుండా.. నేరపూరిత అభియోగాల కింద ఆయనను సీఐడీ శనివారం అరెస్టు చేసింది. అసోంలో అధికార బీజేపీకి ఇద్దరు మహిళ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒక మహిళ ఎమ్మెల్యేను ఇంటిపేరుతో సంబోధిస్తూ ఆయన ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనూ ఇలాగే మహిళా ప్రజాప్రతినిధులపై దుర్భాషలు ఆడిన అంజన్ బొరా సస్పెన్షన్‌కు గురయ్యారు. -
ఆ ఫొటో చూస్తే వెన్నులో వణుకు..!
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన మహిళ బియాంకా డికిన్సన్ ఓ ఫొటో చూడాలంటే ఇప్పటికి వణికిపోతోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ఆమె ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో భారీ స్పందన వస్తుంది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఎఫ్బీ పోస్ట్ 11 వేల లైక్స్, 9800 షేర్లు, 7300 కామెంట్లను సొంతం చేసుకుంది. రెండు రోజుల కిందట తన పిల్లలతో సరదాగా బయటకు వెళ్లింది బియాంకా. తన ఇతర సంతానం ఆ పరిసర ప్రాంతాల్లో సరదాగా ఆడుకుంటుంటే.. నెట్ ఉన్న ప్రాంతంలో రెండేళ్ల కూతురు ఆగింది. దీంతో తన చేతిలో ఉన్న కెమెరాతో చిన్నారిని ఫొటో తీసింది. ఫొటో తీస్తుండగా పక్కనున్న చెట్ల నుంచి గాలికి ఏవో రాలి పడి కదులుతున్నట్లు బియాంకా డికిన్సన్ భావించింది. తాను తీసిన ఫొటో చూసిన ఆ తల్లికి కొన్ని సెకన్లలోపే ముచ్చెమటలు పట్టించింది ఆ ఫొటో. మొదట తన కూతురి నవ్వును అద్భుతంగా కెమెరాలో బంధించానని సంబరపడ్డ బియాంకా ఆ ఫొటోలో ఓ ముదురు గోదుమ రంగులో ఉన్న పెద్ద పామును గుర్తించింది. ఫొటో తీస్తున్నప్పుడు కూతురిపై మనసు పెట్టినందున అది పాము అని గమనించలేకపోయానని, కూతురికి అడుగు దూరంలో భయంకరమైన పాము వెళ్లినా.. ఎలాంటి హాని తలపెట్టలేదని పోస్ట్‌లో పేర్కొంది. రెండు రోజులు గడుస్తున్నా ఇప్పిటికీ ఆ ఫొటో చూస్తే వెన్నులో వణుకు పుడుతుందని ఆ పాప తల్లి బియాంకా డికిన్సన్ అంటోంది. గుడ్ ఫొటోగ్రఫీ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా, మరికొందరు మాత్రం థ్యాంక్ గాడ్ అని కామెంట్ చేస్తున్నారు. -
ఎమ్మెల్యేను ప్రశ్నించాడని వేధింపులు!
విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పనితీరుపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజవర్గానికి చెందిన ఓ యువకుడి తాజా ఫేస్బుక్ పోస్టు ఇందుకు నిదర్శణంగా కనిపిస్తోంది. ఓ యువకుడు నియోజకవర్గ సమస్యలపై ఫేస్బుక్ పోస్ట్ ద్వారా టీడీపీ ఎమ్మెల్యేను నిలదీశాడు. ఆ సోషల్ మీడియా పోస్టుకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. యువకుడికి మద్దతుగా మెసేజ్‌లు రావడాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వర్గం జీర్ణించుకోలేకపోయింది. బోండా ఉమా అభిమానులమన్న పేరుతో యువకుడికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతు చూస్తామంటూ కొందరు, అసభ్య పదజాలంతో మరికొందరు ఆ యువకుడిని వేధింపులకు గురిచేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సీఎం యోగిపై ఫేస్ బుక్ పోస్ట్.. అరెస్ట్
నోయిడా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఫేస్ బుక్ లో అభ్యంతర సమాచారం పోస్టు చేసిన 22 ఏళ్ల యువకుడిని గ్రేటర్ నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ యువ వాహిని సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు రహత్ ఖాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దంకౌర్ ప్రాంతంలో జన సువిధ కేంద్రం(ప్రజా వినియోగ కేంద్రం) నడుపుతున్న రహత్ మార్ఫింగ్ చేసిన సీఎం యోగి ఫొటోలను తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. అతడిపై ఐటీ చట్టంలోని 66ఏ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తన కుమారుడు అమాయకుడని, అతడిని కుట్రపూరితంగా ఇరికించారని రహత్ ఖాన్ తల్లి మున్నీ అన్నారు. ఇదంతా ల్యాండ్ మాఫియా కుట్ర అని ఆరోపించారు. తన కుమారుడి ఫేస్ బుక్ పాస్ వర్డ్ దొగిలించి, సీఎం యోగిపై అభ్యంతకర సమాచారం పోస్టు చేశారని తెలిపారు. హిందూ యువ వాహిని సంస్థను సీఎం యోగి స్థాపించడం గమనార్హం. కాగా, సీఎం యోగిపై అభ్యంతర ఫొటోలు పోస్టు చేశారనే ఆరోపణలతో కర్ణాటకలో ప్రభ ఎన్ బైలహొంగల అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
సైబర్ క్రైమ్ పోలీసులకు హీరో ఫిర్యాదు
-
సైబర్ క్రైమ్ పోలీసులకు హీరో ఫిర్యాదు
హైదరాబాద్: సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపిస్తూ ‘చందమామ’ హీరో శివబాలాజీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఫేస్ బుక్ లో పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘కాటమరాయుడు’ డబ్బింగ్ పనులను పూర్తి చేశామని, ఈ సినిమా బృందం కసిగా పనిచేస్తోందని పేర్కొంటూ శివబాలాజీ పలు ఫొటోలను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలపై ఓ వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో శివబాలాజీ పోలీసులను ఆశ్రయించాడు. అభ్యంతర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్ క్రైం ఏసీపీ బలరాంకు ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు కాటమరాయుడు సెట్ లో పవన్ కళ్యాణ్ కు కత్తిని అతడు బహూకరించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. -
రాబర్ట్ వాద్రా.. కేజ్రీవాల్ మధ్య గొడవేంటి?
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్య ఏదో గొడవ జరిగింది. అదేంటన్నది పూర్తిగా బయటకు రావడం లేదు గానీ... ఈమధ్య కాలంలో తన మీదకు జనాన్ని రెచ్చగొడుతున్నారంటూ కేజ్రీవాల్ మీద వాద్రా విపరీతంగా మండిపడుతున్నారు. కావాలంటే తనతో నేరుగా మాట్లాడాలి గానీ ఇలా నిరాధార ఆరోపణలు చేయొద్దని, అర్థంపర్థం లేని పనులకు పాల్పడొద్దని హెచ్చరించారు. ఈ మేరకు వాద్రా తన ఫేస్బుక్ పేజీలో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. ''ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిక్షనరీలో ఎక్కువగా వినిపించే పేరు రాబర్ట్ వాద్రానే. 'వాద్రా వాళ్లను సజీవంగా తినేస్తాడు' లాంటి వ్యాఖ్యలు చూస్తే ఆయనకు నామీద ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్లుంది. కావాలంటే ఢిల్లీ ముఖ్యమంత్రి బయటకు వచ్చి, నాతో నేరుగా మాట్లాడాలని కోరుతున్నాను. నా మీద ఆయనకు ఏమైనా కోపం ఉంటే.. ప్రజలను నామీదకు ఎగదోయద్దు. ఢిల్లీ ముఖ్యమంత్రి అన్ని విషయాల్లో ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను'' అని ఆ పోస్ట్‌లో రాశారు. ఢిల్లీ అసెంబ్లీలో రెండు రోజుల క్రితం జరిగిన ఘటన గురించి వాద్రా ఇలా స్పందించారు. ''మీరు కేవలం సత్యేంద్ర జైన్‌ను మాత్రమే అరెస్టు చేస్తారు, షీలా దీక్షిత్‌ను అరెస్టు చేయరు. ప్రధానమంత్రి రాబర్ట్ వాద్రా గురించి ఏమైనా మాట్లాడితే, ఆయనకు 56 అంగుళాల ఛాతీ ఉందని నేను నమ్ముతాను. వాద్రా ఆయనను సజీవంగా తినేస్తారు... ఢిల్లీ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నందుకు మోదీ వాళ్ల మీద కక్ష తీర్చుకుంటున్నారు. మా పనికి అడ్డు తగులుతున్నారు. అన్ని అడ్డంకులున్నా మేం చాలానే చేస్తున్నాం'' అని కేజ్రీవాల్ అన్నారు. అసెంబ్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చలో మాట్లాడుతూ ఆయనిలా చెప్పారు రాబర్ట్ వాద్రా పెద్ద భూకుంభకోణంలో ఉన్నారని కేజ్రీవాల్ 2012లో ఆరోపించారు. డీఎల్ఎఫ్ వాళ్లు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా భారీ మొత్తంలో రుణాలు ఇస్తే వాటితో ఆయన కోట్లాది రూపాయల భూములు కొన్నారని.. ఢిల్లీ, రాజస్థాన్, హరియాణాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు డీఎల్ఎఫ్కు చేసిన మేలుకు ప్రతిఫలంగానే ఆ కంపెనీ ఆ సొమ్ము ముట్టజెప్పిందని ఆయన ఆరోపించారు. అలాగే 300 కోట్ల విలువైన భూమిని డీఎల్ఎఫ్ వాళ్లు రాబర్ట్ వాద్రాకు కారు చవగ్గా ఇచ్చేశారని కూడా అన్నారు. -
జాతి విద్వేషం: అమెరికా బుడ్డోడి ధీటైన జవాబు!
వాషింగ్టన్: అమెరికాలో జాతి విద్వేష దాడుల నేపథ్యంలో విదేశీయులు బిక్కుబిక్కు మంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఐదేళ్ల అమెరికన్ బుడ్డోడు తన ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. జాత్యహంకార దాడులకు పాల్పడే వారు ఈ బాలుడు పోస్ట్ చేసిన ఫేస్ బుక్ వీడియో చూసి ఎంతో సిగ్గుపడాలి. ఆ వివరాలిలా ఉన్నాయి.. అమెరికాలోని కెంటూకీకి చెందిన శ్వేతజాతి బాలుడు జాక్స్(5) తన ఫ్రెండ్ నల్లజాతి బాలుడు రెడ్డి గిగిల్(5)కు మద్థతుగా నిలవాలని భావించాడు. అనుకున్నదే తడవుగా తన తల్లితో మాట్లాడి ఫ్రెండ్ రెడ్డి గిగిల్ లాగా కటింగ్ (హెయిర్ కట్) చేయించుకున్నాడు. అంతకుముందు స్పైక్స్ తో మంచి హెయిర్ స్టెయిల్ తో ఉండే జాక్స్ ను చూసి టీచర్లు షాకయ్యారు. విషయం అడిగితే.. తన ఫ్రెండ్ ను చూపిస్తూ ఇప్పుడు మేం ఇద్దరేం ఒకేలా ఉన్నామని.. మా మధ్య ఏ తేడా లేదు కదా అంటూ అడిగాడు. అప్పుడు నల్లజాతి బాలుడు రెడ్డి గిగిల్ సంతోషంగా జాక్స్ ను ఆలింగనం చేసుకుంటాడు. 'జాక్స్ అంటే నేనే.. ఐ యామ్ జాక్స్' అని మా ఇద్దరిలో ఎలాంటి మార్పులేదని రెడ్డి గిగిల్ అంటాడు. ఈ విషయాలను షూట్ చేసిన జాక్స్ తల్లి కుమారుడి కోరిక మేరకు ఈ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అందరూ ఒకటేనని చెప్పేందుకు తాను ఇలా హెయిర్ కట్ చేయించుకున్నానని జాక్స్ చెప్పాడు. జాతి విద్వేష దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారు బుడ్డోడు జాక్స్ ను అభినందిస్తున్నారు. ఆ బాబును చూసయినా కొందరు బుద్ధి తెచ్చుకోవాలని, ఇలాంటి దాడులకు జాక్స్ ధీటైన జవాబిచ్చాడంటూ కామెంట్ చేస్తున్నారు. -
బాధితురాలిపై మంత్రి కామెంట్.. తీవ్ర విమర్శలు!
గువాహటి: 'చీకటి పడుతున్న సమయంలో రోడ్డుపై వెళ్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నా వద్దకు వచ్చారు. బైకుపై వచ్చిన వాళ్లు హెల్మెట్ ధరించి ఉన్నారు. నేను అక్కడినుంచి వెళ్లిపోతున్నాను. ఇంతలో ఒకడు నన్ను అడ్డగించగా.. రెండో వ్యక్తి చెప్పరాని విధంగా నన్ను తాకాడు. దీంతో నిస్సహాయంగా ఉండిపోయాను'.. ఇది అస్సాం రాజధాని గువాహటికి 330 కి.మీ దూరంలోని జోర్హాత్ గ్రామానికి చెందిన ఓ యువతి ఫేస్ బుక్ పోస్ట్ సారాంశం. సోషల్ మీడియాతో ఈ పోస్ట్ విపరీతంగా షేర్ కావడంతో పార్లమెంటరీ వ్యవహరాలశాఖ మంత్రి చంద్ర మోహన్ పఠ్వారీ ఈ ఘటనపై స్పందించి తీవ్ర విమర్శలపాలయ్యారు. గతేడాది అసోం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏజీపీ నేత అయిన చంద్ర మోహన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన జోర్హాత్ గ్రామ యువతి పోస్ట్ పై స్పందిస్తూ.. ఆ యువతి లెఫ్ట్ వింగ్ కు చెందిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి అని అందుకే పోలీసుల వద్దకు వెళ్లకుండా, అందర్నీ తప్పుదోవ పట్టిస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయాలపై కూడా రాజకీయం చేయడంతో మంత్రి చంద్ర మోహన్ పై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. మంత్రి తక్షణమే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ జోర్హాత్, గోలఘాట్, సోనిత్ పూర్, గువాహటిలో ఆందోళన చేపట్టారు. చట్టాలు కేవలం బీజేపీ, ఏబీవీపీ, ఆరెస్సెస్ లకు మాత్రమే అనుకున్నావా అంటూ అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ మంత్రి చంద్ర మోహన్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయాలకు అతీతంగా మహిళలకు రక్షణ కల్పించాల్సింది పోయి.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడ్డారు. చంద్ర మోహన్ వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి హిమంతా బిస్వా శర్మ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తక్షణమే బాధితురాలికి న్యాయం చేయాలని గొగోయ్ డిమాండ్ చేశారు. -
‘తేజ్‌ను అరెస్టు చేయలేదు.. వేరే చోట ఉన్నాడు’
న్యూఢిల్లీ: తమకు సరైన ఆహారం పెట్టడం లేదంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను తెలియజేసి దేశం మొత్తం తనవైపు చూసేలా చేసిన బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్‌ను అరెస్టు చేయలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే, ఆయనను వేరే చోటుకు విధుల దృష్ట్యా బదిలీ చేసినట్లు ఢిల్లీ కోర్టుకు వివరించింది. గత మూడు రోజులుగా తన భర్త జాడ తెలియడం లేదని, ఆయనను కలిసేందుకు అధికారులు అనుమతించడం లేదని, ఫిర్యాదు చేసినందుకు ఆయనను అరెస్టు చేసి ఉంటారని అనుమానిస్తూ తేజ్ భార్య షర్మిళ ఢిల్లీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా విచారణకు స్వీకరించిన కోర్టు ఈ మేరకు సంబంధిత అధికారులను ప్రశ్నించింది. ఎందుకు తేజ్ భార్యను ఆయనను కలిసేందుకు అనుమతించడం లేదని ప్రశ్నించింది. కొత్త బెటాలియన్ క్యాంప్‌లో వీకెండ్లో ఆయనను కలిసే అవకాశం ఇవ్వాలని కూడా అధికారులకు కోర్టుకు ఆదేశించింది. ప్రస్తుతం సాంబా సెక్టార్‌లోని 88వ బెటాలియన్‌లో తేజ్ బహదూర్ పనిచేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. జవాన్లకు పోషకాహారం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియా ఫేస్బుక్లో పెట్టి తేజ్ బహదూర్ యాదవ్ కలవరాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇప్పటికే అతడి భార్య పలుమార్లు ఆరోపిస్తూ వస్తోంది. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. కేంద్రమంత్రికి చేరిన జవాను వీడియో ‘మా ఆయన చెప్పినవన్నీ కరెక్టే’ అలాంటప్పడు తుపాకీ ఎందుకు ఇచ్చారు? జవాన్ల ఆహారానికి కొత్త మార్గదర్శకాలు నా భర్తను నిర్బంధించారు: జవాన్ భార్య -
నా భర్తను నిర్బంధించారు: జవాన్ భార్య
న్యూఢిల్లీ: తన భర్త ఎంతో మానసిక వేదనకు గురయ్యాడని బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ భార్య అన్నారు. సరిహద్దులో అత్యంత ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్న వైనాన్ని బయటపెట్టిన జవానే తేజ్ బహదూర్ యాదవ్. నాసిరకం ఆహారం విషయాన్ని బయటపెట్టిన కారణంగా మానసికంగా వేధింపులకు గురిచేయడంతో పాటు బెదిరించారని ఫోన్ లో 29వ బెటాలియన్ జవాన్ తేజ్ బహదూర్ భార్యకు తెలిపారు. తన భర్త కోసం గత రెండు రోజులుగా ఎదురుచూస్తున్నానని, అయితే ఆయన ఇప్పటికీ ఇంటికి రాలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఏదో విధంగా వేరొకరి నుంచి మొబైల్ తీసుకుని తనకు కాల్ చేశారని, తాను నిర్బంధంలో ఉన్నానని ( అరెస్ట్ చేశారని) చెప్పాడని వివరించారు. అరెస్ట్ చేసిన తర్వాత భర్త రిటైర్మెంట్ ను రద్దు చేశారని చెప్పారు. జవాన్ల సౌకర్యాలు, ఆహారం, ఇతరత్రా సమస్యలను తేజ్ బహదూర్ తర్వాత సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జీత్‌సింగ్, లాన్స్ నాయక్ యజ్ఞప్రతాప్ సింగ్ కూడా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ ప్రయత్నం మొదటగా చేసిన తన భర్తను రిటైర్ అవ్వాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారని తేజ్ బహదూర్ కు ఏమైతుందోనని ఆమె ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. బీఎస్ఎఫ్ అధికారులు తేజ్ బహదూర్ భార్య ఆరోపణలపై స్పందించారు. బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ ను ఎవరూ అరెస్ట్ చేయలేదని, వాలంటరీ రిటైర్మెంట్ ను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. జనవరి 30న సాయంత్రం జవాన్ రిటైర్మెంట్ ను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. (చదవండి: అలాంటప్పడు తుపాకీ ఎందుకు ఇచ్చారు?) (చదవండి: ఉరిమిన ‘యూనిఫాం’) -
సెల్ఫీ క్రేజ్.. అమెరికా యువతికి చుక్కలు!
పోర్ట్ లాండ్: సెల్ఫీ తీసుకునేందుకు యత్నించిన ఓ అమెరికా యువతికి చుక్కలు కనిపించాయి. ఓరెగాన్‌లోని పోర్ట్‌లాండ్‌కు చెందిన ఆష్లే గ్లేవ్ ఓ పామును పెంచుకుంటుంది. తన పెంపుడు పాము బార్ట్‌తో సరదాగా సెల్ఫీ తీసుకోవాలని భావించింది. కుడిచెంపకు పక్కన బార్ట్‌ను ఉంచి సెల్ఫీ తీసుకోవాలని చూసింది. ఇంతలో బార్ట్ అనే పాము ఆమె చివి రంద్రంలోకి దూరిపోయింది. చెవికి ఏదో ఆభరణం ధరించేందుకు పెద్ద సైజులో రంద్రాన్ని చేసుకోగా, అందులోకి దూరిన బార్ట్ కొన్ని సెకన్లలో అలాగే ఉండి ఇరుక్కుపోయిందని తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. తన పెట్ స్నేక్ బార్ట్ ఫొటోతో ఎదుర్కొన్న సమస్యను తన పోస్ట్ లో రాసుకొచ్చింది. చివరికి బార్ట్‌ను బయటకు తీయడం రాక, హాస్పిటల్‌కు పరుగులు తీయాల్సి వచ్చిందని చెప్పింది. హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో దిగిన ఫొటో పోస్ట్ చేయగా విపరీతంగా లైక్స్, షేర్లు సొంతం చేసుకుంది. సెల్ఫీ తీసుకునేందుకు ట్రై చేస్తే ఇలా జరిగి చుక్కలు కనిపించాయంటూ డాక్టర్‌కు వివరించి ఆష్లే గ్లేవ్. పాముకు ఏం జరగకూడదని చెప్పడంతో, వైద్యులు ఆమె చెవిని కాస్త కట్ చేసి పామును బయటకు తీశారు. దీంతో బాధితురాలు, పాము యజమాని గ్లేవ్ ఊపిరి పీల్చుకుంది. ఇలా ఎవరూ సెల్ఫీలకోసం ట్రై చేయకూడదని నెటిజన్లకు సూచించింది. -
‘మా ఆయన చెప్పినవన్నీ కరెక్టే’
న్యూఢిల్లీ: తన భర్త వెలుగులోకి తెచ్చిన విషయాలన్నీ వాస్తవమేనని, ఆయన చేసిన పని కరెక్టేనని బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్ భార్య తెలిపారు. బహదూర్ యాదవ్ మానసిక పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. ఆయనకు మతిస్థిమితం లేకపోతే సరిహద్దులో ఎలా విధులు నిర్వహిస్తారని ఎదురు ప్రశ్నించారు. మంచి ఆహారం పెట్టామని అడగడం తప్పుకాదని బహదూర్ యాదవ్ కుమారుడు రోహిత్ అన్నాడు. సైనికుల సరైన ఆహారం అందిచడం లేదని, దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశాడు. తమకు న్యాయం జరగాలని ఆకాంక్షించాడు. జమ్మూకశ్మీర్ 29వ బెటాలియన్ లో జవానుగా పనిచేస్తున్న తేజ్ బహదూర్ యాదవ్ ఇటీవల ఫేస్ బుక్ లో పోస్ట్చేసిన వీడియో దుమారం రేపింది. సరిహద్దులో అత్యంత ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్న వైనాన్ని వీడియోల్లో చిత్రీకరించి బయటి ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దర్యాప్తుకు ఆదేశించారు. కాగా, సోమవారం సాయంత్రం నుంచి తేజ్ బహదూర్ యాదవ్ అదృశ్యమయ్యాడని అతడి భార్య వెల్లడించింది. ఫోన్ లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాడని, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు తేజ్ బహదూర్ యాదవ్ పై క్రమశిక్షణ చర్య తీసుకుంటామని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ డి.కె. ఉపాధ్యాయ మంగళవారం తెలిపారు. -
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. ఒకరి అరెస్ట్
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పై దుర్భాషలాడుతూ ఫేస్బుక్లో పోస్టు చేసిన ఒక వ్యక్తిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టుచేశారు. ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని నేటి (మంగళవారం) ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాటేదాన్‌కు చెందిన షానవాజ్ అనే వ్యక్తి శాసనసభ్యుడు ప్రకాష్గౌడ్ను దుర్భాషలాడుతూ ఫేస్బుక్లో ఇటీవల పోస్టుచేశాడు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికిరాగా, ఆయన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాటేదాన్ వెళ్లి షానవాజ్‌ను అరెస్టుచేశారు. విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ఫేస్బుక్లో అసభ్యకరంగా వ్యక్తిగత విషయాలు..
హైదరాబాద్ : పరిచయం ఏర్పరచుకున్న యువతిని వేధించడమే కాకుండా ఫేస్బుక్లో అసభ్యకరంగా వాఖ్యలను పోస్ట్ చేసిన ఓ ప్రభుద్దుడిని జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. సీఐ అశోక్‌కుమార్ తెలిపిన మేరకు.. కరీంనగర్ జిల్లా రామగుండం ప్రాంతంలో నివసించే కుంజుమోహన్ కుమార్తె సునీత మోహన్ పీజీ చదవుతుండగా అదే ప్రాంతానికి చెందిన జీవన్‌శర్మ (24) పరిచమయ్యాడు. ఆ తర్వాత సునీతా మోహన్‌కు హైదరబాద్‌లోని హెచ్ఎస్బీసీలో ఉద్యోగం రావడంతో అల్వాల్ మండలంలోని మచ్చబొల్లారం డివిజన్ పరిధిలో గల కౌకూర్ జనప్రియ అపార్ట్‌మెంట్‌కు మకాం మార్చారు. రామగుండంలో ప్రైవేట్ కంపెనీ పెట్టుకుని జీవన్‌శర్మ నివసిస్తున్నాడు. ఇదిలా ఉండగా జీవన్‌శర్మ .. సునీత మోహన్ సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు పంపుతూ ప్రేమించాలని వేధిస్తున్నాడు. దీనిపై ఆమె కుటుంబసభ్యులు గత సంవత్సరం ఏప్రిల్ 9 న జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో జీవన్‌శర్మ మరింత వేధింపులకు పాల్పడసాగాడు. మళ్లీ మరోమారు సెప్టెంబర్ 3న అతనిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేసుకుని రౌడీషీట్ తెరిచి రామగుండం పోలీసులకు సమాచారం అందించారు. అయినప్పటికీ జీవన్శర్మలో మార్పురాకపోగా ఫేస్బుక్లో సునీతా మోహన్‌కు సంబంధించిన వ్యక్తిగత విషయాలను అసభ్యకరంగా పోస్ట్ చేస్తూ మరింత వేధింపులకు గురిచేశాడు. దీంతో ఈ నెల 3న ఐటీ చట్టం ఐపీసీ 66సి ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు సేకరించి గురువారం రామగండంలో జీవన్శర్మను అదుపులోకి తీసుకుని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వచ్చి రిమాండ్‌కు తరలించారు. -
ఫేక్ పోస్టింగ్.. ప్రతిపక్ష నేతకు ఐదేళ్ల జైలు!
ఫెనాం పెన్హ్ : సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ చేసిన కేసుకు సంబంధించి కంబోడియా ప్రతిపక్ష నేత శామ్ రెయిన్సీకి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. సరిహద్దు దేశమైన వియత్నాంతో కొన్ని ఒప్పందాలు, సరిహద్దు విషయమై సంప్రదింపులకు అంగీకరించినట్లు ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు ఫెనాం పెన్హ్ మున్సిపల్ కోర్టు నేడు విచారణ జరిపి శిక్ష ఖరారుచేసింది. గత కొన్ని నెలలుగా అధికార పార్టీ కంబోడియన్ పీపుల్స్ పార్టీ నేత, ప్రధాని హన్ సేన్, ప్రతిపక్ష పార్టీ కంబోడియా నేషనల్ రెస్క్యూ పార్టీల మధ్య ఈ విషయంపై వివాదం కొనసాగుతోంది. వియత్నాం, కంబోడియా దేశాల నేతలలో శామ్ రెయిన్సీ టీం చేసిన ఫేక్ పోస్ట్ కలవరం పుట్టించింది. ఇరుదేశాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావించారు. 2013 లో జరిగిన ఎన్నికల్లో శామ్ రెయిన్సీ నేతృత్వం వహించిన కంబోడియా నేషనల్ రెస్క్యూ పార్టీ 55 సీట్లు కైవసం చేసుకోగా, అధికార పార్టీ కంబోడియన్ పీపుల్స్ 68 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలసిందే. 1979లో జరిగిన బోర్డర్ ఒప్పందాలపై శామ్ రెయిన్సీతో పాటు అంగ్ చంగ్ లియాంగ్, సత్యా సంబాత్ దుష్ప్రచారం చేశారని నిర్ధారించారు. శామ్ రెయిన్సీకి ఐదేళ్లు శిక్షపడగా, అంగ్ చంగ్ లియాంగ్, సత్యా సంబాత్ లకు మూడేళ్ల జైలుశిక్ష విధించారు. కాగా, పరువునష్టం దావాకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శామ్ రెయిన్సీ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని 2015లో ఫ్రాన్స్ వెళ్లిపోయి అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురు నేతలను అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని మున్సిపల్ కోర్టు తీర్పిచ్చింది. -
భార్య డ్రెస్ వివాదంపై స్పందించిన షమీ!
దుస్తుల విషయంలో తన భార్య, కూతురికి భారత క్రికెటర్ మహమ్మద్ షమీ అండగా నిలిచాడు. ఈ నెల 23న తన భార్య, కూతురితో కలిసి దిగిన ఫొటోను షమీ ఫేస్బుక్లో పోస్టు చేయగా.. దానిపై కొందరు విద్వేషం వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలో షమీ భార్య హసిన్ జహాన్ స్లీవ్‌లెస్ గౌను వేసుకోగా.. కొందరు మతకోణంలో దానిని వ్యతిరేకించారు. అసలు నువ్వు ముస్లింవేనా, ఇలాంటి దుస్తులు ఎలా వేసుకుంటావు? నీకు సిగ్గు లేదా? నీ భార్య బురఖా ఎందుకు ధరించలేదు? అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో క్రికెటర్ మహ్మద్ కైఫ్ షమీకి అండగా నిలిచాడు. 'ఇలాంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుపడేలా ఉన్నాయి. మొహమ్మద్ షమీకి నా మద్దతు ఉంటుంది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను చెప్పదలచుకున్నది అర్థమయ్యి ఉంటుందని భావిస్తున్నా' అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా షమీ స్పందిస్తూ.. 'ఈ ఇద్దరే నా జీవితం. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. (ఇతరులను వేలెత్తి చూపేముందు) మనలో మనం ఎంత స్వచ్ఛంగా ఉన్నామో మొదట చూసుకోవాలి' అని షమీ పేర్కొన్నాడు. 'జీవితంలో అందరికీ కోరుకున్నది దొరకదు. అదృష్టవంతుల నుదుటన అది రాసిపెట్టి ఉంటుంది. లోలోపల కాలిపోయేవాళ్లు కాలిపోని' అంటూ విద్వేషకారులకు చురకలు అంటించారు. తన భార్య వేసుకున్న దుస్తులు ఇస్లాం మతానికి విరుద్ధమైనవి కావని పేర్కొన్నాడు. -
ఒబామాపై కామెంట్స్.. చిక్కుల్లో అధికారి!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై జాతి వివక్ష పూరితమైన వ్యాఖ్యలు చేసిన కారణంగా ఓ జైలు ఉన్నతాధికారి జాబ్ కోల్పోయారు. ఫేస్బుక్లో పెట్టిన ఓ పోస్ట్ దీనికి కారమైంది. ఆ వివరాలిలా ఉన్నాయి... డేవిడ్ బార్బర్ అనే వ్యక్తి షెల్బీ కౌంటీ కరెక్షన్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్‌గా గత పదిహేడేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అయితే తరచుగా వివాదాస్పదమైన విషయాలను సోషల్ మీడియా వెబ్సైట్లలో పోస్ట్ చేసేవాడు. అందులోనూ అతడి ఫేస్బుక్ అప్డేట్స్ ఎవరైనా సరే చూడవచ్చు. నిరసనలో భాగంగా ఓ వ్యక్తి కు క్లక్స్ క్లాన్ మాస్క్ ధరించి వచ్చాడు. అతడికి కేకేకే అని పేరు పెట్టిన అధికారి డేవిబ్ బార్బర్.. ఇల్లీగల్ (చట్టవ్యతిరేకంగా) అధ్యక్షుడు బరాక్ ఒబామా కంటే కూడా ఆ మాస్క్ ధరించిన వ్యక్తే ఓవరాల్ అమెరికన్ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీనిపై వివాదం చెలరేగింది. దేశ అధ్యక్షుడిపైనే జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని ఒబామా కుటుంబం ఆరోపించింది. 'కు క్లక్స్ క్లాన్' నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్ధతుదారుడు. ఈ వివాదంపై తీవ్ర వ్యతిరేకత, ఒత్తిడి ఎదుర్కొన్న డేవిడ్ బార్బర్ తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ద ఫ్రీ పాట్రియట్ అనే ఫేస్బుక్ పేజీలో బార్బర్ విద్వేషపూరిత వ్యాఖ్యలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. షెల్బీ కౌంటీ కరెక్షన్స్ సెంటర్ బార్బర్‌ను ఉద్యోగం నుంచి తప్పుకోవాలని సూచించగా ఆయన జాబ్ మానేసినట్లు సమాచారం. ఇటీవల మిషెల్లీ ఒబామాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసిన టేలర్ కూడా జాబ్ కోల్పోయిన విషయం తెలిసిందే. -
ఆ పోస్టులు వ్యాధులను తెలుపుతాయి!
లండన్: ఫేస్బుక్లో మనం పెట్టే స్టేటస్, కొట్టే లైకులు, ఫొటోలు మానసిక వ్యాధులను కనుగొనడంలో సాయపడే అవకాశం ఉందట. సామాజిక అనుసంధాన వెబ్సైట్లను ఉపయోగించేవారిపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. దీని ద్వారా మనం డిప్రెషన్, స్క్రీజోఫ్రేనియా వంటి మానసిక వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు. ఫేస్బుక్ ద్వారా తెలిసిన సమాచారం.. ఆ వ్యక్తి ప్రవర్తన ద్వారా తెలుసుకున్న సమాచారం కంటే మరింత వాస్తవికంగా ఉందన్నారు. అంతేకాకుండా వ్యకిగతంగా ప్రశ్నలు అడిగినప్పుడు సరైన సమాచారం రాబట్టడం, అతని ప్రవర్తనను అంచనా వేయడం కొంచెం కష్టమేనని తెలిపారు. సోషల్ మీడియాలో వారు వాడిన పదజాలం, వెల్లడించిన భావోద్వేగాలు, లేవనెత్తిన అంశాల ద్వారా మరిన్ని అంశాలను తెలుసుకోవచ్చు. ఫేస్బుక్లో రోజుకు 35 కోట్ల ఫొటోలు అప్లోడ్ అవుతున్నాయని, ముఖకవళికలను గమనించే యాంత్రిక చిత్రాల విశ్లేషణ ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుందన్నారు. -
డైరెక్టర్ పై నెటిజన్ల ఆగ్రహం
ముంబై: భారత్-పాక్ ల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి ప్రశ్నించిన బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మరోసారి విమర్శలపాలయ్యారు. ఇంటర్వూ చేసేందుకు కశ్యప్ ఇంటికి వెళ్లిన మహిళా జర్నలిస్టు వివరాలను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాకుండా తాను ఇంటర్వూ ఇవ్వనని చెబుతున్నా వినకుండా హెడ్ లైన్ వార్తల కోసం జర్నలిస్టులు కక్కుర్తి పడుతున్నారని వ్యాఖ్యానించారు. మీడియా తనను కలవాలనే ఆలోచనే పెట్టుకోవద్దని సూచించారు. జర్నలిస్టుతో వాట్సాప్ సంభాషణ వివరాలు ఇలా ఉన్నాయి.. జర్నలిస్టు: అనురాగ్ మీరు మాట్లాడాలి డైరెక్టర్: కుదరదు జర్నలిస్టు: సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న మీరు ఎందుకు మాట్లాడలేరు? డైరెక్టర్: బాధ్యత లేకుండా కేవలం శీర్షికల కోసమే పనిచేసే మీడియాతో నేను మాట్లాడను. జర్నలిస్టు: ఈ మాటలు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో కంటే కెమెరా ముందు చెప్పండి. లేకపోతే ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం ఉంది. మీరు మాట్లాడితే బాగుంటుంది. నేను మీ ఇంటి వద్దే ఉన్నాను. మీరు అందుబాటులో ఉన్నారా? డైరెక్టర్: లేదు. సోషల్ మీడియాలో ఈ పోస్టును పెట్టిన కొంతసమయంలోనే నెటిజన్ల నుంచి విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆ పోస్టులను తన అకౌంట్ నుంచి తొలగించి తన ఉద్దేశాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అయినా ఆయనపై నెటిజన్ల ఆగ్రహం తగ్గలేదు. టెర్రిరిజంపై దేశం అట్టుడుకుతున్న సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని కొంతమంది కశ్యప్ కు హితవు పలికారు. -
క్యాబ్ డ్రైవర్ కాపాడాడు
ముంబై: దేశంలో మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయన్న మాట ఎంత నిజమో అదే మొత్తంలో కాకపోయిన మహిళలను కాపాడుతున్న వారు కూడా ఉన్నారు. హ్యూమన్స్ ఆఫ్ బొంబే పేరుతో ఫేస్ బుక్ లో నడుస్తున్న పేజీ షేర్ చేసిన ఓ పోస్టు మంచి, చెడుల సమూహమే సమాజం అన్న మాటను గుర్తు చేస్తుంది. పోస్టు లోని వివరాల ప్రకారం.. 35 ఏళ్లుగా ముంబై రోడ్లపై ట్యాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన గురించి వివరించారు. తెల్లవారుజామున 12.30నిమిషాల సమయంలో 25 ఏళ్ల వయసు గల ఓ యువతి బస్ స్టాప్ నుంచి నడుచుకుంటూ వెళుతున్నట్లు చెప్పారు. ఇంతలో కొంతమంది విజిల్స్, కేకలు వేస్తూ ఆమెను వెంబడించారని తెలిపారు. దీంతో ఆ యువతి కంగారుపడి వేగంగా నడవడం మొదలుపెట్టినట్లు చెప్పారు. ఇదంతా గమనించిన తాను కారును వారి వెనుకే నడుపుతూ హారన్ మోగించినట్లు చెప్పారు. ఎవరో వస్తున్నట్లు భావించిన వాళ్లు వేరే దారిలో వెళ్లిపోయినట్లు తెలిపారు. తాను ఆ యువతిని తీసుకువెళ్లి ఇంటి దగ్గర వదిలేసినట్లు చెప్పారు. కారు దిగిన యువతి తన రెండు చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుందని తెలిపారు. రెండు నిమిషాలు ఆగమని చెప్పిన యువతి ఇంట్లో నుంచి కొన్ని స్వీట్స్ తీసుకుని వచ్చి ఇచ్చిందని చెప్పారు. హ్యూమన్ ఆఫ్ బొంబే పేజీ ముంబైలోని ప్రజల జీవితాలను సోషల్ మీడియా ద్వారా బయటకు తీసుకువస్తోంది. హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్ పేరుతో రన్ చేస్తున్న పేజీని చూసిన ముంబైకు చెందిన ఓ యువతి ఈ పేజీని ప్రారంభించారు. -
ఫేస్బుక్లో ఓ చిన్న చర్చ.. ఇంతపెద్ద తలనొప్పి!
కోల్కత్తా : సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో స్నేహితులతో చాలా విషయాలే చర్చిస్తుంటాం. అలానే ఓ 21 ఏళ్ల ఇంజనీరింగ్ అమ్మాయి కూడా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన దుర్గామాత పరేడ్‌పై చర్చించింది. నిరుద్యోగ, పేదరిక సమస్యతో బెంగాల్ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రియో ఉత్సవంలో ఎంతో అట్టహాసంగా సీఎం ఆ పరేడ్ నిర్వహించడాన్ని తప్పుడు చర్యగా శుక్రవారం ఆ అమ్మాయి విమర్శించింది. ఎఫ్బీలో స్నేహితులతో నిర్వహించిన చర్చే విద్యార్థికి పెద్ద తలనొప్పిలా మారింది. విమర్శించిన ఒక్కరోజులోనే ఆదివారం ఆమె ఫోటోతో కూడిన ఓ పెద్ద బ్యానర్ విద్యార్థి నివసించే దమ్ దమ్ ప్రాంతాల్లో వెలసింది. ముఖ్యమంత్రిని విమర్శించడాన్ని తాము ఖండిస్తున్నామంటూ పెద్దపెద్ద అక్షరాలతో బ్యానర్‌పై లిఖించారు. ఈ బ్యానర్‌ను చూసిన అమ్మాయి ఒక్కసారిగా బిత్తరపోయింది. వేలమంది ఈ పోస్టర్‌ను చూస్తారని తాను భయపడటం లేదని, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ మహిళ సభ్యుల వల్ల తనకేమన్న ముప్పు వాటిల్లుతుందేమోనని ఆందోళన చెందుతున్నట్టు ఆ విద్యార్థి పేర్కొంది. దమ్ దమ్ వార్డ్8 సిటిజన్స్ కమిటీ ఈ హోర్డింగ్ పెట్టినట్టు తేలింది. మమతా బెనర్జీని విమర్శించే హక్కు తనకుందని ఆ అమ్మాయి భావిస్తే, తనని బహిరంగంగా నిందించే హక్కు ఇతరులకు ఉంటుందని బెదిరించారు. రియో ఉత్సవంలో దుర్గామాత విగ్రహాలతో ముఖ్యమంత్రి పరేడ్ నిర్వహించడాన్ని శుక్రవారం రోజు ఆ విద్యార్థి తప్పుబట్టింది. నిరుద్యోగ, పేదరిక సమస్యతో బెంగాల్ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పరేడ్‌ను తప్పుడు చర్యగా విమర్శించింది. ఆమె ఫేస్బుక్ చర్చలో కొంతమంది స్నేహితులు ఆ విద్యార్థికి మద్దతు పలుకగా, మరికొంతమంది వ్యతిరేకించారు. కానీ ఆ పోస్టు ఇంతపెద్ద సమస్యకు కారణమవుతుందని ఆ విద్యార్థి భావించలేదు.దమ్ దమ్ ప్రాంతానికి చెందిన స్థానికులు కూడా ఆమె ఆలోచనలను తప్పుపడుతున్నారు. బెంగాల్‌కు మమతా బెనర్జీ చేస్తున్న కృషిని చూస్తూ కూడా 21 ఏళ్ల అలా ఎలా విమర్శిస్తుందని మండిపడుతున్నారు. కొంతమంది స్థానికులు విద్యార్థికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎవరికైనా స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఉంటుందని, ఇలా హోర్డింగ్ నెలకొల్పడం సరికాదంటున్నారు. -
'ఓయ్ సెక్సీ' అంటూ పిలిచాడని..!
కాలిఫోర్నియా బేస్డ్ ఫ్లైట్ లో అలస్కా ఎయిర్ లైన్స్ మహిళా సిబ్బందితో ఓ ప్యాసింజర్ దురుసుగా ప్రవర్తించాడన్న కారణంతో అతడిని విమానం నుంచి దింపివేశారు. భద్రత కోసం మహిళా ఉద్యోగిని సూచనలు, సలహాలు ఇస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు కాస్త దురుసుగా ప్రవర్తించాడు. ఓయ్ సెక్సీ.. అంటూ అసభ్యపదజాలంలో మహిళా సిబ్బందిని సంబోధించాడు. అక్టోబర్ 9న జరిగిన ఘటనపై అలస్కా ఎయిర్ లైన్స్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. సీటెల్ నుంచి బర్బాంక్ కు డిపార్టర్ అవడానికి రెడీగా ఉన్న ఫ్లైట్-520 నుంచి ఆ ప్యాసింజర్ ను కిందకి దింపివేసినట్లు ఎయిర్ లైన్స్ తెలిపింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఇతర సిబ్బంది ప్రవర్తన మార్చుకుంటే మంచిదని ఆ ప్రయాణికుడిని హెచ్చరించారు. సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లైట్ మరికాసేపట్లో బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై ఓ ప్యాసింజర్ అంబర్ నిల్సన్.. ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇద్దరు మహిళా ప్యాసింజర్ల మధ్యలో ఆ ప్రయాణికుడి సీట్ ఉంది. అతడి చేష్టలతో ఇద్దరు మహిళలు కూడా ఎంతో అసౌకర్యానికి లోనయ్యారు. దాంతో పాటుగా ఫ్లైట్ మహిళా ఉగ్యోగినిని అసభ్య పదజాలంతో సంబోధించగా ఆమె అతడి వద్దకు వచ్చి కాస్త మర్యాదగా మాట్లాడాలని సూచించింది. 'నేను నీతో జస్ట్ ఫన్ చేశాను. నిన్ను ఓ ఆట ఆడుకుంటాను' అని ఆమెతో మరోసారి చెప్పాడు. ఈ విషయాన్ని ఎయిర్ లైన్స్ దృష్టికి తీసుకెళ్లగా అక్కడికొచ్చిన ఓ ఉద్యోగి ఆ ప్యాసింజర్ ను విమానం నుంచి దిగాలని చెప్పాడు. అయినా అతడిలో ఎలాంటి మార్పురాకపోగా.. తానేం తప్పు చేయలేదని, ఎలాంటి ఉల్లంఘన చర్యలకు పాల్పడలేదని వాదించాడు. చివరికి తన ప్రవర్తనకు మూల్యం చెల్లించుకుంటూ విమానం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. సిబ్బందికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎయిర్ లైన్స్ అధికారులు చెప్పారు. -
పెదవి విప్పిన ఫవాద్ ఖాన్
లాహోర్ : ఉడీ ఘటన అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మొదటిసారి పాక్ నటుడు ఫవాద్ ఖాన్ స్పందించాడు. మరింత శాంతియుత ప్రపంచాన్ని నిర్మించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. ఇద్దరు పిల్లలకు తండ్రిగా, అందరూ కోరుకుంటున్నట్టే తాను కోరుకుంటానని, మరింత శాంతియుత ప్రపంచాన్ని నిర్మించి అందులో జీవించగలగాలి అని తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నాడు. భవిష్యత్తుకు రూపమిచ్చే మన పిల్లల కోసం మనం ఈ పనిచేయగలమని విశ్వసిస్తున్నట్టు చెప్పాడు. గత వారాలుగా సాగుతున్న విచారకర సంఘటనలపై స్పందన తెలియజేయాలని మీడియా, తన ఫ్యాన్స్ కోరుతున్నారని ఫవాద్ ఖాన్ తెలిపారు. పాక్ నటులు దేశం విడిచి వెళ్లాలని, లేదంటే తామే గెంటేస్తామంటూ మహారాష్ట్ర నవ నిర్మాణసే(ఎంఎస్ఎన్) హెచ్చరించిన నేపథ్యంలో నటుడు ఫవాద్ ఖాన్(34) భారత్ నుంచి రహస్యంగా పాక్ చేరుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఘటనపై స్పందించని ఫవాద్ ఖాన్ తాజాగా స్పందించాడు. పాకిస్తానీ నటులపై భారత్‌లో నిషేధం విధిస్తున్న నేపథ్యంలో అతను దేశం విడిచి వెళ్లాడని రిపోర్టులు వచ్చాయి. కానీ తాను జూలైలోనే భారత్ విడిచి లాహోర్ కు వెళ్లానని, ఎటువంటి బెదిరింపులకు మాత్రం భయపడి వెళ్లలేదన్నాడు. తన భార్య రెండో సంతానానికి జన్మనివ్వబోతున్న క్రమంలో తాను లాహోర్ వెళ్లానని, ఈ వారం మొదట్లో భార్య సదాఫ్‌కు కూతురు పుట్టినట్టు ఫేస్బుక్లో తెలిపాడు. భారత్‌కు వ్యతిరేకంగా తాను మాట్లాడినట్టు వస్తున్న వార్తలను ఫవాద్ ఖండించాడు. తాను మొట్టమొదటిసారి ఈ విషయంపై స్పందిస్తున్నానని వివరించాడు. తనకు మద్దతుగా నిలిచిన తన ఫ్యాన్స్‌కు, పాకిస్తాన్, భారత్ వంటి ఇతర దేశాల నటులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఫేస్బుక్లో పోస్టు చేశాడు. 19 మంది జవాన్లను ఉడి ఘటనలో పాకిస్తాన్ టెర్రర్లు పొట్టనపెట్టుకోవడంపై ఫవాద్ స్పందించకపోవడంతో పలు విమర్శలను ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్ నుంచి వచ్చి భారత్ సినిమాల్లో నటిస్తున్న పాక్ నటులపై నిర్మాత మండలి గత నెల నిషేధం విధించింది. తాజాగా సల్మాన్ అగ వంటి పాకిస్తాన్ ప్రముఖ సంగీతకారులు ఉడి ఘటనను ఖండించారు. ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొన్నాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. -
జయలలితపై ఫేస్బుక్లో వదంతులు.. యువతిపై కేసు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేసినందుకు ఆ రాష్ట్రానికి చెందిన ఓ ఎన్నారై యువతిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. జయలలిత రెండు రోజుల క్రితమే మరణించినట్లు తనకు విశ్వసనీయ సమాచారం అందిందని ఫ్రాన్సులో నివసించే తమిళచి అనే యువతి తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. తమిళనాడులో అల్లర్లు సృష్టించడానికి ఆర్ఎస్ఎస్ వర్గాలే ఆమెను హత్యచేశాయని కూడా ఆమె ఆరోపించారు. ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసు, వీహెచ్‌పీ నేత సూరి హత్యకేసు, హిందూ మున్నానీ నాయకుడు శశికుమార్ కేసు.. వీటన్నింటినీ కూడా ఆమె తన పోస్టులో ప్రస్తావించింది. ఈ కేసుల్లో ముస్లింలపై ఆరోపణలు చేశారని.. ఆర్ఎస్ఎస్ వాళ్లు హిందూ ముస్లిం అల్లర్లు రెచ్చగొట్టబోతే జయలలిత అడ్డం పడ్డారని, అందుకే ఆమెను కూడా వాళ్లు చంపేశారని ఆమె తన ఫేస్బుక్లో రాసింది. జయలలిత ఆరోగ్యం గురించిన వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని కూడా ఆమె కోరారు. దీంతో జయలలిత ఆరోగ్యం గురించి వదంతులు ప్రచారం చేస్తున్నారంటూ అన్నాడీఎంకే ఐటీ విభాగం ఆమెపై ఫిర్యాదుచేసింది. క్రైం బ్రాంచి విభాగం పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 153ఎ, 505 (1), (2) కింద కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 22వ తేదీన జయలలిత తీవ్రజ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. -
కామెడీ షోలో ఆ నటిపై దారుణమైన జోక్స్!
మన టీవీల్లో వచ్చే కామెడీ షోల్లో దారుణమైన కుళ్లు జోకులు వేసి నవ్వించేందుకు కుప్పిగంతులు వేయడాన్ని మనం చూసే ఉంటాం. తాజాగా బాలీవుడ్ నటి తనిష్టా ఛటర్జీకి ఇదేవిధమైన చేదు అనుభవం ఎదురైంది. గ్రామీణ స్త్రీల సమస్యలపై సాహసోపేతంగా తెరకెక్కిన ’పర్చెడ్’ సినిమాలో రాధికా ఆప్తేతో కలిసి ఆమె బోల్డ్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా దర్శకురాలు లీనా యాదవ్, సహనటి రాధికా ఆప్తేతో కలిసి ’కామెడీ నైట్స్ బచావో’ షోలో ఆమె పాల్గొన్నది. ఈ షోలో 'రోస్ట్' (ఆరోగ్యకరమైన జోక్స్) పేరిట ఆమె నల్లగా ఉన్నదని హేళన చేశారు. 'మీకు చిన్నప్పటి నుంచి నల్లరేగడి పళ్లు ఇష్టమా? మీరు అవి బాగా తిని ఉంటారు కదా' అంటూ ఆమె ఒంటిరంగును హేళన చేస్తూ కుళ్లు జోకులు వేశారు. దీంతో కంగుతిన్న ఆమె వెంటనే నిరసన తెలిసింది. మనుషుల రూపురేఖలని చులకన చేసే వ్యాఖ్యలతో పరిహాసమాడటం ఏమీ బాగా లేదని ఆమె షో నుంచి వైదొలిగింది. దేశవ్యాప్తంగా ప్రసారమయ్యే ఓ కామెడీ షోలో ఇంత దారుణంగా జోక్స్ వేయడం తనను షాక్‌కు గురిచేసిందని ఆమె తన ఫేస్బుక్ పేజీలో తెలిపారు. అసభ్యకరమైన పరిహాసాలు చేసినందుకు కామెడీ షో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒంటిరంగు కారణంగా మన దేశంలో చాలామందికి ఉద్యోగాలు రావడం లేదని, పెళ్లి ప్రకటనల్లోనూ శరీర ఛాయ ప్రధానపాత్ర పోషిస్తున్నదని, దేశంలోని కులవ్యవస్థ మూలాల్లోనే ఈ వర్ణ వివక్ష కూడా ఉందని ఆమె విశ్లేషించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన కశ్మీరీ విద్యార్థిపై...
అలిగర్ : యూరీ ఆర్మీ బేస్ క్యాంప్‌పై జరిగిన ఉగ్రదాడిపై అభ్యంతరకర కామెంట్లను ఫేస్బుక్లో పోస్టు చేసినందుకు ఓ విద్యార్థుడిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. అలిగర్ ముస్లి యూనివర్సిటీ(ఏఎంయూ)లో ఆర్గనిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్‌ను అభ్యసిస్తున్న కశ్మీరీ విద్యార్థుడు ముదాస్సర్ యూసఫ్ యూరీ ఉగ్రదాడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏఎంయూ వైస్ ఛాన్సరల్ లెప్టినెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్ షా, ఆ విద్యార్థుడిని యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. జాతివ్యతిరేకంగా ఎలాంటి అసహన ఘటనలు తావెత్తకుండా ఉండేందుకు లిప్టినెంట్ జనరల్ షా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూనివర్సిటీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. సెంటిమెంట్లను దెబ్బతీసేవిధంగా ఈ కామెంట్లను పోస్టు చేసినందుకు వైస్ చాన్సలర్‌కు ముదాస్సర్ యూసఫ్ ఆదివారమే క్షమాపణ చెప్పుకున్నాడు. కానీ ఈ విషయం చాలా సున్నితమైనది కారణంగా యూనివర్సిటీ అధికారులు విద్యార్థుడిని యూనివర్సిటీ నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆ విద్యార్థుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైస్ ఛాన్సలర్‌కు బీజేపీ లోక్‌సభ సభ్యులు లేఖ రాశారు. ఆదివారం వేకువ జామున కశ్మీర్‌లోని యూరీ బేస్ క్యాంపుపై జరిగిన ఈ దాడిలో 18 మంది భారత సైన్యం మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను భారత్‌తో పాటు యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఘటనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితులో వదిలేది లేదని భారత ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీచేసింది. -
డ్రస్ బాగోలేదని డైనింగ్ టేబుల్ ఇవ్వనన్నారట!
కోల్కత్తా : డ్రస్ మంచిగా వేసుకురాలేదట. డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ ఇవ్వనంటోంది ఓ రెస్టారెంట్. మళ్లీ ఆ రెస్టారెంట్‌కు ఎంత పేరు ఉందో తెలుసా.? కోల్ కత్తాలోని పార్క్ స్ట్రీట్‌లో ఆ రెస్టారెంట్ తెలియని వాళ్లుండరు. 60 ఏళ్లుగా సర్వీసులను అందిస్తూ ఐకానిక్‌గా నిలుస్తున్న మోకాంబో రెస్టారెంట్ ప్రస్తుతం జాత్యంహకారం ఆరోపణలతో పాటు పలు విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ రెస్టారెంట్ చేసిన నిర్వాకంపై ఫేస్బుక్లో ఓ కస్టమర్ పూసగుచ్చినట్టు వివరించింది. దీంతో రెస్టారెంట్‌కు వ్యతిరేకంగా నమోదైన ఈ పోస్టుపై 10వేలకు పైగా రియాక్షన్స్, 16వేల షేర్లు, 3వేల కామెంట్లు వెల్లువెత్తుతూ వైరల్ సృష్టిస్తున్నాయి. దిల్షాన్ హేమ్నాని అనే మహిళ కోల్కత్తా నగరానికి విజిటర్‌గా వచ్చింది. వారం రోజులుగా అవసరార్థం నియమించుకున్న తను, డ్రైవర్ మనీష్ డిన్నర్ కోసం మోకాంబో రెస్టారెంట్‌కు వెళ్లారు. డిన్నర్ టేబుల్ కోసం క్యూలో వేచిఉన్న వీరిని రెస్టారెంట్ స్టాఫ్ అసలు పట్టించుకోలేదు. దీంతో తమకెందుకు టేబుల్ సౌకర్యం కల్పించడం ప్రశ్నించగా సాకులు చెప్పడం మొదలు పెట్టారు రెస్టారెంట్ స్టాఫ్. డ్రైవర్ సరియైన బట్టలు వేసుకోలేదని కొందరు, అతను తాగి ఉన్నాడని మరికొందరు స్టాఫ్ ఆమెతో వాదించారట. జాత్యాంహకార భావనతో రెస్టారెంట్ స్టాఫ్ ఈ మాదిరి వ్యవహరిస్తున్నారని గుర్తించిన హేమ్నాని, రెస్టారెంట్ ఓనర్ సిద్ధార్థ కొథారిని కాంటాక్టు చేసింది. అయితే తను కూడా ఇదే మాదిరి సమాధానమిచ్చాడు. డ్రైవర్ ధరించిన దుస్తులు బాగాలేవని, ఒకవేళ గెస్టులు శుభ్రంగా లేకపోతే, ఇతర కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వస్తాయంటూ సాకులు చెప్పాడట. రెస్టారెంట్ నిర్వర్తించిన ఈ అమానుష చర్యపై హేమ్నాని ఫేస్బుక్లో వివరిస్తూ ఓ పోస్టు పెట్టింది. ఈ పోస్టుపై స్పందించిన కస్టమర్లు రెస్టారెంట్ నిర్వాకంపై మండిపడుతున్నారు. ఒకవేళ తాను డర్టీగా రెస్టారెంట్‌కు వెళ్తే, అలానే బయటికి పంపిస్తారా అంటూ సుదీప్తో రాయ్ అనే వ్యాపారవేత్త ప్రశ్నించారు. బాయ్‌కాట్ మోకాంబో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కొంతమంది కస్టమర్లు రెస్టారెంట్‌కు మద్దతు పలుకుతున్నారట. ప్రస్తుతం ఈ పోస్టు ఫేస్బుక్లో వైరల్ సృష్టిస్తోంది. -
ఫేస్బుక్లో ఫొటోలు పెట్టాడని.. బాలిక ఆత్మహత్య
సోషల్ మీడియా.. మరో చావుకు కారణమైంది. ప్రేయసి తనకు దూరమైందన్న ఉక్రోషంతో ఓ యువకుడు గతంలో తామిద్దరం సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దాంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా బిష్ణుపూర్‌లో జరిగింది. ఫేస్బుక్లో వీళ్ల ఫొటోలు విపరీతంగా సర్క్యులేట్ కావడంతో పాటు వాటికి కామెంట్లు కూడా పిచ్చిపిచ్చిగా వస్తుండటంతో ఆమె తట్టుకోలేకపోయింది. 20 ఏళ్ల యువకుడికి, 12వ తరగతి చదివే బాలికు మధ్య మూడేళ్ల పాటు ప్రేమాయణం నడిచింది. అయితే, ఏడాది క్రితం కుటుంబ సమస్యల కారణంగా వాళ్లిద్దరూ విడిపోయారు. దీనిపై మౌనంగా ఉండకపోతే ఆ ఫొటోలను ఫేస్బుక్లో పెడతానంటూ యువకుడు చాలాసార్లు బెదిరించాడు. చిరవకు తాను అన్నంత పనీ చేశాడు. ఆ బాధను తట్టుకోలేని బాలిక.. ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని బాలిక తల్లిని సైతం అతడు బెదిరించాడు. దాంతో అతడి గురించి బాలిక తల్లి పోలీసులకు ముందే ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు స్పందించి చర్యలు తీసుకునేలోపే బాలిక ప్రాణాలు తీసుకుంది. -
నటులపై ఫేస్బుక్లో పోస్టు పెట్టినందుకు..
-
నటులపై ఫేస్బుక్లో పోస్టు పెట్టినందుకు..
కావేరి నదీ జలాల విషయంలో కన్నడ నటుల ఆందోళనను ఎద్దేవా చేస్తూ ఫేస్బుక్లో పోస్టు పెట్టిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. కొందరు దుండగులు అతన్ని చితకబాదారు. తమిళనాడుకు 15వేల క్యూసెక్కుల నీటిని పదిరోజులపాటు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేయడంతో కర్ణాటక భగ్గుమన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కన్నడ సంఘాలు ఆందోళనకు దిగి.. శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్‌ను చేపట్టాయి. ఈ బంద్ నేపథ్యంలో ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి డీ సంతోష్ ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టాడు. కావేరి జలాల ఆందోళనలో కన్నడ నటులు శివరాజ్‌కుమార్, 'దునియ' విజయ్, రాగిణి ద్వివేది, దర్శన్ పాల్గొనడాన్ని తప్పుబడుతూ అతను విమర్శలు చేశాడు. అతని పోస్టు కర్ణాటకలో వైరల్‌గా మారింది. దీంతో ఆగ్రహించిన బెంగళూరు స్థానిక యువకులు కొందరు అతన్ని వెతికిమరీ పట్టుకున్నారు. కాలేజీ గేటు వద్ద అతన్ని అటకాయించి చితకబాదారు. ఐదుగురు అతన్ని చుట్టుముట్టి చితకబాదుతున్న వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
ఫొటో పిచ్చితో.. పోలీసులకు దొరికేసింది
ఆస్తులకు సంబంధించిన అనేక కేసులున్న అమీ షార్ప్ అనే ఆస్ట్రేలియన్ యువతి.. ఫొటో పిచ్చితో పోలీసులకు దొరికేసింది. ఆమె జైలు నుంచి పారిపోవడంతో ఆ విషయాన్ని రిపోర్టు చేస్తూ, ఒక మీడియా సంస్థకు చేసిన ఫేస్బుక్ పోస్టులో పెట్టిన తన ఫొటో బాగోలేదని ఆమె భావించింది. దాంతో ఆ పోస్టుకు కామెంటు పెడుతూ.. ఆ ఫొటోకు బదులు ఈ కొత్త ఫొటోను వాడాలని కోరింది. దాంతో సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలు, ఫొటో కూడా విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఎప్పటినుంచో దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న షార్ప్ ఫొటోను ఇటీవలే పోలీసులు స్థానిక టీవీ చానళ్ల వారికి అందజేశారు. ఈ మనిషి ఎక్కడ కనపడినా వెంటనే ఆచూకీ చెప్పాలని సిడ్నీ పోలీసులు తెలిపారు. 'ఛానల్ 7 న్యూస్' అనే వార్తా చానల్ తమ ఫేస్బుక్ పేజీలో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. దానికి మొట్టమొదట స్పందించిన వ్యక్తి.. అమీ షార్ప్. మీరు ప్రచురించిన ఫొటోలో తాను ఏమాత్రం బాగోలేనని, పైగా భుజాల చుట్టూ ఎర్రటి శాలువా కప్పుకొని ఉన్నానని చెప్పింది. కొత్త ఫొటోను కూడా ఆమె అక్కడ పోస్ట్ చేసి, ఈ ఫొటో వాడండి అని సలహా ఇచ్చింది. ఆమె కామెంటును ఏకంగా 50 వేల మంది లైక్ చేశారు. చివరకు ఈ ఫొటో, ఆమె ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు అమ్మడిని పట్టుకుని జైల్లో వేశారు. -
కేజ్రీవాల్ జోస్యం నిజమైందోచ్!
గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ ఊహించనిరీతిలో తన పదవికి రాజీనామా చేశారు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఏకంగా ఫేస్బుక్లో తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్ మీడియా వినియోగంలో చాలా ముందుంటారనే విషయం తెలిసిందే. మోదీ బాటలోనే నడుస్తూ ఆనందిబెన్ కూడా సోషల్ మీడియా వేదికగా రాజీనామా నిర్ణయం వెల్లడించారు. ఇది ఈ రోజుల్లో సాధారణ విషయమే కానీ.. ఇంతకూ ఆనందిబెన్ రాజీనామా రాజీనామా నెటిజన్లు ఏమంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నుంచి సామాన్య నెటిజన్ వరకు ఏమంటున్నారంటే.. ఆనందిబెన్ ఫేస్బుక్ ద్వారా తన రాజీనామాను ప్రకటించారు. 'డిజిటల్ ఇండియా' పథకంలో ఇది కొత్త అఛీవ్మెంట్ అని చెప్పొచ్చు. #AnandibenPatel resigns via Facebook. A new achievement under Digital India initiative ! — Saket Aloni (@SaketAloni) August 1, 2016 'అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన మరో జోస్యం నిజమైంది. ఆనందిబెన్ రాజీనామా చేసింది' అంటూ ఓ నెటిజన్ రెండు నెలల కిందట కేజ్రీవాల్ చేసిన ట్వీట్‌ను గుర్తుచేశాడు. 'ఆనందిబెన్ అవినీతి, అక్రమాల పరిపాలనతో ప్రజలు విసిగిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ మద్దతు లభిస్తున్నది. త్వరలోనే బీజేపీ ఆనందిబెన్‌ను మార్చి ఆయన స్థానంలో అమిత్ షాను కూర్చోబెట్టబోతున్నదని విశ్వసనీయంగా తెలుస్తున్నది' అని కేజ్రీవాల్ గత జూన్ 9న చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. Another prediction of @ArvindKejriwal comes true. #Anandibenpatel to resign as Guj CM..lol...coward and psycho feku pic.twitter.com/K8wY18aO2V — Mayur Panghaal (@mayurpanghaal) August 1, 2016 ఆనందిబెన్ ఫేస్బుక్లో రాజీనామా పోస్టుచేశారు. దానిని కేజ్రీవాల్ లైక్ కొట్టారు. Gujarat CM Anandiben Patel posted her resignation on Facebook. Arvind Kejriwal Liked it — Joy (@Joydas) August 1, 2016 ఆనందిబెన్ రాజీనామాను బీజేపీ ఆమోదించవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ గోవుల రక్షణకు కట్టుబడి ఉంది. #AnandibenPatel has resigned. The BJP will probably accept because they are committed to taking care of cows. — lindsay pereira (@lindsaypereira) August 1, 2016 కేజ్రీవాల్ ఏమంటున్నారంటే.. గుజరాత్లో ఆప్‌కు ప్రజాదరణ పెరిగిపోతుండటంతోనే ఆనందిబెన్ రాజీనామా చేశారు. గుజరాత్ విషయంలో ఇప్పుడు బీజేపీ భయపడుతోంది... గుజరాత్లో అవినీతికి వ్యతిరేకంగా ఆప్ జరిపిన పోరాట విజయమే ఆనందిబెన్ రాజీనామా.. - ట్విట్టర్లో అరవింద్ కేజ్రీవాల్ మేడం మీరు వెళ్లొద్దు.. ఆనందిబెన్ రాజీనామా నిర్ణయంపై ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేశారు. "మేడం మీరు ముఖ్యమంత్రిగా కొనసాగాలి. గుజరాత్ కోసం మీరు ఎంతగా కష్టపడుతున్నారో ప్రజలకు తెలియదు. తమ చేతుల్లో ఉన్న వజ్రాన్ని ప్రజలు గుర్తించడం లేదు' అని దేవల్ షా అనే వ్యక్తి ఆనందిబెన్ రాజీనామా పోస్టుపై కామెంట్ చేశారు. -
రాజీనామాకు సిద్ధపడ్డ ముఖ్యమంత్రి!
-
రాజీనామాకు సిద్ధపడ్డ ముఖ్యమంత్రి!
అహ్మాదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ అనూహ్యరీతిలో రాజీనామాకు సిద్ధపడ్డారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించాలని ఆమె సోమవారం బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. గుజరాత్లో దళితులపై దాడులను నివారించడంలో ఆనందిబెన్ సర్కారు విఫలమైందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తనకు వయస్సు మీద పడుతున్నదని, ఈ నేపథ్యంలో తనను సీఎం పదవి నుంచి తప్పించాలని ఆనందిబేన్ తన ఫేస్బుక్ పేజీలో బీజేపీ అధినాయకత్వాన్ని కోరారు. ఆనందిబెన్ వచ్చే నవంబర్‌లో 75వ ఏట అడుగుపెట్టబోతున్నారు. మరోవైపు వచ్చే ఏడాది గుజరాత్లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ అభివృద్ధి నమూనాను దేశమంతటా ప్రచారం చేసి నరేంద్రమోదీ ప్రధానిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టడంతో ఆయన స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ ప్రమాణం స్వీకరించారు. ఆనందిబెన్ హయాంలోనే పటేళ్ల రిజర్వేషన్ల ఆందోళన గుజరాత్‌ను కుదిపేసింది. దీనికితోడు గుజరాత్ ఉనాలో దళిత యువకులపై జరిగిన దాడి దేశమంతటా గగ్గోలు రేపింది. ఈ నేపథ్యంలో ఆనందిబెన్ రాజీనామాకు సిద్ధపడటం గమనార్హం. -
ఎఫ్బీలో అభ్యంతరకర పోస్ట్.. ఐఏఎస్‌కు నోటీసులు
రాయ్‌పూర్: ఫేస్బుక్లో వివాదాస్పద పోస్ట్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ అలెక్స్ పాల్ మీనన్‌కు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 'మరణశిక్షల్లో ఎక్కువగా ముస్లింలు, దళితులే ఉంటున్నారు.. భారత న్యాయవ్యవస్థలో వివక్షత ఉందా' అంటూ సోషల్ మీడియాలో అలెక్స్ చేసిన పోస్ట్‌ను జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచారం చేసింది. దీంతో ఓ ప్రభుత్వ అధికారి న్యాయవ్యవస్థ నిబద్దతపై సందేహం వ్యక్తం చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చత్తీస్‌గఢ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ నిధి చిబ్బర్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా అలాంటి పోస్టులు సోషల్ మీడియాలో ఉంచడం పరిపాలనా అధికారుల నిబంధనలకు వ్యతిరేకమైంది. దీంతో అతడిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అలెక్స్ దీనిపై నెలరోజుల గడువులోపు వివరణ ఇవ్వనున్నారు. 2012లో సుక్మా జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో అలెక్స్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేయడంతో వార్తల్లో నిలిచాడు. -
కుక్కలను చంపి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు
-
కుక్కలను చంపి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు
హైదరాబాద్ : తమిళనాడులో ఓ కుక్కను వైద్య విద్యార్థులు మేడ మీద నుంచి తోసేసిన ఘటన మరవక ముందే హైదరాబాద్ లోనూ అటువంటి అమానుష ఘటనే చోటుచేసుకుంది. మూడు కుక్కలను చంపి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ముగ్గురు ఆకతాయిలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నగరంలోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు యువకులు కొన్ని రోజుల క్రితం ఓ కుక్కను చంపేశారు. దాన్ని వీడియో తీసి.. ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇది గమనించిన సైబర్ పోలీసులు ఆ మైనర్లపై కేసు నమోదు చేశారు. ఇవాళ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము సరదా కోసమే ఆ పని చేశామని వాళ్లు చెప్పడం గమనార్హం. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో సంచలనం సృష్టిస్తోంది. -
టీఆర్పీ రేటింగ్స్ కోసమే కశ్మీర్లో చిచ్చు!
చానెళ్ల తీరుపై మారకపోతే రాజీనామా చేస్తాను: కశ్మీర ఐఏఎస్ టాపర్ హెచ్చరిక సివిల్స్ పరీక్షల్లో తొలి కశ్మీర్ టాపర్ షా ఫైజల్ తాజాగా లోయలో జరగుతున్న హింసాత్మక ఘటనలపై ఫేస్బుక్లో స్పందించారు. ‘రాజ్యం తన పౌరుల్ని తానే చంపడం.. గాయపర్చడం.. తనను తాను గాయపర్చుకొని.. స్వీయవిధ్వంసం చేసుకోవడమేనని’ అని ఆయన తన తాజా పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం కశ్మీర్లో పాఠశాల విద్య డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఫైజల్.. తన ఫొటోలు, మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వనీ మృతదేహం ఫొటోలు పక్కపక్కనపెట్టి కొన్ని చానెళ్లు కథనాలు ప్రసారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మీడియా తన తీరు మార్చుకోకపోతే త్వరలోనే ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ఆయన హెచ్చరించారు. ‘నా ఫొటోలు, మృతిచెందిన మిలిటెంటర్ కమాండర్ బుర్హాన్ వనీ ఫోటోలు కలిపి చూపించడం ద్వారా ఓ సెక్షన్ జాతీయ మీడియా తన సంప్రదాయబద్ధమైన కథనాలు వండివారుస్తోంది. అబద్ధాలు, ప్రజల్లో విభజన ప్రాతిపదికగా ప్రసారం చేసే ఈ కథనాలు మరింత విద్వేషాన్ని రేపుతాయి’ అని ఫైజల్ ఆందోళన వ్యక్తం చేశారు. ’ప్రస్తుత మరణాలతో కశ్మీర్ తీవ్ర సంతాపంలో మునిగిపోయిన సమయంలో న్యూస్‌రూమ్స్ నుంచి రెచ్చగొట్టేలా వెలువడుతున్న వాడీవేడి కథనాలు కశ్మీరీలను మరింత ఏకాకులను చేస్తున్నాయి. వారిలో మరింత ఆగ్రహాన్ని రేపుతున్నాయి. భారత ప్రభుత్వం కన్నా మీడియా తీరే దారుణంగా ఉంది’ అని ఫైజల్ పేర్కొన్నారు. కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసం కశ్మీర్ లోయలో చిచ్చురేపుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ఆయన సూచించారు. ఇలాంటి మూర్ఖమైన టీవీ చర్చల్లో తాను పరోక్షంగా భాగం కావడం ఎంతో చికాకును కలిగిస్తున్నదని, టీవీ చానెళ్లు తనను చిత్రీకరించిన తీరు ఎంతో బాధకు గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. -
త్వరలో 45 భాషల్లో ఫేస్బుక్ పోస్టులు..
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న నానా భాషల వారికి మరింత చేరువ అయ్యేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను పరిచయం చేయనుంది. మనం చేసే పోస్టులు అవంతట అవే వివిధ భాషల్లోకి తర్జుమా అయ్యేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. 45 భాషల్లో పోస్టులను తర్జుమా చేసి చూపిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ సాఫ్ట్‌వేర్‌ను 5,000 వ్యాపార, వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన పేజెస్‌లో ఉపయోగిస్తున్నారని సంస్థ వెల్లడించింది. త్వరలోనే ఈ సాఫ్ట్‌వేర్‌ను పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి తేనున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. -
'16 సార్లు ఫోన్ చేశాడు'
వాషింగ్టన్: అమెరికాలోని ఆర్లెండో నైట్ క్లబ్ లో నరమేధం సృష్టించిన ఒమర్ మతీన్ కు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పాశ్చాత్య సంస్కృతిని అసహ్యించుకుంటూ ఫేస్బుక్ లో పుంఖాను పుంఖాలుగా అతడు రాతలు రాశాడు. కాల్పులకు ముందు, కాల్పుల సమయంలోనూ అతడు ఫేస్బుక్ లో పోస్ట్ లు పెట్టాడని భద్రత, ప్రభుత్వ వ్యవహారాల సెనెట్ కమిటీ చైర్మన్, సెనేటర్ రాన్ జాన్సన్ వెల్లడించారు. ఆదివారం తెల్లవాజామున ఆర్లెండో నైట్ క్లబ్ లో కాల్పులు జరపడానికి ముందు మతీన్ 16 ఫోన్ కాల్స్ చేశాడని తెలిపారు. 911 నంబర్ కు మూడు సార్లు, స్థానిక టీవీ చానల్ కు ఒకసారి ఫోన్ చేశాడని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తుకు సహకరించాలని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్గ్ జుకర్ బర్గ్ కు లేఖ రాశారు. ఫేస్బుక్ లో మతీన్ రాతలను బట్టి అతడు ఎలాంటి వాడో తెలుస్తోందన్నారు. ఇలాంటి కేసుల్లో గతంలోనూ ఫేస్బుక్ సహరించిందని గుర్తు చేశారు. ఫేస్బుక్ ను టార్గెట్ చేయాలన్న ఉద్దేశం తమకు లేదని, కమిటీ విచారణకు సహకరించాలని జాన్సన్ కోరారు. తమ దగ్గరున్న సమాచారం ప్రకారం 5 ఫేస్బుక్ ఖాతాలున్నాయని చెప్పారు. జూన్ 12న అతడు పల్స్ ఆర్లెండో, షూటింగ్ అనే పదాలతో ఇంటర్నెట్ లో వెతికాడని వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ పై అమెరికా, రష్యా దాడులు ఆపాలని అతడు ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడని తెలిపారు. నిజమైన ముస్లిం పాశ్చాత్య విధానాలను అంగీకరించడని రాశాడని వెల్లడించారు. -
అమెరికాలో అతడు చెప్పినట్టే జరుగుతున్నాయి!
భవిష్యత్ ను ముందే ఊహించి అతడు చెప్పినవి చెప్పినట్టు జరుగుతున్నాయి. అమెరికాలో ఏం జరగబోతుందో చెబుతూ గతేడాది డిసెంబర్ లో పాబ్లో రెయెస్ అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతోంది. దిగ్గజ బాక్సర్ మహ్మద్ అలీ, పాప్ మ్యూజిక్ స్టార్ ప్రిన్స్ మరణం, ఆర్లెండో నైట్ క్లబ్ లో నరేమేధం నేపథ్యంలో ఈ పోస్ట్ మళ్లీ వార్తల్లో నిలిచింది. పాబ్లో రెయెస్ చెప్పినట్టుగా అమెరికాలో ఘటనలు జరుగుతుండడంతో అంతా విస్తుపోతున్నారు. 2016లో అమెరికాకు హిల్లరీ క్లింటన్ తొలి మహిళా అధ్యక్షురాలు అవుతారని, గోరిల్లా మరణం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని, ప్రిన్స్, మహ్మద్ అలీ, కింబొ స్లైస్, డొనాల్డ్ ట్రంప్ చనిపోతారని తన పోస్ట్ లో పేర్కొన్నాడు. అమెరికా చరిత్రల్లో భారీ కాల్పులు చోటు చేసుకుంటాయని కూడా ఊహించి చెప్పాడు. ఎవరినీ భయపెట్టడానికి తాను ఈ విషయాలు చెప్పడం లేదని, కానీ తన పేరును అందరూ గుర్తు పెట్టుకుంటారని తన పోస్ట్ లో రాశాడు. అతడు చెప్పినట్టుగానే అమెరికాలో ఘటనలు జరుగుతున్నాయి. అతడు అంత కచ్చితంగా ఎలా చెప్పగలిగాడని అందరూ ఆశ్చర్య పోతున్నారు. పాబ్లో రెయెస్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటివరకు 2 లక్షల మందిపైగా దీన్ని షేర్ చేశారు. ఈ సంఖ్య ప్రతి నిమిషానికి పెరుగుతోంది. అయితే పాబ్లో రెయెస్ ఎవరు అనేది ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. -
లైవ్‌లో ఓ సాఫ్ట్వేర్ నరాలు తెంపేసుకున్నాడు
గుర్గావ్: లైవ్‌లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తన స్నేహితుడితో ఫేస్ బుక్‌లో చాట్ చేస్తూ ఆత్మహత్యా లేఖను అందులో పోస్ట్ చేసి ల్యాప్ టాప్ కెమెరాకు చూపించి మరీ తన చేతి నరాన్ని తెంపేసుకున్నాడు. దీంతో అతడి స్నేహితుడు పోలీసులకు విషయం చెప్పడంతో శరవేగంగా వారు స్పందించి అతడిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరుణ్ మాలిక్ అనే 30 ఏళ్ల యువకుడు తన తండ్రితో కలిసి ఉంటున్నాడు. 2012లో సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. గత కొద్ది రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్న అతడు జీవితం మీద విరక్తి భావనతో ఉన్నట్లు అతడి స్నేహితులు తెలిపారు. గత రెండు రోజుల్లోనే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన అతడు మంగళవారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో తన స్నేహితుడితో చాట్ చేస్తూనే అతడికి కెమెరాలో చూపిస్తూ తన చేతి నరాలు కత్తితో కోసుకున్నాడు. దీంతో పోలీసులు సమాచారం అందించగా వారు వేగంగా స్పందించి అతడిని రక్షించారు. అతడికి ఇంకా వివాహం కాలేదు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్న అతడి నుంచి వాంగ్మూలం నమోదుచేసుకునేందుకు పోలీసులు ఎదురుచూస్తున్నారు. -
'99 శాతం వ్యక్తులకు దమ్ము, ధైర్యం లేదు'
ముంబై: తనపై వస్తున్న కామెంట్లపై బాలీవుడ్ హీరో ఫర్దీన్ ఖాన్ స్పందించాడు. బరువు పెరుగుతున్నందుకు తానేమి సిగ్గుపడటం లేదని ఫేస్ బుక్ లో గురువారం రాత్రి పోస్ట్ చేశాడు. గత కొన్ని రోజులుగా ఫర్దీన్ బరువు పెరగడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని, ఏ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని 'నో ఎంట్రీ' స్టార్ పేర్కొన్నాడు. కామెంట్లు చేస్తున్న వారిలో 99 శాతం మంది దమ్ము, ధైర్యం లేని వారని.. ఇందులో సందేహమే లేదని మరోసారి కామెంట్ చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలని హెచ్చరించాడు. తనపై కామెంట్లు చేస్తున్న వాళ్ల కంటే గుంపుగా ఉన్న పిరికివాళ్లే నయం అంటూ విమర్శించాడు. కామెంట్లు చేస్తున్నారే తప్ప తర్వాత ఏం జరుగుతుంది.. అవతలి వ్యక్తులు ఎలా రియాక్ట్ అవుతారని వారు ఆలోచించరని చెప్పాడు. సెలబ్రిటీలను ఇంటర్నెట్ మాధ్యమంగా చేసుకుని డిస్టర్బ్ చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డాడు. పిరికి పందల గుంపులు పనిపాటా లేని సమయంలో చేస్తున్న కామెంట్లపై ఎక్కువగా ఒత్తిడికి గురవ్వాల్సిన పనిలేదని, వీకెండ్ టాపిక్ గా మారినందుకు హ్యాపీగా ఉందని పోస్ట్ లో హీరో ఫర్దీన్ ఖాన్ రాసుకొచ్చాడు. -
'లక్ష రూపాయలకు నా భార్యను అమ్మేస్తా'
- ఫేస్బుక్లో ఓ ప్రబుద్ధుడి నిర్వాకం ఇండోర్: ప్రపంచమంతా మహిళా దినోత్సవం జరుపుకొంటున్న సందర్భంలోనే మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఓ వికృత ఘటన చోటుచేసుకుంది. అప్పుల పాలైన ఓ 30 ఏళ్ల వ్యక్తి.. వాటిని తీర్చుకోవడానికి తన భార్యను అమ్మడానికి సిద్ధమయ్యాడు. లక్ష రూపాయలు ఇస్తే తన భార్యను అమ్మేస్తానంటూ ఏకంగా ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. అతని నిర్వాకంతో నివ్వెరపోయిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్త దిలీప్ మాలిపై ఐపీసీ సెక్షన్ 509 (మాటలు, చర్యలు, చేష్టలతో మహిళలను కించపరచడం) ఎరోద్రోమ్ పోలీసు స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు దిలీప్ సింగ్ తన భార్య, రెండేళ్ల కూతురు ఫొటోను ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఆ పోస్టులో తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. తన భార్యను అమ్మాలనుకుంటున్నాని హిందీలో ఈ పోస్టులో పేర్కొన్నాడు. 'వేర్వేరు వ్యక్తుల వద్ద నేను తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నా. అందుకే నా భార్యను లక్ష రూపాయలకు అమ్మేస్తాను. ఎవరైనా కొనేందుకు ఆసక్తిగా ఉంటే నా ఫోన్ నంబర్‌కు సంప్రదించండి' అని అతడు తన పోస్టులో పేర్కొన్నాడు. తన బంధువుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అతని భార్య షాక్ తింది. తనను, తన కుటుంబసభ్యులను అవమానపరిచేందుకు అతను ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దిలీప్ మాలితో ఆమెకు మూడేళ్ల కిందట పెళ్లయింది. వివాహం అనంతరం ఈ జంట ఇండోర్‌లో స్థిరపడింది. అక్కడ తెలిసినవారందరి దగ్గరా అప్పులు చేసిన దిలీప్.. వాటిని తీర్చలేక తన పూర్వీకుల ఊరికి పరారయ్యాడు. దీంతో చేసేదేమీ లేక తాముంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేసి అతని భార్య, రెండేళ్ల కూతురు తమ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. -
ఎవరిదో..?
డోసు ఎక్కువైతే మందుబాబులు తమను తాము మరిచిపోయి... వీరంగం వేయడం చూస్తుంటాం. అలాగే మొబైల్ ఫోన్లు, పర్సులు, ఇతర విలువైన వస్తువులను మర్చిపోవడమో, పారేసుకోవడమో చేస్తుంటారు. అయితే బ్రిటన్‌లోని యార్క్‌షైర్‌లో ఓ దివ్యాంగుడు చేసిన పని మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. గురుడు బాగా తాగేసి... తన కృత్రిమకాలును బార్ ముందు వదిలేసి వెళ్లిపోయాడు. పరిస్థితిని బట్టి చూస్తుంటే ఫూటుగా తాగి... చేతిలో బీరు బాటిల్‌తో బయటకు వచ్చిన అతను బార్ మూతపడ్డాక దాని ముందే పేవ్‌మెంట్‌పై కూర్చొని మందుకొట్టాడు. ఆ క్రమంలో కృత్రిమకాలును తీసి పక్కన అలా నిలబెట్టాడు. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయినట్లున్నాడు. ఎందుకంటే కృత్రిమకాలు వెనకే సగం ఖాళీ చేసిన బీరు సీసా కూడా కనిపిస్తోంది. ఈ కాలును ఫొటో తీసి యార్క్‌షైర్ ఫేస్బుక్ పేజీలో ఎవరో పోస్ట్ చేశారు. ‘రాత్రి ఎవరైనా డోంకస్టర్‌లో కృత్రిమకాలును పోగొట్టుకున్నారా?’ అని క్యాప్షన్ పెట్టారు. దాంతో రకరకాల కామెంట్లతో ఈ ఫొటో సోషల్ సైట్లలో చక్కర్లు కొట్టింది. -
ప్రాణం తీసిన ఫేస్బుక్ పోస్ట్
సీనియర్‌ను ‘శిష్యా’ అని పిలిచాడని హత్య సాక్షి, బెంగళూరు: ఫేస్బుక్లో పెద్దవాడికి ‘హాయ్ శిష్యా’ అంటూ పోస్ట్ చేయడం 20 ఏళ్ల యువకుడి ప్రాణం తీసింది. ఈ దురాగతానికి పాల్పడిన ఏడుగురిలో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. బెంగళూరులో ఉంటున్న అరుణ్‌కుమార్ (20) కెంపేగౌడ విమానాశ్రయంలోని కార్గో విభాగంలో పనిచేస్తున్నాడు. ఫేస్బుక్లో ఫ్రెండ్స్‌తో ఛాట్ చేసేవాడు. పదిహేను రోజుల క్రితం కళాశాలలో తనకంటే సీనియర్ అయిన బెంగళూరుకు చెందిన సందీప్‌కు ఫేస్బుక్లో ‘హాయ్ శిష్యా’ అని పోస్ట్ చేశాడు. దీంతో సందీప్ ఆగ్రహించాడు. సోమవారం రాత్రి సందీప్ స్నేహితులు అరుణ్ ఇంటికెళ్లారు. అరుణ్‌ను కారులో ఎక్కించుకుని బాగళూరు క్రాస్ వద్దకు చేరుకోగానే అరుణ్‌ను చాకుతో పొడిచి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలైనఅరుణ్ను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అరుణ్ మృతిచెందాడు. అరుణ్మృతికి కారకులుగా భావిస్తున్న వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మిగిలిన వారి కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. -
ఫేస్'బుక్క'య్యింది... మహిళకు ఆర్నెల్లు జైలు
యంగాన్: మయన్మార్‌లో సైన్యాన్ని కించపరిచేలా ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు ఓ యువతికి ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. చా శాండి టున్ అనే మహిళ.. ఆర్మీ చీఫ్ యూనిఫాం రంగును మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమనేత, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచి ధరించే దుస్తులతో (లుంగీ) పోల్చుతూ పోస్ట్ చేసింది. 'మీరు అమ్మను ప్రేమిస్తే.. మీ తలపై తల్లి వస్త్రాన్ని (లుంగీ) ఎందుకు చుట్టుకోరాదు' అని ఫేస్బుక్ పేజీలో రాసింది. ఈ ఫేస్బుక్ పోస్ట్‌పై దుమారం రేగడంతో గత అక్టోబర్‌లో చా టున్ను అరెస్ట్ చేశారు. అయితే చా టున్ ఈ పోస్ట్ చేయలేదని, తన ఎకౌంట్‌ను హ్యాక్ చేశారని ఆమె తరపు న్యాయవాది చెప్పారు. చా టున్ తప్పు చేసినట్టు తీర్పు చెబుతూ కోర్టు ఆమెకు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించింది. -
'అయినా.. నన్ను భయపెట్టలేకపోయారు'
పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో భార్యను కోల్పోయిన ఓ వ్యక్తి సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ఫేస్బుక్ లో చేసిన ఓ పోస్ట్ కలకలం సృష్టిస్తోంది. వివరాలు.. పారిస్ ఉగ్రదాడుల్లో భార్యను కోల్పోయిన ఓ బాధితుడు ఆంటోనీ లీరిస్. ఈ ఘటనను జీర్ణించుకోలేని ఆ వ్యక్తి 'మీరు నా నుంచి అసహ్యాన్ని కూడా పొందలేరు. మీరు ఎవరో నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే వాళ్లు చచ్చిన శవాలు' అని పేర్కొంటూ చేసిన ఫేస్బుక్ పోస్ట్ అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. తనకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిని చంపేశారని, నా జీవితాన్ని నాకు దూరం చేశారని పేర్కొన్నాడు. ఇన్నీ చేసినా మీరు నన్ను భయపెట్టలేక పోయారు. 'నా స్వేచ్ఛకు భంగం కలిగించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. నేటి ఉదయం కూడా నేను ఆమెను చూశాను.12 ఏళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నాను. బాటాక్లాన్ థియేటర్ వద్ద జరిపిన కాల్పుల్లో 89 మందికి పైగా చనిపోయారు. కానీ, ఇది ఉగ్రవాదుల స్వల్ప విజయం' అని భార్య మృతదేహాన్ని చూస్తూ ఈ విషయాలను పోస్ట్ ద్వారా వివరించాడు. 'నేను, నా బాబు(17 నెలలు) ప్రపంచంలోని అన్ని ఆర్మీల కంటే ధృడంగా ఉన్నాం. మీ గురించి ఆలోచిస్తూ టైం వృథా చేసుకోను. నా బాబును సంతోషంగా, దైర్యంగా ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తుంటాను. మీరు నా నుంచి అసహ్యాన్ని కూడా పొందలేరు' అంటూ ఉద్వేగభరితంగా తన మనసులోని బాధను ఆంటోనీ లీరిస్ బయటపెట్టాడు. -
సీఎంకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టి బుక్కయ్యాడు
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డాడో జర్నలిస్టు. రాష్ట్రంలోని మాంది నగరానికి చెందిన రాజేశ్ శర్మ గురువారం సోషల్ మీడియాలో సీఎం కు వ్యతిరేకంగా కామెంట్స్ పోస్ట్ చేశాడు. దీంతో దుమారం రేగింది. తమ నేత ప్రతిష్టకు భంగం కలిగేలా రాజేశ్ శర్మ ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ నాయకుడు పూరన్ చాంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జర్నలిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ లోని వివిధ సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదు చేశారు. -
ఏసీటీవో లంచాలను బయటపెట్టిన ఫేస్బుక్
అనంతపురం జిల్లా హిందూపురంలోని వాణిజ్య శాఖ కార్యాలయంలో చోటుచేసుకుంటున్న అవినీతి బాగోతాన్ని ఓ ఫేస్బుక్ పోస్టింగ్ బయటపెట్టింది. ఆ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీఓ) హబీబ్ లక్షల్లో లంచాలు వసూలు చేస్తున్నారంటూ వాణిజ్య శాఖకు చెందిన నాగరాజు అనే ఓ ప్రైవేటు ఉద్యోగి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దాంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో అలజడి చెలరేగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఏసీటీవో, జూనియర్ అసిస్టెంట్, స్పెషల్ వింగ్ స్టాఫ్, ప్రైవేటు బాయ్స్‌తో ప్రతి నెలా ఒక్కొక్క షాపు నుంచి రూ.3 వేలు మొదలుకుని రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ వసూళ్ల చిట్టాను ఫేస్బుక్లో పెట్టారు. ఏసీటీవో రూ.70 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఐరన్, సిమెంట్ షాపుల నుంచి రూ.20 వేలు, ఫైర్ వర్క్ డీలర్స్ నుంచి రూ.30వేలు, హోల్‌సేల్ కిరాణా మర్చంట్స్ నుంచి రూ.50 వేలు, తూమకుంట, గోళాపురం ఐరన్ ఫ్యాక్టరీల నుంచి రూ.లక్ష, సోప్స్ వ్యాపారుల నుంచి రూ.25 వేలు, ముద్దిరెడ్డిపల్లి పట్టుచీరల వ్యాపారుల నుంచి రూ.లక్ష, బెంగళూరు పార్సిల్ సర్వీసు నుంచి రూ.50 వేల చొప్పున.. ఇలా ప్రతినెలా మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ చిట్టా ఉంచారు. కాగా.. తూమకుంట చెక్‌పోస్టులో జనరేటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నాగరాజు ఈ వివరాలు ఫేస్బుక్లో ఉంచి తన ప్రతిష్ఠకు భంగం కల్గించారని ఏసీటీవో హబీబ్ హిందూపురం రూరల్ ఎస్సై ఆంజనేయులుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై నాగరాజును స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కేసు నమోదు చేస్తున్నామని, పూర్తిస్థాయి విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. ఫేస్బుక్లో ఉంచిన అక్రమ వసూళ్ల వివరాలపైనా ఆరా తీస్తున్నామన్నారు. -
ఫేస్ బుక్ పోస్ట్ అతడి జీవితాన్నే మార్చేసింది..
నోయిడా: ఓ ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు...ఓ బాలుడికి సోషల్ మీడియా ఫేస్ బుక్ చేసిన సాయం అంతా ఇంతా కాదు. ఓ ప్రయాణికుడు చేసిన ఒక ఫేస్ బుక్ పోస్టు ఆ బాలుడి పాలిట వరంగా మారింది. అతడికి సహాయం చేయాలంటూ చేసిన విన్నపం ఏకంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను చేరింది. వివరాల్లోకి వెళితే... 13 ఏళ్ల హరేంద్రసింగ్ నోయిడాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అనుకోకుండా ఆర్థిక సమస్యలు తలెత్తడంతో నోయిడాలోని మెట్రో స్టేషన్లో బరువు కొలిచే యంత్రం పక్కన పెట్టుకొని, స్ట్రీట్ ల్యాంప్ కింద కూర్చొని హోం వర్క్ చేసుకునే వాడు. ఆ దారిలో ఎవరైనా బరువు తెలుసుకోవాలనుకునే వాళ్లు అక్కడికి వచ్చి చిల్లర వేసి బరువు కొలుచుకునే వాళ్లు. అలా వచ్చిన డబ్బుతో పుస్తకాలు,పెన్నులు, చదువుకోవడానికి అవసరమైన సామగ్రిని కొనుక్కునే వాడు. నోయిడాకి చెందిన వికాస్ షర్ధా అనే ప్రయాణికుడు ఒక రోజు స్టేషన్ నుంచి బయటకి వస్తున్నసమయంలో ఆ అబ్బాయిని చూశాడు. వెంటనే ఫోటో తీసి... 'ఎవరైతే నోయిడా మెట్రో స్టేషన్ గుండా రాత్రి 7 గంటల తర్వాత ప్రయాణాలు చేస్తారో..వాళ్లు ఆ బాలుని దగ్గర బరువు చూసుకుని అతని చదువు కోసం సహాయం చేయండి... దయచేసి అతడిని ఎవరూ అడుక్కునే వాడిలా చూడకండి..అంటూ' ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. అంతే.. ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చివరికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలే యాదవ్ దృష్టిలో హరేంద్రసింగ్ పడ్డాడు. అతనికి ఐదు లక్షల ఆర్థిక సహాయంతో పాటూ చదువుకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. 'జూన్‌లో మానాన్న ఉద్యోగాన్ని కోల్పోయారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గత నెలన్నర నుంచి నోయిడా మెట్రో స్టేషన్‌కు రాత్రి 7 గంటకు వచ్చి కొంత డబ్బును సంపాదిస్తున్నాను. అలా వచ్చిన డబ్బుతో చదువుకోవడానికి అవసరమయ్యే స్టేషనరీ సమాన్లు కొనుక్కుంటున్నాను' అని హరేంద్రసింగ్ చెప్పాడు. రోజు రూ. 70 లేదా అప్పడప్పుడు అంతకన్నా తక్కువగా వచ్చేవని తెలిపాడు. అతని సమస్య గురించి అందరికీ తెలిసేలా ఫోటో తీసి షేర్ చేసినందుకు వికాస్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. -
'కాల్చి చంపండి.. తుపాకీ నేను ఇస్తా'
న్యూయార్క్: బొద్దుగా, ముద్దుగా ఉండే కుక్కను తుపాకీతో కాల్చి చంపమంటే ఎవరైనా చంపుతారా? ఎంతటి కఠినాత్ములైనా ఇలాంటి పని చేయలేరు. కానీ దిక్కుతోచని స్థితిలో తన కుక్కను చంపాలని అమెరికా మహిళ ఒకరు ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ను అభ్యర్థించింది. తన పెంపుడు శునకాన్ని సంరక్షణించే స్తోమత తనకు లేనందున దాన్ని చంపాలని ఆమె విజ్ఞప్తి చేసింది. 'నా కుక్కను కాల్చి చంపడానికి ఒకరు కావాలి. తుపాకీ నేనే ఇస్తా' అని టెక్సాస్ మహిళ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. వెంటనే స్పందించిన జంతు సంరక్షణ అధికారులు ఈ కుక్కను కాపాడారు. దీనికి వ్యాక్సిన్లు వేయించి మరొక మహిళకు సంరక్షణార్థం అప్పగించారు. ఎవరైనా దీన్ని పెంచుకునేందుకు ముందుకు వస్తే వారికి ఈ కుక్కను అప్పగిస్తామని అధికారులు తెలిపారు. గోధుమ, తెలుపు రంగులో ఉన్న మూడున్నరేళ్ల ఈ శునకాన్ని పోషించలేక దాన్ని చంపాలని యజమానురాలు తన ఫేస్ బుక్ లో మిత్రులను కోరిందని చెప్పారు. భారమైన హృదయంతోనే ఆమె ఈ పనికి పూనుకుందన్నారు. ఆమెతో నేరుగా మాట్లాడేందుకు మీడియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. -
'క్షమాపణ చెప్పను... అది నా హక్కు'
న్యూఢిల్లీ: ఎంపీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. ఫేస్ బుక్ లో తాను చేసిన కామెంట్స్ కు కట్టుబడివున్నట్టు తెలిపారు. పార్లమెంట్ నోటీసులుకు ఆయన సమాధానం ఇచ్చారు. తన అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించే హక్కు తనకు ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్ అంటే ఎంతో గౌరవం ఉందని, పార్లమెంట్ ను తాను అగౌరవపరచలేదని అన్నారు. వాద్రా వివాదాన్ని ఇంతటితో ముగించాలా లేదా ప్రివిలేజ్ కమిటీకి విన్నవించాలా అనే దానిపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకోనున్నారు. 'పార్లమెంట్ సమావేశాలు మళ్లీ మొదలవుతున్నాయి. విషయాలను పక్కదారి పట్టించే రాజకీయ ఎత్తుగడలు వేసుకోనివ్వండి. ప్రజలు ఏమీ తెలివి తక్కువవాళ్లు కాదు. ఇలాంటి నాయకుల నాయకత్వంలో దేశాన్ని చూడాల్సి రావడం బాధకరమ'ని ఫేస్ బుక్ లో వాద్రా పోస్ట్ చేశారు. దీనిపై అధికార బీజేపీ మండిపడింది. లోక్ సభలో బీజేపీ చీఫ్ విప్ అర్జున్ రామ్ మేఘవాల్ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. -
చీఫ్ సెక్రటరీకి ఫేస్బుక్ తలనొప్పి
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళి అర్పించాలన్న ప్రయత్నం.. ఓ ఉన్నతాధికారికి చీవాట్లు పెట్టించింది. కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి థామ్సన్.. అబ్దుల్ కలాంకు కాస్త పెద్దగా నివాళులు అర్పిద్దాం అనుకున్నారు. తాను మరణిస్తే సెలవు ప్రకటించవద్దని కలాం చెప్పిన విషయాన్ని తు.చ. తప్పకుండా ఆచరించాలని, అందుకోసం ఆదివారం కూడా పనిచేయాలని ఆయన ఫేస్బుక్లో పోస్టింగ్ చేశారు. దాంతో, చీఫ్ సెక్రటరీ థామ్సన్ తీరుపై ముఖ్యమంత్రి కార్యాలయం మండిపడింది. ఇలా చెప్పడం సరికాదని, అందువల్ల ఫేస్బుక్లో పెట్టిన పోస్టింగును వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించింది. -
ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఏడుగురిపై కేసు
ఒక మతాన్ని కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలను ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు ఏడుగురు యువకులపై కేసు నమోదైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ ప్రాంతంలో జరిగింది. ఐపీసీ సెక్షన్లు 153 బి, 295ఎ, 504తో పాటు ఐటీ చట్టం కింద ఈ కేసులు నమోదు చేశారు. విపుల్ సింగ్ అనే వ్యక్తి ఈ పోస్ట్ రాయడంతో అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జూన్ 20వ తేదీన విపుల్ సింగ్ ఫేస్బుక్ అకౌంటులో ఈ కామెంట్లు పోస్ట్ చేయగా, మిగిలిన ఆరుగురు దాన్ని లైక్ చేయడమో, కామెంట్లు పెట్టడమో చేశారని ఏఎస్పీ దినేష్ త్రిపాఠీ చెప్పారు. బీఎస్పీ నాయకుడి నేతృత్వంలోని ఓ వర్గం సభ్యులు కొత్వాలీ పోలీసు స్టేషన్‌కు చేరుకుని నినాదాలు చేస్తూ విపుల్ సింగ్ ఫేస్బుక్ కామెంట్లపై ఫిర్యాదు చేశారు. వెంటనే వివిధ స్టేషన్లకు చెందిన పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. -
‘స్మార్ట్’గా ‘లైవ్’ ఇవ్వొచ్చు
ప్రపంచానికి ఇప్పుడు ఫేస్బుక్ పోస్టులతోనే పొద్దు పొడుస్తోంది. ట్విటర్ అభిప్రాయాలు హీటెక్కిస్తున్నాయి. సంభాషణలన్నీ వాట్సప్‌లోనే జరుగుతున్నాయి. బ్లాగులు బతుకులో భాగం అయ్యాయి. స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాకా... అప్లికేషన్ల రూపంలో అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ సర్వీసులు సగటు మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇంత వరకూ ఇంటర్నెట్ సంధాన సేవల్లో నెటిజన్లు చెప్పాలను కొన్నది మాటలు, అక్షరాల రూపంలోనే చెబుతూ మురిసి పోతుండగా... కొత్తగా లైవ్‌స్ట్రీమింగ్ ఊపం దుకొంటోంది. ఇక ఎవరికి వారు ఎక్కడ నుంచి అయినా ‘లైవ్’ ఇచ్చేసుకోవచ్చు. చేతిలో ఒక స్మార్ట్‌ఫోనూ, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు! ‘పెరిస్కోప్’ పేరుతో ఇద్దరు ఔత్సాహిక ఆప్ డెవలపర్లు రూపొందించిన అప్లికేషన్‌ను ఇటీవలే ట్విటర్ కొనుగోలు చేసింది. దీని కోసం ఏకంగా 620 కోట్ల రూపాయలను వెచ్చించింది. భారీ బిజినెస్‌కు తెరలేపింది. ఈ అప్లికేషన్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసి దాని ద్వారా లైవ్ టెలికాస్ట్ చేసుకోవచ్చు! ఎక్కడికి లైవ్ ఇవ్వడం? యాప్‌లో ఒక గ్రూప్‌ను క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్‌లోని వారంద రూ ఒకేసారి వీక్షించే విధంగా వీడియోను ప్రసారం చేయవచ్చు! ఇప్పటికే అందుబాటులో ఉన్న వీడియో కాలింగ్ ఫీచర్‌కు కొంత మాత్రమే భిన్నమైనది. అయినా ఒకేసారి ఎక్కువమంది లైవ్ చూడటా నికి అవకాశం ఉండటం ఈ యాప్‌కు క్రేజ్‌ను పెంచుతోంది! ఇప్పటికే బ్లాగుల ద్వారా, వెబ్సైట్ల ద్వారా లైవ్ప్రసారాలు జరుగుతున్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌తో ఇలాంటి ప్రసారం ప్రత్యేకమే కదా! ప్రస్తుతానికి ‘పెరిస్కోప్’ ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ అప్లికేషన్ కోసం వేచి ఉండాల్సిందే! తుది కక్ష్యలోకి ‘ఐఆర్ఎన్ ఎస్ఎస్-1డీ’ శ్రీహరికోటలోని షార్ నుంచి గతనెల 28న ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1డీ ఉపగ్రహం తుది కక్ష్యలోకి చేరి సమర్థంగా పనిచేస్తోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వెల్లడించింది. మరికొన్ని రోజుల్లోనే ‘భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ(ఐఆర్ఎన్ఎస్ఎస్)’ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఇస్రో పేర్కొంది. -
ఫేస్బుక్లో ‘డిస్లైక్’ అంటే అయిష్టం: జుకర్‌బర్గ్
శాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్లో పోస్టులపై యూజర్లు తమ అనుభూతులను వ్యక్తపర్చేందుకు వీలుగా ‘లైక్(థంబ్స్ అప్) బటన్‌ను ఏర్పాటు చేశామని, తనకు ‘డిస్లైక్’ అంటే ఇష్టం లేదని ఆ వెబ్సైట్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. శుక్రవారం కాలిఫోర్నియాలోని ఫేస్బుక్కార్యాలయంలో ప్రేక్షకుల ప్రశ్నలకు జుకర్‌బర్గ్ ఈ మేరకు సమాధానమిచ్చారు. డిస్లైక్ బటన్ వల్ల ఫేస్బుక్ పోస్టులపై ఓటింగ్ ద్వారా తీర్పు ఇచ్చేలా పరిస్థితి మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 3 2019కి దేశం గ్రీన్ ఇండియూ: వెంకయ్య చెన్నై: జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల(2019) నాటికి భారత్‌ను క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియాగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. శనివారం చెన్నైలో రోటరీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో దేశాభివృద్ధికి రూ.2 లక్షల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందన్నారు. -
ఆ మీటింగ్ అద్భుతంగా జరిగింది: మోదీ
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో తన సమావేశం అద్భుతంగా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. తాము పలు అంశాల గురించి ఆ సమావేశంలో చర్చించుకున్నామన్నారు. ఈ విషయాలను ఆయన తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తాను రెండు దేశాల మధ్య భాగస్వామ్యంపై చర్చించుకున్నామని, ఇరు దేశాలు కలిసి మొత్తం మానవాళికి మేలు జరిగేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని కూడా ఆయన తెలిపారు. అమెరికాలో ఐదు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోదీ వెళ్లిన విషయం తెలిసిందే. -
ఫేస్బుక్ లో పోస్ట్ తొలగించిన జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి నెటిజన్లు ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో తన ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన సందేశాన్ని ఆయన ఉపసంహరించుకున్నారు. ప్రపంచ యుఎఫ్ఓ దినోత్సవం(అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్) జరుపుకుంటున్నామంటూ ఫేస్బుక్ లో బుధవారం జైట్లీ పోస్ట్ పెట్టారు. ఆకాశయానంలో గల్లంతైన వస్తువుల కోసం ఈ రోజు జరుపుకుంటారని కూడా వివరించారు. జైట్లీ పోస్ట్ పై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఆర్థిక మంత్రి గారూ ఈరోజు భారతీయులు యుఎఫ్ఓ డే బదులుగా ధరల పెంపు రోజు జరుపుకుంటున్నాం అంటూ ఓ యూజర్ వ్యంగ్యాస్త్రం వదిలారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు, రైల్వే చార్జీలు పెంచిన నేపథ్యంలో ఈ కామెంట్ చేశారు. అంతరిక్షం గురించి కాకుండా సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని మరో యూజర్ సూచించారు. దీంతో యుఎఫ్ఓ డే పోస్ట్ ను తన ఫేస్బుక్ నుంచి జైట్లీ తొలగించారు. కాగా, త్వరలో ప్రవేశపెట్టనున్న 2014-15 బడ్జెట్ లో కఠిన నిర్ణయాలు తప్పవని జైట్లీ ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. దీనిపై నెటిజన్లు ఇంకెంత ఘాటుగా స్పందిస్తారో చూడాలి.