
‘స్మార్ట్’గా ‘లైవ్’ ఇవ్వొచ్చు
ప్రపంచానికి ఇప్పుడు ఫేస్‌బుక్ పోస్టులతోనే పొద్దు పొడుస్తోంది. ట్విటర్ అభిప్రాయాలు హీటెక్కిస్తున్నాయి. సంభాషణలన్నీ వాట్సప్‌లోనే జరుగుతున్నాయి.
ప్రపంచానికి ఇప్పుడు ఫేస్‌బుక్ పోస్టులతోనే పొద్దు పొడుస్తోంది. ట్విటర్ అభిప్రాయాలు హీటెక్కిస్తున్నాయి. సంభాషణలన్నీ వాట్సప్‌లోనే జరుగుతున్నాయి. బ్లాగులు బతుకులో భాగం అయ్యాయి. స్మార్ట్‌ఫోన్లు చేతిలోకి వచ్చాకా... అప్లికేషన్ల రూపంలో అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ సర్వీసులు సగటు మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇంత వరకూ ఇంటర్నెట్ సంధాన సేవల్లో నెటిజన్లు చెప్పాలను కొన్నది మాటలు, అక్షరాల రూపంలోనే చెబుతూ మురిసి పోతుండగా... కొత్తగా లైవ్‌స్ట్రీమింగ్ ఊపం దుకొంటోంది. ఇక ఎవరికి వారు ఎక్కడ నుంచి అయినా ‘లైవ్’ ఇచ్చేసుకోవచ్చు. చేతిలో ఒక స్మార్ట్‌ఫోనూ, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు!
‘పెరిస్కోప్’ పేరుతో ఇద్దరు ఔత్సాహిక ఆప్ డెవలపర్లు రూపొందించిన అప్లికేషన్‌ను ఇటీవలే ట్విటర్ కొనుగోలు చేసింది. దీని కోసం ఏకంగా 620 కోట్ల రూపాయలను వెచ్చించింది. భారీ బిజినెస్‌కు తెరలేపింది. ఈ అప్లికేషన్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి దాని ద్వారా లైవ్ టెలికాస్ట్ చేసుకోవచ్చు! ఎక్కడికి లైవ్ ఇవ్వడం? యాప్‌లో ఒక గ్రూప్‌ను క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్‌లోని వారంద రూ ఒకేసారి వీక్షించే విధంగా వీడియోను ప్రసారం చేయవచ్చు! ఇప్పటికే అందుబాటులో ఉన్న వీడియో కాలింగ్ ఫీచర్‌కు కొంత మాత్రమే భిన్నమైనది. అయినా ఒకేసారి ఎక్కువమంది లైవ్ చూడటా నికి అవకాశం ఉండటం ఈ యాప్‌కు క్రేజ్‌ను పెంచుతోంది! ఇప్పటికే బ్లాగుల ద్వారా, వెబ్‌సైట్ల ద్వారా లైవ్‌ప్రసారాలు జరుగుతున్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌తో ఇలాంటి ప్రసారం ప్రత్యేకమే కదా! ప్రస్తుతానికి ‘పెరిస్కోప్’ ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ అప్లికేషన్ కోసం వేచి ఉండాల్సిందే!
తుది కక్ష్యలోకి ‘ఐఆర్‌ఎన్ ఎస్‌ఎస్-1డీ’
శ్రీహరికోటలోని షార్ నుంచి గతనెల 28న ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డీ ఉపగ్రహం తుది కక్ష్యలోకి చేరి సమర్థంగా పనిచేస్తోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వెల్లడించింది. మరికొన్ని రోజుల్లోనే ‘భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్)’ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఇస్రో పేర్కొంది.