93 ఏళ్ల బామ్మ ఫేస్ బుక్ పోస్ట్ వైరల్! | old bride Sylvia become popular for her marriage post | Sakshi
Sakshi News home page

93 ఏళ్ల బామ్మ ఫేస్ బుక్ పోస్ట్ వైరల్!

Published Sat, Jun 3 2017 11:15 PM | Last Updated on Fri, Jul 12 2019 3:15 PM

old bride Sylvia become popular for her marriage post

సిడ్నీ: ప్రేమకు వయసుతో పని లేదంటారు. ఇందుకు ఆస్ట్రేలియా బామ్మ సిల్వియా ప్రేమ వివాహమే తాజా ఉదాహరణ. 93 ఏళ్ల బామ్మ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు. అందుకు కారణం ఆమె చేసిన ఓ చిన్న ప్రయత్నం. తాను పెళ్లి చేసుకోబోతున్నానని, పెళ్లి డ్రెస్ విషయంలో మీరు కాస్త సాయం చేయండని కోరుతూ సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేస్తూ పోస్ట్ చేశారు సిల్వియా. ఈ పోస్ట్ ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది.

ఆ వివరాలిలా ఉన్నాయి.. 93 ఏళ్ల సిల్వియా, 88 ఏళ్ల ఫ్రాంక్ గత రెండు దశాబ్దాల నుంచి గాఢంగా ప్రేమించుకుంటున్నారు. పలుమార్లు పెళ్లి ప్రతిపాదన తెచ్చినా సిల్వియా అందుకు నో చెప్పేవారు. ఈ క్రమంలో ఇటీవల మరోసారి ఫ్రాంక్ చేసిన పెళ్లి ప్రతిపాదనకు బామ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫ్రాంక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నేళ్లుగా పెళ్లికి నో చెప్పిన బామ్మగారు, ఇప్పుడు పెళ్లికి ఒప్పుకునేందుకు ఓ కండీషన్ కూడా పెట్టారు. అదేమంటే.. తన మొదటి భర్త ఇంటిపేరును మార్చుకునే ప్రసక్తే లేదని చెప్పగా.. ఇది తనకు సమస్యే కాదని స్పష్టం చేయడంతో పెళ్లికి అంగీకరించారు.

వచ్చే నెలలో ఫ్రాంక్, సిల్వియా దంపతులు కానున్నారు. ఈ క్రమంలో బామ్మగారు పెళ్లి షాపింగ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా షాపింగ్ మాల్ లో నాలుగు డ్రెస్సులు ట్రై చేసి, వాటి ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. 'నాకు కొంచెం సాయం చేయండి. పెళ్లికి ఏ డ్రెస్సు వేసుకోవాలో సూచించండి' అంటూ సిల్వియా చేసిన పోస్టుకు భారీగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించారు.. కంగ్రాట్స్ అంటూ బామ్మకు అభినందనల వెల్లువ మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement