సమాధిలో మొదటిరోజు ఏమవుతుందో...!
‘‘ఒక్కసారి ఊహించండి... సమాధిలో మీరు, కటిక చీకటిలో ఒంటరిగా. ఓ క్షణమాగి... ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా... సమాధిలో తొలిరాత్రి నాకేమవుతుందని? అంతిమయాత్ర కోసం మీ పార్థివదేహానికి స్నానం చేయిస్తున్న క్షణాన్ని ఊహించుకోండి. కుటుంబీకులు రోదిస్తుండగా... జనం మీ పార్థివదేహాన్ని మోస్తున్న రోజును ఊహించుకోండి. మిమ్మల్ని ఖననం చేస్తున్న క్షణాన్ని ఊహించండి’’
– 2013 జనవరి 18న సబ్ ఇన్‌స్పెక్టర్ ఫిరోజ్ అహ్మద్ దార్ పెట్టిన ఫేస్‌బుక్ పోస్టు ఇది. కల్లోల కశ్మీరంలో శాంతి నెలకొనాలని ఆశించిన ఫిరోజ్ మనోనేత్రం మరణాన్ని ముందే చూసిందేమో. శుక్రవారం లష్కరే మిలిటెంట్లు పోలీసులపై దాడిచేసి ఆరుగురిని చంపేశారు. ఇందులో 32 ఏళ్ల ఫిరోజ్ అహ్మద్ దార్ ఒకరు.
‘‘ఓ దేవుడా...! ప్రశాంత కశ్మీర్‌ను చూసే రోజు ఎప్పుడొస్తుంది’’
– మార్చి 8, 2013న ఫిరోజ్ పెట్టిన మరో పోస్టు
– సాక్షి నాలెడ్జ్ సెంటర్