సెల్ఫీ క్రేజ్.. అమెరికా యువతికి చుక్కలు! | snake stuck in earlobe while trying to take selfie | Sakshi
Sakshi News home page

సెల్ఫీ క్రేజ్.. అమెరికా యువతికి చుక్కలు!

Published Thu, Feb 2 2017 7:11 AM | Last Updated on Mon, Aug 20 2018 7:28 PM

సెల్ఫీ క్రేజ్.. అమెరికా యువతికి చుక్కలు! - Sakshi

సెల్ఫీ క్రేజ్.. అమెరికా యువతికి చుక్కలు!

పోర్ట్ లాండ్: సెల్ఫీ తీసుకునేందుకు యత్నించిన ఓ అమెరికా యువతికి చుక్కలు కనిపించాయి. ఓరెగాన్‌లోని పోర్ట్‌లాండ్‌కు చెందిన ఆష్లే గ్లేవ్ ఓ పామును పెంచుకుంటుంది. తన పెంపుడు పాము బార్ట్‌తో సరదాగా సెల్ఫీ తీసుకోవాలని భావించింది. కుడిచెంపకు పక్కన బార్ట్‌ను ఉంచి సెల్ఫీ తీసుకోవాలని చూసింది. ఇంతలో బార్ట్‌ అనే పాము ఆమె చివి రంద్రంలోకి దూరిపోయింది. చెవికి ఏదో ఆభరణం ధరించేందుకు పెద్ద సైజులో రంద్రాన్ని చేసుకోగా, అందులోకి దూరిన బార్ట్‌ కొన్ని సెకన్లలో అలాగే ఉండి ఇరుక్కుపోయిందని తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్ చేసింది.

తన పెట్‌ స్నేక్ బార్ట్‌ ఫొటోతో ఎదుర్కొన్న సమస్యను తన పోస్ట్ లో రాసుకొచ్చింది. చివరికి బార్ట్‌ను బయటకు తీయడం రాక, హాస్పిటల్‌కు పరుగులు తీయాల్సి వచ్చిందని చెప్పింది. హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ వార్డులో దిగిన ఫొటో పోస్ట్ చేయగా విపరీతంగా లైక్స్, షేర్లు సొంతం చేసుకుంది. సెల్ఫీ తీసుకునేందుకు ట్రై చేస్తే ఇలా జరిగి చుక్కలు కనిపించాయంటూ డాక్టర్‌కు వివరించి ఆష్లే గ్లేవ్. పాముకు ఏం జరగకూడదని చెప్పడంతో, వైద్యులు ఆమె చెవిని కాస్త కట్ చేసి పామును బయటకు తీశారు. దీంతో బాధితురాలు, పాము యజమాని గ్లేవ్ ఊపిరి పీల్చుకుంది. ఇలా ఎవరూ సెల్ఫీలకోసం ట్రై చేయకూడదని నెటిజన్లకు సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement