ఆ పోస్టులు వ్యాధులను తెలుపుతాయి!
లండన్: ఫేస్‌బుక్‌లో మనం పెట్టే స్టేటస్, కొట్టే లైకులు, ఫొటోలు మానసిక వ్యాధులను కనుగొనడంలో సాయపడే అవకాశం ఉందట. సామాజిక అనుసంధాన వెబ్‌సైట్లను ఉపయోగించేవారిపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. దీని ద్వారా మనం డిప్రెషన్, స్క్రీజోఫ్రేనియా వంటి మానసిక వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు. ఫేస్‌బుక్ ద్వారా తెలిసిన సమాచారం.. ఆ వ్యక్తి ప్రవర్తన ద్వారా తెలుసుకున్న సమాచారం కంటే మరింత వాస్తవికంగా ఉందన్నారు.
అంతేకాకుండా వ్యకిగతంగా ప్రశ్నలు అడిగినప్పుడు సరైన సమాచారం రాబట్టడం, అతని ప్రవర్తనను అంచనా వేయడం కొంచెం కష్టమేనని తెలిపారు. సోషల్ మీడియాలో వారు వాడిన పదజాలం, వెల్లడించిన భావోద్వేగాలు, లేవనెత్తిన అంశాల ద్వారా మరిన్ని అంశాలను తెలుసుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో రోజుకు 35 కోట్ల ఫొటోలు అప్‌లోడ్ అవుతున్నాయని, ముఖకవళికలను గమనించే యాంత్రిక చిత్రాల విశ్లేషణ ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుందన్నారు.