లైవ్లో ఓ సాఫ్ట్వేర్ నరాలు తెంపేసుకున్నాడు | Gurgaon Techie Posts Suicide Note On Facebook, Saved | Sakshi
Sakshi News home page

లైవ్లో ఓ సాఫ్ట్వేర్ నరాలు తెంపేసుకున్నాడు

Published Wed, Jun 15 2016 8:28 AM | Last Updated on Thu, Jul 26 2018 1:02 PM

లైవ్లో ఓ సాఫ్ట్వేర్ నరాలు తెంపేసుకున్నాడు - Sakshi

లైవ్లో ఓ సాఫ్ట్వేర్ నరాలు తెంపేసుకున్నాడు

లైవ్లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

గుర్గావ్: లైవ్లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తన స్నేహితుడితో ఫేస్ బుక్లో చాట్ చేస్తూ ఆత్మహత్యా లేఖను అందులో పోస్ట్ చేసి ల్యాప్ టాప్ కెమెరాకు చూపించి మరీ తన చేతి నరాన్ని తెంపేసుకున్నాడు. దీంతో అతడి స్నేహితుడు పోలీసులకు విషయం చెప్పడంతో శరవేగంగా వారు స్పందించి అతడిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరుణ్ మాలిక్ అనే 30 ఏళ్ల యువకుడు తన తండ్రితో కలిసి ఉంటున్నాడు.

2012లో సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. గత కొద్ది రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్న అతడు జీవితం మీద విరక్తి భావనతో ఉన్నట్లు అతడి స్నేహితులు తెలిపారు. గత రెండు రోజుల్లోనే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన అతడు మంగళవారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో తన స్నేహితుడితో చాట్ చేస్తూనే అతడికి కెమెరాలో చూపిస్తూ తన చేతి నరాలు కత్తితో కోసుకున్నాడు. దీంతో పోలీసులు సమాచారం అందించగా వారు వేగంగా స్పందించి అతడిని రక్షించారు. అతడికి ఇంకా వివాహం కాలేదు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్న అతడి నుంచి వాంగ్మూలం నమోదుచేసుకునేందుకు పోలీసులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement