చీఫ్ సెక్రటరీకి ఫేస్బుక్ తలనొప్పి | kerala chief secretary faces ire of cmo because of facebook post | Sakshi
Sakshi News home page

చీఫ్ సెక్రటరీకి ఫేస్బుక్ తలనొప్పి

Published Wed, Jul 29 2015 2:35 PM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

చీఫ్ సెక్రటరీకి ఫేస్బుక్ తలనొప్పి - Sakshi

చీఫ్ సెక్రటరీకి ఫేస్బుక్ తలనొప్పి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళి అర్పించాలన్న ప్రయత్నం.. ఓ ఉన్నతాధికారికి చీవాట్లు పెట్టించింది. కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి థామ్సన్.. అబ్దుల్ కలాంకు కాస్త పెద్దగా నివాళులు అర్పిద్దాం అనుకున్నారు.

తాను మరణిస్తే సెలవు ప్రకటించవద్దని కలాం చెప్పిన విషయాన్ని తు.చ. తప్పకుండా ఆచరించాలని, అందుకోసం ఆదివారం కూడా పనిచేయాలని ఆయన ఫేస్బుక్లో పోస్టింగ్ చేశారు. దాంతో, చీఫ్ సెక్రటరీ థామ్సన్ తీరుపై ముఖ్యమంత్రి కార్యాలయం మండిపడింది. ఇలా చెప్పడం సరికాదని, అందువల్ల ఫేస్బుక్లో పెట్టిన పోస్టింగును వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement