
త్వరలో 45 భాషల్లో ఫేస్‌బుక్ పోస్టులు..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న నానా భాషల వారికి మరింత చేరువ అయ్యేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను పరిచయం చేయనుంది.
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న నానా భాషల వారికి మరింత చేరువ అయ్యేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను పరిచయం చేయనుంది. మనం చేసే పోస్టులు అవంతట అవే వివిధ భాషల్లోకి తర్జుమా అయ్యేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. 45 భాషల్లో పోస్టులను తర్జుమా చేసి చూపిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ సాఫ్ట్‌వేర్‌ను 5,000 వ్యాపార, వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన పేజెస్‌లో ఉపయోగిస్తున్నారని సంస్థ వెల్లడించింది. త్వరలోనే ఈ సాఫ్ట్‌వేర్‌ను పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి తేనున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది.