
‘లైక్స్’తో లాభం లేదు!
ఫేస్‌బుక్‌లో తాము పెట్టిన పోస్టింగ్‌కు ఎక్కువగా ‘లైక్స్’ వస్తే బాగా ఉద్వేగానికి, ఆనందానికి గురికావడం చాలా మందిలో కనిపించేదే.
పరిపరిశోధన
ఫేస్‌బుక్‌లో తాము పెట్టిన పోస్టింగ్‌కు ఎక్కువగా ‘లైక్స్’ వస్తే బాగా ఉద్వేగానికి, ఆనందానికి గురికావడం చాలా మందిలో కనిపించేదే. అదే కోవలో మీరు కూడా ఫేస్‌బుక్ ‘లైక్’లను కోరుకుంటున్నారా? అయితే... అదేమీ మీ మూడ్స్‌ను మెరుగుపరచవనీ, వాటితో మీ ఆత్మవిశ్వాసమూ పెద్దగా పెరగదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్‌కు చెందిన పరిశోధకులు.
అంతేకాదు... మాటిమాటికీ ప్రొఫైల్స్ మార్చి, వాటికి వచ్చే లైక్స్‌ను చూసుకోవడం, వాటి ఆధారంగా మళ్లీ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చడం వంటి పనులు మీ ఆత్మవిశ్వాసలేమిని సూచిస్తుంటాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. దాదాపు 340 మందిపై అధ్యయనాన్ని నిర్వహించి వారు ఈ విషయాలను వెల్లడించారు.