కాబూల్: సాధారణంగా తల్లిదండ్రులు తమకు ఇష్టమైన, నచ్చిన పేర్లను పిల్లలకు పెడుతుంటారు. అయితే ఆ పేర్లు కొంచెం విచిత్రంగా ఉంటేమాత్రం అనవసర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అఫ్గానిస్తాన్‌కు చెందిన సయ్యద్ అసదుల్లాహ్, జమీలా దంపతులకు ఇదే ఇబ్బంది ఎదురైంది. ఎందుకంటే 2016లో పుట్టిన తమ రెండో కుమారుడికి వీరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు. అయితే చిన్నారి ట్రంప్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల్ని గుర్తుతెలియని వ్యక్తులెవరో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేయడంతో అసలు వివాదం రాజుకుంది.
ముస్లింపేరు పెట్టకపోవడంతో అసదుల్లాహ్‌ను చంపేస్తామని కొంతమంది ఫేస్‌బుక్‌లో హెచ్చరించగా.. మరికొందరు తీవ్ర అభ్యంతరకరమైన కామెంట్లు పెట్టేవారు. ఈ బాధ తట్టుకోలేక ఆయన ఫేస్‌బుక్ ఖాతాను క్లోజ్ చేశారు. ఇరుగుపొరుగువారు కూడా వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోవాలని అసదుల్లాహ్‌ను బెదిరించసాగారు. దీంతో ఆయన స్వస్థలమైన డైకుండీ ప్రావిన్సును వదిలి కాబూల్‌కు వలస వచ్చారు. ఈ విషయమై అసదుల్లాహ్ మీడియాతో మాట్లాడుతూ.. ట్రంప్ రాసిన ‘హౌ టు గెట్ రిచ్’ పర్షియన్ అనువాదాన్ని చదవడంతో పాటు చాలా పరిశోధన చేసిన తర్వాతే తన కుమారుడికి ట్రంప్ అని పేరుపెట్టినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment