President of America
-
బైడెన్ అసమర్థ పాలనలో... అమెరికా సర్వభ్రష్టం
వాషింగ్టన్: హష్ మనీ చెల్లింపుల కేసులో తాను పూర్తిగా అమాయకుడినని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ కేసులో తనపై దాఖలైన క్రిమినల్ అభియోగాలకు సంబంధించి మంగళవారం ఆయన న్యూయార్క్‌లో మన్హాటన్ జ్యూరీ ముందు విచారణకు హాజరవడం తెలిసిందే. అనంతరం ఫ్లోరిడాలో తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఈ కేసు రాజకీయ కక్షసాధింపులో భాగమని ఆరోపించారు. వామపక్ష అతివాద ఉన్మాదులు దేశాన్ని సర్వనాశనం దిశగా తీసుకెళ్తున్నారంటూ అధ్యక్షుడు జో బైడెన్, ఆయన మద్దతుదారులపై నిప్పులు చెరిగారు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడిలా ఎన్నికల ప్రక్రియనూ ముందుగానే ప్రభావితం చేయజూస్తున్నారని ఆరోపించారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని హెచ్చరించారు. ‘‘బైడెన్ దేశ చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు. ఆయనకు ముందున్న ఐదుగురు అత్యంత అసమర్థ అధ్యక్షుల వైఫల్యాన్నింటినీ కలగలిపినా బైడెన్ పాలనా వైఫల్యాల్లో పదో వంతుకు కూడా తూగవు. అంతటి దారుణ పాలనతో అమెరికాను అన్ని రంగాల్లోనూ భ్రష్టు పట్టిస్తూ విఫల రాజ్యంగా మారుస్తున్నారు’’ అంటూ తూర్పారబట్టారు. ‘‘ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. డాలర్ శరవేగంగా పతనమవుతోంది. గత 200 ఏళ్ల అమెరికా చరిత్రలో అత్యంత దారుణ పరాజయమిది! ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికా ఇంకెంత మాత్రమూ సూపర్ పవర్ కాదు. సర్వనాశనం దిశగా పయనిస్తోంది’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. 2024లో మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. నేనుంటేనా...! బైడెన్ అసమర్థత వల్ల నమ్మశక్యం కాని రీతిలో చైనాతో రష్యా, ఇరాన్‌తో సౌదీ అరేబియా చేతులు కలిపాయని ట్రంప్ ఆరోపించారు. ‘‘చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా కలిసి అత్యంత వినాశకర సంకీర్ణంగా రూపొందాయి. ఎన్నో దేశాలు అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ బాహాటంగా హెచ్చరికలు చేస్తున్నాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా పూర్తిస్థాయి అణ్వాయుధ ప్రయోగాలతో కూడిన మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదు. బైడెన్ హయాంలోనే జరిగి తీరుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘నేనుంటే వీటిలో దేన్నీ జరగనిచ్చేవాన్ని కాదు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే జరిగేది కాదు. ఎన్నో లక్షల ప్రాణాలు పోయేవి కాదు. అందమైన ఉక్రెయిన్ పట్టణాలు నేలమట్టమయ్యేవి కాదు’’ అని ట్రంప్ అన్నారు. అదే నా తప్పిదం... వినాశక శక్తుల బారినుంచి దేశాన్ని సాహసోపేతంగా కాపాడటమే తాను చేసిన ఏకైక తప్పిదమంటూ బైడెన్, ఆయన మద్దతుదారులపై ట్రంప్ నిప్పులు చెరిగారు. తనపై కేసు విషయంలో మన్హాటన్ జిల్లా అటార్నీ ఆల్విన్ బ్రాగ్‌తో పాటు దాన్ని పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జువాన్ ఎం.మెర్చన్పైనా విరుచుకుపడ్డారు. వారిద్దరూ డెమొక్రటిక్ పార్టీ సానుభూతిపరులంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘అంతేకాదు, వారిద్దరికీ నేనంటే విపరీతమైన ద్వేషం. జువాన్ భార్యకు, కుటుంబానికీ నేనంటే అసహ్యమే. ఆయన కూతురు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కోసం పని చేస్తోంది’’ అన్నారు. ఎవరేం చేసినా తనను కుంగదీయలేరని, అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మార్చి చూపిస్తానని చెప్పుకొచ్చారు. -
అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయం
-
నాటి అమెరికన్ ప్రెసిడెంట్లు ఇప్పుడు ఎలా ఉండేవారో..
మొన్న అమెరికన్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసింది జో బైడెన్ కాదనుకుందాం. అబ్రహం లింకన్ అనుకుందాం! పోనీ థామస్ జెఫర్సన్, పోనీ జాన్ ఆడమ్స్, పోనీ జేమ్స్ మ్యాడిసన్ అనుకుందాం. పోనీ అమెరికన్ ఫస్ట్ ప్రెసిడెంట్ జార్జి వాషింగ్టన్నే మొన్న స్వోర్న్–ఇన్ చేశారని అనుకుందాం. రాతియుగం నాటి ఆ ప్రెసిడెంట్ ల ముఖాలు ఈ పాలరాతి యుగంలో ఎలా ఉంటాయి? ఎంత పాలిష్డ్ గా, ఎంత ఫెయిర్ గా, ఎంత గ్లో గా, ఎంత లవ్లీ గా, ఎంత స్మార్ట్ గా.. అండ్, ఎంత ముద్దుగా (సేమ్ అదే వయసులో) ఉంటాయి? ఎలా ఉంటాయో అవార్డ్ విన్నింగ్ అమెరికన్ కామిక్ బుక్ రైటర్ ఒకావిడ ఊహించి పెయింట్ చేశారు! ‘అబ్బ! ఈ ప్రాచీన పురుష విగ్రహాలను ఇంతగా ఎలా ఈ న్యూ ఏజ్ లోకి మోసుకు రాగలిగారండీ..‘ అంటే.. ‘ఏం లేదు. ముఖం పై కనిపించీ కనిపించకుండా కాస్త స్మైల్ పులిమానంతే..’ అని ఆమె నవ్వుతూ చెబుతున్నారు. ఫొటోగ్రఫీ పుట్టక ముందే యూఎస్ ప్రెసిడెంట్ పుట్టారు! సరాసరి ప్రెసిడెంట్‌గా పుట్టడం కాదు లెండి. యూఎస్‌కు స్వాతంత్య్రం వచ్చాక తొలి అధ్యక్షుడిగా జార్జి వాషింగ్టన్ 1789 లో ప్రమాణ స్వీకారం చేస్తే, 1826 లోనో 1827 లోనో మానవాళికి ఫొటోగ్రఫీ చేతనైంది. అంతకు పూర్వం, ఆ తర్వాత కూడా ఏళ్ల పాటు అమెరికన్ అధ్యక్షులు చిత్రలేఖనాల్లో మాత్రమే ఫొటోలుగా ఉండేవారు. యు.ఎస్. ప్రెసిడెంట్లు వచ్చి ఇప్పటికి 232 ఏళ్లు గడిచాయి. ఫొటోలు వచ్చి 195 ఏళ్లు అయ్యాయి. ఇన్నేళ్లగా పాలకులు నాగరికం అవుతూ వస్తున్నట్లే ఫొటోగ్రఫీ కూడా అత్యాధునికం అవుతూ వచ్చింది. అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ కనుక మొన్న జో బైడెన్‌కు బదులుగా ప్రమాణం స్వీకారం చేసి ఉంటే అప్పటికన్నా ఆయన భిన్నంగా ఉండేవారు. అలాగే ఆ పందొమ్మిదో శతాబ్దపు అధ్యక్షులంతా! అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ కూడా మోడర్న్‌గా ఉండేవారు. ఏమిటీ వింత ఊహ! వింత ఊహే కానీ ఆసక్తిని కలిగించే ఊహ. ప్రముఖ కామిక్ పుస్తకాల అమెరికన్ రచయిత్రి 36 ఏళ్ల మగ్దలీన్ విసాజియోకు వచ్చిన ఒక ‘అందమైన’ ఆలోచన ఇది. ఆలోచన వచ్చిన వెంటనే ఆమె తొలినాళ్ల అమెరికా అధ్యక్షులను ఎంపిక చేసుకుని వారిని ఈ కాలానికి తగ్గట్లుగా ఫొటో తీశారు! అలాగని ఆమె చిత్రకారిణి గానీ, ఫొటోగ్రాఫర్ కానీ కాదు. తన స్మార్ట్ ఫోన్లోని ఫేస్‌యాప్, ఎయిర్ బ్రెష్‌లను ఉపయోగించి అధ్యక్షుల వారిని ఆధునాతనంగా ‘చిత్రీకరించారు’. మగ్దలీన్ ఇప్పటి వరకు ఐదు సార్లు కామిక్ పుస్తకాలకు ఇచ్చే ఔట్‌స్టాండింగ్ అవార్డులకు నామినేట్ అయ్యారు. ఫేస్ మార్ఫింగ్‌కి ప్రత్యేకంగా అవార్డులు ఉంటే కనుక ఈ ముఖ రచనలకు నామినేట్ అవడమే కాదు, తప్పనిసరిగా అవార్డును సాధిస్తారు కూడా. అంత నాణ్యంగా, ఓ గంట క్రితమే ఈ అధ్యక్షులు అందరూ దివి నుంచి భువికి దిగి, మేకోవర్ చేయించుకుని వచ్చినట్లుగా ఉన్నారంటే అది.. పోలికలు పోకుండా పూర్వపు ఏలికల్ని సృష్టించిన మగ్దలీన్ ప్రావీణ్యమే! ఒక్కో ఫొటోకి జీవం పోయడానికి 15–30 నిముషాలు మాత్రమే పట్టిందట. అమెరికా తొలి పదిహేడు మంది అధ్యక్షుల ఆధునిక రూపాలివి. జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడు. -
అఫ్గాన్‌లో ‘ట్రంప్’కు కష్టాలు
కాబూల్: సాధారణంగా తల్లిదండ్రులు తమకు ఇష్టమైన, నచ్చిన పేర్లను పిల్లలకు పెడుతుంటారు. అయితే ఆ పేర్లు కొంచెం విచిత్రంగా ఉంటేమాత్రం అనవసర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అఫ్గానిస్తాన్‌కు చెందిన సయ్యద్ అసదుల్లాహ్, జమీలా దంపతులకు ఇదే ఇబ్బంది ఎదురైంది. ఎందుకంటే 2016లో పుట్టిన తమ రెండో కుమారుడికి వీరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు. అయితే చిన్నారి ట్రంప్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల్ని గుర్తుతెలియని వ్యక్తులెవరో ఫేస్బుక్లో పోస్ట్‌చేయడంతో అసలు వివాదం రాజుకుంది. ముస్లింపేరు పెట్టకపోవడంతో అసదుల్లాహ్ను చంపేస్తామని కొంతమంది ఫేస్బుక్లో హెచ్చరించగా.. మరికొందరు తీవ్ర అభ్యంతరకరమైన కామెంట్లు పెట్టేవారు. ఈ బాధ తట్టుకోలేక ఆయన ఫేస్బుక్ ఖాతాను క్లోజ్ చేశారు. ఇరుగుపొరుగువారు కూడా వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోవాలని అసదుల్లాహ్ను బెదిరించసాగారు. దీంతో ఆయన స్వస్థలమైన డైకుండీ ప్రావిన్సును వదిలి కాబూల్‌కు వలస వచ్చారు. ఈ విషయమై అసదుల్లాహ్ మీడియాతో మాట్లాడుతూ.. ట్రంప్ రాసిన ‘హౌ టు గెట్ రిచ్’ పర్షియన్ అనువాదాన్ని చదవడంతో పాటు చాలా పరిశోధన చేసిన తర్వాతే తన కుమారుడికి ట్రంప్ అని పేరుపెట్టినట్లు తెలిపారు. -
అమెరికా అధ్యక్షులకే దక్కలేదు
మోదీకి అసాధారణ స్వాగతంపై భారతీయుల హర్షాతిరేకాలు టెలీఅవీవ్: తొలిసారిగా ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అసాధారణరీతిలో స్వాగతం లభించడం ఇక్కడి భారతీయులను ఆనందపరవశులను చేసింది. చివరికి అమెరికా అధ్యక్షులకు సైతం ఇటువంటి గౌరవం దక్కలేదని వారు అంటున్నారు. భారత సంతతికి చెందిన నాలుగు రకాల తెగలవారు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. వీరి సంఖ్య ఎనిమిది లక్షలదాకా ఉంది. వీరిలో కొంతమంది ముంబైకి చెందిన బెనీ తెగవారు కాగా మరికొందరు కేరళలోని కొచిన్‌కు చెందినవారు. ఇంకా మణిపూర్, మిజోరాంలకు చెందిన బినై మెనషే తెగవారు ఉన్నారు. ఈ విషయమై ఇక్కడ డ్రైవర్‌గా స్థిరపడిన భారత్‌కు చెందిన డేవిడ్ నగని మాట్లాడుతూ ‘16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇక్కడికి వలసవచ్చా. అయితే భారత్‌తో దౌత్యసంబంధాలు లేవని తెలియగానే అప్పట్లో ఎంతో బాధ కలిగింది. అందువల్ల వచ్చే ఇబ్బందులేమిటనే విషయం నాకు అప్పట్లో అంతగా అర్థం కాలేదు. అయితే ఇక్కడ యూదులకు ఎంత గౌరవం లభిస్తుందో అదేస్థాయిలో భారతీయులు కూడా పొందుతారు.ఇజ్రాయెల్ ప్రభుత్వం మన ప్రధానికి ఇచ్చిన గౌరవం నాకు ఎంతో ఆనందం కలిగించింది’ అని చెప్పారు.