అమెరికా అధ్యక్షులకే దక్కలేదు | Narendra Modi In Israel Delegation-Level Talks Between India and Israel Under Way | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్షులకే దక్కలేదు

Published Wed, Jul 5 2017 11:10 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

అమెరికా అధ్యక్షులకే దక్కలేదు - Sakshi

అమెరికా అధ్యక్షులకే దక్కలేదు

మోదీకి అసాధారణ స్వాగతంపై భారతీయుల హర్షాతిరేకాలు
టెలీఅవీవ్‌: తొలిసారిగా ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అసాధారణరీతిలో స్వాగతం లభించడం ఇక్కడి భారతీయులను ఆనందపరవశులను చేసింది. చివరికి అమెరికా అధ్యక్షులకు సైతం ఇటువంటి గౌరవం దక్కలేదని వారు అంటున్నారు. భారత సంతతికి చెందిన నాలుగు రకాల తెగలవారు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. వీరి సంఖ్య  ఎనిమిది లక్షలదాకా ఉంది. వీరిలో కొంతమంది ముంబైకి చెందిన బెనీ తెగవారు కాగా మరికొందరు కేరళలోని కొచిన్‌కు చెందినవారు.

ఇంకా మణిపూర్, మిజోరాంలకు చెందిన బినై మెనషే తెగవారు ఉన్నారు. ఈ విషయమై ఇక్కడ డ్రైవర్‌గా స్థిరపడిన భారత్‌కు చెందిన డేవిడ్‌ నగని మాట్లాడుతూ ‘16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇక్కడికి వలసవచ్చా. అయితే భారత్‌తో దౌత్యసంబంధాలు లేవని తెలియగానే అప్పట్లో ఎంతో బాధ కలిగింది. అందువల్ల వచ్చే ఇబ్బందులేమిటనే విషయం నాకు అప్పట్లో అంతగా అర్థం కాలేదు. అయితే ఇక్కడ యూదులకు ఎంత గౌరవం లభిస్తుందో అదేస్థాయిలో భారతీయులు కూడా పొందుతారు.ఇజ్రాయెల్‌ ప్రభుత్వం మన ప్రధానికి ఇచ్చిన గౌరవం నాకు ఎంతో ఆనందం కలిగించింది’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement