ఫేస్‌బుక్‌లో పోస్టులపై యూజర్లు తమ అనుభూతులను వ్యక్తపర్చేందుకు వీలుగా ‘లైక్(థంబ్స్ అప్) బటన్‌ను ఏర్పాటు చేశామని, తనకు ‘డిస్‌లైక్’ అంటే ఇష్టం లేదని ఆ వెబ్‌సైట్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు.
శాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్‌లో పోస్టులపై యూజర్లు తమ అనుభూతులను వ్యక్తపర్చేందుకు వీలుగా ‘లైక్(థంబ్స్ అప్) బటన్‌ను ఏర్పాటు చేశామని, తనకు ‘డిస్‌లైక్’ అంటే ఇష్టం లేదని ఆ వెబ్‌సైట్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. శుక్రవారం కాలిఫోర్నియాలోని ఫేస్‌బుక్‌కార్యాలయంలో ప్రేక్షకుల ప్రశ్నలకు జుకర్‌బర్గ్ ఈ మేరకు సమాధానమిచ్చారు. డిస్‌లైక్ బటన్ వల్ల ఫేస్‌బుక్ పోస్టులపై ఓటింగ్ ద్వారా తీర్పు ఇచ్చేలా పరిస్థితి మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
3
2019కి దేశం గ్రీన్ ఇండియూ: వెంకయ్య
చెన్నై: జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల(2019) నాటికి భారత్‌ను క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియాగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. శనివారం చెన్నైలో రోటరీ ఇంటర్‌నేషనల్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో దేశాభివృద్ధికి రూ.2 లక్షల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందన్నారు.