ఫేస్‌బుక్‌లో అసభ్యకరంగా వ్యక్తిగత విషయాలు..
హైదరాబాద్ : పరిచయం ఏర్పరచుకున్న యువతిని వేధించడమే కాకుండా ఫేస్‌బుక్‌లో అసభ్యకరంగా వాఖ్యలను పోస్ట్ చేసిన ఓ ప్రభుద్దుడిని జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. సీఐ అశోక్‌కుమార్ తెలిపిన మేరకు.. కరీంనగర్ జిల్లా రామగుండం ప్రాంతంలో నివసించే కుంజుమోహన్ కుమార్తె సునీత మోహన్ పీజీ చదవుతుండగా అదే ప్రాంతానికి చెందిన జీవన్‌శర్మ (24) పరిచమయ్యాడు. ఆ తర్వాత సునీతా మోహన్‌కు హైదరబాద్‌లోని హెచ్‌ఎస్‌బీసీలో ఉద్యోగం రావడంతో అల్వాల్ మండలంలోని మచ్చబొల్లారం డివిజన్ పరిధిలో గల కౌకూర్ జనప్రియ అపార్ట్‌మెంట్‌కు మకాం మార్చారు. రామగుండంలో ప్రైవేట్ కంపెనీ పెట్టుకుని జీవన్‌శర్మ నివసిస్తున్నాడు.
ఇదిలా ఉండగా జీవన్‌శర్మ .. సునీత మోహన్ సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు పంపుతూ ప్రేమించాలని వేధిస్తున్నాడు. దీనిపై ఆమె కుటుంబసభ్యులు గత సంవత్సరం ఏప్రిల్ 9 న జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో జీవన్‌శర్మ మరింత వేధింపులకు పాల్పడసాగాడు. మళ్లీ మరోమారు సెప్టెంబర్ 3న అతనిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేసుకుని రౌడీషీట్ తెరిచి రామగుండం పోలీసులకు సమాచారం అందించారు.
అయినప్పటికీ జీవన్‌శర్మలో మార్పురాకపోగా ఫేస్‌బుక్‌లో సునీతా మోహన్‌కు సంబంధించిన వ్యక్తిగత విషయాలను అసభ్యకరంగా పోస్ట్ చేస్తూ మరింత వేధింపులకు గురిచేశాడు. దీంతో ఈ నెల 3న ఐటీ చట్టం ఐపీసీ 66సి ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు సేకరించి గురువారం రామగండంలో జీవన్‌శర్మను అదుపులోకి తీసుకుని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వచ్చి రిమాండ్‌కు తరలించారు.