'99 శాతం వ్యక్తులకు దమ్ము, ధైర్యం లేదు' | Fardeen Khan responds to bodyshamers, post a post in facebook | Sakshi
Sakshi News home page

'99 శాతం వ్యక్తులకు దమ్ము, ధైర్యం లేదు'

Published Fri, May 27 2016 3:25 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

'99 శాతం వ్యక్తులకు దమ్ము, ధైర్యం లేదు' - Sakshi

'99 శాతం వ్యక్తులకు దమ్ము, ధైర్యం లేదు'

ముంబై: తనపై వస్తున్న కామెంట్లపై బాలీవుడ్ హీరో ఫర్దీన్ ఖాన్ స్పందించాడు. బరువు పెరుగుతున్నందుకు తానేమి సిగ్గుపడటం లేదని ఫేస్ బుక్ లో గురువారం రాత్రి పోస్ట్ చేశాడు. గత కొన్ని రోజులుగా ఫర్దీన్ బరువు పెరగడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని, ఏ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని 'నో ఎంట్రీ' స్టార్ పేర్కొన్నాడు. కామెంట్లు చేస్తున్న వారిలో 99 శాతం మంది దమ్ము, ధైర్యం లేని వారని.. ఇందులో సందేహమే లేదని మరోసారి కామెంట్ చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలని హెచ్చరించాడు.

తనపై కామెంట్లు చేస్తున్న వాళ్ల కంటే గుంపుగా ఉన్న పిరికివాళ్లే నయం అంటూ విమర్శించాడు. కామెంట్లు చేస్తున్నారే తప్ప తర్వాత ఏం జరుగుతుంది.. అవతలి వ్యక్తులు ఎలా రియాక్ట్ అవుతారని వారు ఆలోచించరని చెప్పాడు. సెలబ్రిటీలను ఇంటర్నెట్ మాధ్యమంగా చేసుకుని డిస్టర్బ్ చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డాడు. పిరికి పందల గుంపులు పనిపాటా లేని సమయంలో చేస్తున్న కామెంట్లపై ఎక్కువగా ఒత్తిడికి గురవ్వాల్సిన పనిలేదని, వీకెండ్ టాపిక్ గా మారినందుకు హ్యాపీగా ఉందని పోస్ట్ లో హీరో ఫర్దీన్ ఖాన్ రాసుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement