Fardeen Khan
-
సినిమా కోసం అధిక వడ్డీకి అప్పులు.. దేశం విడిచి వెళ్లిపోలేదు: నటుడు
బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా అతడు తన చిన్ననాటి సంగతులను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తండ్రి, స్టార్ హీరో ఫిరోజ్ ఖాన్ చేసిన పని వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో తెలిపాడు. 'నాన్న హీరోగా ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. 1972లో అపర్ధ్ సినిమాతో నిర్మాతగా మారాడు. ఆ సమయంలో నిర్మాతలు అధిక వడ్డీకి అప్పు తీసుకుని చిత్రాలు చేసేవారు. నాన్న కూడా అలానే చేశాడు. అది చూసి మేమంతా భయపడ్డాం.ఆర్థిక ఇబ్బందులుతర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. స్టార్ హీరో కుమారుడిని అని గల్లా ఎగరేసి చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. మా అమ్మ ఎయిర్ ఇండియాలో ఫ్లైట్ అటెండెంట్‌గా 9 సంవత్సరాలు పని చేసింది. అమ్మానాన్న ఇద్దరూ మాకోసం కష్టపడేవారు. ప్రతి ఏడాది లాంగ్ వెకేషన్‌కు తీసుకువెళ్లేవారు. కొన్నిసార్లు ఆ వెకేషన్ కూడా ఆపేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బర్త్‌డే పార్టీ కూడా చిన్నగా జరిపేవారు. అలా అని తినడానికి తిండి లేనంత దీన స్థితిలోనైతే లేము అని పేర్కొన్నాడు.దేశం విడిచి పారిపోలేదుఇండస్ట్రీకి 14 ఏండ్లు దూరంగా ఉండటంపై స్పందిస్తూ.. నేను సినిమాలకు దూరంగా ఉన్నమాట వాస్తవమే.. కానీ దేశం విడిచి వెళ్లిపోలేదు. కొన్నాళ్లపాటు అక్కడ ఉండి మళ్లీ ఇండియాకు వచ్చేశాను.. ఇక్కడే ఉన్నాను. కొన్నేళ్ల క్రితం నేను కాస్త లావయ్యాను. నా అవతారం చూసి సినిమాలు పూర్తిగా మానేసినట్లున్నాడని అంతా అనుకున్నారు. నిజంగా 14 ఏళ్లు మూవీస్‌కు దూరంగా ఉండటం నేను చేసిన అతిపెద్ద పొరపాటు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫర్దీన్ ఖేల్ ఖేల్ మే, విస్ఫోట్ సినిమాల్లో నటిస్తున్నాడు. చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో -
పెళ్లయిన 18 ఏళ్లకు విడాకులు తీసుకుంటున్న బాలీవుడ్ జంట!
పెళ్లి-విడాకులు సర్వసాధారణమైపోయాయి. మరీ ముఖ్యంగా చిత్రపరిశ్రమలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఓ బాలీవుడ్ జంట విడాకుల దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్- నటాషా మాద్వానీ విడిపోయినట్లు ఓ ప్రచారం నెట్టింట వైరల్‌గా మారింది. నటుడు ఫర్దీన్ ఖాన్ ప్రముఖ నటి ముంతాజ్ కూతురు నటాషాను 2005 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి దియాని ఇసబెల్లా ఖాన్(10) అనే కూతురు, అజారియస్ ఫర్దీన్ ఖాన్(6) అనే కుమారుడు ఉన్నారు. సుమారు ఏడాదికాలంగా దంపతులిద్దరూ విడివిడిగానే జీవనం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వాటిని పరిష్కరించుకోలేని క్రమంలో విడిపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇకపోతే గతేడాది ప్రారంభంలో ఓ ఇంటర్వ్యూలో ఫర్దీన్ ఖాన్ మాట్లాడుతూ.. '2011లో మేము లండన్ షిఫ్ట్ అయ్యాం. సంతాన సమస్యలు ఉండటంతో అక్కడ ఓ డాక్టర్‌ను సంప్రదించాం. ఐవీఎఫ్(ఇన్వెట్రో ఫర్టిలైజేషన్) ద్వారా నటాషా గర్భంలో కవలలు ప్రవేశించారు. కానీ ఆరో నెలలోనే వారిద్దరూ కడుపులోనే ప్రాణాలు వదిలారు. త్వరలో ఇద్దరు పిల్లల్ని చేతుల్లోకి తీసుకుని ఆడించబోతున్నామన్న ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న మాకు ఈ వార్త అశనిపాతంలా తాకింది. నటాషా ఎంతగానో కుమిలిపోయింది. తర్వాత మాకు పాప పుట్టింది. అప్పుడు మా ఆనందం అంతా ఇంతా కాదు. కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత పాప మా జీవితాల్లోకి రావడంతో మా మనసంతా తేలికయిపోయింది' అని ఫర్దీన్ చెప్పుకొచ్చాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఫర్దీన్ త్వరలోనే రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. విస్ఫట్ సినిమాతో పాటు నో ఎంట్రీ సీక్వెల్లో అతడు నటించనున్నట్లు గాసిప్ వినిపిస్తోంది. ఆయన చివరిసారిగా 2010లో వచ్చిన దుల్హా మిల్ గయా సినిమాలో కనిపించాడు. చదవండి: రాఘవ లారెన్స్ సినిమా ఆడిషన్స్‌కు వెళ్తే డైరెక్టర్ అలా చేయమని బలవంతం!: నటి ప్రియుడి కోసం పేరు మార్చుకున్న జ్యోతి రాయ్? జగతి మేడమ్ రెండో పెళ్లి -
'నేను యాక్సిడెంట్లో చనిపోయానన్నారు.. అది విని మా అమ్మ'
Actor Fardeen Khan Reacts To Fake News On His Death: సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఫేక్ వార్తలు హల్చల్ చేస్తుంటాయి. పెళ్లి, ప్రేమాయణం, బ్రేకప్ వంటి పుకార్లతో సెలబ్రిటీలు చిరాకు పడిపోతుంటారు. అవి వారి సినీ కెరీర్‌పైనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇబ్బందిపెడుతుంటాయని బాధ వెళ్లబోసుకున్న తారలు ఉన్నారు. ఇలాంటి సంఘటన ప్రముఖ నటుడు ఫర్దీన్ ఖాన్‌కు ఒకటి కాదు రెండు సందర్భాల్లో జరిగిందట. తాను కొన్నేళ్లు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నానని, అప్పుడు ఓ యాక్సిడెంట్లో చనిపోయినట్లు ఇప్పటికీ రెండు సార్లు రూమర్లు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పుకార్లతో ఎంతో కలత చెందానని పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టిన విషయం ఏంటి ?' అని అడిగిన ప్రశ్నకు ఫర్దీన్ ఖాన్ ఈ విషయం చెప్పుకొచ్చారు. 'నేను కొంతకాలం హిందీ సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నాను. ఆ సమయంలో నేను ఒక యాక్సిడెంట్లో చనిపోయానని రెండుసార్లు వార్తలు వచ్చాయి. అది నన్ను చాలా బాధించింది. ఎందుకంటే ఈ వార్త విని మా అమ్మకు గుండెపోటు వస్తే. లేదా ఇది చూసి నా భార్య ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చెప్పలేను. అందుకే నేను చనిపోయానన్న వార్త విన్నా, చదివినా నాకు బాధ, చిరాకు తెగ వచ్చేవి. ఇంత బాధ్యాతరాహిత్యంగా ఎలా ఉంటారని అనిపించేది.' అని ఫర్దీన్ ఖాన్ తెలిపారు. ఆయన 2010లో సుస్మితా సేన్‌తో కలిసి నటించిన 'దుల్హా మిల్గయా' సినిమాలో చివరిసారిగా కనిపించారు. ఇప్పుడు తాజాగా రితేష్ దేశ్ముఖ్తో కలిసి 'విస్ఫోట్' అనే సినిమాలో అలరించనున్నారు. వీరిద్దరూ 'హే బేబీ' సినిమాలో చివరిగా కలిసి నటించారు. ఇప్పుడు సుమారు 14 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించనున్నారు. -
46 ఏళ్ల నటుడు... 25 ఏళ్ల కుర్రాడిలా
సాక్షి,ముంబై: మరో బాలీవుడ్ నటుడు బాడీ షేమింగ్‌తో ఫుల్ ఎనర్జిటిక్‌గా మళ్లీ వెండితెర మీద దర్శనం ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఆ నటుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 46 ఏళ్ల నటుడు... 25 ఏళ్ల కుర్రాడిలా చలాకీగా ఉన్నాడు. ఇంతకీ ఎవరా నటుడు అనుకుంటున్నారా? ప్రేమ్ ఆగన్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన ఫర్దీన్ ఖాన్. ఇతగాడు అలనాటి బాలీవుడ్ హీరో, నిర్మాత, ప్రముఖ దర్శకుడు ఫిరోజ్ ఖాన్ తనయుడు కూడా. ప్రేమ్ ఆగన్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన ఫర్దీన్ ఖాన్. పలు హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్‌ను సంపాదించుకున్న ఫర్దీన్... ఆ తర్వాత అనూహ్యంగా స్టార్ రేసులో వెనుకబడిపోయాడు. చాలా ఏళ్ల వెండితెరకు దూరంగా ఉన్నాడు. ఓ వైపు అనుకున్నంతగా సినీ కెరీర్ సాగకపోవడం, మరోవైపు వ్యక్తిగత సమస్యలతో విపరీతంగా బరువు పెరిగిపోయాడు ఫర్దీన్. దీంతో ఇక ఈ హీరో పని అయిపోయినట్లే అని విమర్శలు,బాడీ షేమింగ్‌పై కామెంట్లు వెల్లువెత్తినా అతగాడు మాత్రం పట్టించుకోలేదు. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు కూడా. అయితే మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించిందుకు, పెరిగిన బరువును తగ్గించుకునే పనిలో బిజీ అయిపోయాడు. అధిక బరువును తగ్గించుకునేందుకు కఠోరంగా శ్రమించి, సన్నబడ్డాడు కూడా. అయితే అతని బరువు తగ్గడానికి కారణమైనని ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ విషయాలు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ‘‘నేను ప్రస్తుతం 30ఏళ్ల కుర్రాడిలా ఉన్నా. కానీ నేను ఇంకా 35 శాతం అంటే 25 ఏళ్ల కుర్రాడిలాగా మారిపోవాలని అనుకుంటున్నాను. ఆరు నెలల్లో 18 కేజీల బరువు తగ్గాను. మంచి నిద్ర, ఆహారం తీసుకుని ప్రశాంతంగా ఉన్నాను. అందుకు తగ్గట్టుగా వర్క్ అవుట్స్ చేశాను. అందుకే నాకు ఈ రూపం దక్కింది.’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ఫర్దీన్ తిరిగి బాలీవుడ్లో అడుగు పెట్టాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఫర్దీన్ చివరిగా 2010లో దుల్హా మిల్ గయా సినిమాలో కనించాడు. ప్రేమ్ ఆగన్ తరువాత హే బేబి, నో ఎంట్రీ, జనషీన్, లవ్ కే లియే కుచ్ బి కరేగా , ప్యార్ తునే క్యా కియా, డార్లింగ్ వంటి స్టార్ సినిమాల్లో నటించాడు. నటనతో పాటు దర్శకత్వంపై దృష్టి పెట్టనున్నట్లు తన మనసులో మాటను ఫర్దీన్ వెల్లడించాడు. -
రెండేళ్లలో ఎంత మార్పు...
బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ గుర్తుండే ఉంటుంది. రెండేళ్ల క్రితం ఈ నటుడు తన శరీర బరువు గురించి విపరీతమైన విమర్శలు ఎదుర్కోన్నారు. ‘మీరు బాగా లావెక్కుతున్నారు, తెగ చబ్బీ అవుతున్నారు చూడలేక పోతున్నామంటూ’ నెటిజన్లు ఈ నటున్ని తెగ ట్రోల్ చేశారు. కానీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఫర్దీన్‌ను చూసిన వారు ముందు కాస్తా ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. అంతేనా విమర్శలు ఇంత పని చేస్తాయా అనుకోక మానరు. ఫర్దీన్ ఎయిర్ పోర్టులో ఉండగా తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. రెండేళ్లలో ఎంత మార్పు అంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఎందుకంటే రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఫర్దీన్ చాలా ఫిట్‌గా, పర్ఫేక్ట్ ఫిజిక్‌తో తనను విమర్శించిన వారందరి నోళ్లు మూయించాడు. ఈ విషయం గురించి ఫర్దీన్ ఖాన్ ‘నా శరీర బరువు గురించి విమర్శలు వచ్చినప్పుడు నేను వాటి గురించి ఆలోచిస్తూ నా బుర్ర పాడు చేసుకోలేదు. నన్ను కామెంట్ చేసిన వారంతా నేను ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నారు కదా అనిపించింది. అందుకే ఫిట్నేస్పై శ్రద్ద పెట్టాను. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను’ అని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రోలింగ్ ట్రెండ్ గురించి మాట్లాడుతూ ‘ప్రతికూలంగా ట్రోల్ చేసేవారిని ప్రశ్నించకపోతే ఈ వెర్రి మరింత పెరిగిపోతుంది. ట్రోల్ చేసేవారు తామే కరెక్ట్ అనే భావనలోకి వెళ్లి పోతారు. తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు అందరికి ఉంది. కానీ ఇలా చాటుగా (ఇంటర్నెట్లో)కాదు.. ధైర్యంగా ఎలుగెత్తి మీ అభిప్రాయాలను వ్యక్తపర్చండి’ అంటూ సలహా ఇచ్చారు -
ఈ నటిని గుర్తుపట్టారా?
ముంబై: యశ్ రాజ్ బ్యానర్ లో షారూఖ్ నటించిన సూపర్ హిట్ సినిమా 'చక్ దే ఇండియా' గుర్తుందికదా! అందులో కోమల్ చౌహాన్ గా టామ్ బాయ్ తరహా పాత్రలో ఇరగదీసిన చిత్రాశ్రీ రావత్ 'చక్ దే' తర్వాత ఒకటిరెండు సినిమాల్లో మాత్రమే కనిపించింది. నిజజీవితంలోనూ హాకీ క్రీడాకారిణి అయిన చిత్రాశ్రీ సినిమాల్లోకి వచ్చి, ఆ తర్వాత బుల్లితెర నటిగా తనదైన ప్రయాణం కొనసాగిస్తోంది. మళ్లీ వెండి తెరపై మెరవాలనుకుంటోన్న ఈ ఉత్తరాఖండ్ చిన్నది ఇటీవలే తన కొత్తలుక్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది. అప్పుడలా.. ఇప్పుడిలా.. అప్పట్లో ప్రొవోగ్ దగ్గర్నుంచి ఫేమస్ బ్రాండ్లన్నిటికీ అంబాసిడరైన బాలీవుడ్ హీరో ఫర్దీన్ ఖాన్ ఇప్పుడు గుర్తుపట్టలేనంత లావెక్కారు. జంగల్, ప్యార్ తూనే క్యా కియా, నో ఎంట్రీ సినిమాలతో ఓ ఊపు ఊపి, 2010లో విడుదలైన 'దూల్హా మిల్ గయా' తరువాత తెరమరుగైపోయిన ఫర్దీన్ క్రమంగా లావెక్కుతూ.. అభిమానులు గుర్తుపట్టలేనంతలా మారిపోయాడు. ప్రస్తుతం బరువుతగ్గించుకునేపనిలో బిజీగా ఉన్నాడు. చిక్కబడ్డ చక్కనమ్మ! చేసింది కొన్ని సినిమాలే అయినా చాలా మందికి చాలాకాలం గుర్తిండిపోయే నటీమణుల్లో కీర్తిరెడ్డి ఒకరు. 'తొలిప్రేమ'తో టాలీవుడ్ ని, 'తేరా జాదూ చల్ గయా', 'ప్యార్ ఇష్క్ మొహబ్బత్' లాంటి సినిమాలతో బాలీవుడ్ ని ఊపేసిన ఈ తెలుగు హీరోయిన్ ప్రస్తుతం అమెరికాలో సెటిలై ఓ బాబుకు జన్మనిచ్చింది. గతేడాది కజిన్ రిసెప్షన్ కోసం ఇండియా వచ్చినప్పటి ఫొటో ఇది. 2004లో సుమంత్ ను పెళ్లిచేసుకుని, పడక విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కీర్తి అప్పటి రూపానికి, ఇప్పటి ఫొటోతో పోలిక ఎలా ఉందో చూడండి. బుల్లెతెర ఎంట్రీకి రంగం సిద్ధం మాచీస్, జోష్.. లెక్కకు మిక్కిలి సినిమాల్లో నటించి భారీగా మహిళా అభిమానులకు సొంతం చేసుకున్న చంద్రచూడ్ సింగ్ సినిమా అవకాశాలు రాక(లేక) పోవడంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆమేరకు తన ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. కొత్తలుక్ బాగుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. -
'99 శాతం వ్యక్తులకు దమ్ము, ధైర్యం లేదు'
ముంబై: తనపై వస్తున్న కామెంట్లపై బాలీవుడ్ హీరో ఫర్దీన్ ఖాన్ స్పందించాడు. బరువు పెరుగుతున్నందుకు తానేమి సిగ్గుపడటం లేదని ఫేస్ బుక్ లో గురువారం రాత్రి పోస్ట్ చేశాడు. గత కొన్ని రోజులుగా ఫర్దీన్ బరువు పెరగడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని, ఏ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని 'నో ఎంట్రీ' స్టార్ పేర్కొన్నాడు. కామెంట్లు చేస్తున్న వారిలో 99 శాతం మంది దమ్ము, ధైర్యం లేని వారని.. ఇందులో సందేహమే లేదని మరోసారి కామెంట్ చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలని హెచ్చరించాడు. తనపై కామెంట్లు చేస్తున్న వాళ్ల కంటే గుంపుగా ఉన్న పిరికివాళ్లే నయం అంటూ విమర్శించాడు. కామెంట్లు చేస్తున్నారే తప్ప తర్వాత ఏం జరుగుతుంది.. అవతలి వ్యక్తులు ఎలా రియాక్ట్ అవుతారని వారు ఆలోచించరని చెప్పాడు. సెలబ్రిటీలను ఇంటర్నెట్ మాధ్యమంగా చేసుకుని డిస్టర్బ్ చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డాడు. పిరికి పందల గుంపులు పనిపాటా లేని సమయంలో చేస్తున్న కామెంట్లపై ఎక్కువగా ఒత్తిడికి గురవ్వాల్సిన పనిలేదని, వీకెండ్ టాపిక్ గా మారినందుకు హ్యాపీగా ఉందని పోస్ట్ లో హీరో ఫర్దీన్ ఖాన్ రాసుకొచ్చాడు.