46 ఏళ్ల నటుడు... 25 ఏళ్ల కుర్రాడిలా | Fardeen Khan Trending On Social Media On His Physical Transformation | Sakshi
Sakshi News home page

పూర్వ వైభవంతో తిరిగి సినిమాల్లోకి ఫర్దీన్‌ ఖాన్‌

Published Wed, Dec 9 2020 3:48 PM | Last Updated on Wed, Dec 9 2020 6:53 PM

Fardeen Khan Trending On Social Media On His Physical Transformation - Sakshi

సాక్షి,ముంబై: మరో బాలీవుడ్‌ నటుడు బాడీ షేమింగ్‌తో ఫుల్‌ ఎనర్జిటిక్‌గా మళ్లీ వెండితెర మీద దర్శనం ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఆ నటుడి ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 46 ఏళ్ల నటుడు... 25 ఏళ్ల కుర్రాడిలా చలాకీగా ఉన్నాడు. ఇంతకీ ఎవరా నటుడు అనుకుంటున్నారా? ప్రేమ్‌ ఆగన్‌ చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన ఫర్దీన్‌ ఖాన్‌. ఇతగాడు అలనాటి బాలీవుడ్ హీరో, నిర్మాత, ప్రముఖ దర్శకుడు ఫిరోజ్‌ ఖాన్‌ తనయుడు కూడా.

ప్రేమ్‌ ఆగన్‌ చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన ఫర్దీన్‌ ఖాన్‌. పలు హిట్‌ చిత్రాలు తన ఖాతాలో వేసుకుని స్టార్‌ డమ్‌ను సంపాదించుకున్న ఫర్దీన్‌... ఆ తర్వాత అనూహ్యంగా స్టార్‌ రేసులో వెనుకబడిపోయాడు. చాలా ఏళ్ల వెండితెరకు దూరంగా ఉన్నాడు. ఓ వైపు అనుకున్నంతగా సినీ కెరీర్‌ సాగకపోవడం, మరోవైపు వ్యక్తిగత సమస్యలతో విపరీతంగా బరువు పెరిగిపోయాడు ఫర్దీన్‌. దీంతో ఇక ఈ హీరో పని అయిపోయినట్లే అని విమర్శలు,బాడీ షేమింగ్‌పై కామెంట్లు వెల్లువెత్తినా అతగాడు మాత్రం పట్టించుకోలేదు. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు కూడా. అయితే మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించిందుకు, పెరిగిన బరువును తగ్గించుకునే పనిలో బిజీ అయిపోయాడు.  అధిక బరువును తగ్గించుకునేందుకు కఠోరంగా శ్రమించి, సన్నబడ్డాడు కూడా. 

అయితే అతని బరువు తగ్గడానికి కారణమైనని ఫిజికల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ విషయాలు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ‘‘నేను ప్రస్తుతం 30ఏళ్ల కుర్రాడిలా ఉన్నా. కానీ నేను ఇంకా 35 శాతం అంటే  25 ఏళ్ల కుర్రాడిలాగా మారిపోవాలని అనుకుంటున్నాను. ఆరు నెలల్లో 18 కేజీల బరువు తగ్గాను. మంచి నిద్ర, ఆహారం తీసుకుని ప్రశాంతంగా ఉన్నాను. అందుకు తగ్గట్టుగా వర్క్‌ అవుట్స్‌ చేశాను. అందుకే నాకు ఈ రూపం దక్కింది.’ అని సంతోషం వ్యక్తం చేశాడు.

ఫర్దీన్ తిరిగి‌ బాలీవుడ్‌లో అడుగు పెట్టాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఫర్దీన్‌ చివరిగా 2010లో దుల్హా మిల్‌ గయా సినిమాలో కనించాడు. ప్రేమ్‌ ఆగన్‌ తరువాత హే బేబి, నో ఎంట్రీ, జనషీన్‌, లవ్‌ కే లియే కుచ్‌ బి కరేగా , ప్యార్‌ తునే క్యా కియా, డార్లింగ్‌ వంటి స్టార్‌ సినిమాల్లో నటించాడు. నటనతో పాటు దర్శకత్వంపై దృష్టి పెట్టనున్నట్లు తన మనసులో మాటను ఫర్దీన్‌ వెల్లడించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement