Physical Transformation
-
46 ఏళ్ల నటుడు... 25 ఏళ్ల కుర్రాడిలా
సాక్షి,ముంబై: మరో బాలీవుడ్ నటుడు బాడీ షేమింగ్‌తో ఫుల్ ఎనర్జిటిక్‌గా మళ్లీ వెండితెర మీద దర్శనం ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఆ నటుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 46 ఏళ్ల నటుడు... 25 ఏళ్ల కుర్రాడిలా చలాకీగా ఉన్నాడు. ఇంతకీ ఎవరా నటుడు అనుకుంటున్నారా? ప్రేమ్ ఆగన్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన ఫర్దీన్ ఖాన్. ఇతగాడు అలనాటి బాలీవుడ్ హీరో, నిర్మాత, ప్రముఖ దర్శకుడు ఫిరోజ్ ఖాన్ తనయుడు కూడా. ప్రేమ్ ఆగన్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన ఫర్దీన్ ఖాన్. పలు హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్‌ను సంపాదించుకున్న ఫర్దీన్... ఆ తర్వాత అనూహ్యంగా స్టార్ రేసులో వెనుకబడిపోయాడు. చాలా ఏళ్ల వెండితెరకు దూరంగా ఉన్నాడు. ఓ వైపు అనుకున్నంతగా సినీ కెరీర్ సాగకపోవడం, మరోవైపు వ్యక్తిగత సమస్యలతో విపరీతంగా బరువు పెరిగిపోయాడు ఫర్దీన్. దీంతో ఇక ఈ హీరో పని అయిపోయినట్లే అని విమర్శలు,బాడీ షేమింగ్‌పై కామెంట్లు వెల్లువెత్తినా అతగాడు మాత్రం పట్టించుకోలేదు. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు కూడా. అయితే మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించిందుకు, పెరిగిన బరువును తగ్గించుకునే పనిలో బిజీ అయిపోయాడు. అధిక బరువును తగ్గించుకునేందుకు కఠోరంగా శ్రమించి, సన్నబడ్డాడు కూడా. అయితే అతని బరువు తగ్గడానికి కారణమైనని ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ విషయాలు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ‘‘నేను ప్రస్తుతం 30ఏళ్ల కుర్రాడిలా ఉన్నా. కానీ నేను ఇంకా 35 శాతం అంటే 25 ఏళ్ల కుర్రాడిలాగా మారిపోవాలని అనుకుంటున్నాను. ఆరు నెలల్లో 18 కేజీల బరువు తగ్గాను. మంచి నిద్ర, ఆహారం తీసుకుని ప్రశాంతంగా ఉన్నాను. అందుకు తగ్గట్టుగా వర్క్ అవుట్స్ చేశాను. అందుకే నాకు ఈ రూపం దక్కింది.’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ఫర్దీన్ తిరిగి బాలీవుడ్లో అడుగు పెట్టాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఫర్దీన్ చివరిగా 2010లో దుల్హా మిల్ గయా సినిమాలో కనించాడు. ప్రేమ్ ఆగన్ తరువాత హే బేబి, నో ఎంట్రీ, జనషీన్, లవ్ కే లియే కుచ్ బి కరేగా , ప్యార్ తునే క్యా కియా, డార్లింగ్ వంటి స్టార్ సినిమాల్లో నటించాడు. నటనతో పాటు దర్శకత్వంపై దృష్టి పెట్టనున్నట్లు తన మనసులో మాటను ఫర్దీన్ వెల్లడించాడు. -
నూరు నుంచి ఆరుకు తెచ్చారు!
స్టార్ ట్రైనర్ ఆరేళ్ల క్రితం నా తొలి మూవీ విడుదలైంది. మంచి పేరొచ్చింది కానీఆఫర్స్ రాలేదు. ఆ సమయంలో భుక్తి కోసం ఏ పని దొరికితే ఆ పని చేశాను. సరైన ఫుడ్ తినలేక, జిమ్‌కి వెళ్లలేక, సరైన పని లేకపోవడంతో రెండు మూడేళ్లలో బాగా వెయిట్ పెరిగాను. దాదాపుగా 100 కిలోల బరువుకి చేరుకున్నా. అదే సమయంలో ‘మాయ’ సినిమా ఛాన్సొచ్చింది. అందులో స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు రావడం నా ఎంట్రీ షాట్. ఆ షాట్లో లావుగా ఉంటే బాగుండదని డెరైక్టర్ నీలకంఠ అన్నారు. స్లిమ్‌గా మారమని ఓ రకంగా అల్టిమేటమ్ ఇచ్చారాయన. అలా నా ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఫస్ట్ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ఆ తర్వాత హీరో రానాకి ఆ క్రెడిట్ ఇవ్వాలి. ఆ టైమ్‌లో రానా నాకు ఎక్విప్మెంట్ ఇచ్చాడు, డైట్ చెప్పాడు. అంతేకాదు... తన పర్సనల్ ట్రైనర్ కునాల్‌ని పరిచయం చేశారు. అలా రానా నాకు చాలా హెల్ప్ చేశారు. హిందీ సినిమాతో... ‘మాయ’ సినిమా నుంచి నా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2015లో బాలీవుడ్ మూవీ ‘సనమ్ తేరీ కసమ్’ ఛాన్స్ వచ్చింది. అప్పుడు హీరో జాన్ అబ్రహాంను కలిస్తే... తన ట్రైనర్ వినోద్ చన్నాను పరిచయం చేశారు. నిజానికి వినోద్ చన్నా రెమ్యూనరేషన్ నా తాహతుకు మించిందే. అయినా... రెండు నెలల కోసం జాయినయ్యాను. ఆ తర్వాత నా ప్రొడక్షన్ హౌజ్, ప్రొడ్యూసర్ నాకు సాయం చేశారు. చాలా పెద్ద స్టార్ ట్రైనర్ అయినప్పటికీ వినోద్ చాలా సింపుల్ పర్సన్. ఫిట్నెస్ విషయంలో అత్యున్నత పరిజ్ఞానం ఉంది ఆయనకు. చాలా డిఫరెంట్ వర్కవుట్స్ చేయించేవాడు. టైగర్ వాక్, గొరిల్లా వాక్, క్రాబ్ వాక్... వంటివి భాగంగా ఉండే యానిమల్ ఫ్లో ఆయన చేయించే వెరైటీ వర్కవుట్స్‌కి ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. అలా ప్రతి రోజూ కనీసం ఒక్కటైనా కొత్త వర్కవుట్ చేయించడం వల్ల ఫిజిక్‌కి ఓ రకంగా షాక్ ఇచ్చినట్టు అయేది. దాంతో మన శరీరానికి వ్యాయామం అలవాటైపోయి, అది సులభం అయిపోవడం ఉండేది కాదు. వెజిటబుల్స్, చికెన్, ఎగ్‌వైట్స్, పెరుగు, ఆల్మండ్స్, వాల్నట్స్ వంటివి డైట్. వర్కవుట్ అయ్యాక మాత్రం ఒక ప్రొటీన్ షేక్ తాగేవాణ్ణి. రోజుకు గంటన్నర పాటు చేసిన అలాంటి వర్కవుట్స్‌తో 6 నెలల్లో సిక్స్‌ప్యాక్ వచ్చింది. నూరు కిలోల నుంచి ‘ఆరు’ పలకల దేహానికి వచ్చానంటే ట్రైనర్ చలవే. ఇంకా ముందే వచ్చేదేమో కానీ, షార్ట్ కట్లో వెళ్లాలనుకోలేదు. ఖరీదైనా... ఆయనే మిన్న... ఇప్పటికీ ట్రైనర్‌గా వినోద్‌నే ప్రిఫర్ చేస్తున్నా. ఆయన చాలా ఎక్స్పెన్సివ్ అయినా... ఇకపై కూడా మానను. మన లోపల ఏం జరుగుతుంది అనేది ఆయన సరిగ్గా అంచనా వేయగలడు. టోటల్ బాడీని ఆయన స్క్రూటీనీ చేస్తాడు. ఆయన వల్ల నేను మరింత డిసిప్లిన్‌గా మారాను. ప్రస్తుతం నా బరువు 81 కిలోలు. - హర్షవర్ధన్ రాణే