Is Fardeen Khan, and Natasha Madhvani to Part Ways After 18 Years Marriage? - Sakshi
Sakshi News home page

సంతాన సమస్యలు.. గర్భశోకం.. అంతలోనే సంతోషం.. 18 ఏళ్ల బంధానికి నటుడు తెగదెంపులు

Published Sun, Jul 30 2023 1:03 PM | Last Updated on Sun, Jul 30 2023 3:47 PM

Is Fardeen Khan, Natasha Madhvani to Part Ways After 18 Years Marriage? - Sakshi

పెళ్లి-విడాకులు సర్వసాధారణమైపోయాయి. మరీ ముఖ్యంగా చిత్రపరిశ్రమలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఓ బాలీవుడ్‌ జంట విడాకుల దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ నటుడు ఫర్దీన్‌ ఖాన్‌- నటాషా మాద్వానీ విడిపోయినట్లు ఓ ప్రచారం నెట్టింట వైరల్‌గా మారింది. నటుడు ఫర్దీన్‌ ఖాన్‌ ప్రముఖ నటి ముంతాజ్‌ కూతురు నటాషాను 2005 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి దియాని ఇసబెల్లా ఖాన్‌(10) అనే కూతురు, అజారియస్‌ ఫర్దీన్‌ ఖాన్‌(6) అనే కుమారుడు ఉన్నారు.

సుమారు ఏడాదికాలంగా దంపతులిద్దరూ విడివిడిగానే జీవనం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వాటిని పరిష్కరించుకోలేని క్రమంలో విడిపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇకపోతే గతేడాది ప్రారంభంలో ఓ ఇంటర్వ్యూలో ఫర్దీన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. '2011లో మేము లండన్‌ షిఫ్ట్‌ అయ్యాం. సంతాన సమస్యలు ఉండటంతో అక్కడ ఓ డాక్టర్‌ను సంప్రదించాం. ఐవీఎఫ్‌(ఇన్‌వెట్రో ఫర్టిలైజేషన్‌) ద్వారా నటాషా గర్భంలో కవలలు ప్రవేశించారు. కానీ ఆరో నెలలోనే వారిద్దరూ కడుపులోనే ప్రాణాలు వదిలారు. త్వరలో ఇద్దరు పిల్లల్ని చేతుల్లోకి తీసుకుని ఆడించబోతున్నామన్న ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న మాకు ఈ వార్త అశనిపాతంలా తాకింది.

నటాషా ఎంతగానో కుమిలిపోయింది. తర్వాత మాకు పాప పుట్టింది. అప్పుడు మా ఆనందం అంతా ఇంతా కాదు. కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత పాప మా జీవితాల్లోకి రావడంతో మా మనసంతా తేలికయిపోయింది' అని ఫర్దీన్‌ చెప్పుకొచ్చాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఫర్దీన్‌ త్వరలోనే రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. విస్‌ఫట్‌ సినిమాతో పాటు నో ఎంట్రీ సీక్వెల్‌లో అతడు నటించనున్నట్లు గాసిప్‌ వినిపిస్తోంది. ఆయన చివరిసారిగా 2010లో వచ్చిన దుల్హా మిల్‌ గయా సినిమాలో కనిపించాడు.

చదవండి: రాఘవ లారెన్స్‌ సినిమా ఆడిషన్స్‌కు వెళ్తే డైరెక్టర్‌ అలా చేయమని బలవంతం!: నటి
ప్రియుడి కోసం పేరు మార్చుకున్న జ్యోతి రాయ్‌? జగతి మేడమ్‌ రెండో పెళ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement