ముంబై: యశ్ రాజ్ బ్యానర్ లో షారూఖ్ నటించిన సూపర్ హిట్ సినిమా 'చక్ దే ఇండియా' గుర్తుందికదా! అందులో కోమల్ చౌహాన్ గా టామ్ బాయ్ తరహా పాత్రలో ఇరగదీసిన చిత్రాశ్రీ రావత్ 'చక్ దే' తర్వాత ఒకటిరెండు సినిమాల్లో మాత్రమే కనిపించింది. నిజజీవితంలోనూ హాకీ క్రీడాకారిణి అయిన చిత్రాశ్రీ సినిమాల్లోకి వచ్చి, ఆ తర్వాత బుల్లితెర నటిగా తనదైన ప్రయాణం కొనసాగిస్తోంది. మళ్లీ వెండి తెరపై మెరవాలనుకుంటోన్న ఈ ఉత్తరాఖండ్ చిన్నది ఇటీవలే తన కొత్తలుక్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది.
అప్పుడలా.. ఇప్పుడిలా..
అప్పట్లో ప్రొవోగ్ దగ్గర్నుంచి ఫేమస్ బ్రాండ్లన్నిటికీ అంబాసిడరైన బాలీవుడ్ హీరో ఫర్దీన్ ఖాన్ ఇప్పుడు గుర్తుపట్టలేనంత లావెక్కారు. జంగల్, ప్యార్ తూనే క్యా కియా, నో ఎంట్రీ సినిమాలతో ఓ ఊపు ఊపి, 2010లో విడుదలైన 'దూల్హా మిల్ గయా' తరువాత తెరమరుగైపోయిన ఫర్దీన్ క్రమంగా లావెక్కుతూ.. అభిమానులు గుర్తుపట్టలేనంతలా మారిపోయాడు. ప్రస్తుతం బరువుతగ్గించుకునేపనిలో బిజీగా ఉన్నాడు.
చిక్కబడ్డ చక్కనమ్మ!
చేసింది కొన్ని సినిమాలే అయినా చాలా మందికి చాలాకాలం గుర్తిండిపోయే నటీమణుల్లో కీర్తిరెడ్డి ఒకరు. 'తొలిప్రేమ'తో టాలీవుడ్ ని, 'తేరా జాదూ చల్ గయా', 'ప్యార్ ఇష్క్ మొహబ్బత్' లాంటి సినిమాలతో బాలీవుడ్ ని ఊపేసిన ఈ తెలుగు హీరోయిన్ ప్రస్తుతం అమెరికాలో సెటిలై ఓ బాబుకు జన్మనిచ్చింది. గతేడాది కజిన్ రిసెప్షన్ కోసం ఇండియా వచ్చినప్పటి ఫొటో ఇది. 2004లో సుమంత్ ను పెళ్లిచేసుకుని, పడక విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కీర్తి అప్పటి రూపానికి, ఇప్పటి ఫొటోతో పోలిక ఎలా ఉందో చూడండి.
బుల్లెతెర ఎంట్రీకి రంగం సిద్ధం
మాచీస్, జోష్.. లెక్కకు మిక్కిలి సినిమాల్లో నటించి భారీగా మహిళా అభిమానులకు సొంతం చేసుకున్న చంద్రచూడ్ సింగ్ సినిమా అవకాశాలు రాక(లేక) పోవడంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆమేరకు తన ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. కొత్తలుక్ బాగుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఈ నటిని గుర్తుపట్టారా?
Published Fri, Jun 3 2016 1:01 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement