సాక్షి, బెంగళూర్ : సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ అంశంతో ఓ పోస్ట్ తెగ చక్కర్లు కొడుతోంది. బెంగళూర్‌లోని ఓ ప్రముఖ యూనివర్సిటీ పాఠ్యాంశమంటూ ఓ వ్యాసం ఫేస్ బుక్, వాట్సాప్‌లలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఉంది ఏంటంటే.. వరకట్నం తీసుకోవటం వల్ల లాభాలు.
బెంగళూరులోని ప్రముఖ విద్యాసంస్థగా గుర్తింపు పొందిన సెయింట్ జోసెఫ్ కాలేజీ పేరిట ఈ వ్యాసం విడుదల అయ్యింది. వరకట్నం తీసుకోవడం వల్ల ప్రయోజనాలు, లాభాలను అక్కడ పాఠ్యాంశంగా వల్లె వేస్తున్నారంట. సోషియాలజీ సబ్జెక్ట్ లో భాగంగా ఈ అంశాలను బోధిస్తున్నారని చెబుతున్నారు. వరకట్నం తీసుకోవడం వల్ల ఉండే 7 ఉపయోగాలను పాఠ్యాంశంలో పేర్కొన్నారు.
- ఎక్కువ కట్నం ఇవ్వడం వల్ల అందవిహీనంగా ఉన్న అమ్మాయిల పెళ్లి చేయవచ్చు
- అందమైన అబ్బాయిలను ఎక్కువ కట్నం ఆశజూపి పెళ్లికి ఒప్పించవచ్చు
- కట్నం వల్ల కొత్తగా పెళ్లైన వాళ్లు కలిసి జీవించడానికి కొంత ఆర్థిక సాయంగా ఉంటుంది
- మెరిట్ విద్యార్థులు ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది
- ఎక్కువ కట్నం తెచ్చిన అమ్మాయిని అత్తారింట్లో ఎక్కువ ప్రేమగా చూస్తారు
- ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేసిన వారి స్థాయిని సమాజం గుర్తిస్తుంది
- అమ్మాయికి తండ్రి ఆస్తిలో భాగం ఇవ్వడం కంటే.. కట్నం ఇచ్చి పంపించేస్తేనే ఉపయోగం ఉంది
ఇలా ఆయా అంశాల గురించి అందులో కూలంకశంగా పేర్కొన్నారు. అయితే ఈ పాఠ్యాంశం వ్యవహారంతో తమకు సంబంధం లేదన్న యూనివర్సిటీ అధికారులు.. ఉతన్నస్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు. తమ కళాశాల ఇలాంటి వాటిని ప్రోత్సహించదని సెయింట్ జోసెఫ్ కళాశాల పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ కిరణ్ జీవన్ చెప్పగా, సోషియాలజీ విభాగం హెడ్ డాక్టర్ బెరిన్ కూడా ఆ ఆరోపణలను ఖండించారు.
1961 నుంచి భారత దేశంలో వరకట్న నిషేధం అమలులోకి వచ్చింది. అయినప్పటికీ ఇంకా అది ఓ దురాచారంగానే కొనసాగుతుండగా.. ప్రభుత్వాలు కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment