
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చింతపల్లి మండలం గొల్లపల్లిలో దుండగులు... గుర్తుతెలియని వ్యక్తిని హత్యచేశారు. ఆ తర్వాత.. తలను, మొండెంను వేరు చేసి విరాట్‌నగర్‌లోని మహంకాళి ఆలయం వద్ద పడేశారు. దేవాలయం వద్ద తలను చూసిన భక్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆలయం చుట్టుపక్కల సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు దర్యాప్తునకు ఆటంకంగా మారింది. పోలీసులు ఇప్పటికే ప్రత్యేక బృందాలను, డాగ్‌స్వ్కాడ్‌లను రంగంలోకి దింపారు. హత్యకు ఏదైన వివాహేతర సంబంధం ఉందా?.. నరబలి కారణమా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి: భర్త ఇంటి ముందు యువతి ధర్నా