Top Stories
ప్రధాన వార్తలు

మీ నిబద్ధతకు హ్యాట్సాఫ్! : వైఎస్ జగన్
స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించిన 50 స్థానాలకు గానూ 39 చోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిచారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకుండా హుందాగా వదిలేయాలి. కానీ చంద్రబాబు అలా కాకుండా నేను సీఎంను, నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు బలం ఉన్నా లేకపోయినా ప్రతి పదవీ నాకే కావాలి.. ఎవరినైనా నేను భయపెడతా.. కొడతా.. చంపుతా.. ప్రలోభపెడతా..! అనే రీతిలో అహంకారంతో వ్యవహరిస్తున్న తీరును మనం అంతా చూస్తున్నాం. ఇది ధర్మమేనా? న్యాయమేనా? రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే.. తాను చేసిన మంచి పనిని చూపించి, నేను ఈ మంచి పని చేశానని ప్రజల దగ్గరకు ధైర్యంగా వచ్చి చిరునవ్వుతో వారి ఆశీర్వాదం తీసుకునేలా ఉండాలి. కానీ చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. అవి మోసాలుగా మిగిలాయి మీ జగన్ పాలనలో ప్రతి నెలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక మేలు జరిగింది. నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేవి. చంద్రబాబు వచ్చిన తర్వాత నాలుగు వేళ్లు నోట్లోకి పోవడం మాట అటుంచి.. ఉన్న ప్లేటును కూడా తీసేశారు. ఇలాంటి పరిస్థితులలో ఆయన ప్రజల్లోకి వెళ్లలేడు. తన కార్యకర్తలను పంపించి ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పే పరిస్థితి కూడా లేదు– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘మీ అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. రాజకీయాలలో ఎప్పుడూ విలువలు, విశ్వసనీయత ఉండాలని నేను చాలా గట్టిగా నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటా.. పార్టీ కూడా అలాగే ఉండాలని మొట్టమొదటి నుంచి ఆశించా. కష్టకాలంలో మీ అందరూ చూపించిన తెగువ, స్ఫూర్తికి హ్యాట్సాఫ్..’ అని స్థానిక సంస్థల వైఎస్సార్సీపీ(YSRCP) ప్రజాప్రతినిధులను పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్రశంసించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా.. బెదిరింపులు, అక్రమ కేసులు, దాడులకు వెరవకుండా పార్టీ కోసం గట్టిగా నిలబడిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను అభినందించారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరాయని వ్యాఖ్యానించారు. ‘రాబోయే రోజులు మనవే.. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. జగన్ 1.0 పాలనలో కోవిడ్ వల్ల కార్యకర్తలకు చేయాల్సినంత చేయకపోయి ఉండవచ్చు. కానీ.. జగన్ 2.0లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నా. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటా. కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్ చేసి చూపిస్తాడు’ అని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకూడదుమొన్న జెడ్పీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యులు, ఉప సర్పంచ్ స్థానాలు కలిపి దాదాపు 57 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే.. ఏడు చోట్ల అధికార పార్టీ గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఎన్నికలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల వాయిదా వేసే పరిస్థితి లేకపోవడంతో అనివార్యంగా ఎన్నికలు జరిపారు. అలా ఎన్నికలు నిర్వహించిన 50 స్థానాలకు గానూ 39 చోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిచారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. అసలు టీడీపీకి ఎక్కడా కనీసం గెలవడానికి కావాల్సిన సంఖ్యాబలం లేదు. అయినా సరే.. మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభ పెట్టి.. ఏకంగా పోలీసులను వాడుకుని దౌర్జన్యాలు చేస్తూ ఎన్నికలు నిర్వహించారు. ఇన్నేళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబుకు నిజంగా బుద్ధీ, జ్ఞానం రెండూ లేవు! సూపర్ సిక్స్‌లు.. మోసాలుగా మిగిలాయిఎన్నికల మేనిఫెస్టోలో 143 హామీలతో కూటమి పార్టీలు ప్రజలను మభ్యపెట్టి, ప్రతి ఇంటికి వారి కార్యకర్తలను పంపించి పాంప్లెట్లు పంచాయి. చంద్రబాబు బాండ్లు పంపించారని ప్రతి ఒక్కరికీ చెప్పి ఎన్నికల్లో గెలిచాయి. చంద్రబాబు పాలన చేపట్టి దాదాపు 11 నెలలు అవుతుంది. మరి ఆయన చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు ఏమయ్యాయని ఎవరైనా అడగడానికి ధైర్యం చేస్తే.. ఆ స్వరం కూడా వినిపించకుండా చేయాలని తాపత్రయపడుతున్నారు. ఆ హామీలను నెరవేర్చాలనిగానీ, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంగానీ చంద్రబాబులో కనిపించడం లేదు. ప్రతి అడుగులోనూ మోసం.. పాలనలో అబద్ధాలే కనిపిస్తున్నాయి. సూపర్ సిక్స్‌లు, సెవెన్లు గాలికెగిరిపోయి మోసాలుగా కనిపిస్తున్నాయి. మాట మీద నిలబడే పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారు..సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎందుకు అమలు చేయడం లేదు అని అడుగుతుంటే రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లు అని చంద్రబాబు అంటారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలోనే రాష్ట్రం అప్పు రూ.6.50 లక్షల కోట్లు అని చూపించారు. అందులో రూ.3.13 లక్షల కోట్లు ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆయన చేసిన అప్పులే అని తెలుసు. కానీ రాష్ట్రాన్ని భయంకరంగా చూపించాలని రూ.10 లక్షల కోట్లు అని చెబుతున్నారు. మరో రెండు రోజులు పోతే రూ.12 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అని చెబుతాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను ఎగ్గొట్టడానికే ఈ దిక్కుమాలిన అబద్ధాలు చెబుతున్నారు. ఇలాంటి దిక్కుమాలిన అబద్ధాలు, మోసాలతో రాష్ట్రంలో పాలన చేస్తున్నాడు. ఇలాంటి పాలన పోయి మళ్లీ మాట చెబితే ఆ మాట మీద నిలబడే పాలన రావాలని, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలను పరిష్కరించాలని తపించే గుండె ఉండే మంచి పాలన రావాలని ప్రజలందరూ ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఉన్నదల్లా రెడ్‌బుక్ రాజ్యాంగమే..మరోవైపు ఇవాళ వలంటీర్ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు. స్కీములూ లేవు. ఉన్నదల్లా రెడ్ బుక్ రాజ్యాంగమే. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. పోలీసులను అధికార పార్టీ కాపలాదారులుగా వాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దారుణ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం..⇒ తిరుపతి కార్పొరేషన్లో మనం 48 స్థానాలు గెలిస్తే వాళ్లు కేవలం ఒక్కటే గెలిచారు. అక్కడ ఇటీవల డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా మన కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సును అడ్డుగుతున్నారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్సీని పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్ చేశారు. ఇలా చేయడానికి సిగ్గు ఉండాలి. ⇒ విశాఖ కార్పొరేషన్లో 98 స్థానాలకు వైఎస్సార్సీపీ 56 స్థానాలకు పైగా గెలిచింది. అక్కడ ప్రజాస్వామ్యయుతంగా వైఎస్సార్సీపీ మేయర్ ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టారు. మన కార్పొరేటర్లు క్యాంపుల్లో ఉంటే.. పోలీసులు వారి ఇళ్ల వద్దకు వచ్చి మీ భర్తలు ఎక్కడున్నారో చెప్పాలని, లేదంటే మిమ్మల్ని స్టేషన్‌కి తరలిస్తామని బెదిరిస్తున్నారు. బుద్ధీ, జ్ఞానం ఉన్నవారు ఎవరైనా పోలీసులను ఈ మాదిరిగా వాడుకుంటారా?⇒ అనంతపురం జిల్లా రామగిరి మండలంలో పదికి తొమ్మిది స్థానాలు మనవే. వాళ్లు ఒక్కటే గెలిచారు. సంఖ్యాపరంగా చూస్తే ఉప ఎన్నికలో మనమే గెలవాలి. కానీ అక్కడ ఎస్ఐ పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చినట్లు నమ్మించి తొమ్మిది మంది మన ఎంపీటీసీలను కిడ్నాప్ చేశాడు. వీడియో కాల్లో లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడిస్తున్నాడు. అయినా సరే మన ఎంపీటీసీలు మాట వినకపోవడంతో మండల కేంద్రంలో నిర్బంధించి బైండోవర్ కేసులు పెడుతున్నాడు. దీనిపై మన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతటితో ఆగకుండా.. ఆ మండలంలో భయం రావాలట..! అందుకోసం లింగమయ్య అనే బీసీ నాయకుడిని హత్య చేశారు. పోలీసుల సమక్షంలో చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు చేయిస్తున్నారు. ఇదా ప్రజాస్వామ్యం?⇒ స్వయంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్పంలో 16కి మొత్తం 16 ఎంపీటీసీలను మనం గెలిచాం. ఆరుగురిని ప్రలోభపెట్టగా..మిగిలిన వాళ్లు మనవాళ్లే. అక్కడ మనవాళ్లు ప్రయాణిస్తున్న బస్సును పోలీసులతో అడ్డుకుని కౌంటింగ్ దగ్గరకు పంపించకుండా చంద్రబాబు ఆపించారు. అక్కడ కోరమ్ లేకపోయినా.. ఆరుగురే ఉన్నా వాళ్ల మనిషే గెలిచినట్లు డిక్లేర్ చేశాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని.. ఎంపీపీ స్థానంలో బలం లేకపోయినా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇదీ.⇒ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం గోపవరంలో ఉప సర్పంచ్ ఎన్నికలు చూస్తే.. మనం 19 గెలిస్తే వాళ్లు నలుగురిని ప్రలోభపెట్టారు. మనవాళ్లు 15 మందిని పోలీసులు బందోబస్తు కల్పిస్తామని చెప్పి తీసుకెళ్లి టీడీపీ సభ్యులున్న చోట విడిచిపెట్టారు. అంటే టీడీపీ వాళ్లను దౌర్జన్యం చేయమని వదిలేశారు. కౌంటింగ్ హాల్లోకి మనవాళ్లను లోపలకి పంపించరు కానీ.. వాళ్లను మాత్రం పంపిస్తారు. అక్కడ నకిలీ వార్డు మెంబర్లతో ఐడీ కార్డులు తయారు చేశారు. అదే విషయం ఎన్నికల అధికారికి చెబితే ఎన్నిక వాయిదా వేశారు. మళ్లీ రెండో రోజు.. ఎన్నికల అధికారికి గుండెపోటు అని వాయిదా వేశారు. బలం లేనప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నారు. ⇒ ఇక తుని మున్సిపాల్టీలో 30కి 30 కౌన్సిలర్లు మనమే గెలిచాం. వాళ్ల దగ్గర ఏమాత్రం సంఖ్యా బలం లేదు. అయినాకూడా వైస్ చైర్మన్ పోస్టు దక్కించుకునేందుకు కావాలని ఎన్నికలకు అడ్డంకులు సృష్టించి వాయిదాల మీద వాయిదాలు వేశారు. చివరకు మున్సిపల్ చైర్మన్ మహిళను బెదిరించి రాజీనామా చేయించారు.⇒ అత్తిలిలో 20 స్థానాలకు మనం 16 గెలిస్తే.. వాళ్లు 4 గెలిచారు. ఒకరు డిస్ క్వాలిఫై కాగా మన బలం 15 ఉంది. అంటే అక్కడ ఎన్నికల్లో మనం గెలవాలి. వాళ్లకు సంఖ్యా బలం లేదు కాబట్టి ఎన్నిక జరపకుండా వాయిదా మీద వాయిదా వేస్తున్నారు. ఇదీ రాష్ట్రంలో జరుగుతోంది!!⇒ ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య.. మీ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. మీరంతా గట్టిగా నిలబడ్డారు. నా అక్కచెల్లెమ్మలు చాలా గట్టిగా నిలబడ్డారు. దీన్ని విన్నప్పుడు చాలా సంతోషం అనిపించిన సందర్భాలున్నాయి. ఈ ఎన్నికల్లో మీరు చూపించిన గొప్ప స్ఫూర్తితో... చంద్రబాబు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అనే సందేశం మీ ద్వారా వెళ్లింది. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి చిరస్ధాయిగా నిలబడుతుంది.సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తల కోసం ఎంత గట్టిగా నిలబడతానో చూపిస్తా..‘కష్ట సమయంలో ఉన్న మన కార్యకర్తలకు ఒక్కటే చెబుతున్నా. ఈ కష్ట కాలంలో మీరు చూపించిన ఈ స్ఫూర్తి, నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు. రాబోయే రోజులు మనవే. ఈసారి కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ఈ సారి వచ్చినప్పుడు మీ జగన్ కార్యకర్తల కోసం కచ్చితంగా ఉంటాడు. జగన్ 1.0 పాలనలో కార్యకర్తల కోసం చేయాల్సినంత చేయలేకపోయి ఉండవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ సమయంలో రెండేళ్లు ప్రజల గురించి, వాళ్ల ఆరోగ్యం గురించే మొత్తం ఎఫర్ట్ పెట్టాం. కాబట్టి కార్యకర్తలకు ఉండాల్సినంత తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కానీ జగన్ 2.0 లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నా. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటా. కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్ చేసి చూపిస్తాడు’ – వైఎస్ జగన్‌విద్య, వైద్యం, వ్యవసాయం అధోగతి..ఇవాళ స్కూళ్లు నాశనం అయిపోయాయి. ఇంగ్లీషు మీడియం గాలికెగిరిపోయింది. నాడు ృ నేడు పనులు ఆగిపోయాయి. టోఫెల్ తీసేశారు. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ తరగతులు నిర్వహించి పిల్లలను గొప్పగా చదివించాలని ఆరాటపడే ఆలోచనలు గాలికెగిరిపోయాయి. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ లేదు. ఎనిమిదో తరగతి పిల్లలకు ఏటా ట్యాబ్‌ల పంపిణీ ఆగిపోయింది.మరోవైపు వైద్యం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. 11 నెలలకు నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో పేషెంట్లకు వైద్యం చేయడానికి సుముఖంగా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 104, 108 ఆంబులెన్సుల గురించి చెప్పాల్సిన పనిలేదు.ఈ రోజు వ్యవసాయం గురించి అందరికీ తెలిసిందే. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతన్న పూర్తిగా దళారుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన దుస్థితి నెలకొంది. పెట్టుబడి సహాయం కింద జగన్ పీఎం కిసాన్తో కలిపి రూ.13,500 ఇస్తున్నాడు... మేం వస్తే పీఏం కిసాన్ కాకుండా సొంతంగా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఇచ్చిన అమౌంట్ లేదు... బాబు ఇస్తామన్నది కూడా ఇవ్వలేదు. మరోవైపు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తివేశారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది.పీ4 పేరుతో బాబు కొత్త మోసం..చంద్రబాబునాయుడు మోసాలు క్లైమాక్స్‌కి చేరాయి. చాలామంది చంద్రబాబు మారిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ ఆయన మారలేదని నిరూపిస్తూ ఈమధ్య పీ4 అని కొత్త మోసం తీసుకొచ్చాడు. పీ4 విధానం ద్వారా సమాజంలో 20 శాతం పేదవారి బాగోగులు అన్నింటినీ 10 శాతం సంపన్నులకు అప్పగిస్తాడట. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. అసలు చంద్రబాబుకు రాష్ట్రంలో ఎన్ని తెల్లరేషన్ కార్డులు ఉన్నాయో తెలుసా? రాష్ట్రంలో 1.61 కోట్ల ఇళ్లు ఉంటే 1.48 కోట్ల వైట్ (తెల్ల) రేషన్ కార్డులున్నాయి. అంటే 90 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో కేవలం 8.60 లక్షల మంది మాత్రమే ఆదాయపన్ను కడుతున్నారు. 25 లక్షల మంది ఐటీ ఫైల్ చేస్తున్నారు. అంటే 8.60 లక్షల మందికి.. 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డు దారులను అప్పగించాలి. అక్కడ కూడా మోసం చేస్తున్నాడు. పేదలు కేవలం 20 శాతం అంటున్నాడు. చంద్రబాబు చెప్పిన దానికి కనీసం వెయ్యి మంది కూడా ముందుకు రారు. చంద్రబాబు చెప్పింది అవాస్తవమని, జరగదని అందరికీ తెలుసు. ఆయన డ్రామాలు ఆడుతున్నాడని ప్రజలకు తెలుసు. జనం నవ్వుకుంటున్నారు. ఆయన మాట్లాడినప్పుడు మీటింగ్‌ల నుంచి వెళ్లిపోతున్నారు. అయినాసరే నేను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అన్నట్లు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారు.

చెట్ల నరికివేత ఆపండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లు నరకడాన్ని వెంటనే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించింది. దీనిపై గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే వరకు అక్కడ ఎలాంటి పనులు చేయొద్దని ఏసీజే జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం తేల్చిచెప్పింది. సుదీర్ఘ వాదప్రతివాదనల వల్ల సమయం ముగియడంతో తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎక రాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ)కి బదిలీ చేసి చదును చేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలయ్యాయి. ‘ఐటీ, ఇతర అవసరాల కోసం ఎకరం రూ. 75 కోట్ల మేర సంస్థలకు కేటాయించేలా కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల అటవీ భూమిని టీజీఐఐసీకి సర్కార్ కేటాయించింది. ఈ మేరకు గతేడాది జూన్ 26న రెవెన్యూ శాఖ తీసుకొచ్చిన జీవో 54ను కొట్టేయాలి. అక్కడ 40 జేసీబీ తవ్వకాలతో సర్కార్ చెట్లను తొలగిస్తూ వృక్ష, జంతుజాలాన్ని నాశనం చేస్తోంది’ అని పిటిషనర్లు ఆరోపించారు.పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి..పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎల్.రవిచందర్ వాదిస్తూ ‘ఆ 400 ఎకరాలు అటవీభూమి. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాలి. 40కిపైగా జేసీబీలతో చెట్లు కొట్టేసి భూమిని చదును చేస్తున్నారు. సుప్రీం తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని చదును చేయాలంటే నిపుణుల కమిటీ వేయాలి. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో నెలపాటు అధ్యయనం చేయాలి. ఈ అడవిలో బఫెలో, పీకాక్, ఎస్ఆర్ ప్రధాన సరస్సులు, ‘పుట్టగొడుగుల శిల’ వంటి ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలున్నాయి. ఇది 237 జాతుల పక్షులు, నెమళ్లు, చుక్కల జింకలు, అడవి పందులు, నక్షత్ర తాబేళ్లు, ఇండియన్ రాక్ పైథాన్, బోయాస్ వంటి వివిధ పాము జాతులకు పర్యావరణ నివాసం. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ‘అడవి’ అనే పదాన్ని ప్రభుత్వ రికార్డులు, చట్టపరమైన నోటిఫికేషన్లకే పరిమితం చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. దీనికి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. పర్యావరణ సమతౌల్యతను దెబ్బతీసే విధ్వంసాన్ని నిరోధించాలి’ అని నివేదించారు.ఆదాయం కోసం ఆరాటమే తప్ప..‘150 ఎకరాలకు మించి అటవీ ప్రాంతాన్ని చదును చేసేందుకు పర్యావరణ అధ్యయనం అవసరం. మీటర్ కంటే ఎక్కువ ఎత్తు కాండం పెరిగిన చెట్లును కొట్టాలంటే వాల్టా చట్ట ప్రకారం అనుమతి పొందాలి. లేకుంటే చట్టప్రకారం శిక్షార్హం. కానీ ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేదు. ఆదాయం కోసం ఆరాటమే తప్ప పర్యావరణ విధ్వంసం గురించి పట్టించుకోలేదు. హైదరాబాద్ నడిబొడ్డున 400 ఎకరాల్లో దశాబ్దాలకుపైగా ఉన్న భారీ వృక్షాలను తొలగిస్తే పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుంది. పక్కనే కాంక్రీట్ జంగిల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఊపిరి కూడా అందడం కష్టమవుతుంది. భవిష్యత్ తరాలు ఆక్సిజన్‌కు అవస్థ పడాల్సి వస్తుంది. ఒకపక్క కేసు హైకోర్టులో విచారణ సాగుతుండగానే అధికారులు రాత్రీపగలు చెట్ల నరికివేత చేపడుతున్నారు. ఈ పనులను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.క్రీడల పేరిట రూ. వేల కోట్ల భూములకు చంద్రబాబు..రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘2003 ఆగస్టు 5న ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) ఏర్పాటైంది. ఆగస్టు 9న ఐఎంజీ భారతతో నాటి చంద్రబాబు ప్రభుత్వం (తాత్కాలిక ప్రభుత్వం) క్రీడల్లో ఇక్కడి యువతను చాంపియన్లుగా తీర్చిదిద్దే పేరుతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. స్పోర్ట్స్ అకాడమీలను నిర్మించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం కోసమంటూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాలను ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం మామిడిపల్లి సర్వే నంబర్ 99/1లోని మరో 450 ఎకరాలను అప్పగిస్తామని ఒప్పందం చేసుకుంది. అంతేకాదు.. ఐఎంజీ భారత అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడానికి బంజారాహిల్స్ నుంచి మాదాపూర్ వెళ్లే మార్గంలో ఎకరం నుంచి 5 ఎకరాలను కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. 2004 ఫ్రిబవరిలో రూ. వేల కోట్ల విలువైన 400 ఎకరాలను స్వల్ప మొత్తానికి అంటే రూ. 2 కోట్లకు ఐఎంజీ భారతకు సేల్‌డీడ్ చేసింది. ఏమాత్రం అర్హతలేని, భూములు కొట్టేయడం కోసమే ఏర్పడిన కంపెనీ నుంచి ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసం 2006లో నాటి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 2007లో దీన్ని చట్టబద్ధం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఐఎంజీ భారతకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన సేల్‌డీడ్‌తోపాటు ఎంఓయూ కూడా రద్దయ్యింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా రాజశేఖరరెడ్డి నిర్ణయాన్ని సమర్థించాయి. నాడు వైఎస్సార్ రక్షించిన ఆ 400 ఎకరాలు ఇండస్ట్రియల్ భూములే. నాడు పిల్ దాఖలు చేసిన వారు అర్హతలేని కంపెనీ, తక్కువ ధరనే సవాల్ చేశారు. హెచ్‌సీయూ భూములనిగానీ, పర్యావరణం దెబ్బతింటుందని కానీ ఎక్కడా పేర్కొనలేదు. నాడు ఒక దొంగ నుంచి మేము ఈ భూములను రక్షించినప్పుడు ఈ పిల్ దాఖలు చేసిన వారెవరూ కలసి రాలేదు. ఇప్పుడు పిల్లు దాఖలు చేసి ప్రశ్నిస్తున్నారు’ అని ఏజీ పేర్కొన్నారు.గూగుల్ ఫొటోలే ఆధారామా?‘గూగుల్ ఫోటోల ఆధారంగా అక్కడ ఫారెస్ట్ ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. రెవెన్యూ, ఇతర ఏ రికార్డుల్లోనూ అది అటవీ భూమిగా లేదు. గూగుల్ చిత్రాలు వానాకాలం ఒకలా, ఎండాకాలంలో మరోలా ఉంటాయి. గూగుల్ చిత్రాలు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. నా స్నేహితుడొకరు సభ్యుడిగా ఉన్న ఓ గోల్ఫ్ క్లబ్‌లోనూ నెమళ్లు, జింకలు, పాములు ఉన్నాయి. దాన్ని కూడా అటవీ ప్రాంతంగా డిక్లేర్ చేస్తారా? ఈ లెక్కన హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టొద్దు. గత పదేళ్లలో నాటి ప్రభుత్వం వేలాది ఎకరాలు విక్రయించినా నోరుమెదపని వారు ఇప్పుడు రూ.75 కోట్లకు ఎకరం విక్రయిస్తుంటే ప్రశ్నిస్తున్నారు. ఈ పిల్లు ప్రజాప్రయోజనం ఆశించి వేసినవి కావు. నిజాం కాలం నుంచి ఈ 400 ఎకరాలు గడ్డి భూములు. ఈ భూములకు ఆనుకొని ఉన్న హెచ్‌సీయూ స్థలంలో భారీ భవనాలు నిర్మించారు. నాలుగు హెలీప్యాడ్లు కూడా ఉన్నాయి’ అని ఏజీ చెప్పారు. కాగా, ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ అని సర్కార్ వద్ద రికార్డులున్నాయా? అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సమయం ముగియడంతో తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది.

ఈ రాశి వారికి చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి.. భూవివాదాలు పరిష్కారం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.షష్ఠి రా.3.27 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: రోహిణి ప.12.25 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: సా.5.45 నుండి 7.17 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.02 నుండి 10.51 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.43 వరకు, అమృత ఘడియలు: ఉ.9.24 నుండి 10.55 వరకు.సూర్యోదయం : 5.58సూర్యాస్తమయం : 6.09రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.వృషభం.... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.మిథునం.... బంధువిరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ధనవ్యయం. కుటుంబసమస్యలు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడులు.కర్కాటకం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.సింహం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.కన్య.... ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.తుల..... కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.వృశ్చికం... చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి. భూవివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. నూతన పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.ధనుస్సు... దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.మకరం.... పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. మిత్రులు, కుటుంబసభ్యులతో అకారణంగా వైరం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.కుంభం... కుటుంబసభ్యులతో వివాదాలు. రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మీనం.... పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. అంతకుముందు బిల్లుపై 12 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్ష ఇండియా కూటమి ఆరోపించగా పారదర్శకత కోసమేనని ప్రభుత్వం సమర్థించుకుంది.న్యూఢిల్లీ: మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. అంతకుముందు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా వాడీవేడీగా చర్చ కొనసాగింది. ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని విపక్షాలు మండిపడ్డాయి. బిల్లును అంగీకరించబోనంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సభలోనే బిల్లు ప్రతిని చించేశారు. అధికార ఎన్డీయే కూటమి ఎంపీలు బిల్లును సమర్థించారు. విపక్షాలవి ఓటు బ్యాంకు రాజకీయాలని ధ్వజమెత్తారు. వక్ఫ్ సవరణ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. ఎగువ సభలో చర్చకు 8 గంటల సమయం కేటాయించారు. అనంతరం బిల్లుపై ఓటింగ్ జరగనుంది. రాజ్యసభలోనూ అధికార ఎన్డీయేకు తగిన మెజార్టీ ఉండడంతో బిల్లు సులువుగా ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది.యూపీఏ పాపమే: రిజిజు వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుకు అనుకూలంగా బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ, వ్యతిరేకంగా కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటముల మధ్య సంవాదం సభను వేడెక్కించింది. ముస్లింల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని ఎన్డీఏ పక్షాలు పేర్కొనగా, బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటూ విపక్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి. వక్ఫ్ బిల్లు పేరును ఉమ్మీద్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్, ఎఫీషియన్సీ అండ్ డెవలప్మెంట్–యూఎంఈఈడీ)గా మారుస్తున్నట్టు రిజిజు ప్రకటించారు. అనంతరం చర్చను ప్రారంభించారు. వక్ఫ్ బిల్లుకు తాము ప్రతిపాదిస్తున్న సవరణలే లేకపోతే పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తే అంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు భవనం, దాని పరిసర ప్రాంతాలు వక్ఫ్ ఆస్తుల్లో భాగమేనని ఆలిండియా ముస్లిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ గతంలో వ్యాఖ్యలు చేశారు. వాటినుద్దేశించే మంత్రి ఇలా మాట్లాడినట్టు చెబుతున్నారు. ఈ బిల్లు కేవలం వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు సంబంధించిన విషయమే తప్ప ముస్లింల మత విశ్వాసాల్లో ఎలాంటి జోక్యమూ చేసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. ‘‘వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం వేసి అత్యంత సుదీర్ఘంగా చర్చలు, సంప్రదింపులు జరిపాం. జేపీసీ సూచించిన పలు సవరణలకు అంగీకరించాం. అయినా విపక్షాలు అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించజూస్తున్నాయి. వక్ఫ్ చట్టానికి యూపీఏ హయాంలో చేసిన మార్పుల వల్ల దానికి విపరీతమైన అధికారాలు దఖలు పడ్డాయి. వక్ఫ్ చట్టాన్ని ఇతర చట్టాలకు అతీతంగా మార్చేశాయి. అందుకే ఈ సవరణలు తప్పనిసరయ్యాయి’’ అని రిజిజు అన్నారు. ఏ మత సంస్థల వ్యవహారాల్లోనూ తమ ప్రభుత్వం వేలుపెట్టబోవడం లేదని చెప్పారు. ‘‘ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో వక్ఫ్ ఆస్తులున్నది భారత్‌లోనే. వాటిని పేద ముస్లింల సంక్షేమానికి మాత్రమే వినియోగించాలి. అలా జరిగేలా చూడటమే బిల్లు లక్ష్యం. దీనికి మద్దతిస్తున్నదెవరో, వ్యతిరేకిస్తున్నదెవరో దేశం ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది’’ అని చెప్పారు. కాంగ్రెస్ తరఫున గౌరవ్ గొగొయ్ మాట్లాడుతూ రిజిజు వాదనను తీవ్రంగా ఖండించారు. బిల్లును రాజ్యాంగ మౌలిక స్వరూపంపైనే దాడిగా అభివర్ణించారు. రిజుజు చర్చకు బదులిచ్చారు. మైనారిటీలకు భారత్‌ను మించిన సురక్షితమైన దేశం ప్రపంచంలోనే లేదన్నారు. అత్యల్ప సంఖ్యాకులైన పార్సీలు కూడా సగర్వంగా నివసిస్తున్నట్టు చెప్పారు.అంతా అంగీకరించాల్సిందే: అమిత్ షా వక్ఫ్ బిల్లు విషయమై దేశంలో అయోమయం సృష్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ముస్లింలను భయపెట్టడం ద్వారా వారిని ఓటుబ్యాంకుగా మార్చుకున్నాయంటూ దుయ్యబట్టారు. ఈ బిల్లు ముస్లింల మత సంబంధిత అంశాల్లో వేలు పెడుతుందన్న ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. ‘‘ఈ సవరణలను మైనారిటీలు ఒప్పుకోరని కొందరంటున్నారు. భారత ప్రభుత్వం, పార్లమెంటు చేస్తున్న చట్టమిది. దీన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరాల్సిందే’’ అని కుండబద్దలు కొట్టారు. ‘‘2014 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు వక్ఫ్ చట్టానికి హడావుడిగా రాత్రికి రాత్రి అడ్డగోలు సవరణలు చేసింది. తద్వారా దాన్ని చట్టాలకు అతీతంగా మార్చింది. కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంతుïÙ్టకరణ రాజకీయాలకు ఇది పరాకాష్ట. లేదంటే ఈ సవరణ బిల్లు అవసరముండేదే కాదు’’ అని అమిత్ షా అన్నారు. ‘‘యూపీఏ నిర్ణయం వల్ల ఢిల్లీలోని ల్యూటెన్స్ జోన్లో ఏకంగా 123 ఆస్తులు కేవలం 25 రోజుల వ్యవధిలో వక్ఫ్ ఆస్తులుగా మారిపోయాయి. ఇలాంటి దారుణమైన అవకతవకలను సరిదిద్దడం, వక్ఫ్ భూములు, ఆస్తుల నిర్వహణ పూర్తిగా ప్రజాస్వామికంగా, పారదర్శకంగా జరిగేలా చూడటమే తాజా బిల్లు ఉద్దేశం. అంతేతప్ప ఓటుబ్యాంకు కోసం చట్టాలు చేయడం మోదీ సర్కారుకు అలవాటు లేదు’’ ని స్పష్టం చేశారు. పౌరుల వ్యక్తిగత, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ పరిరక్షించి తీరతామని చెప్పారు. ‘‘కేవలం వక్ఫ్ ఆస్తి అని ప్రకటించినంత మాత్రాన ఎవరి భూమీ వక్ఫ్ భూమిగా మారకుండా తగిన రక్షణలను ఈ బిల్లు కల్పిస్తుంది’’ అని వివరించారు. అనంతరం బీజేపీతో పాటు విపక్షాల నుంచి పలువురు సభ్యులు బిల్లుపై అర్ధరాత్రి దాకా సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం ఓటింగ్ ద్వారా బిల్లు ఆమోదం పొందింది. తర్వాత దానికి విపక్షాలు పలు సవరణలు ప్రతిపాదించగా అవన్నీ ఒక్కొక్కటిగా వీగిపోయాయి.చర్చకు రాహుల్ గైర్హాజరు సోదరి, వయనాడ్ ఎంపీ ప్రియాంక కూడా కీలకమైన వక్ఫ్ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చకు, ఓటింగ్‌కు విపక్ష నేత రాహుల్‌గాంధీ గైర్హాజరయ్యారు. ఆయన సోదరి, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ కూడా బుధవారం సభకు హాజరు కాలేదు. బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై ఉదయం సభలో ఆయన పార్టీ ఎంపీలతో చర్చించారు. దాంతో బిల్లుపై కాంగ్రెస్ తరఫున చర్చకు రాహులే సారథ్యం వహిస్తారని భావించారు. కానీ చర్చలో పాల్గొనరాదని రాహుల్ నిర్ణయించుకున్నారు. పార్లమెంటు ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. ప్రియాంక కూడా చర్చలో పాల్గొనకపోవడం విశేషం. కాంగ్రెస్‌కు కేటాయించిన గంటా 40 నిమిషాల సమయంలో గౌరవ్ గొగొయ్ తదితర పార్టీలే ఎంపీలే మాట్లాడారు. బీజేపీ నయా మత రాజకీయంలౌకిక ఇమేజ్ కు పెద్ద దెబ్బ: అఖిలేశ్ వక్ఫ్ బిల్లు ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని, భారత లౌకిక ఇమేజ్ కు పెద్ద దెబ్బ అని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. బీజేపీ నయా మత రాజకీయం అని ధ్వజమెత్తారు. లోక్ సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బల నేపథ్యంలో.. ఓట్ల పోలరైజేషన్ కు, తమకు దూరమైన కొన్ని వర్గాలను దగ్గర చేసుకునేందుకు కాషాయ పార్టీ ఈ ఎత్తుగడ వేసిందన్నారు. అధికార కూటమిలోకి కొన్ని పార్టీలు వక్ఫ్ బిల్లుకు మద్దతిస్తున్నప్పటికీ వాటికీ మనస్ఫూర్తిగా ఇష్టం లేదని తెలిపారు.

ఇకనైనా అరాచకం ఆగేనా!
రాచరికాల్లో అధికారానికీ, దర్పానికీ, దానిద్వారా లభించే న్యాయానికీ రాజదండం చిహ్నం. ఈమధ్యకాలంలో బుల్డోజర్ అలాంటి పాత్ర పోషిస్తున్న వైనం కనబడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ పాలన మొదలయ్యాక బుల్డోజర్ అర్థం, దాని పరమార్థం మారిపోయాయి. ఆ రాష్ట్రాన్ని చూసి మరికొన్ని రాష్ట్రాలు వాతలు పెట్టుకోవటం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో 2021 మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అమానవీయంగా, చట్టవిరుద్ధంగా ఆవాసాలను కూల్చేసిన అధికారగణంపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయటంతోపాటు, ఇళ్లు కోల్పోయిన ఆరుగురు పిటిషనర్లకూ ఆరువారాల్లో రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు... ఈ ఉదంతం తమ అంతరాత్మను తీవ్రంగా కలవరపరిచిందని ధర్మాసనం తెలియజేసింది. అధికారమంటే ఇష్టానుసారం ఏదైనా చేయడానికి దొరికిన లైసెన్స్‌గా భావించే సంస్కృతి దేశంలో ముదిరిపోయింది. ఒక్క యూపీలోనేకాదు... మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వగైరాల్లో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకున్న తీరు గమనిస్తే ఇదో అంటువ్యాధిగా మారిందన్న అభిప్రాయం కలుగుతుంది. ఏదైనా కేసులో నిందితులుగా ఉన్నా లేదా శిక్షపడినా... అధికార పక్షానికి అనుకూలంగా లేకపోయినా అలాంటివారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చేయడానికి బుల్డోజర్లు అత్యుత్సాహంతో ఉరుకుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. నిర్మాణ నిబంధనల్ని తీవ్రంగా ఉల్లంఘించారని తేలినా, ప్రభుత్వ భూమినో, మరొకరి భూమినో దురా క్రమించి కట్టారని తేలినా అలాంటివాటిని కూల్చేయటాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ అందుకొక విధానం ఉండాలి. చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. తప్పు చేశారని ఆరోపణ లొచ్చినవారికి తగిన నోటీసులిచ్చి వారి సంజాయిషీ కోరాలి. సంతృప్తి చెందనట్టయితే ఆక్రమణ దారులకు హేతుబద్ధమైన వ్యవధినిచ్చి కూల్చివేత ప్రక్రియ ప్రారంభించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారిస్తున్న కేసు సంగతే తీసుకుంటే 2021 మార్చి 1న మొదటిసారి అక్కడ నివాసముంటున్నవారికి నోటీసులు వచ్చాయి. వారికి అంతకు దాదాపు మూణ్ణెల్ల ముందే... అంటే జనవరి 8న నోటీసులిచ్చినట్టు, అందులో ఆ నెల 27లోగా ఎవరికివారు సొంత ఖర్చులతో ఇళ్లు కూల్చేయాలని ఆదేశించినట్టు ఉంది. దానికి స్పందన రాకపోవటంతో తాజాగా నోటీసులు జారీచేశామని అందులో పేర్కొన్నారు. మరో ఆరు రోజుల్లో బుల్డోజర్లతో వచ్చి ఇళ్లు కూల్చేశారు. తొలుత నోటీసులు వ్యక్తిగతంగా ఇవ్వటానికి చేసిన ప్రయత్నం విఫలం కావటంతో ఇళ్ల దగ్గర అతికించామన్న ప్రభుత్వ వాదనను న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ లతో కూడిన బెంచ్ విశ్వసించలేదు. పిటిషనర్లకు సహేతుకమైన వ్యవధినిచ్చిన దాఖలా కనబడటం లేదని, ఇది పౌరులకు రాజ్యాంగంలోని 21వ అధికరణ ద్వారా సమకూరిన ఆవాస హక్కును ఉల్లంఘించటమేనని తేల్చిచెప్పింది. ఈ తీర్పు అనేకవిధాల ఎన్నదగినది. పిటిషనర్లకు ఆ స్థలంపై చట్టబద్ధమైన హక్కుందా లేదా అన్న అంశంలోకి ధర్మాసనం పోలేదు. దానిపై వారు విడిగా న్యాయస్థానాల్లో తేల్చుకోవాల్సిందే! 2023 ఏప్రిల్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన రాజకీయ నాయకుడు, పలు కేసుల్లో నింది తుడైన అతీఖ్ అహ్మద్ అక్రమంగా ఆక్రమించుకున్న భూమిలో ఈ ఇళ్లున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎన్నడో 1906లో అప్పటి అలహాబాద్ జిల్లా కలెక్టర్ షకీర్ అహ్మద్ అనే వ్యక్తికి 30 ఏళ్లకు లీజుకిచ్చి మరో రెండు దఫాలు పొడిగించుకునే వీలు కల్పించారని రికార్డులు చెబు తున్నాయి. 1960లో జిల్లా మేజిస్ట్రేట్ అనుమతితో షకీర్ దాని హక్కుల్ని వేరేవారికి బదలాయించాడు. ఆ తర్వాత క్రమంలో అది మరికొందరి చేతులు మారింది. చివరకు ప్రస్తుత పిటిషనర్లు దాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వం వాదిస్తున్నట్టు ఆ కొనుగోలు చెల్లకపోవచ్చు. అది ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాల్సిన భూమే కావొచ్చు. అంతమాత్రాన నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇళ్లు కూల్చటం సరైన చర్య కాదు. సుప్రీంకోర్టు తీర్పు దీన్ని తేటతెల్లం చేసింది.ఈ సందర్భంగా వేరేచోట బుల్డోజర్ కూల్చివేతలు సాగిస్తుండగా ఒకటో తరగతి బాలిక అనన్యా యాదవ్ తన స్కూల్ బ్యాగ్‌ను రక్షించుకోవటానికి మంటలంటుకున్న షెడ్ సమీపానికి వెళ్లిన వీడియోను న్యాయమూర్తులు ప్రస్తావించటం గమనార్హం. అలాంటి ఉదంతాలు అందరినీ దిగ్భ్రాంతిపరుస్తాయన్న వారి వ్యాఖ్యలతో ఏకీభవించని వారుండరు. గత నవంబర్‌లో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేసింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నారులూ, మహిళలూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని ధర్మాసనం గుర్తు చేసింది. ఇలాంటి సంద ర్భాల్లో కూల్చివేతలకు పాల్పడిన అధికారుల నుంచి ఇళ్ల, దుకాణాల పునర్నిర్మాణానికి అయ్యే వ్యయం వసూలు చేయాలని కూడా చెప్పింది. ఇతర మార్గదర్శకాలు కూడా రూపొందించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. కేవలం అయిదేళ్ల కోసం ఎన్నికై అధి కారంలోకొచ్చిన ప్రభుత్వాలు శాశ్వతంగా నిలిచే రాజ్యాంగ విలువలను కాలరాయటం, ఇష్టాను సారం ప్రవర్తించటం తప్పుడు సంకేతాలిస్తుంది. సాధారణ పౌరుల్ని కూడా చట్ట ఉల్లంఘనలకు ప్రోత్సహిస్తుంది. అందుకే ప్రభుత్వాలు ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది. నాలుగేళ్లు ఆలస్యమైనా సర్వోన్నత న్యాయస్థానంలో బాధితులకు సరైన న్యాయం దక్కటం హర్షించదగ్గది.

బందిపోట్లలా కాంగ్రెస్ సర్కారు తీరు!: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు బందిపోట్లను తలపిస్తోందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. వందలాది బుల్డో జర్లను రంగంలోకి దించి యూనివర్సిటీ భూమిలో విధ్వంసానికి పాల్పడటం రేవంత్ మనస్తత్వానికి అద్దంపడుతోందని విమర్శించారు. ఇతర అంశాల్లోనూ రేవంత్ దూకుడు ఇదే తరహాలో ఉండ టాన్ని ప్రజలు తప్పు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం దిశగా వేగంగా పయనిస్తోందని, దానిని ఎవరూ రక్షించలేరని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని తెలుసుకునే సీఎంతోపాటు మంత్రులు వీలైనంత త్వరగా సొంత జేబులు నింపుకొనేందుకు పోటీ పడుతున్నారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి దారితీస్తుందని చెప్పారు. బుధవారం ఎర్రవల్లి నివాసంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లు, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి సహా 20కిపైగా మంది ముఖ్య నాయకులు పాల్గొన్నట్టు వెల్లడించాయి.మోదీ పట్ల ఆర్ఎస్ఎస్ అసంతృప్తి..‘‘దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోంది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడమే దీనికి సంకేతం. ఆర్ఎస్ఎస్ కూడా ప్రధాని మోదీ పనితీరు పట్ల సంతృప్తిగా లేదు. ఆయన ఒంటెద్దు పోకడల పట్ల ఆర్ఎస్ఎస్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పదవి కోసం ఆర్ఎస్ఎస్ను దేబిరించాల్సిన పరిస్థితిలో ప్రధాని మోదీ ఉన్నారు..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో తొలి రెండు పర్యాయాలు ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేయడం ద్వారానే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా నిర్మాణాత్మకంగా దేశానికి చేసినది చెప్పుకునేందుకు ఏమీ లేదని.. దీంతో ప్రజలు మళ్లీ తమవైపు చూస్తున్నారని చెప్పారు. పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన పనితో ఇతర పార్టీల పనితీరును ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని.. రాష్ట్ర రాజకీయాల్లో నిరంతరం బీఆర్ఎస్ చేసిన పనులే ఇతర పార్టీల పనితీరుకు గీటు రాయిలా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.లక్షలాదిగా సభకు తరలిరావాలి..ఏప్రిల్ 27న అన్ని గ్రామాల్లోనూ పార్టీ కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ జెండా ఎగరవేసి వరంగల్ సభకు బయలుదేరాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్‌కు దగ్గరలో ఉండే సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్ నియోజకవర్గాల నుంచి ఎక్కువ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావాలన్నారు. ఒక్కో జిల్లా నుంచి కనీసం రెండు లక్షల మంది తరలివచ్చేలా వాహనాలు సమకూర్చుకోవాలని.. ఆర్టీసీ, ఇతర బస్సులను ఇప్పటి నుంచే సమీకరించడం ప్రారంభించాలని సూచించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రచార పోస్టర్ రూపకల్పనకు సంబంధించి కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింత ప్రభాకర్, మాణిక్‌రావు, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్‌రెడ్డి, పార్టీ నేతలు జైపాల్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి... ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ బిగాల, గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ముజీబుద్దీన్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, పార్టీ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

హలీమ్ @ రూ.వెయ్యి కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ వచ్చిoదంటే హైదరాబాదీలకు ముందుగా గుర్తుకు వచ్చేది హలీమే. ఈ మాసంలో ప్రత్యేకంగా లభించే హలీమ్ కోసం మాంసప్రియులు తహతహలాడతారు. ఈసారి రికార్డు స్థాయిలో జరిగిన హలీమ్ అమ్మకాలే దానికి నిదర్శనం. ఏకంగా రూ.వేయి కోట్ల మేర హలీమ్ వ్యాపారం జరిగిందని అంచనా. దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో హలీమ్ విక్రయాలు సాగాయని వ్యాపారులు చెబుతున్నారు. పోషకాలతో కూడిన రుచికరమైన హలీమ్ కేంద్రాలు, హోటళ్లు రంజాన్ నెలంతా కిటకిటలాడాయి. ప్రతి హోటల్ ముందు ప్రత్యేక బట్టీలు, కౌంటర్ల ద్వారా విక్రయాలు సాగాయి. ఈ సీజన్లో దాదాపు 50 లక్షల ప్లేట్ల హలీమ్ అమ్మకాలు జరిగినట్లు హైదరాబాద్ హోటళ్ల సంఘం చెబుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 20 శాతం అధికంగా హలీమ్ అమ్మకాలు సాగాయని అంటోంది. కేవలం హోటళ్లలోనే కాదు ఫుడ్ డెలివరీ యాప్‌లలోనూ హలీమ్‌కే ఆహారప్రియులు ఓటేశారు. టేక్ ఆవేలు, స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్‌లతో హలీం అమ్మకాలు ఒక రేంజ్లో సాగాయి. ఆరువేల విక్రయ కేంద్రాలు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 6 వేల చిన్నా, చితక హలీమ్ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధాన రెస్టారెంట్లు వీటికి అదనం. చిన్న, మధ్య తరగతి రెస్టారెంట్లే కాదు స్టార్ హోటళ్లలోనూ రంజాన్ సీజన్ మెనూలో హలీం డిష్‌ను తప్పనిసరి చేశారు. హైదరాబాదీ బిర్యానీని హలీం ఓవర్ టేక్ చేసి మెనూలో టాప్‌లో నిలిచింది. చిన్న హలీం కేంద్రాల్లో రోజుకు దాదాపు వంద పేట్ల చొప్పున అమ్మకాలు జరిగితే, పేరున్న హోటళ్లు, కేంద్రాల్లో సుమారు 500–600 ప్లేట్ల హలీం విక్రయించారని అంచనా. వీకెండ్లలో 25 శాతం అధికం..హలీమ్ ప్లేట్ ధర రూ.100 నుంచి 320 వరకు పలికింది. ఎక్కువ శాతం మటన్ హలీమ్ సెంటర్లు ఉండగా, పలు ప్రాంతాల్లో చికెన్, బీఫ్ కేంద్రాలు కూడా వెలిశాయి. వీటిలో అత్యధికంగా 70 శాతం మేర పాతబస్తీలోనే ఉన్నాయి. సగటున రోజుకు దాదాపు రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. సాధారణ రోజుల కంటే వీకెండ్లలో 25 శాతం అధికంగా విక్రయాలు జరిగాయని జహంగీర్ అనే హలీం కేంద్ర నిర్వాహకుడు తెలిపారు. పాతబస్తీతో పోలిస్తే సైబరాబాద్‌లో హలీం జోష్ ఎక్కువగా ఉందని, పేరొందిన ఫుడ్ బ్లాగర్స్ కూడా హలీంను ప్రమోట్ చేసేలా వార్తలు ఇవ్వడం అమ్మకాలకు కలిసొచ్చిందని షెరటన్ హోటల్ మేనేజర్ నాసర్ చెప్పారు.

ఎంత ‘నిర్మల’మైన న్యాయం?!
ఇంట్లో గోనె సంచుల్లో నోట్ల కట్టలు తగులబడిన జస్టిస్ యశ్వంత్ వర్మ కథ ఇంకా మరిచిపోక ముందే, దాని అడుగుజాడల్లోనే, థ్రిల్లర్ సినిమాను మైమరపింపజేసే మరొక న్యాయమూర్తి రసవత్తరమైన కథ గురించి చెప్పుకోవ లసి వస్తున్నది. ‘తీగలాగితే డొంక కదిలింది’ అనే సామెతను అక్షరాలా నిజం చేసే వాస్తవ కథనం ఇది. సినిమా కథలు తిరిగినన్ని మలుపులు, అనూహ్య సంఘ టనలు, తారుమారు పరిణామాలు ఎన్నో ఉన్న ఈ అవినీతి కథ ఒక తారుమారు తమాషాతో మొదలయింది. పంజాబ్– హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ 2008 జూలై 10న పదవి స్వీకరించారు. తర్వాత నెల రోజు లకు, 2008 ఆగస్ట్ 13న ఆమె ఇంటికి ఒక వ్యక్తి వచ్చి ‘నిర్మల్ జీకి ఇమ్మని ఢిల్లీ నుంచి ఈ పార్సెల్ వచ్చింది’ అని ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చాడు. అమ్రిక్ సింగ్ అనే వాచ్‌మన్ ఆ పార్సెల్ లోపలికి తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు విప్పితే, అందులో నుంచి అక్షరాలా పదిహేను లక్షల రూపాయలు బైటపడ్డాయి. ఆ పార్సెల్ తెచ్చిన ప్రకాష్ అనే వ్యక్తిని పోలీసులకు అప్పగించి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విషయం తెలియజేశారు. పోలీసులు ప్రకాష్‌ను ప్రశ్నించగా, అతను పంజాబ్ హైకోర్టులో అడ్వకేట్ జనరల్‌గా ఉన్న సంజీవ్ బన్సాల్ దగ్గర గుమాస్తా అని తేలింది. పోలీసులు బన్సాల్‌ను ప్రశ్నించగా, అవి తన డబ్బులు కావని, ఢిల్లీకి చెందిన హోటల్ యజమాని రవీందర్ సింగ్ తనకు పంపి, జస్టిస్ నిర్మల్ యాదవ్‌కు అంద జేయమని చెప్పాడని, తన గుమాస్తాకు ‘జస్టిస్ నిర్మల్ జీకి ఇవ్వు’ అని పంపిస్తే, పొరపాటున జస్టిస్ నిర్మల్జిత్ జీకి ఇచ్చా డని చెప్పాడు. అంటే ఆ సొమ్ము వాస్తవంగా చేరవలసింది జస్టిస్ నిర్మల్ యాదవ్ అనే మరొక న్యాయమూర్తికన్నమాట. గుమాస్తా చేసిన చిన్న పొరపాటువల్ల, ఇద్దరు న్యాయమూర్తుల పేర్లలో నిర్మల్ ఉండడం వల్ల ఈ అవినీతి బయటపడింది. జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ ఇచ్చిన ఫిర్యాదుతో, రెడ్ హ్యాండెడ్‌గా పదిహేను లక్షల రూపాయలు, అది పట్టుకొచ్చి ఇచ్చిన వారు, పంపించినవారు దొరికారు గనుక పోలీసు కేసు నమోదయింది. కాని, న్యాయమూర్తి, అడ్వకేట్ జనరల్‌లకు ఇందులో భాగం ఉంది గనుక పది రోజుల్లో ఈ కేసును పోలీ సుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. తర్వాత సీబీఐ చేసిన దర్యాప్తులో సంజీవ్ బన్సాల్, రాజీవ్ గుప్తా కలిసి హరియాణా లోని పంచ్ కులాలో కొన్న ఒక భూమి కేసులో, జస్టిస్ నిర్మల్ యాదవ్ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, అందుకు ప్రతిఫలంగా ఈ లంచం పంపించారని తేలింది. అది మాత్రమే కాక, జస్టిస్ నిర్మల్ యాదవ్ విదేశీ ప్రయాణపు టికెట్లు, విదే శాలలో ఆమె వాడిన మొబైల్ ఫోన్ కార్డ్ కూడా సంజీవ్ బన్సాల్ కొనిపెట్టాడని సీబీఐ సాక్ష్యాధారాలు సేకరించింది. నిందితులకు, న్యాయమూర్తికి మధ్య జరిగిన సంభాషణల ఫోన్ రికార్డులను కూడా సీబీఐ సేకరించింది. చివరికి అవినీతి నిరోధక చట్టం కింద, భారత శిక్షా స్మృతి కింద జస్టిస్ నిర్మల్ యాదవ్ మీద, మిగిలిన నిందితుల మీద కేసు పెట్టవచ్చునని సీబీఐ నిర్ధారించింది. ఇక్కడిదాకా సాఫీగా సాగిన కథ తర్వాత ఎన్నో ఉత్కంఠ భరితమైన మలుపులు తిరిగింది. న్యాయమూర్తి మీద ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇమ్మని కోరుతూ సీబీఐ స్థానిక అధికా రులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఆ నివేదికకు జవాబిస్తూ సీబీఐ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ నిందితుల మీద కేసు నడపడానికి తగిన ఆధారాలు లేవని అన్నారు. కాని ఆ సమయంలో సీబీఐకి డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఇది తప్పకుండా ప్రాసిక్యూట్ చేయవలసిన అవినీతి నేరమే అన్నారు. సీబీఐ ఉన్నతాధికారులిద్దరు ఇలా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, మూడో అభిప్రాయం కోసం అప్పటి అటార్నీ జనర ల్కు పంపారు. అదే ప్రతిని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు కూడా పంపారు. అటార్నీ జనరల్ కూడా ఈ కేసులో పస లేదు అన్నారు. ఈ వ్యవహారం బయటకు పొక్కి, ‘హైకోర్టు న్యాయమూర్తి మీద కేసు నడపడానికి తిరస్కరించిన సీబీఐ’ అని హిందుస్థాన్ టైమ్స్ 2009 జూన్ 6న ఒక వార్త రాసింది. అది చూసిన అప్పటి న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, ఇంత తీవ్రమైన వ్యవహారంలో కేసు నడపకపోవడం తప్పు అనీ, అలా చేస్తే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందనీ తీవ్ర పదజాలంతో న్యాయశాఖ కార్యదర్శికి నోట్ పెట్టి, దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మన్నారు. అప్పుడు సీబీఐ మళ్లీ కొత్తగా వచ్చిన అటార్నీ జనరల్ సలహా కోసం వెళ్లింది. కొత్త అటార్నీ జనరల్ కూడా కేసు అవసరం లేదు అంటూ పాత అటార్నీ జనరల్ అభిప్రాయాన్నే ప్రకటించారు. దానితో తర్వాత సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కేసును ఉపసంహరించుకుంటున్నానని (క్లోజర్ రిపోర్ట్) సీబీఐ తెలిపింది. ఇక్కడ కథ మరొక మలుపు తిరిగి, సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి క్లోజర్ రిపోర్ట్‌ను తిరస్కరించి, కేసు నడపవల సిందే అన్నారు. అప్పుడు సీబీఐ మరొకసారి అనుమతి కోసం దరఖాస్తు... పైకి పంపించింది. దాన్ని పరిశీలించిన న్యాయ శాఖ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించగా, రాష్ట్రపతి 2011 మార్చ్‌లో అనుమతి ఇచ్చారు. అంటే రెడ్ హ్యాండెడ్‌గా అవినీతి పట్టు బడినా కేసు ప్రారంభించడానికే మూడు సంవత్సరాలు పట్టిందన్న మాట. అప్పుడు సీబీఐ చార్జిషీట్ వేసింది. అప్పటికే ఈ కేసు నడపడానికి వీలులేదని ఎన్నో పిటిషన్లు దాఖలు చేసిన జస్టిస్ నిర్మల్ యాదవ్ ఇప్పుడు ఈ అనుమతి చెల్లదని హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు అనుమతి చెల్లుతుందని తేల్చి చెప్పింది. ఆ తీర్పును నిర్మల్ యాదవ్ సుప్రీం కోర్టులో సవాలు చేయగా, అక్కడ కూడా ఆమెకు చుక్కెదురయింది. కేసును తాత్సారం చేయడానికి ఆమె వేసిన మరెన్నో పిటిషన్లు కూడా గడిచిన తర్వాత, చివరికి 2013 మేలో నెల లోపు దర్యాప్తు, చార్జెస్ ఫ్రేమ్ ప్రక్రియలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలా అవినీతి సొమ్ము దొరికిన ఐదు సంవత్సరాల తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసు మొదలయింది. ఏడున్నర సంవ త్సరాల తర్వాత చార్జెస్ ఫ్రేమ్ అయి విచారణ మొదలయింది. ఈలోగా జస్టిస్ నిర్మల్ యాదవ్ పదవీ విరమణ జరిగింది. సంజీవ్ బన్సాల్ మరణించాడు. డబ్బు పట్టుకొచ్చిన గుమాస్తా మరణించాడు. నలుగురు కీలక సాక్షులు అడ్డం తిరిగారు. న్యాయస్థానం దాదాపు 70 మంది సాక్షులను విచారించింది. ఇలా ఎన్నెన్నో అవరోధాలు దాటి, ఘటన జరిగిన 17 సంవత్సరాల తర్వాత, కేసు మొదలైన 14 సంవత్సరాల తర్వాత... ఎట్టకేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అల్కా మాలిక్ సరిపోయినన్ని సాక్ష్యాధారాలు లేవని, సాక్షుల వాఙ్మూలాల్లో వైరుద్ధ్యాలున్నాయని కేసు కొట్టేశారు. ఎంత నిర్మలమైన న్యాయం!!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్

బెంగళూరుకు సిరాజ్ షాక్
ఏడేళ్ల పాటు బెంగళూరు ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్ సిరాజ్... తొలిసారి ఆ జట్టుకు ప్రత్యర్థిగా ఆడుతూ నిప్పులు చెరిగాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున తన పాత సహచరులపై బుల్లెట్ బంతులతో ప్రతాపం చూపాడు. ఫలితంగా ఐపీఎల్లో టైటాన్స్ రెండో విజయం నమోదు చేసుకోగా... రెండు విజయాల తర్వాత బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. సిరాజ్ ధాటికి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైన బెంగళూరు జట్టు... ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా ఎలాంటి మెరుపులు లేకుండా ఓటమిని ఆహ్వానించింది. బ్యాటింగ్‌లో బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో మరో 13 బంతులు మిగిలుండగానే గుజరాత్ గెలుపొందింది. బెంగళూరు: వరుస విజయాలతో జోరుమీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఐపీఎల్ 18వ సీజన్లో తొలి ఓటమి ఎదురైంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన బెంగళూరు... బుధవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైంది. గత సీజన్ వరకు ఆర్సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ సిరాజ్ (3/19) గుజరాత్ టైటాన్స్ తరఫున చెలరేగిపోగా... అతడి బౌలింగ్‌ను ఆడలేక బెంగళూరు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. మొదట బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; 1 ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... జితేశ్ శర్మ (33; 5 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (7), దేవదత్ పడిక్కల్ (4) కెప్టెన్ రజత్ పాటీదార్ (12), ఫిల్ సాల్ట్ (14), కృనాల్ పాండ్యా (5) విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిరాజ్ 3 వికెట్లు, సాయికిషోర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్), రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. సూపర్ సిరాజ్... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. అర్షద్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో అనవసర షాట్‌కు యత్నించిన కోహ్లి ఫైన్ లెగ్‌లో ప్రసిధ్ చేతికి చిక్కాడు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. తదుపరి ఓవర్లో పడిక్కల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్ టైటాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. ఇక కొన్ని మంచి షాట్లు ఆడిన సాల్ట్‌ను కూడా సిరాజ్ బుట్టలో వేసుకున్నాడు. ఈ మధ్య పాటీదార్‌ను ఇషాంత్ శర్మ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో... బెంగళూరు జట్టు 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జితేశ్ శర్మ, లివింగ్‌స్టోన్... చివర్లో డేవిడ్ ధాటిగా ఆడారు. 15 ఓవర్లు ముగిసేసరికి 105/6తో ఉన్న ఆర్సీబీ... చివరి 5 ఓవర్లలో 64 పరుగులు జోడించింది. రషీద్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో 3 సిక్స్‌లు బాదిన లివింగ్‌స్టోన్‌ను తదుపరి ఓవర్లో సిరాజ్ అవుట్ చేశాడు. చివరి ఓవర్లో డేవిడ్ 4, 6, 4 కొట్టడంతో బెంగళూరు ఆ మాత్రం స్కోరు చేసింది. అలవోకగా... ఛేదనలో గుజరాత్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదు. లక్ష్యం చిన్నది కావడంతో ఆ జట్టు ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేయలేకపోయిన ఆర్సీబీ... బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (14) త్వరగానే అవుటైనా... మరో ఓపెనర్ సాయి సుదర్శన్‌తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో చెలరేగిన ఈ జంట రెండో వికెట్‌కు 47 బంతుల్లో 75 పరుగులు జతచేసింది. అనంతరం సుదర్శన్ అవుట్ కాగా... రూథర్‌ఫోర్డ్‌తో కలిసి బట్లర్ మూడో వికెట్‌కు 32 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (బి) సిరాజ్ 14; కోహ్లి (సి) ప్రసిధ్ కృష్ణ (బి) అర్షద్ 7; దేవదత్ పడిక్కల్ (బి) సిరాజ్ 4; పాటీదార్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 12; లివింగ్‌స్టోన్ (సి) బట్లర్ (బి) సిరాజ్ 54; జితేశ్ శర్మ (సి) తెవాటియా (బి) సాయికిషోర్ 33; కృనాల్ పాండ్యా (సి అండ్ బి) సాయికిషోర్ 5; టిమ్ డేవిడ్ (బి) ప్రసిధ్ కృష్ణ 32; భువనేశ్వర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–8, 2–13, 3–35, 4–42, 5–94, 6–104, 7–150, 8–169. బౌలింగ్: సిరాజ్ 4–0–19–3; అర్షద్ ఖాన్ 2–0–17–1; ప్రసిధ్ కృష్ణ 4–0–26–1; ఇషాంత్ 2–0–27–1; సాయికిషోర్ 4–0–22–2; రషీద్ ఖాన్ 4–0–54–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) జితేశ్ శర్మ (బి) హాజల్‌వుడ్ 49; గిల్ (సి) లివింగ్‌స్టోన్ (బి) భువనేశ్వర్ 14; బట్లర్ (నాటౌట్) 73; రూథర్‌ఫోర్డ్ (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–32, 2–107. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–23–1, హాజల్‌వుడ్ 3.5–0–43–1; యశ్ దయాళ్ 3–0–20–0; రసిక్ సలామ్ 3–0–35–0; కృనాల్ పాండ్యా 3–0–34–0; లివింగ్‌స్టోన్ 1–0–12–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X హైదరాబాద్‌వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

మా ఇంటి మణిదీపం
‘ఆడపిల్ల పుట్టింది’ అనే వార్త చెవిన పడగానే... ‘మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది’ అంటూ సంబరం అంబరాన్ని అంటాలి. ‘మా పాప–మా ఇంటి మణిదీపం’ ఇచ్చే స్ఫూర్తి అదే. ‘ఆడపిల్లలు ఎంత చదివితే అంత ముందుకు వెళతారు. అంత అదనపు శక్తి వస్తుంది’ అని అమ్మమ్మ చెబుతుండే వారు. తన అమ్మమ్మ స్ఫూర్తితో చదువు నుంచి స్వయం ఉపాధి వరకు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్...‘బేటీ బచావో...బేటీ పడావో’ స్ఫూర్తితో ఖమ్మం జిల్లాలో ‘మా పాప–మా ఇంటి మణిదీపం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్ల పుట్టిన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, నానమ్మని సత్కరిస్తారు. శాలువ కప్పి స్వీట్ బాక్స్, పండ్లు, ఒక సర్టిఫికెట్‌ను అందజేస్తారు. కొందరి ఇళ్లకు స్వయంగా కలెక్టర్ వెళుతున్నారు.హాజరు శాతంపెరిగిందిపాఠశాలల్లో బాలికల హాజరు శాతంపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బాలికల హాజరు శాతం పెరిగేలా కృషి చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో బాలికల హాజరు శాతం 86 నుంచి 92 శాతానికి పెరిగింది. పాఠశాలల్లో బాలికలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకున్నారు.ఆర్థిక శక్తిస్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఉపాధి కలిగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో స్త్రీ–టీ క్యాంటీన్లు ప్రసిద్ధి చెందాయి. ఇప్పటికే 50 కి పైగా క్యాంటీన్ల వరకు జిల్లా వ్యాప్తంగా లాభాల బాటలో నడుస్తుండగా మరిన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. యూనిట్లను మంజూరు చేయడంతోపాటు ఎప్పటికప్పుడు వాటి పనితీరును కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు.మా అమ్మమ్మ అలా లాయర్ అయింది...మహిళలు చదువుకుంటే తరతరాలుగా ఆ కుటుంబం బాగుపడుతుందని చెబుతారు. అది కళ్లతో చూశా. మా అమ్మమ్మకు పన్నెండేళ్లకే పెళ్లి చేశారు. అమ్మమ్మ వాళ్ల ఇంటి ఎదుట కిరాణాషాపు ఉండేది. అక్కడ సరుకులను న్యూస్ పేపర్లలో కట్టి ఇచ్చేవారు. ఆ న్యూస్ పేపర్లను చదువుతూ మరోసారి చదువుపై ఆసక్తిని పెంచుకుని బీఈడీ, ఎంఈడీ పూర్తి చేసింది. లాయర్ అయింది. అప్పుడే నాకు తెలిసింది చదువుతో ఎంతైనా సాధించవచ్చునని. – ముజమ్మిల్ ఖాన్, కలెక్టర్, ఖమ్మంకలెక్టర్ మా ఇంటికి వచ్చారు!నాకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. మా ఇంటికి కలెక్టర్ సార్ వచ్చిండు. మాకు సన్మానం చేసి, పూలు, పండ్లు, స్వీట్లు ఇచ్చారు. సర్టిఫికెట్ అందజేశారు. మా పాప పెద్దయ్యాక ఈ సర్టిఫికెట్ చూపించి కలెక్టర్ ఇచ్చారని చెప్పమన్నారు. ‘మీకు మహాలక్ష్మి పుట్టింది. బాగా చదివించండి. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదిస్తుంది’ అంటూ ఆశీర్వదించారు. – బానోత్ కృష్ణవేణి, రామచంద్రాపురం, ఖమ్మం జిల్లా– బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ఖమ్మం
శిఖరాన్ని వంచింది
ద్విముఖ పోరు
మా ఇంటి మణిదీపం
ఎంత ‘నిర్మల’మైన న్యాయం?!
ఇకనైనా అరాచకం ఆగేనా!
IPL 2025: ఉతికి ఆరేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం
కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్‌గా శైలజ జోస్యుల
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్: హెచ్‌సీయూ వివాదంపై యాంకర్ రష్మీ
జపాన్‌లో భారీ భూకంపం
రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్ జగన్ ట్వీట్
హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం
యువ ఐఏఎస్ అధికారికి ఫ్యూచర్ సిటీ పగ్గాలు!
భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి
అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష
బెంగళూరుకు సిరాజ్ షాక్
దిశా పటానీ ధగధగ.. కావ్య థాపర్ గిబ్లీ ఆర్ట్!
గువాహాటిలో తొలిసారి టెస్టు
శిఖరాన్ని వంచింది
మా ఇంటి మణిదీపం
ఇకనైనా అరాచకం ఆగేనా!
కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్‌గా శైలజ జోస్యుల
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
బిర్లాన్యూ రూ. 1,300 కోట్ల పెట్టుబడులు
ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్.. ఎవరీ పూనమ్ గుప్తా?
నేరుగా వాట్సాప్‌లో.. ఇన్వెస్టర్లకు సరికొత్త ఫీచర్
ఆదిత్య బిర్లా ఫైనాన్స్ విలీనం పూర్తి.. కంపెనీ ఇకపై..
నాపై ట్రోలింగ్.. ఆ ఒక్క పని చేస్తే చాలు: సారా అలీ ఖాన్
అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
'మ్యాడ్' హీరోతో మెగా డాటర్ కొత్త సినిమా
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
భూమికి మేలు–రైతుకు వీలు
రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్..
65 నుంచి 40కు...
ఈ రాతగాళ్లు సవ్యసాచులు
‘పథకం’ ప్రకారం ప్రతినెలా కేవలం ఒక ఇంటిని సందర్శించి వస్తున్నాం సార్!
ద్విముఖ పోరు
పట్టణాలకు పన్నుపోటు
IPL 2025: ఉతికి ఆరేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్: హెచ్‌సీయూ వివాదంపై యాంకర్ రష్మీ
RCB VS GT: అదిరిపోయే రీతిలో ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. వైరల్ వీడియో
జైస్వాల్ బాటలోనే సూర్య, తిలక్..?
IPL 2025: ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
Bird Flu : హైదరాబాద్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం.. వేల కోళ్లు మృత్యువాత
నీలి రంగు అద్దాల మేడలు : భగభగ మంటలు
రాత్రికి రాత్రే బుల్డోజర్లు.. అసలేం జరుగుతుంది?: రష్మిక
ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ రిపీట్ అంటూ తెగ చూసేస్తున్నారా?
HCU భూ వివాదం.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
టీడీపీ అరాచకాలు.. వైఎస్ జగన్‌ను కలిసిన చిత్తూరు వైఎస్సార్సీపీ నేత
ఎక్స్పీరియన్ హైదరాబాద్ జీఐసీ.. ఇప్పుడు డబుల్!
వక్ఫ్‌పై అపోహ మాత్రమే: లోక్‌సభలో అమిత్ షా
నాటక రంగానికి సీఆర్సీ ప్రోత్సాహం ఎనలేనిది
కారును ఢీకొట్టిన లారీ
నాలుగు లక్షల నెంబర్లు లీక్.. రేపు ఒకరి అరెస్ట్ తప్పదు
కళారంగానికి సీఆర్సీ సేవలు ఎనలేనివి
దీక్ష ముగిసె.. దువా ఫలించె!
‘బిల్లీ’ కబంధ హస్తాల్లోంచి..భూముల చెర విడిపించాం
మీ నిబద్ధతకు హ్యాట్సాఫ్! : వైఎస్ జగన్
గెలుపు బాటలోకి ఎవరో!
సాకేత్ జోడీ శుభారంభం
చెట్ల నరికివేత ఆపండి: హైకోర్టు
ఎంత ‘నిర్మల’మైన న్యాయం?!
టీడీపీ విమర్శలు భావ్యం కాదు
కాంతార ప్రీక్వెల్ విడుదల వాయిదా.. స్పందించిన టీమ్
ఊహించని విషాదం.. రిటైర్మెంట్ రోజే అనంతలోకాలకు
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు కొనసాగనున్న కష్టాలు..!
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సారా టెండూల్కర్
ప్రపంచ సమస్యలను-ఆర్ట్‌ని మిళితం చేసే వంటకాలు..చూస్తే మతిపోతుంది..!
Heatwave Alert: భానుడి భగభగ .. మారిన ప్రభుత్వ కార్యాలయాల ఆఫీస్ టైమింగ్స్
టెక్ లేఆఫ్‌లు.. ఒక్క నెలలో ఎన్ని వేల కోతలో..
చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. ఇలా దొరికిపోయిందేంటి?
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్‌పై మంత్రి కీలక ప్రకటన
కిడ్నాప్ చేసి నిన్ను ముంబై తీసుకెళ్లిపోతా: మంచు లక్ష్మీ
ఊరంతా చేపల కూరే...!
హార్ట్ బ్రేకింగ్ అంటూ అనసూయ పోస్ట్.. బాధగా ఉందన్న సమంత!
IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌కు గుడ్ న్యూస్
నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!
తెలుగులో ‘కరాటే కిడ్: లెజెండ్స్’.. ట్రైలర్ రిలీజ్
ఆ ఐదో ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?: అంబటి
లాభాలతో ముగిసిన మార్కెట్లు
హీరోయిన్ శ్రీలీలకు ముఖ్యమంత్రి గిఫ్ట్.. ఎందుకో తెలుసా?
అండగా ఉంటా.. ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులతో వైఎస్ జగన్
నాగర్‌కర్నూల్ ఘటన.. వెలుగులోకి కీలక విషయాలు
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగిరావాలి, లేకుంటే..: రేవంత్‌రెడ్డి
కలిసి నడుద్దాం...
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఓటీటీలోకి ఖుషీ కపూర్ డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అబద్ధపు వాగ్దానాలతో మోసం
నష్టం మిగిల్చిన అకాల వర్షం
పొలం పారదు.. పంట పండదు!
నాట్స్ తెలుగు సంబరాలు సినీ ప్రముఖులకు ఆహ్వానం
ప్రశాంతంగా ముగిసిన హోలీ, రంజాన్ ప్రార్థనలు
శిఖరాన్ని వంచింది
ద్విముఖ పోరు
మా ఇంటి మణిదీపం
ఎంత ‘నిర్మల’మైన న్యాయం?!
ఇకనైనా అరాచకం ఆగేనా!
IPL 2025: ఉతికి ఆరేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం
కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్‌గా శైలజ జోస్యుల
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్: హెచ్‌సీయూ వివాదంపై యాంకర్ రష్మీ
జపాన్‌లో భారీ భూకంపం
రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్ జగన్ ట్వీట్
హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం
యువ ఐఏఎస్ అధికారికి ఫ్యూచర్ సిటీ పగ్గాలు!
భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి
అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష
బెంగళూరుకు సిరాజ్ షాక్
దిశా పటానీ ధగధగ.. కావ్య థాపర్ గిబ్లీ ఆర్ట్!
గువాహాటిలో తొలిసారి టెస్టు
శిఖరాన్ని వంచింది
మా ఇంటి మణిదీపం
ఇకనైనా అరాచకం ఆగేనా!
కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్‌గా శైలజ జోస్యుల
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
బిర్లాన్యూ రూ. 1,300 కోట్ల పెట్టుబడులు
ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్.. ఎవరీ పూనమ్ గుప్తా?
నేరుగా వాట్సాప్‌లో.. ఇన్వెస్టర్లకు సరికొత్త ఫీచర్
ఆదిత్య బిర్లా ఫైనాన్స్ విలీనం పూర్తి.. కంపెనీ ఇకపై..
నాపై ట్రోలింగ్.. ఆ ఒక్క పని చేస్తే చాలు: సారా అలీ ఖాన్
అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
'మ్యాడ్' హీరోతో మెగా డాటర్ కొత్త సినిమా
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
భూమికి మేలు–రైతుకు వీలు
రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్..
65 నుంచి 40కు...
ఈ రాతగాళ్లు సవ్యసాచులు
‘పథకం’ ప్రకారం ప్రతినెలా కేవలం ఒక ఇంటిని సందర్శించి వస్తున్నాం సార్!
ద్విముఖ పోరు
పట్టణాలకు పన్నుపోటు
IPL 2025: ఉతికి ఆరేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్: హెచ్‌సీయూ వివాదంపై యాంకర్ రష్మీ
RCB VS GT: అదిరిపోయే రీతిలో ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. వైరల్ వీడియో
జైస్వాల్ బాటలోనే సూర్య, తిలక్..?
IPL 2025: ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
Bird Flu : హైదరాబాద్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం.. వేల కోళ్లు మృత్యువాత
నీలి రంగు అద్దాల మేడలు : భగభగ మంటలు
రాత్రికి రాత్రే బుల్డోజర్లు.. అసలేం జరుగుతుంది?: రష్మిక
ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ రిపీట్ అంటూ తెగ చూసేస్తున్నారా?
HCU భూ వివాదం.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
టీడీపీ అరాచకాలు.. వైఎస్ జగన్‌ను కలిసిన చిత్తూరు వైఎస్సార్సీపీ నేత
ఎక్స్పీరియన్ హైదరాబాద్ జీఐసీ.. ఇప్పుడు డబుల్!
వక్ఫ్‌పై అపోహ మాత్రమే: లోక్‌సభలో అమిత్ షా
నాటక రంగానికి సీఆర్సీ ప్రోత్సాహం ఎనలేనిది
కారును ఢీకొట్టిన లారీ
నాలుగు లక్షల నెంబర్లు లీక్.. రేపు ఒకరి అరెస్ట్ తప్పదు
కళారంగానికి సీఆర్సీ సేవలు ఎనలేనివి
దీక్ష ముగిసె.. దువా ఫలించె!
‘బిల్లీ’ కబంధ హస్తాల్లోంచి..భూముల చెర విడిపించాం
మీ నిబద్ధతకు హ్యాట్సాఫ్! : వైఎస్ జగన్
గెలుపు బాటలోకి ఎవరో!
సాకేత్ జోడీ శుభారంభం
చెట్ల నరికివేత ఆపండి: హైకోర్టు
ఎంత ‘నిర్మల’మైన న్యాయం?!
టీడీపీ విమర్శలు భావ్యం కాదు
కాంతార ప్రీక్వెల్ విడుదల వాయిదా.. స్పందించిన టీమ్
ఊహించని విషాదం.. రిటైర్మెంట్ రోజే అనంతలోకాలకు
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు కొనసాగనున్న కష్టాలు..!
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సారా టెండూల్కర్
ప్రపంచ సమస్యలను-ఆర్ట్‌ని మిళితం చేసే వంటకాలు..చూస్తే మతిపోతుంది..!
Heatwave Alert: భానుడి భగభగ .. మారిన ప్రభుత్వ కార్యాలయాల ఆఫీస్ టైమింగ్స్
టెక్ లేఆఫ్‌లు.. ఒక్క నెలలో ఎన్ని వేల కోతలో..
చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. ఇలా దొరికిపోయిందేంటి?
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్‌పై మంత్రి కీలక ప్రకటన
కిడ్నాప్ చేసి నిన్ను ముంబై తీసుకెళ్లిపోతా: మంచు లక్ష్మీ
ఊరంతా చేపల కూరే...!
హార్ట్ బ్రేకింగ్ అంటూ అనసూయ పోస్ట్.. బాధగా ఉందన్న సమంత!
IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌కు గుడ్ న్యూస్
నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!
తెలుగులో ‘కరాటే కిడ్: లెజెండ్స్’.. ట్రైలర్ రిలీజ్
ఆ ఐదో ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?: అంబటి
లాభాలతో ముగిసిన మార్కెట్లు
హీరోయిన్ శ్రీలీలకు ముఖ్యమంత్రి గిఫ్ట్.. ఎందుకో తెలుసా?
అండగా ఉంటా.. ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులతో వైఎస్ జగన్
నాగర్‌కర్నూల్ ఘటన.. వెలుగులోకి కీలక విషయాలు
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగిరావాలి, లేకుంటే..: రేవంత్‌రెడ్డి
కలిసి నడుద్దాం...
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఓటీటీలోకి ఖుషీ కపూర్ డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అబద్ధపు వాగ్దానాలతో మోసం
నష్టం మిగిల్చిన అకాల వర్షం
పొలం పారదు.. పంట పండదు!
నాట్స్ తెలుగు సంబరాలు సినీ ప్రముఖులకు ఆహ్వానం
ప్రశాంతంగా ముగిసిన హోలీ, రంజాన్ ప్రార్థనలు
సినిమా

చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. ఇలా దొరికిపోయిందేంటి?
ప్రముఖ యూట్యూబర్, ఆర్జే మహ్వశ్ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ తర్వాత అందరి దృష్టి ఆమెపైనే పడింది. అంతవరకు ముక్కు మొహం తెలియని ఆమె గురించి నెటిజన్స్ తెగ వెతికారు. ఇంతకీ ఆమె ఎవరంటూ ఆరా తీశారు. దీనికంతటికీ కారణం ఆ టీమిండియా క్రికెటరే. అతనితో కలిసి మ్యాచ్‌లో కనిపించడంతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చేసింది. టీమిండియా స్పిన్నర్ చాహల్‌తో కలిసి ఛాంపియన్ ట్రోఫీలో సందడి చేసింది. ఇక అప్పటి నుంచి వరుసగా ఏదో ఒక సందర్భంలో టాక్ వినిపిస్తూనే ఉంది. అంతేకాకుండా వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా మరోసారి ఆర్జే మహ్వశ్ వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి చాహల్‌తో కలిసి మాత్రం కనిపించలేదు. అతని ఆడుతున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం లక్నోలో వాలిపోయింది ముద్దుగుమ్మ. నగరంలో ప్రముఖ హోటల్లో ఆర్జే మహ్వశ్ ఈత కొడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది.అయితే చాహల్‌తో డేటింగ్ రూమర్స్ వస్తున్న వేళ.. ఐపీఎల్ మ్యాచ్ కోసం ఆర్జే మహ్వశ్ రావడంతో మరోసారి వీరిద్దరిపై రిలేషన్‌పై టాక్ నడుస్తోంది. నిజంగానే ఈ జంట డేటింగ్లో ఉన్నారా? అనే చర్చ మొదలైంది. కాగా.. చాహల్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ లీగ్ ఆడుతున్నారు. ఇటీవలే తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు కూడా తీసుకున్నారు. మార్చి 20, 2025న ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.లక్నోలో ఆర్జే మహ్వశ్ కనిపించడంతో చాహల్‌తో డేటింగ్ నిజమేనంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పంజాబ్, లక్నో మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఆమె కనిపించడంతో రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. మీ రిలేషన్‌షిప్‌ను ఇంకెన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచతారని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.ఎవరీ ఆర్జే మహ్వశ్?ఆర్జే మహ్వశ్ రేడియో మిర్చిలో రేడియో జాకీ(ఆర్జే)గా పని చేస్తోంది. సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు చేస్తూ పాపులర్ అయింది. చాహల్‌తో డేటింగ్ కథనాలు రావడంతో జనవరిలో 1.5 మిలియన్లు ఉండే ఫాలోవర్ల ఒక్కసారిగా అమాంతం పెరిగింది. అంతేకాకుండా నవాజుద్దీన్ సిద్దిఖీ, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'సెక్షన్ 108' సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. వీటితో పాటు హీరోయిన్గా ఓ వెబ్ సిరీస్ చేస్తోంది.

కిడ్నాప్ చేసి నిన్ను ముంబై తీసుకెళ్లిపోతా: మంచు లక్ష్మీ
మంచు కుటుంబంలో మనోజ్, విష్ణు.. హైదరాబాద్ లో ఉంటున్నారు. కానీ మంచు లక్ష్మీ మాత్రం ముంబైలో ఉంటోంది. రీసెంట్ గా జరిగిన ఫ్యామిలీ గొడవల్లోనూ ఈమె ఎక్కడా కనిపించలేదు. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఇన్ స్టాలో మనోజ్ కూతురు గురించి లక్ష్మీ క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్ పెట్టింది.మనోజ్ కూతురిని తెగ ముద్దు చేసేస్తున్న మంచు లక్ష్మీ.. చిన్నారి దేవసేన తొలి పుట్టినరోజు సందర్భంగా తన ప్రేమనంతా బయటపెట్టింది. 'నువ్వు పుట్టే ముందురోజు దేవుడు నన్ను ఇక్కడికి రప్పించడానికి కారణం ఉందేమో. ఎందుకంటే నేనే అప్పటికే వెళ్లిపోవడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. పని కూడా ఉంది. కానీ తర్వాత రోజు ఉదయమే నువ్వు పుట్టావ్ దేవసేన. నిన్ను మీ అమ్మనాన్న కాదు నేనే మొదట ఎత్తుకున్నాను. రోజంతా నీతోనే గడిపాను. నువ్వు బాగా కనెక్ట్ అయ్యావ్.'(ఇదీ చదవండి: మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి)'మనిద్దరి మధ్య మంచి అనుబంధముంది. మాటల్లో అది చెప్పలేను. నన్ను అత్తగా సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్యూ. నేను నీతో ఉండి అల్లరి చేసే అత్తని. నీ తొలి పుట్టినరోజున చాలా చెప్పాలని ఉంది. కానీ నువ్వు ఆనందంగా ఎదగాలి. నీ ప్రపంచం అందంగా ఉండాలి. నువ్వు మా ఇంటి రాణివి. నిన్ను తర్వలో కిడ్నాప్ చేసి ముంబై తీసుకెళ్లిపోతా (నవ్వుతూ). ఈ డైమండ్ ని నాకు ఇచ్చినందుకు మనోజ్-మౌనికకు థ్యాంక్యూ' అని మంచు లక్ష్మీ రాసుకొచ్చింది.మనోజ్, అతడి కూతురు దేవసేనతో మంచు లక్ష్మీ బాండింగ్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. కానీ కొన్నాళ్ల క్రితం మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవలు.. ఇప్పుడు మనోజ్ కూతురు గురించి లక్ష్మీ పోస్ట్ పెట్టడం చూస్తుంటే మోహన్ బాబు-విష్ణు ఒకవైపు.. మనోజ్-లక్ష్మీ ఒకవైపు ఉన్నట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

మనకు మరో ఆలియా భట్ అవసరం లేదు: అర్జున్ రెడ్డి హీరోయిన్
బాలీవుడ్ భామ షాలిని పాండే తెలుగువారికి సుపరిచితమైన పేరు. విజయ్ దేవరకొండ సరసన అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒక్కటే సినిమాలతో మెప్పించింది. అయితే గతేడాది మహరాజ్ చిత్రంతో నటించిన ముద్దుగుమ్మ.. ఇటీవల జ్యోతిక ప్రధాన పాత్రలో వచ్చిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్‌లో కనిపించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షాలిని పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనను ఆలియా భట్‌తో పోల్చడంపై కూడా మాట్లాడింది. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలని కోరుకుంటానని తెలిపింది. అంతేకానీ మరొకరితో తనను పోల్చడం సరికాదని హితవు పలికారు. మనకు మరో ఆలియా భట్ అవసరం లేదని షాలిని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.షాలిని మాట్లాడుతూ.. "మనకు మరొక అలియా అవసరం లేదు. ఎవరూ మరో ఆలియా భట్ కాకూడదు. ఎందుకంటే ఆమె చాలా అద్భుతంగా ఉంది. కేవలం ఆమె సినిమాల వల్ల మాత్రమే కాదు. తెరపై మాత్రమే కాదు.. నేను వ్యక్తిగతంగా అలియా భట్‌ను అభిమానిస్తాను. అందువల్లే నేను మరో ఆలియా భట్ కావాలనుకోవడం లేదు. నాకంటూ స్వంత వ్యక్తిత్వం కూడా ఉండాలి. ఎవరైనా నన్ను షాలిని లాగే చూడాలని కోరుకుంటున్నా. అది నాకు చాలు.' అని అన్నారు. కాగా.. రణ్వీర్ సింగ్ సరసన జయేష్‌భాయ్ జోర్దార్లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన షాలిని.. తెలుగులో అర్జున్ రెడ్డి మూవీతో ఫేమస్ అయింది.

'మ్యాడ్' హీరోతో మెగా డాటర్ కొత్త సినిమా
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్.. ఇప్పుడు హీరోగా మరో మూవీ ఓకే చేశారు. 'కమిటీ కుర్రాళ్లు' మూవీతో నిర్మాతగా తొలి హిట్ అందుకున్న నిహారిక.. ఇప్పుడు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది.(ఇదీ చదవండి: మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి)నిహారిక తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రెండో చిత్రాన్ని ప్రారంభించింది. మానస శర్మ అనే కొత్తమ్మాయిని దర్శకురాలిగా పరిచయం చేస్తోంది. గతంలో ఈమె.. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీసులకు దర్శకత్వం వహించింది. ఇప్పుడు సినిమాకు డైరెక్షన్ వహించబోతుంది. ఇదివరకే నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ లో సంగీత్ శోభన్ నటించాడు. దానికే మానస శర్మ కూడా పనిచేసింది. అప్పుడు ఓటీటీ సిరీస్ కోసం పనిచేసిన ఈ ముగ్గురు.. ఇప్పుడు సినిమా కోసం ఒక్కటయ్యారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ ఏడాదే రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి)
న్యూస్ పాడ్‌కాస్ట్

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పేరిట సిండికేట్ లూటీ... సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు...
క్రీడలు

గువాహాటిలో తొలిసారి టెస్టు
ముంబై: ఈ ఏడాది సొంతగడ్డపై భారత జట్టు ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది. ఈ సంవత్సరం భారత క్రికెట్ జట్టు స్వదేశంలో 4 టెస్టులు, 3 వన్డేలు, 5 టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా స్వరాష్ట్రం అస్సాంలో భారత జట్టు తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడనుంది. గువాహాటిలోని అస్సాం క్రికెట్ సంఘం (ఏసీఏ) స్టేడియం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టుకు నవంబర్ 26 నుంచి ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. వెస్టిండీస్‌తో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. అనంతరం దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌ల్లో తలపడుతుంది. భారత్–దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 6న జరిగే మూడో వన్డే మ్యాచ్‌కు విశాఖపట్నం వేదిక కానుంది.

IPL 2025: ఉతికి ఆరేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు) వేదికగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 2) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి గుజరాత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మధ్యలో జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) కూడా ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో వీరు మినహా ఎవరూ రాణించలేదు. సాల్ట్ 14, విరాట్ కోహ్లి 7, పడిక్కల్ 4, పాటిదార్ 12, కృనాల్ పాండ్యా 5 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్ 2, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.170 పరుగుల నామ మాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) గుజరాత్‌ను గెలిపించారు. తొలుత నిదానంగా ఆడిన బట్లర్.. ఆతర్వాత గేర్ మార్చి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్ (ఇంపాక్ట్ ప్లేయర్) తనదైన శైలితో చెలరేగిపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. టాప్ ప్లేస్‌లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది.

RCB VS GT: అదిరిపోయే రీతిలో ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. వైరల్ వీడియో
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు చెలరేగడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఆ జట్టు 16 ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. లివింగ్‌స్టోన్ (33), టిమ్ డేవిడ్ (6) క్రీజ్‌లో ఉండటంతో ఆర్సీబీ ఇంకా ఆశలు పెట్టుకుంది.రెండు వరుస విజయాల తర్వాత ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేస్తుంది. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. ఆర్సీబీని పేసర్ అర్షద్ ఖాన్ తొలి దెబ్బేశాడు. రెండో ఓవర్లోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (7) ఔట్ చేశాడు. ఆతర్వాత ఆర్సీబీ మాజీ ఆటగాడు సిరాజ్ లైన్లోకి వచ్చాడు. సిరాజ్ అతని వరుస ఓవర్లలో పడిక్కల్ (4), సాల్ట్‌ను (14) క్లీన్ బౌల్డ్ చేశాడు. Mo Siraj 🔥pic.twitter.com/2cbgtJIhNi— CricTracker (@Cricketracker) April 2, 2025ఆతర్వాత ఇషాంత్ అద్భుతమైన బంతితో కెప్టెన్ పాటిదార్‌ను (12) ఎల్బీడబ్ల్యూ చేశాడు. లేట్‌గా (11వ ఓవర్) బౌలింగ్‌కు దిగిన సాయికిషోర్ తన రెండో ఓవర్లోనే మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన జితేశ్ శర్మను (33) ఔట్ చేశాడు. సాయి కిషోర్ తన మూడో ఓవర్లో మరో ఫలితం రాబట్టాడు. ఈసారి కిషోర్ కృనాల్ పాండ్యాను (5) బోల్తా కొట్టించాడు. భారీ హిట్టర్లు లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్ క్రీజ్‌లో ఉండటంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోర్‌పై ఆశలు పెట్టుకుంది.కాగా, ఈ మ్యాచ్‌లో సిరాజ్ సాల్ట్ వికెట్ తీసిన విధానం అందరినీ ఆకర్శించింది. ఇన్నింగ్స్ 5వ ఓవర్ మూడో బంతికి సాల్ట్ సిరాజ్ బౌలింగ్‌లో 105 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. ఆతర్వాతి బంతికి సిరాజ్ సాల్ట్‌పై తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. సాల్ట్ వికెట్లు వదిలి మరో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. సిరాజ్ బంతిని నేరుగా వికెట్లపైకి సంధించి సాల్ట్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ సీజన్లో సిరాజ్ ఇప్పటివరకు తీసిన నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్లే కావడం విశేషం. సిరాజ్ బౌలింగ్‌లో సాల్ట్ కొట్టిన సిక్సర్ ఈ సీజన్లో అత్యంత భారీ సిక్సర్‌గా రికార్డైంది. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు ట్రవిస్ హెడ్ కూడా 105 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు.

భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది భారత క్రికెట్ జట్టు హోం సీజన్ (స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు) షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్ 2) ప్రకటించింది. అక్టోబర్‌లో వెస్టిండీస్.. నవంబర్, డిసెంబర్ నెలల్లో సౌతాఫ్రికా క్రికెట్ జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి.విండీస్ క్రికెట్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో తొలి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 2-6 మధ్య తేదీల్లో జరుగనుంది. రెండో టెస్ట్ కోల్‌కతా వేదికగా అక్టోబర్ 10-14 మధ్య తేదీల్లో జరుగుతుంది. టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ భారత్‌లో పర్యటించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ఆ సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది.అనంతరం నవంబర్ నెలలో సౌతాఫ్రికా జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా రెండు టెస్ట్‌లు.. మూడు వన్డేలు.. ఐదు టీ20లు ఆడనుంది. నవంబర్ 14-18 మధ్య తేదీల్లో న్యూఢిల్లీలో తొలి టెస్ట్ జరుగనుంది. నవంబర్ 22 తేదీన గౌహతి వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.నవంబర్ 30, డిసెంబర్ 3, డిసెంబర్ 6 తేదీల్లో రాంచీ, రాయ్‌పూర్, వైజాగ్ వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి. డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్, చండీఘడ్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా ఐదు టీ20లు జరుగనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో భారత్, శ్రీలంకల్లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా ఈ టీ20 సిరీస్‌ను షెడ్యూల్ చేశారు.కాగా, భారత క్రికెట్ జట్టు ఐపీఎల్ 2025 తర్వాత ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన నెలన్నర పాటు సాగనుంది. మధ్యలో భారత్ జట్టు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఖాళీగా ఉంటుంది. ఆతర్వాత హోం సీజన్ ప్రారంభమవుతుంది. భారత్‌లో వెస్టిండీస్ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌ల షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ఇటీవలే విడుదల చేసింది.ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్‌అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్‌అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్‌బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్‌నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్‌నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్
బిజినెస్

లాభాలతో ముగిసిన మార్కెట్లు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన నేపథ్యంలో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు బుధవారం సానుకూలంగా ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 592.93 పాయింట్లు లేదా 0.78 శాతం పెరిగి 76,617.44 వద్ద స్థిరపడింది. సూచీ 76,680.35 - 76,064.94 రేంజ్లో ట్రేడ్ అయింది.జొమాటో, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ ఇండియా, టెక్ మహీంద్రా షేర్లు 4.75 శాతం వరకు లాభపడటంతో సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 21 షేర్లు లాభాల్లో ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు 1.36 శాతం వరకు నష్టపోయాయి.సెన్సెక్స్‌కు అద్దంపడుతూ ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 166.65 పాయింట్లు లేదా 0.72 శాతం పెరిగి 23,332.35 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సూచీ 23,350 వద్ద గరిష్టాన్ని, 23,158.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 1.61 శాతం లాభపడటంతో మిడ్ క్యాప్ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.12 శాతం లాభంతో ముగిసింది.ఎన్ఎస్ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు లాభాల్లో ముగియగా, నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ అత్యధికంగా 3.61 శాతం లాభపడింది. ఆ తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 2.51 శాతం వరకు లాభపడ్డాయి.

ఎక్స్పీరియన్ హైదరాబాద్ జీఐసీ.. ఇప్పుడు డబుల్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా, టెక్నాలజీ దిగ్గజం ఎక్స్పీరియన్, హైదరాబాద్‌లోని తమ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ని (జీఐసీ) మరింతగా విస్తరించింది. గతానికన్నా రెట్టింపు ఆఫీస్ స్పేస్‌తో 85,000 చ.అ. విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటైనట్లు సంస్థ సీఈవో (టెక్నాలజీ సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఇన్నోవేషన్) అలెగ్జాండర్ లింట్నర్ తెలిపారు.ప్రపంచ స్థాయి ప్రోడక్టులు రూపొందించేందుకు, నిరంతరాయంగా సర్వీసులు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సెంటర్ ప్రధానంగా ఫిన్‌టెక్, అనలిటిక్స్, మోసాల నివారణ వంటి అంశాలకు సంబంధించిన కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెడుతుంది.హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ జీఐసీ ఎక్స్పీరియన్ ప్రపంచవ్యాప్త సాంకేతిక కార్యకలాపాలకు కీలకమైన నాడీ కేంద్రంగా రూపుదిద్దుకుంది. క్లౌడ్ మైగ్రేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పురోగతి, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, ప్రాసెస్ ఆటోమేషన్‌లో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. భారత్‌లోని బలమైన ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రతిభను ఉపయోగించుకోవడం ద్వారా, ఎక్స్పీరియన్ ప్రపంచవ్యాప్తంగా స్కేలబుల్, డేటా ఆధారిత పరిష్కారాలను అందించే సామర్థ్యాన్ని పెంచుతోంది.

ఏడాదిలో రూ.1.33 లక్షల కోట్ల సమీకరణ
దేశీ కార్పొరేట్లు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం భారీగా నిధులు సమీకరించాయి. ప్రధానంగా దేశీ స్టాక్ మార్కెట్ల దూకుడు ప్రభావంతో 2024–25లో 85 కంపెనీలు రూ.1,33,251 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. అంతక్రితం ఏడాది(2023–24)లో 64 కంపెనీలు క్విప్ ద్వారా అందుకున్న రూ.71,306 కోట్లతో పోలిస్తే ఇవి 87 శాతం వృద్ధికావడం గమనార్హం! ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం ఈక్విటీ మార్కెట్ దన్నుతో కంపెనీలు బ్యాలెన్స్ షీట్‌ను పటిష్టపరచుకోవడంతోపాటు.. విస్తరణకు అవసరమైన నిధులను సమకూర్చుకున్నాయి. వెరసి గతేడాది అటు విలువలోనూ, ఇటు సంఖ్యలోనూ దేశీ కార్పొరేట్లు క్విప్ నిధులలో సరికొత్త రికార్డుకు తెరతీసినట్లు జేఎమ్ ఫైనాన్షియల్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ నేహా అగర్వాల్ పేర్కొన్నారు. క్విక్‌గా..లిస్టెడ్ కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు వేగవంతంగా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు క్విప్ మార్గాన్ని ఎంచుకుంటాయి. ప్రధానంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపుల ద్వారా నిధులు సమీకరించే సంగతి తెలిసిందే. ఇందుకు సెబీ తదితర మార్కెట్ నియంత్రణ సంస్థలకు ముందస్తుగా దరఖాస్తు చేయవలసిన అవసరంలేకపోవడంతో లిస్టెడ్ కంపెనీలు ఆసక్తి చూపుతుంటాయని విశ్లేషకులు వివరించారు. గతేడాది ప్రధానంగా ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్స్, ఆటోమొబైల్స్, యుటిలిటీస్, రియల్ ఎస్టేట్ రంగాల కంపెనీలు అధికంగా క్విప్ చేపట్టాయి. నిధుల సమీకరణకు ఈక్విటీ ప్రధాన వనరుగా మారడంతో లిస్టెడ్ కంపెనీలు క్విప్‌నకు ఆసక్తి చూపినట్లు నిపుణులు తెలియజేశారు. తద్వారా వృద్ధి, విస్తరణ, ఇతర కంపెనీల కొనుగోళ్లు తదితరాలకు నిధులను వెచ్చించనున్నట్లు తెలియజేశారు. జేఎమ్ జోరుక్విప్ నిధుల సమీకరణలో డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంత గ్రూప్, ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అగ్ర స్థానంలో నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరంలో రెండు కంపెనీలు విడిగా రూ.8,500 కోట్లు చొప్పున సమీకరించాయి. ఈ బాటలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ రూ. 8,373 కోట్లు, వరుణ్ బెవరేజెస్ రూ. 7,500 కోట్లు, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ రూ. 6,438 కోట్లు, గోద్రేజ్ ప్రాపరీ్టస్ రూ. 6,000 కోట్లు, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ రూ. 5,000 కోట్లు చొప్పున అందుకున్నాయి. ఇదీ చదవండి: తండ్రి అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలా?పీఎస్యూలుగతేడాది క్విప్ ద్వారా పీఎస్‌యూ బ్యాంకులు పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యుకో, ఐఓబీ, సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ సైతం ఉమ్మడిగా రూ.14,000 కోట్లకు పైగా సమీరించాయి. అంతేకాకుండా జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రీట్, టొరెంట్ పవర్, భారత్ ఫోర్జ్ సైతం క్విప్ మార్గాన్ని ఎంచుకున్నాయి. అత్యధిక క్విప్‌ల నిర్వహణ ద్వారా జేఎమ్ ఫైనాన్షియల్ ప్రధాన పాత్ర పోషించింది. ప్రైమ్ డేటాబేస్ వివరాల ప్రకారం ఫిబ్రవరివరకూ చూస్తే జేఎమ్ 15 ఇష్యూలను నిర్వహించింది. తద్వారా 4.5 బిలియన్ డాలర్లు(రూ. 38,693 కోట్లు) సమీకరణలో సహకారం అందించింది. ప్రస్తుత ఆ ర్థిక సంత్సరం(2025–26)లో క్విప్‌లు, ఐపీవోల ద్వారా రూ. 3 లక్షల కోట్లకుపైగా నిధుల సమీకరణకు వీలున్నట్లు దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అసోసియేషన్(ఏఐబీఐ) అంచనాల వేయడం విశేషం!

దేశంలో లక్షకుపైగా ఎలక్ట్రిక్ ఆటోలు అమ్మిన కంపెనీ
మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (ఎంఎల్ఎంఎంఎల్) ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల (ఈవీ) తయారీదారుగా తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంది. ఎల్ 5 కేటగిరీలో కంపెనీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు రెండు లక్షల కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించినట్లు చెప్పింది. ఈ విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తిని 2024 ఆర్థిక సంవత్సరంలో 16.9 శాతం నుంచి 24.2 శాతానికి పెంచినట్లు పేర్కొంది. సుస్థిర మొబిలిటీ, సృజనాత్మక ఉత్పత్తుల తయారీకి కంపెనీ కట్టుబడి ఉందని చెప్పింది. దేశవ్యాప్తంగా లక్షకుపైగా ట్రియో మోడల్ ఎలక్ట్రిక్ ఆటోలను విక్రయించి ఈ విభాగంలో మొదటిస్థానంలో నిలిచామని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: తండ్రి అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలా?త్రివీలర్ కమర్షియల్ వాహనాలకు సంబంధించి ఎల్ 5 కేటగిరీలో ఎంఎల్ఎంఎంఎల్ ముందంజలో ఉందని కంపెనీ పేర్కొంది. మహీంద్రా ట్రియో, జోర్ గ్రాండ్ వంటి ఉత్పత్తులు ఈ వృద్ధికి కీలకంగా నిలిచాయని తెలిపింది. ట్రియో 1,00,000 యూనిట్లకు పైగా విక్రయించడంతో ఈ వాహనాలకు వినియోగదారుల్లో విశ్వసనీయత నెలకొందని చెప్పింది. ఎల్5 ఎలక్ట్రిక్ వెహికల్ కేటగిరీలో 37.3 శాతం మార్కెట్ వాటాతో ఎంఎల్ఎంఎంఎల్ ఆధిపత్యం వహిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దీన్ని కొనసాగించడానికి, వివిధ వ్యాపార అవసరాలను తీర్చడానికి రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలైన మెటల్ బాడీ ట్రియో, మహీంద్రా జీఈఓ మోడళ్ల విక్రయాలు ఎంతో తోడ్పడుతున్నాయని పేర్కొన్నాయి.
ఫ్యామిలీ

40లలో ఏం తింటామో అది..70లలోని ఆర్యోగ్యాన్ని నిర్ణయిస్తుందా..?
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎలాంటి దీర్ఘవ్యాధుల బారినపడకుండా సాగే చక్కటి వృద్ధాప్య జీవితం కొనసాగించడం ఎలా అనేది శాస్తవేత్తలను వేధిస్తున్న చిక్కు ప్రశ్న. మనం తినే ఆహారం వృద్ధాప్యానికి ఏమైనా లింక్ ఉందా? అనే దిశగా విస్తృతమైన పరిశోధనలు చేశారు. అయితే దానికి తాజాగా చేసిన పరిశోధనల్లో సరైన సమాధానం దొరికిందని వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఆహారం వృద్ధాప్యాన్ని ఎలా డిసైడ్ చేస్తుందో నిర్థారించామని చెప్పారు. కేవలం ఎక్కువ కాలం జీవించడమే లక్ష్యం కాదని మెరుగ్గా జీవించడమనేది అత్యంత ప్రధానమంటూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అవేంటో చూద్దామా..!.నిపుణుల అభిప్రాయం ప్రకారం..సమతుల్య ఆహారం, దీర్ఘాయువు, మెదడు పనితీరుతో సహా మొత్తం ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుందని అన్నారు. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు మంటను తగ్గించడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, శారీరక విధులకు మద్దతు ఇవ్వడానికి సహాపడతాయని చెప్పారు. అందుకోసం 30 ఏళ్ల లోపు వయసున్న దాదాపు ఒక లక్ష మందికి పైగా వ్యక్తుల ఆహారపు అలవాట్లను ట్రాక్ చేశామని చెప్పుకొచ్చారు. వారంతా తీసుకున్న ఆహారం..అది వారి 70 ఏళ్ల వయసులోని ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నిర్థారించామని చెప్పారు. ఆ క్రమంలోనే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం తీసుకోవాల్సిన సరైన ఎనిమిది ఆహార విధానాలను కూడా గుర్తించామని తెలిపారు. దాన్ని ఆరోగ్యకరమైన సూచిక(AHEI)గా వర్గీకరించారు. ఈ విధమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా నొక్కి చెప్పారు శాస్త్రవేత్తలు.ఆ ఆహారాలు ఏంటంటే..పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, చిక్కుళ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు(ఆలివ్ నూనె, చేప కొవ్వు) తదితరాలు మంచివని చెప్పారు. అదే సమయంలోఎరుపు మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాలు(జంక్‌ఫుడ్), శుద్ధిచేసిన ధాన్యాలు, అధిక సోడియం తదితరాలను నివారిస్తే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని అన్నారు. ఈ ఆహారపు అలవాట్లకు కాస్త దగ్గరగా ఉన్నవారు.. 70లలో మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకున్నట్లు వివరించారు. ఇలాంటి కొన్ని ఆరోగ్య సూత్రాలు ఆరోగ్యకరమైన జీవతానికి మద్దుతిస్తాయని చెప్పారు. అందుకోసం వివిధ రకాల రంగురంగుల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అసంతృప్త కొవ్వులు తదితర ఆహారపు అలవాట్లు ప్రాధాన్యత ఇస్తే..70లలో ఏ చీకు చింతా లేకుండా హాయిగా వృద్ధాప్యాన్ని ఆస్వాదించగలుగుతారని అన్నారు పరిశోధకులు.(చదవండి: పొట్ట ఫ్లాట్‌గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత ఆ ఆరు ఆహారాలను నివారించండి!)

35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!
అంబానీ ఫ్యామిలీకి చెందిన 'చోటి బహు' రాధిక మర్చంట్ అందంలోనూ, ష్యాషన్ స్టైల్లోనూ ఎప్పుడూ స్పెషల్‌గా నిలుస్తుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధిక తన ట్రెండీ ఫ్యాషన్ లుక్స్‌తో అభిమానులను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆమె ఫ్యాషన్ సెన్స్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా చందేరీ చీరతో తన డ్రెస్‌ను వినూత్నంగా తీర్చి దిద్దిన వైనం ఆకర్షణీయంగా నిలిచింది. 35 ఏళ్ల వింటేజ్ కార్సెట్‌ను చందేరి చీరతో అందంగా స్టైల్ చేయడం హైలైట్‌గా నిలిచింది.అనంత్ అంబానీతో పెళ్లి సందర్భంగా రాధిక మర్చంట్ తన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు, అత్యంత ఘనంగా జరిగిన వెడ్డింగ్‌లో ఆమె ధరించిన ఒక్కో డ్రెస్ ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. హల్దీ వేడుకలు, మెహిందీ మొదలు సాంప్రదాయ దుస్తుల్లో కొత్త వధువుగా ఆమె లుక్స్ వరకు ప్రతీ వస్త్రాలంకరణలో అందరి హృదయాలను గెలుచు కుంది. తాజాగా రాధిక తనకు ఇష్టమైన స్టైలిస్ట్ రియా కపూర్ స్టైల్ చేసిన వింటేజ్ కార్సెట్నురీ మోడల్ చేసి కార్సెట్-సారీ ట్రెండ్ సృష్టించింది. సల్వార్-కమీజ్‌కు కూడా స్టైల్‌తో కనిపించేలా చందేరీ చీరతో 35 ఏళ్ల కార్సెట్‌ను రీ స్టైల్ చేసి ధరించడం ద్వారా మరోసారి ఫ్యాషన్ ముద్రను చాటుకుంది.ఏప్రిల్ 1న జరిగిన వివియన్నే వెస్ట్ వుడ్ షోకు హాజరైనప్పటి రాధిక ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో సందడి చేశాయి. వివియన్నే వెస్ట్ వుడ్ తయారు చేసిన పోర్ట్రెయిట్ కలెక్షన్ నుండి పురాతన కార్సెట్, స్కార్ఫ్ ధరించి కనిపించింది. ఇందులో ఫ్రెంచ్ కళాకారుడు ఫ్రాంకోయిస్ బౌచర్ రాసిన 'డాఫ్నిస్ అండ్ క్లో' (1743-174) పెయింటింగ్ కూడా ఉండటం విశేషం. వివియన్నే ఒక దుస్తులపై పెయింటింగ్‌ను పునరుత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఈ డ్రెస్ పద్దెనిమిదవ శతాబ్దపు ఆయిల్ పెయింటింగ్ గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది అంటున్నారు ఫ్యాషన్ రంగ నిపుణులు చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!ఈ లుక్కు ముత్యాల చోకర్, మ్యాచింగ్ స్టడ్ చెవిపోగులతో స్టైల్ చేయడం మరో హైలైట్. ఈ గతంలో తన మంగళసూత్రాన్ని స్టైల్ చేసిన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మెడలో ధరించాల్సిన మంగళసూత్రాన్ని బ్రాస్లెట్గా ధరించిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన వివియన్ వెస్ట్‌వుడ్ ష్యాషన్ ఈవెంట్‌కు రాధికా మర్చంట్ అక్క అంజలి మర్చంట్ మరో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. స్టార్-స్టడెడ్ ఈవెంట్లో ఎమరాల్డ్ గ్రీన్ గౌనులో ఆమె అందంగా కనిపించారు. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s)

మహిళలకు డిజిటల్ స్కిల్స్
సాక్షి, సిటీబ్యూరో: గ్రామీణ మహిళల సాధికారత కోసం పనిచేసే నాస్కామ్ ఫౌండేషన్ మహిళలకు డిజిటల్ స్కిల్స్‌లో శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. హెచ్ఎస్బీసీతో కలిసి 4వేల మంది మహిళలకు ఆర్థిక అక్షరాస్యత, వ్యాపార దక్షత, ఇ-గవర్నెన్స్.. తదితర విషయాల్లో అవగాహన కల్పించనున్నామని, రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగుతోందని వివరించింది. ‘డిజిటల్ ఎకానమీలో మహిళల పాత్ర విస్తరణ, మహిళా వ్యాపారుల సామర్థ్యాలను పెంపొందించడం’ పేరిట ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొంది. పాటరీ వర్క్షాప్నగరంలోని ఆర్ట్ లవర్స్ కోసం ప్రత్యేకంగా పాటరీ వర్క్‌షాప్ ప్రారంభించింది మైరా స్టూడియో. బంజారాహిల్స్‌లోని స్టూడియో మైరా వేదికగా నేటి నుంచి ప్రారంభమయ్యే పాటరీ వర్క్‌షాపులో రంగులతో ప్రత్యేక కళాఖండాలను సృష్టించడానికి శిక్షణ అందించనున్నారు. ఈ వర్క్‌షాప్‌కు అవసరమైన మేకింగ్ మెటీరియల్ నిర్వాహకులే అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకూ కొనసాగనున్న ఈ వర్క్‌షాపులో ఐదేళ్లపైబడిన ఆర్ట్ లవర్స్ ఎవరైనా భాగస్వాములు కావచ్చని నిర్వాహకులు తెలిపారు. బుక్ మై షో ద్వారా నమోదు చేసుకోవచ్చని వివరించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉండే ఈ వర్క్‌షాపు వారంలోనూ, వారాంతాల్లోనూ ఉంటుంది.

అగ్గినీ తట్టుకునే ‘అగవె’! దెబ్బకు కార్చిచ్చులు కట్టడి..
అగవె.. చాలా అరుదైన ఎడారి మొక్క. మంటలకు తట్టుకొని నిలబడగలిగే అరుదైన లక్షణం గల ఎడారి పంట ఇది. కలబంద మొక్క మాదిరిగా కనిపించే అగవే చాలా ఎత్తుగా ఎదుగుతుంది. అగవె మట్టల నుంచి నార తీసి, తాళ్లు అల్లే సంప్రదాయం ఉంది. ‘నార కలబంద’ అని పేరుంది. తీవ్ర వేడి పరిస్థితుల్లోనూ మనుగడ సాగిస్తుంది. పశుగ్రాసంగా పనికొస్తుంది. వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి భూమిలో స్థిరీకరించటం ద్వారా భూతాపాన్ని తగ్గిస్తుంది. నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందిస్తుంది. దీని మట్టల పైపొర చాలా దృఢంగా, బూడిద పూసినట్లు ఉండటం వల్ల మంటలను కూడా తట్టుకోగలుగుతుంది. అందువల్ల, అగవే తోటలకు నిప్పు భయం ఉండదు. ఉద్యాన తోటల మధ్యలో అక్కడక్కడా కొన్ని వరుసలు అగవే మొక్కలు నాటుకుంటే నిప్పు భయం నుంచి తోటలను కొంతమేరకైనా కాపాడుకోవచ్చు. 275కు పైగా రకాలుఅగవె సక్యులెంట్ ప్లాంట్. అంటే, గాలి నుంచి తేమను గ్రహించి తన ఆకుల్లో దాచుకోగలిగే ఎడారి మొక్క. ఐదారు అడుగుల ఎత్తుకు పెరిగే అగవె జాతులు కూడా ఉన్నాయి. బహుళ ప్రయోజనకారి అయిన అగవె తోటలు అమెరికా ఖండం అంతటా వ్యాపించి ఉన్నప్పటికినీ.. మెక్సికోలో ఎక్కువ. మన దేశంలోనూ అగవె మొక్కలు మెట్ట ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. 275కు పైగా అగవె పంట రకాలున్నాయి. ఇందులో ఎ. సిసాలన, ఎ. కంటల, ఎ.అమెరికానా వంటి అగవె రకాలు భారత దేశంలో అందుబాటులో ఉన్నాయని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పదేళ్ల క్రితమే ప్రకటించింది. దీని సాగు పద్ధతులను కూడా ప్రామాణీకరించింది. అయినా, ఇప్పటికీ అగవె మనం ఉపయోగించుకోలేక΄ోయిన పంటగానే మిగిలిపోయింది.దైవమిచ్చిన పంట! మెక్సికోలో పురాతన కాలం నుంచే అజ్టెక్ ప్రజలు అగవెను దైవమిచ్చిన పంటగా భక్తితో సాగు చేసుకొని ఉపయోగించుకుంటున్నారని చరిత్ర చెబుతోంది. మాయాహుఎల్ అనే దేవత తమకు ప్రసాదించిన తేనె అగవె మట్టల నుంచి తీసినదేనని వారు నమ్ముతారు. ఇప్పుడు దీన్ని ఒక పారిశ్రామిక పంటగా, ఆదాయ వనరుగా కూడా చూస్తున్నారు. అనేక ఆల్కహాల్ ఉత్పత్తులతో పాటు.. షుగర్, సిరప్ వంటి ఆహారోత్పత్తులు, సహజ నార ఉత్పత్తుల తయారీకి.. పశుగ్రాసంగా కూడా అగవె పంటను ఉపయోగిస్తున్నారు. యాంటీఆక్సిడెంట్లు, సపోనిన్లు వంటి ఆరోగ్యకర ఉత్పత్తులను కూడా ఇటీవల అగవె నుంచి ఇటీవల సంగ్రహిస్తున్నారు. దీంతో ఇది బహుళ ప్రయోజనకారి అయిన పారిశ్రామిక పంటగా మారింది. భూతాపోన్నతి పెచ్చుమీరుతున్న ఈ దశలో ఈ ఎడారి పంట మరింత ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తీవ్ర నీటి ఎద్దడిని తట్టుకునే స్వభావం వల్ల లాండ్‌స్కేపింగ్‌లో కొన్ని రకాల అగవె మొక్కలను కంచెలుగా పెంచుతుండటం నగరాల్లోనూ కనిపిస్తోంది.వంద కోట్ల అగవె ప్రాజెక్టుఅగవె జాతి మొక్కల పెంపకం వల్ల ప్రజలకే కాకుండా పర్యావరణానికీ గొప్ప మేలు జరుగుతుందని నమ్మే ‘రీజెనరేషన్ ఇంటర్నేషనల్’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల అగవె మొక్కలు నాటాలన్న బృహత్ సంకల్పం తీసుకుంది. ద బిలియన్ అగవె ప్రాజెక్ట్‌లో భాగంగా మెక్సికోలోని గ్వానాజువాటో ఎడారి ప్రాంతంలో పర్యావరణంలో అద్భుత మార్పులు తేగల అగవె తోటలు నాటుతున్నారు. అగవె మొక్కలతో పాటు వాటి పక్కనే నత్రజనిని గాలిలో నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరింపజేసే జాతుల చెట్లను నాటడం, పశువులను ఈ తోటల్లో తగుమాత్రంగా మేపుతూ ఉండటం ద్వారా ఆ ఎడారి ప్రాంతాన్ని తిరిగి పచ్చని ప్రాంతంగా మార్చటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో, నిస్సారమైన భూముల్లో అధికంగా పశుగ్రాసాన్ని పెద్ద మొత్తంలో సాగు చేయటం అగవె ద్వారానే సాధ్యమని ఈ సంస్థ తెలిపింది. అగవె మట్టలను గుజ్జులాగా చేసి, కొన్ని రోజులు గాలి తగలకుండా మగ్గబెడితే అద్భుతమైన పశుగ్రాసంగా పనికి వస్తుంది. తీవ్ర కరువు ్ర΄ాంతాల్లో పశువులను ఇది కష్టకాలంలో రక్షిస్తుందని చెబుతున్నారు.సరికొత్త తోటల నమూనా అగవెతో మెట్ట ప్రాంతాల్లో సాగు చేయదగిన సరికొత్త తోటల (ఆగ్రోఫారెస్ట్రీ) నమూనాను రీజనరేషన్ ఇంటర్నేషనల్ రూ΄÷ందించింది. హెక్టారుకు 1600–2500 మొక్కల్ని వత్తుగా నాటాలి. వీటి మధ్యలో వేగంగా పెరిగే, పశువులు తినే ఆకులుండే దీర్ఘకాలిక ద్విదళ జాతి చెట్ల జాతి (గ్లైరిసీడియా (గిరిపుష్పం), తుమ్మ వంటి) మొక్కల్ని 500 వరకు నాటాలి. అగవె మొక్కలు 3 ఏళ్లు పెరిగిన తర్వాత నుంచి 5–7 ఏళ్ల పాటు ఈ చెట్ల మట్టలను (ఆకులను) కోసుకోవచ్చు. గట్టిగా ఉండే ఈ మట్టలను చాప్ కట్టర్ వంటి యంత్రంతో గుజ్జులాగా తరగాలి. ΄్లాస్టిక్ బక్కెట్లు/ డ్రమ్ముల్లో ఈ గుజ్జును నింపి, మూత పెట్టి, 30 రోజులు మాగ బెట్టాలి. దీనితో ΄ాటు.. గ్లైరిసీడియా/ అడవి తుమ్మ /సర్కారు తుమ్మ వంటి ద్విదళ జాతి చెట్ల కాయలు, ఆకులను 20% వరకు కలిపి గుజ్జుగా చేసి కలిపితే ప్రోటీన్లు కూడా సమృద్ధిగా దొరుకుతాయి. ఈ విధంగా సహజ సిద్ధమైన కూడిన పశువుల దాణా అతి తక్కువ ఖర్చుతో తయారవుతుంది. 8–10 ఏళ్ల తర్వాత అగవె చెట్టు పువ్వు పూసి చని΄ోతుంది. ఆ దశలో చెట్టు కాండం నుంచి ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీకి వినియోగించవచ్చు. ఈ అగవె తోటలో పశువులను మేపుకుంటూనే, పశువుల దాణాను కూడా తయారు చేసుకోవచ్చు. ఎడారి ప్రాంత రైతులకు అగవె తోటలు ఆర్థికంగానే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తాయని రీజెనరేషన్ ఇంటర్నేషనల్ స్పష్టం చేస్తోంది. ఇది మన దేశంలోనూ దక్షిణాదిలో మెట్ట ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అగ్రోఫారెస్ట్రీ నమూనాగా చెప్పవచ్చు.ఎకరానికి 30–40 టన్నుల మట్టల దిగుబడిమన దేశంలో ఎ. సిసలన, ఎ. కంటల, ఎ. అమెరికానా రకాల అగవె మొక్కలు ఉన్నాయి. నీరు నిల్వ ఉండని, ఎర్ర గరప నేలల్లో బాగా పెరుగుతుందని అగవె పంటపై పరిశోధన చేసిన తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకు ముక్కలను లేదా పిలకలను నాటుకోవాలి. ఆకు ముక్కల్ని నర్సరీలో 9–12 అంగుళాల వరకు పెంచి, 2“2 మీటర్ల దూరంలో, వర్షాకాలంలో నాటుకోవాలి. మూడేళ్ల తర్వాత నుంచి ఆకుల దిగుబడి వస్తుంది. మీటరు కన్నా ఎక్కువ ΄÷డవు పెరిగిన ఆకులను కత్తిరించాలి. ప్రతి మొక్కా ఏడాదికి 40–50 ఆకుల దిగుబడిని 8 ఏళ్ల వరకు ఇస్తుంది. ఈ మట్టల్లో నార/పీచు రకాన్ని బట్టి 2.5–4.5% వరకు ఉంటుంది. అగవె సిసలన రకంలో 4.5% నాణ్యమైన నార ఉంటుంది. మూడేళ్లు గడచిన తర్వాత ఎకరానికి 30–40 టన్నుల మట్టల దిగుబడి వస్తుంది. పదేళ్ల నాటి అంచనాల ప్రకారం.. ఎకరానికి రూ. 2 వేల నికారాదాయం వస్తుంది. పొలాల చుట్టూ కంచె పంటగా అగవెను నాటుకున్నా.. ఇందులో 25% నికరాదాయం వస్తుంది. యంత్రంతో నార తీసి, నీటితో శుద్ధిచేసి, ఎండబెట్టి బేళ్లుగా కట్టి అమ్మాలి. ఎండగా ఉన్న రోజే నార తియ్యాలి. మట్టలను కోసిన రెండు రోజుల్లోగా తీస్తేనే నాణ్యమైన నార వస్తుంది. పాల తెలుపు నుంచి బంగారు పసుపు రంగుల్లో ఈ నార ఉంటుందని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పేర్కొంది. అగవెను పశు దాణా ఉత్పత్తి గురించి మెక్సికో రైతులు ఎక్కువగా చెబుతుంటే.. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం మాత్రం నార కోసం అని మాత్రమే చెబుతోంది. అందుకే దీనికి నార కలబంద అని పేరొచ్చినట్టుంది. ఏదేమైనా బంజర్లు, ఎడారి ్ర΄ాంతాల్లో అగవెతో కూడిన కొత్త రకం ఆగ్రోఫారెస్ట్రీ తోటల సాగుపై ప్రభుత్వ రంగ పరిశోధకులు దృష్టి సారిస్తే వర్షాధార ప్రాంత రైతులకు, పర్యావరణానికీ మేలు కలుగుతుంది. ‘అగవె’నే ఎందుకు?భూతాపం పెచ్చు మీరిన తర్వాత అడవుల్లో కార్చిచ్చులు మరీ ఎక్కువైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. వేలాది ఎకరాల్లో అడవులు దగ్థమైపోతున్నాయి. అంతర్జాతీయంగా కార్చిచ్చుల నుంచి పచ్చని చెట్లను, తోటలను రక్షించుకోవటానికి మధ్యలో అక్కడక్కడా అగవే మొక్కలు నాటుకోవటం ఒక వినూత్న పరిష్కార మార్గంగా ముందుకు వస్తోంది.అగవె మట్టలు(ఆకులు) మందంగా, బూడిద పూసినట్లు ఉండి, వేడిని తట్టుకునేలా ఉంటాయి. సులువుగా నిప్పంటుకోవటానికి అవకాశం ఉండదు. అగవె మొక్క తన ఆకుల్లో చాలా నీటిని నిల్వ చేసుకుంటుంది. అందువల్ల వాటికి అంత సులువుగా నిప్పంటుకోదు. ఈ కారణంగా మంటలను అవతలి ప్రాంతానికి వ్యాపింపజేయకుండా అడ్డుకునే తత్వం అగవె మొక్కలకు వచ్చింది. అగవె చెట్టు వేర్లు ఎంత విస్తారంగా భూమిలోకి విస్తరించి ఉంటాయంటే.. ఇతరత్రా చెట్లన్నీ అగ్నికి ఆహుతైపోయినా ఇవి మాత్రం నిలబడే ఉంటాయి. ఒక మొక్కకు టన్ను పశువుల దాణా!అగవె మొక్కలు గాలికి, ఎండకు, వానకు పెరుగుతాయి. నిర్వహణ అతి సులభం. బాగా పెరుగుతుంది. ఒక్కో చెట్టు 8–10 ఏళ్లు బతుకుతుంది. ఈ కాలంలో ఒక టన్ను బరువైన మట్టలను అందిస్తుంది. ఈ చెట్లను ఇతర ద్విదళ చెట్లతో కలిపి పెంచితే ఎడారి ప్రాంతం కూడా ఆకుపచ్చగా మారుతుంది. భూమి సారవంతమవుతుంది. వాన నీరు అక్కడికక్కడే భూమిలోకి బాగా ఇంకుతుంది. వాతావరణంలోని కార్బన్ డయాక్సయిడ్ను భారీగా గ్రహించి భూమిలో స్థిరీకరించడానికి అగవె తోటలు దోహదపడతాయి. ఈ ప్రయోజనాల రీత్యా ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల అగవె మొక్కలు నాటాలని ద బిలియన్ అగవె ఉద్యమాన్ని రీజనరేటివ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రారంభించింది. విరాళాలు, ప్రభుత్వ, ప్రజల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఈ సంస్థ తలపెట్టింది. పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్(చదవండి: beat the heat ఇండోర్ ప్లాంట్స్‌తో ఎండకు చెక్)
ఫొటోలు


Sharwanand : కుటుంబంతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శర్వానంద్ పూజలు (ఫోటోలు)


ఆ హెలికాప్టర్ షాట్‌కు 14 ఏళ్లు.. సిక్స్ కొట్టి ప్రపంచకప్ గెలిపించిన ధోని..! (ఫొటోలు)


ప్రముఖ కమెడియన్ రెడిన్ కింగ్స్లే భార్యకు సీమంతం (ఫొటోలు)


జాన్వీకే తలనొప్పిగా మారిన తమన్నా, ఎవరీమె (ఫోటోలు)


గ్రాండ్‌గా దిల్ రాజు కూతురు హన్సిత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)


తిరుమలలో ఆకాశ్ అంబానీ.. గోమాతకు విశేష పూజలు (ఫొటోలు)


బాంధవి శ్రీధర్ వాటే గ్లామర్... మతిపోగొడుతోన్న మసూద బ్యూటీ (ఫోటోలు)


'శారీ' మూవీ ప్రీరిజ్లో మెరిసిన నటి ఆరాధ్య దేవి (ఫొటోలు)


వయ్యారాల నడకలతో కనువిందు చేసిన బ్యూటిఫుల్ ఉమెన్స్ (ఫొటోలు)


#IPL2025 : ముంబై మ్యాచ్‌లో ఆమె ఎవరు.. పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్? (ఫోటోలు వైరల్)
అంతర్జాతీయం

మీకు దండం పెడతా ఆ ఫొటోలు ఆపండ్రా బాబు
మార్కెట్లోకి ఏ కొత్త ప్రాడక్ట్ వచ్చినా జనం ఊరుకోరు.. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వచ్చే అప్డేట్స్.. మార్పులు.. కొత్తకొత్త ఆవిష్కరణలు వంటివి జనాన్ని మరింతగా ఆకట్టుకుంటాయి. ఎంతలా అంటే కొత్త ఆవిష్కరణ తీసుకొచ్చిన కంపెనీకి సైతం నిద్రపట్టని స్థాయిలో మనోళ్లు వాడకం ఉంటుంది. ఐ ఫోన్ కొత్త మోడల్ వచ్చిందంటే చాలు తిండి నిద్రమానేసి దానికోసం లైన్లో నిలబడి చివరకు దాన్ని దక్కించుకునేవరకూ ఊపిరిసలపని వాళ్ళు కొందరు. దానికోసం ఏకంగా కిడ్నీలు అమ్ముకునేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఫోన్ కొనకపోతే ఉరేసుకుంటాను అని తల్లిదండ్రులను బెదిరించిన కేసులూ ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా చాట్‌జీపీటీలో వచ్చిన కొత్త ఆవిష్కరణ జిబ్లీ స్టూడియో ఫోటోలు.. అంటే మనం ఏదైనా ఫోటోను దానిలోకి అప్లోడ్ చేస్తే అది కార్టూన్ మాదిరి మార్చేసి మనకు తిరిగి ఇస్తుందన్నమాట. అంటే ఒక చిత్రకారుడు పెన్సిల్.. కుంచెతో వేసినట్లు ఆ ఫోటోలు ఉంటాయి.ఈ కొత్త ఫీచర్ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం ఐంది. ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఫోటోలు అప్లోడ్ చేసేసి వాటిని జిబ్లీ స్టూడియో ఫొటోలుగా మార్చేసుకుని ఫేసుబుక్ ట్విట్టర్.. ఇన్‌స్టాలో పోస్టు చేసుకుంటున్నారు. మనిషికి తనని తాను చూసుకోవడం ప్రతిసారీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందేమో..అద్దంలో ఒకసారి ఫోటోలో ఒకసారి.. బొమ్మ గీయించుకొని ఒకసారి..చూసుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు కొత్తగా కార్టూన్ లో ఎలా ఉంటానో అనే కుతూహలంతో.. చాట్‌జీపీటీలో అందరూ స్టూడియో గిబ్లీ ఆర్ట్ స్టైల్ లో తమ ఫొటోలు మారుస్తూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ ఫోటోల పిచ్చి ఏకంగా ఆ చాట్‌జిపిటి సంస్థను సైతం కుదిపేసింది.మనం అప్లోడ్ చేసిన మన మామూలు ఫోటోలను ఏకంగా జపానీస్ యానిమేషన్ స్టూడియో డైరెక్టర్లు హయావో మిజజాకి, ఇసావో టకహట రూపొందించిన పాపులర్ సినిమాలు స్పిరిటెడ్ అవే , ప్రిన్సెస్ మోనోనొకే వంటి సినిమా క్యారెక్టర్లను పోలి ఉండేలా మార్చేసి మనకు అందిస్తోంది. . ఈ కార్టూన్ చిత్రాలు మంచి జనాదరణ పొందడంతో కోట్లకొద్దీ ఫోటోలు చాట్‌జీపీటీలోకి వచ్చి పడుతున్నాయి. దీంతో అక్కడి సిబ్బందికి తిండి నిద్ర కూడా లేదంట. దీంతో ఈ ట్రేండింగ్ ను చూసి విసుగెత్తిపోయిన చాట్ జిపిటి వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్మాన్ బాబూ కాస్త గ్యాప్ ఇవ్వండి.. మా సిబ్బంది కూడా కాస్త నిద్రపోవాలి కదా అని ట్విట్టర్లో పోస్ట్ చేసారు. అంటే కొత్త ట్రెండ్ మొదలైతే జనం ఎంతలా వేలం వెర్రిలా ఉంటారన్నదానికి ఇదో ఉదాహరణ అన్నమాట.- సిమ్మాదిరప్పన్న

హుర్రే.. అరవైలో కూడా ఇరవైలా మారిపోవచ్చా?
నిత్య యవ్వనం కోసం మందులు మాకులు మింగే వారి దగ్గరి నుంచి.. రకరకాల ప్రయోగాలతో ఒళ్లు హూనం చేసుకుంటున్నవాళ్ల గురించి కూడా ఈ మధ్య మనం కాలంగా వింటున్నాం. కానీ.. వయసుతో వచ్చే ఆరోగ్య సమస్యలను, మరణాన్ని మాత్రం ఇప్పటివరకూ జయించలేకపోతున్నాడు. అయితే సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. శాస్త్రవేత్తలు మానవ శరీరం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటున్న కొద్దీ జబ్బులను ఎంతో కొంత నయం చేయగలిగాడు. తాజాగా ఒట్టావా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం.. వారం రోజుల పాటు మంచుముక్కల్లో మునిగి తేలితే.. వృద్ధాప్యంతోపాటు వచ్చే సమస్యలను ఆలస్యం చేయవచ్చని తేలింది. చల్లటి నీళ్లలో స్నానం చేస్తేనే వణికిపోతూంటాం మనం. జలుబు చేస్తుందేమో అని భయపడుతూంటాం. అలాంటిది వారం రోజులపాటు మంచుముక్కల్లో మునిగితేలితే ఇంకేమైనా ఉందా? అని అనుకుంటున్నారా? అక్కడే కిటుకు ఉందంటున్నారు ఒట్టావా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. నిజానికి మనం ఒకసారి చన్నీళ్లలో మునిగితే శరీరం అలర్ట్ అయిపోతుంది. ఉష్ణోగ్రత సరిగ్గా ఉండేలా చేసేందుకు ఇన్ఫ్లమేషన్ను సృష్టిస్తుంది. జలుబు లేదా ఒంటినొప్పులు వస్తాయన్నమాట. అయితే వీటిని విస్మరించి.. ఒక వారం రోజులపాటు మంచుముక్కల్లో మునుగుతూంటే మాత్రం శరీరం ఆ పరిస్థితికి అలవాటు పడిపోతుందని.. ఆటోఫేజీని మొదలుపెడుతుందని తాజా పరిశోధన ద్వారా తెలిసింది.ఆటోఫేజీనా అంటే ఏంటో తెలుసా?సింపుల్‌గా చెప్పాలంటే శరీరం తనను తాను శుభ్రం చేసుకునే ప్రక్రియ ఆటోఫేజీనా(Autophagy). కాస్త డెప్త్‌గా వెళ్తే.. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకూ మన శరీరంలోని కణాలు విడిపోతూనే ఉంటాయి. అయితే తినే ఆహారమనండి.. ఉండే వాతావరణం అనండి.. లేదా జన్యుపరమైన కారణాలైనా కానివ్వండి.. శరీర కణాల్లో కొన్ని పనికి రాకుండా పోతాయి. పాడైపోయిన ప్రొటీన్లు, కణ భాగాలు.. బయటి నుంచి వచ్చిన బ్యాక్టీరియా, వైరస్ల భాగాలు వయసుతోపాటు పేరుకుపోతూంటాయి. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సమస్యలకు కారణమవుతూంటాయి కూడా. వీటన్నింటినీ సరి చేసుకునేందుకు శరీరం ఉపయోగించే ప్రక్రియే ఆటోఫేజీ. .. శరీరం చెడిపోయిన, ముక్కలైపోయిన భాగాలను గుర్తించి వాటిని చిన్న బుడగల్లాంటి వాటిల్లో ప్యాక్ చేసి.. పనికొచ్చే వాటిని వాడుకుంటుంది. వ్యర్థాలను బయటకు తోసేస్తుంది. దీనివల్ల కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. జబ్బు పడితే తొందరగా కోలుకోవచ్చు కూడా. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ ప్రక్రియను చేపడుతుంది శరీరం. చల్లటినీళ్లలో మునగడం వాటిల్లో ఒకటని ఒట్టావా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతూంటే.. వ్యాయామం, తగినన్ని పోషకాలు అందించడం... పదిహేడు గంటలకుపై నిరాహారంగా ఉండటం వల్ల కూడా ఈ ఆటోఫేజీ ప్రక్రియ మొదలవుతుందని ఇటీవలికాలంలో వినిపిస్తున్న మాట. పరిశోధనలు ఇలా.. ఒట్టావా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం... ఆరోగ్యంగా ఉన్న పది మంది మగాళ్లను ఎంచుకున్నారు. వీరి వయసు అటు ఇటుగా 23 ఏళ్లు. ఏడు రోజులపాటు వీరిని పద్నాలుగు డిగ్రీ సెల్సియస్ చల్లటి నీళ్లలో రోజుకు గంట సేపు ఉంచారు. వీరి రక్తాన్ని సేకరించి ప్రొటీన్లను పరిశీలించారు. చల్లటి నీళ్లల్లో మునగడం కణాలపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకునేందుకు అన్నమాట. ఇన్ఫ్లమేషన్ అంటే మంట/వాపు ఏమైనా ఉందా? ఆటోఫేజీ మొదలైందా? ఉష్ణోగ్రత తగ్గడం వల్ల ఏర్పడ్డ షాక్ మాట ఏమిటి? అన్నవి పరిశీలించారు. అకస్మాత్తుగా చల్లటి నీళ్లలోకి మునిగినప్పుడు శరీరం ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా ప్రొటీన్ల ఆకారంలో మార్పులు వస్తాయి. శరీర క్రియలన్నింటికీ కీలకమైన ప్రొటీన్లలో తేడా రాగానే శరీరం అలర్ట్ అవుతుంది. ప్రమాదాన్ని తప్పించేందుకు ప్రత్యేకమైన ప్రొటీన్లు కొన్నింటిని విడుదల చేస్తుంది. ఇవి చలికి ఉండచుట్టుకుపోయిన ప్రొటీన్లు మళ్లీ సాధారణ స్థితికి చేరేలా చేస్తాయి. బాగా పాడైన ప్రొటీన్లను ఆటోఫేజీకి గురి చేస్తాయి!చల్లటి నీళ్లల్లో ఒక్కసారి మునిగితే శరీరంలో అద్భుతాలు జరిగాయని ఒట్టావా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. పాడైపోయిన ప్రొటీన్లను పట్టుకుని క్లీన్ చేసే పీ62 అనే ప్రొటీన్ ఉత్పత్తి బాగా పెరిగిందని, ఆ తరువాత ఆటోఫేజీ ప్రక్రియలో రెండూ ముక్కలు ముక్కలపోయి శరీరంలో పేరుకుపోయిన కణాల చెత్త తగ్గిందని శాస్త్రవేత్తలు గుర్తించారు! ముఖ్య గమనిక: ఇలాంటివి స్వంతంగా మీరు ప్రయత్నించొద్దు. ఈ విషయమై మీ డాక్టర్‌తో మాట్లాడటం మాత్రం మరచిపోవద్దు!

Switzerland: సొరంగాల స్వర్గం.. ప్రభుత్వ కృషి అమోఘం
మనం ఏదైనా రైలులో లేదా బస్సులో ప్రయాణించినప్పుడు ఆ దారిలో మనకు సొరంగాలు ఎదురైనప్పుడు అద్భుతమైన అనుభూతికి లోనవుతుంటాం. అలాంటి సందర్భాల్లో మళ్లీమళ్లీ అలాంటి సొరంగాల గుండా వెళ్లాలని అనిపిస్తుంటుంది. ఇక చిన్నపిల్లలైతే సొరంగమార్గం(Tunnel) గుండా వెళ్లినప్పుడు ఒక్కసారిగా చీకటి ప్రదేశంలోకి వెళ్లడం, తరువాత వెలుతురులోకి రావడాన్ని చూసినప్పుడు కేరింతలు కొడుతూ, భలేగా ఎంజాయ్ చేస్తుంటారు. మరి ఇలాంటి అనేక సొరంగ మార్గాలు కలిగిన దేశమేదో తెలుసా?స్విట్జర్లాండ్(Switzerland) విస్తృతమైన సొరంగమార్గాలకు ప్రసిద్ది చెందింది. దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించడంలో ఈ సొరంగాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇవి అటు రైలు మార్గంలోనూ ఇటు, రోడ్డు మార్గంలోనూ కనిపిస్తాయి. ఈ సొరంగ మార్గాల నిర్మాణానికి స్విట్జర్లాండ్ ప్రభుతం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. అటు రైలు, ఇటు రోడ్డు మార్గాల్లో విరివిగా సొరంగాలను నిర్మిస్తూ ప్రయాణాలను వేగవంతం చేస్తోంది. ఈ సొరంగమార్గాలు దేశ ప్రజలనే కాకుండా పర్యాటకులను కూడా అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటువంటి సొరంగమార్గాల్లో పలు విశేషాలు కలిగినవాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పొడవైన రైలు సొరంగం: గోథార్డ్ బేస్ టన్నెల్ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్.. గోథార్డ్ బేస్ టన్నెల్(Gotthard Base Tunnel). దీని నిర్మాణానికి 20 ఏళ్లు పట్టింది. భూమి ఉపరితలానికి ఎనిమిదివేల అడుగుల లోతున ఈ రైలు సొరంగాన్ని నిర్మించారు. నీట్ గోథార్డ్ బేస్ టన్నెల్ అని దీనిని పిలుస్తున్నారు. 57 కిలో మీటర్ల పొడవైన ఈ రైల్వే టన్నెల్ ప్రపంచంలోనే అతి పొడవైన రైలు సొరంగంగా గుర్తింపు పొందింది. జురిచ్ నుంచి మిలాన్ నగరాన్ని కలిపేందుకు ఈ రైలు మార్గం ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రైలు గంటకు 240 కిలో మీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ రైల్వే టన్నెల్ నిర్మాణానికి స్విస్ ప్రభుత్వం రూ. 65 వేల కోట్లు ఖర్చు చేసింది.పొడవైన రోడ్డు సొరంగం: గోథార్డ్ రోడ్డు టన్నెల్స్విట్జర్లాండ్లోని గోథార్డ్ రోడ్డు టన్నెల్ దేశంలోని గోస్చెనెన్ దగ్గర మొదలైన దక్షిణాన టిసినోలోని ఐరోలో వరకు కొనసాగుతుంది. ఇది ఆల్ప్స్ ప్రధాన మార్గమైన సెయింట్ గోథార్డ్ పాస్(Saint Gotthard Pass) వద్ద 16.9 కిలోమీటర్లు (10.5 మైళ్ళు) పొడవున నిర్మితమయ్యింది. 1980 నాటికి ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డు సొరంగంగా ఇది పేరొందింది. బాసెల్ నుంచి చియాస్సో వరకు వెళుతుంది. దీనిలో రెండు లేన్లు ఉన్నాయి. దీనిలో ఒక మార్గాన్ని ద్విచక్రవాహనాల కోసం కేటాయించారు. ఈ సొరంగం గరిష్టంగా 1,175 మీటర్లు (3,855 అడుగులు) ఎత్తు కలిగివుంది. ఉత్తర పోర్టల్ నుండి ఈ మార్గం 10.3 కిలోమీటర్లు (6.4 మైళ్ళు) పొడవు కలిగివుంది.మరో రైల్ సొరంగం: లోట్స్చ్‌బర్గ్ బేస్ టన్నెల్లోట్స్చ్బర్గ్ బేస్ టన్నెల్ (ఎల్బీటీ) లోట్స్చ్‌బర్గ్ లైన్‌లోని 34.57 కిమీ (21.48 మైళ్ళు) రైల్వే బేస్ టన్నెల్. ఇది స్విట్జర్లాండ్‌లోని బెర్నీస్ ఆల్ప్స్ గుండా పాత లోట్స్చ్‌బర్గ్ టన్నెల్ వరకూ సాగుతుంది . ఇది ఫ్రూటిజెన్ , బెర్న్, రారాన్ , వాలాయిస్ మధ్య నడుస్తుంది. ఆల్ప్స్ పర్వతాల గుండా ఈ లోట్ష్బర్గ్ బేస్ టన్నెల్‌ను నిర్మించారు. ఎల్బీటీ నిర్మాణం 1999లో ప్రారంభమై, 2007లో పూర్తయింది. మొదటి రైలు కార్యకలాపాలు 2007 డిసెంబర్లో ప్రారంభమయ్యాయి. అయితే 2020లో ఈ మార్గంలోకి నీరు, ఇసుక ప్రవేశించడంతో తాత్కాలికంగా ఈ సొరంగాన్ని మూసివేశారు. అనంతరం సొరంగం లోపల అవసరమైన మరమ్మతులు చేశారు. 2020 చివరిలో రవాణా కోసం ఈ సొరంగాన్ని తిరిగి సిద్ధం చేశారు. దీంతో అదే ఏడాది ఏప్రిల్ 27న ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.ఇది కూడా చదవండి: మరుభూమిగా మయన్మార్.. దారుణమైన పరిస్థితులు

Ghibli ఫొటోలు ట్రై చేస్తున్నారా?.. ఇది మీకోసమే!
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్.. ఇలా ఏ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జిబ్లీ(Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ఇలా అంతా కార్టూన్ తరహా ఫొటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫొటోలు అప్లోడ్ చేస్తుండడంతో.. నెట్టింట ఈ నయా ట్రెండ్ ఊపేస్తోంది. అయితే అలా అప్లోడ్ చేసే ముందు ఇది ఎంతవరకు సురక్షితం అనే ఆలోచన మీలో ఎంతమంది చేస్తున్నారు?.. ఏఐ బేస్డ్ చాట్‌బాట్ యూజర్లను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే.. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో (ChatGPT) జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. తమకు కావాల్సిన ఫొటోను ఎంచుకుని.. ఫలానా స్టైల్లో కావాలని కోరితే చాలూ.. ఆకర్షనీయమైన యానిమేషన్ తరహా ఫొటోలను సృష్టించుకోవచ్చు. ఈ ట్రెండ్ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్‌ఫామ్‌లు సైతం ఇవే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఆ వాడకం పరిధి దాటి శ్రుతిమించి పోతోంది. ఎంతవరకు సురక్షితం?ఏదైనా మనం ఉపయోగించినదాన్ని బట్టే ఉంటుంది. అది సాంకేతిక విషయంలో అయినా సరేనని నిఫుణులు తరచూ చెబుతుంటారు. అలాగే జిబ్లీ స్టైల్ ఏఐ ఇమేజ్ జనరేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సృజనాత్మకత మరీ ఎక్కువైపోయినా.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరోవైపు వ్యక్తిగతమైన ఫొటోలను ఏఐ వ్యవస్థల్లోకి అడ్డగోలుగా అప్లోడ్ చేస్తే.. అవి ఫేషియల్ డాటాను సేకరించే ప్రమాదమూ లేకపోలేదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొన్ని కంపెనీలు వ్యక్తిగత డాటాను తమ అల్గారిథమ్‌లలో ఉపయోగించుకుంటున్న పరిస్థితులను నిపుణులు ఉదాహరిస్తున్నారు.అలాంటప్పుడు ఏం చేయాలంటే..వ్యక్తిగత ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు.. ఆ జనరేటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రైవసీ పాలసీల విషయంలో నమ్మదగిందేనా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోండి. అందుకోసం సదరు జనరేటర్ గురించి నెట్లో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికి యూజర్లు ఇచ్చే రివ్యూలను చదవాలి. అన్నికంటే ముఖ్యమైన విషయం.. సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం. చిన్నపిల్లల ఫొటోలను ప్రయత్నించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమంగా ప్రముఖుల ఫొటోలను ప్రయత్నించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇది చట్టపరమైన చర్యలకు అవకాశం కూడా ఇచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతానికి.. ఛాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, ఎక్స్ గ్రోక్, డీప్‌ఏఐ, ప్లేగ్రౌండ్‌ఏఐలు.. పరిమితిలో ఉచితంగా,అలాగే పెయిడ్ వెర్షన్లలోనూ రకరకాల ఎఫెక్ట్‌లతో ఈ తరహా ఎఫెక్ట్‌లను యూజర్లకు అందిస్తున్నాయి. వీటితో పాటు జిబ్లీ ఏఐ కూడా స్టూడియో జిబ్లీస్టైల్ ఆర్ట్ వర్క్‌తో ఫొటోలను చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. నోట్: పర్సనల్ డాటా తస్కరణ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్న రోజుల్లో ఏ టెక్నాలజీని అయినా.. అదీ సరదా కోణంలో అయినా ఆచితూచి.. అందునా పరిమితంగా వాడుకోవడం మంచిదనేది సైబర్ నిపుణుల సూచన.
జాతీయం

ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. అసలు ట్విస్ట్ ఇచ్చిన రెండో అత్త
లక్నో: నాడు తన భార్య ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించిన భర్త వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న రాధికకు రెండో భర్త వికాస్ తల్లి షాకిచ్చింది. రాధికను తిరిగి అతడి మొదటి భర్త బబ్లూకే అప్పగించింది. ఈ క్రమంలో ఆమె అత్త.. కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో, ప్రేమకథ అనూహ్య మలుపు తిరిగింది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా కటార్‌జాట్ గ్రామంలో తన భార్య రాధికకు ఆమె ప్రియుడు వికాస్‌తో ఇటీవలే భర్త బబ్లూ పెళ్లి చేయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఏదైనా ప్రాణహాని తలపెడుతుందనే భయంతో బబ్లూ తన భార్యను ఆమె ప్రియుడికే కట్టబెట్టాడు. అయితే రాధికకు రెండో భర్త వికాస్ తల్లి షాకిచ్చింది. రాధికను తిరిగి అతడి మొదటి భర్త బబ్లూకే అప్పగించింది.ఈ సందర్భంగా రాధిక అత్త మాట్లాడుతూ..‘రాధిక భర్త, అతడి పిల్లల మానసిక క్షోభ గురించి ఆలోచించి, నేను చలించిపోయాను. అందుకే మొదటి భర్త బబ్లూ దగ్గరికి వెళ్లిపొమ్మని రాధికకు తేల్చి చెప్పాను’ అని వికాస్ తల్లి వెల్లడించింది. ఈ విషయంపై కటార్‌జాట్ గ్రామంలో మళ్లీ పంచాయతీ జరిగింది. బబ్లూ తన భార్య రాధికను చూసుకుంటాడని గ్రామ పెద్దల సమక్షంలో ప్రకటించాడు. వారి ఎదుట ప్రమాణం చేసిన తర్వాత రాధికను బబ్లూ తిరిగి స్వీకరించాడు. భవిష్యత్తులో రాధికకు ఏదైనా ప్రమాదం జరిగితే, దానికి తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వికాస్ తల్లి గొప్ప మనసు గురించి అంతటా చర్చ జరుగుతోంది.

చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్
కేదార్నాథ్: హిందువులు అత్యంత పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా భావించేవాటిలో కేదార్నాథ్(Kedarnath) ఒకటి. ప్రతీయేటా లక్షలాదిమంది భక్తులు కేదార్‌నాథ్‌ను సందర్శిస్తుంటారు. అయితే గత కొంతకాలంగా ఇక్కడికి వచ్చే యూట్యూబర్లు ఆలయ పరిసరాల్లో వీడియోలు, రీల్స్ తీస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆలయ కమిటీ ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది(2025)లో చార్ధామ్ యాత్ర(Chardham Yatra) ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. తొలుత యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరవనున్నారు. మే 2న కేదార్నాథ్, మే 4న బద్రీనాథ్ ఆలయాల ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇటువంటి తరుణంలో కేదార్నాథ్ ఆలయ సముదాయంలో రీల్స్ చేయడాన్ని నిషేధిస్తూ చార్ధామ్ మహా పంచాయతీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామ్‌లలో అత్యధికంగా రీల్స్, వీడియోలు కేదార్నాథ్ ధామ్(Kedarnath Dham)లోనే రూపొందిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన పలువురు యూట్యూబర్లు విరివిగా వీడియోలు , రీల్స్ చేసి వాటిని వైరల్ చేస్తున్నారు. వీటి ప్రభావం తీర్థయాత్రపై పడుతోందని ఆలయ అధికారులు గుర్తించారు. భక్తి విశ్వాసాలతో మెలిగేవారు ఇటువంటి రీల్స్ చూసి ఆందోళన చెందుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఇక్కడ రీల్స్ చేయడాన్ని పూర్తిగా నిషేధించారు.ధామ్ పవిత్రతను కాపాడటానికి ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని ఆలయ అధికారులు తెలిపారు. కేదార్నాథ్ తీర్థ పురోహిత సమాజ్ కూడా ఇక్కడ రీల్స్ చేయడాన్ని వ్యతిరేకించింది. ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోవాలని కోరింది. ఈ నేపధ్యంలో ఆలయ ప్రాంగణంలో రీల్స్, వీడియోలు తీయడాన్ని నిషేధించాలని చార్ ధామ్ మహా పంచాయతీ సమావేశంలో నిర్ణయించారు. దీనితో పాటు ఆలయంలో వీఐపీ దర్శనాలను కూడా నిషేధించారు. ఎవరైనా ఆలయ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ఇది కూడా చదవండి: Switzerland: సొరంగాల స్వర్గం.. ప్రభుత్వ కృషి అమోఘం

హెచ్‌సీయూ భూముల అంశంలో జోక్యం చేసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్‌సీయూ) చెందిన 400 ఎకరాల భూమి విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభు త్వానికి బీజేపీ కేంద్రమంత్రులు, ఎంపీలు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిలో 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులు ఉన్నా యని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఈ మేరకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గొడెం నగేశ్‌ల బృందం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి వినతి పత్రం అందజేసింది. ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన అనంతరం బీజేపీ ఎంపీలు తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు.కాంగ్రెస్ అధిష్టానానికి కప్పం కట్టేందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూములను అమ్ముతోందని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. హెచ్‌సీయూ భూముల విషయంలో ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. భూముల అమ్మకం విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుగానే కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. ట్రిపుల్ఆర్ రాజ్యాంగం అమలవుతోంది: లక్ష్మణ్తెలంగాణలో రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి రాజ్యాంగమే అమలవుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దుయ్యబట్టారు. మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్ లేవనెత్తారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు తీర్చలేకే ప్రభుత్వం భూములను అమ్ముతోందన్నారు. లోక్‌సభలో ధర్మపురి అర్వింద్ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. భూమి వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేసేందుకు చొరవ చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుకుంటాం: భూపేంద్ర యాదవ్ హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి భూములపై నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలకు హామీ ఇచ్చారు. మంగళవారం తెలంగాణ బీజేపీ ఎంపీలు భూపేంద్ర యాదవ్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని ఆ భూములను పరిరక్షించాలని కోరారు.

చిలీ అధ్యక్షునితో మోదీ భేటీ
న్యూఢిల్లీ: సమగ్ర ఆర్థిక వాణిజ్య భాగస్వామ్య ఒప్పందంపై భారత్, చిలీ చర్చలు ప్రారంభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ ఫాంట్ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, ఖనిజాలు, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో కలిసి పని చేయాలని, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. లాటిన్ అమెరికాలో చిలీ తమకు అత్యంత కీలక భాగస్వా మ్య దేశమని మోదీ పేర్కొన్నారు. చిలీతో దశాబ్దా లుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకుంటామని వెల్లడించారు. బోరిక్ ఫాంట్‌తో భేటీ అనంతరం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. భౌగోళికంగా దూరంగా ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య ఎన్నో సారూప్యతలున్నాయని గుర్తుచేశారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, అంతరిక్షం వంటి రంగాల్లో తమ అనుభవాన్ని చిలీలో పంచుకోడానికి సిద్ధంగా ఉన్నామని మోదీ వెల్లడించారు. ఐరాస భద్రతా మండలితోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల విషయంలో ఇండియా, చిలీ ఏకాభిప్రాయంతో ఉన్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వీసా జారీ ప్రక్రియను సులభతరంగా మార్చుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఎన్ఆర్ఐ

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సు నిర్వహించింది. గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో ఫౌండేషన్, హోఫ్ ఫర్ లైఫ్ సంస్థలతో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆడపిల్లలు సమాజంలో మానవ మృగాల నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలనేది ఈ సదస్సులో వివరించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరిష అన్నారు. అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా అది కచ్చితంగా తల్లితో చెప్పాలని సూచించారు. మేం ఏం చేయలేం అని నిస్సహాయ స్థితి నుంచి మేం ఏదైనా చేయగలమనే ధైర్యం ఆడపిల్లల్లో రావాలని హోఫ్ ఫర్ లైఫ్ సంస్థ వ్యవస్థాపకులు హిమజ అన్నారు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హోఫ్ ఫర్ సంస్థ ప్రతినిధులు ఆశాజ్యోతి, సైకాలజిస్టులు డాక్టర్ సంగీత, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌లపై ఆడపిల్లలకు పూర్తి అవగాహన కల్పించేలా ఈ సదస్సు జరిగింది.

Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్ సంతాపం
అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇకలేరు. వారి కుటుంబ సభ్యులకు మనసారా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, మహానుభావుడైన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. వారి గానం యుగయుగాల పాటు మనలో జీవించే ఉంటుందంటూ నాట్స్ నివాళులర్పించింది. గరిమెళ్ల గళంలో అన్నమయ్య అమృతంఆచార్య తాడేపల్లి పతంజలికొందరు జీవించి ఉన్నప్పుడే తాము ఎంచుకున్న క్షేత్రంలో అంకితభావంతో కృషిచేసి ప్రసిద్ధులవుతారు. శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత ఈ లోకానికి సిద్ధ పురుషులుగా మిగిలిపోతారు. అటువంటి వారిలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఒకరు.‘పుడమి నిందరి బట్టె భూతము కడుబొడవైన నల్లని భూతము‘ అని అన్నమయ్య వేంకటేశుని గురించి వర్ణిస్తాడు. ఆ అన్నమయ్య కీర్తనల భూతం ఎప్పటినుంచో సంగీత సాహిత్య ప్రపంచంలో చాలా మందిని పట్టుకొని వదలటం లేదు.అటువంటి అన్నమయ్య వేంకటేశుని భూతము పట్టినవారిలో గరిమెళ్ళ ఒకరు. తన మనసుని పట్టుకున్న అన్నమయ్య కీర్తనకి అద్భుతమైన తన గాత్ర రాగ చందనాన్ని అద్ది సంగీత సాహిత్య ప్రియుల హృదయాలలో పట్టుకునేటట్లు కలకాలం నిలిచి ఉండేటట్లు చేసారు. ఒకటా రెండా... వందల కొలది అన్నమయ్య కీర్తనలు గరిమెళ్ళ వారి స్వరరచనలో విరబూసిన వాడిపోని కమలాలుగా, సౌగంధికా పుష్పాలుగా నేటికీ విరబూస్తున్నాయి. భావ పరిమళాలు వెదజల్లుతున్నాయి.NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఒక గొప్ప రహస్యంఎందరు గాయకులు పాడుతున్నప్పటికీ ప్రత్యేకంగా శ్రీ గరిమెళ్ళ అన్నమయ్య కీర్తన ఇంతగా ప్రచారం కావడం వెనుక ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, అన్నమయ్య మానసిక స్థాయికి తాను వెళ్లి, రసానుభూతితో పాడారు కనుకనే గరిమెళ్ళ వారి అన్నమయ్య కీర్తన సప్తగిరులలోను, లోకంలోను ప్రతిధ్వనిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ నడుస్తూనే ఈ లోకం నుంచి సెలవు తీసుకొన్నారు. బహుశా ఆ సమయంలో కూడా అన్నమయ్య కీర్తన ఏదో ఆయన మనస్సులో ప్రస్థానం సాగించే ఉంటుంది. అనుమానం లేదు.సంగీత ప్రస్థానంశ్రీ గరిమెళ్ళ సంగీత ప్రస్థానం చాలా విచిత్రంగా సాగింది. మొదట్లో సినిమా పాటలు పాడేవారు. తర్వాత లలిత సంగీతం, ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం ఆయనను తన అక్కున చేర్చుకుంది. తన పినతల్లి అయిన ప్రముఖ సినీ నేపథ్యగాయని ఎస్. జానకి గారి ఇంట్లో ఆరు నెలల పాటు ఉండి ఆమెతో కలిసి రికార్డింగ్లకి వెళ్లేవారు. జానకి గారు గరిమెళ్ళ వారిని ఎంతోప్రోత్సహించారు. బాలకృష్ణ ప్రసాద్ మొదట్లో చిన్న చిన్న కచేరీల్లో మృదంగం వాయించేవారు. తన 16వ ఏట చలనచిత్ర గీతాలతో పాటు భక్తి పాటలు కలిపి మొదటి కచేరీ చేసారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చేసిన కచేరీలు, శబ్దముద్రణలు (రికార్డింగ్‌లు లెక్కకు అందనివి.కొత్త పద్ధతిసాధారణంగా ఎవరైనా ఒకే వేదిక నుంచి ఒకరోజు సంకీర్తన యజ్ఞం చేస్తారు కానీ బాలకృష్ణ ప్రసాద్ ఒక వారం రోజులపాటు ఒకేవేదిక నుంచి సంకీర్తన యజ్ఞం చేసి ఒక కొత్త పద్ధతినిప్రారంభించారు. టెలివిజన్ మాధ్యమాల ద్వారా అనేక మందికి సంగీతపు పాఠాలు నేర్పించారు.నేదునూరి నోట – అన్నమయ్య మాటఅప్పట్లో ప్రసిద్ధమయిన ఆకాశవాణి భక్తి రంజనిలో బాలకృష్ణ ప్రసాద్ ని పాడటానికి సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆహ్వానించారు. పోంగిపోయారు బాలకృష్ణ ప్రసాద్. గరిమెళ్ళ గానానికి సంతోషించిన నేదునూరి తిరుపతి అన్నమాచార్యప్రాజెక్టులో చేరమని సలహా ఇచ్చారు. అలా అన్నమయ్య కు వేంకటేశునికి బాలకృష్ణ ప్రసాద్ దగ్గరయ్యారు. అన్నమాచార్యప్రాజెక్టుకు బాలకృష్ణప్రసాద్ అందించిన సేవలు సాటిలేనివి.పురస్కారాలురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి 2023 ఫిబ్రవరి 23న కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, శ్రీపోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఇలా కోకొల్లలు. అన్నమాచార్య సంకీర్తన సంపుటి, అన్నమయ్య నృసింహ సంకీర్తనం వంటి పుస్తకాలు తెలుగు, తమిళ భాషల్లో ఆయన ప్రచురించారు. గరిమెళ్ళపై ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులు పరిశోధన గ్రంథాలు సమర్పించారు.శివపదం కూడా...గరిమెళ్ళ ఎంతటి అన్నమయ్య వేంకటేశ భక్తులో అంతగా శివభక్తులు కూడా. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శివునిపై రచించిన సాహిత్యానికి, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ మృదుమధురంగా స్వరపరిచి పాడారు. ‘‘అడుగు కలిపెను’’,’’ఐదు మోములతోడ’’, ‘‘అమృతేశ్వరాయ’’ వంటి కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పోందాయి. ‘చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు‘ అంటూ ఒక శివ పద కీర్తనలో బాల కృష్ణప్రసాద్ ఆర్తి మరిచిపోలేనిది. ఆంజనేయుడు మొదలయిన ఇతర దేవతలపై కూడా గరిమెళ్ళ పాడిన పాటలు ప్రసిద్ధాలు.అన్నమయ్య స్వరసేవ‘అన్నమయ్యకు స్వరసేవ చేయడం తప్ప మరో ప్రపంచం తెలీదు. అన్నమయ్య పాటలే ప్రపంచంగా బతికారు. ఆ పాటలు వినని వాళ్లకు కూడా బలవంతంగా వినిపించేవారు. ప్రతి ఇంట్లో అన్నమయ్య పాట ఉండాలి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తపన పడేవారు. అన్నమయ్య కీర్తనలు స్వరం, రాగం, తాళం తూకం వేసినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టేవారు.’’ అని బాలకృష్ణ ప్రసాద్ సతీమణి రాధ చెప్పారు. అన్నమయ్య చెప్పినట్లు ‘‘ఇదిగాక వైభవంబిక నొకటి కలదా?’’చిరస్మరణీయంతెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి నెల 6న నిర్వహించిన అన్నమాచార్య సంకీ ర్తన విభావరియే ఆయన చివరి కచేరీ. నాలుగు నెలలుగా గొంతు సరిగా లేకపోవడంతో ఎక్కడా కచేరీ చేయలేదని, నీదే భారమంటూ స్వామికి మొక్కి వచ్చినట్లు ఆయన ఆర్ద్రంగా యాదగిరి గుట్టలో చెప్పిన విషయం చిరస్మరణీయం.అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20కొత్త రాగాలు కూడా సృష్టించారు.ప్రసూన బాలాంత్రపుమంద్రస్థాయిలోని మధుర స్వరం భక్తి, ప్రేమ రంగరించి రూపం దాలిస్తే అది బాలకృష్ణ ప్రసాద్ అవుతుంది. ఈ తరం వారికి అన్నమయ్య పాటలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది బాలకృష్ణ ప్రసాద్. లలిత సంగీత ధోరణిలో అన్నమయ్యను అందరికి దగ్గర చేసిన ఘనత ఆయనది.1948 నవంబర్ 9న రాజమండ్రిలో కృష్ణవేణి, గరిమెళ్ళ నరసింహరావులకు జన్మించారు బాలకృష్ణ. ఇంటిలో అందరూ సంగీత కళాకారులే కావడం వల్ల ఆయన పాటతోనే పెరిగారు. ప్రముఖ నేపథ్యగాయని జానకి వారి పినతల్లి. సంగీతం ఎంతో సహజంగా వారికి అబ్బింది కనుకే ఒక పాట రాసినా, సంగీతం కూర్చినా, పాట పాడినా అది అందరి మనస్సులను ఆకర్షించింది. 1980లో మాట. టి.టి.డి వాళ్ళు అన్నమాచార్యప్రాజెక్ట్ మొదలు పెట్టి రాగి రేకులలో దొరికిన అన్నమయ్య పాటలను ప్రజలకు చేర్చాలని నిశ్చయించారు. అప్పటికే కొన్ని పాటలు జనంలో వున్నా అవి అన్నమయ్య పాటలు అని తెలియదు.ఉదాహరణకు ‘జో అచ్యుతానంద’. ఒక ఉద్యమంగా ఈ పాటలు ప్రచారం చెయ్యాలని ప్రతిపాదన. ప్రముఖ విద్వాంసులు రాళ్ళపల్లి అనంత కృష్ణ్ణశర్మ, నేదునూరి కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ ఈ పాటలకు సంగీతం కూర్చారు. ఆ తరువాత తరం కళాకారులు బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు. నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర బాలకృష్ణ ప్రసాద్ స్కాలర్‌షిప్‌తో శిష్యులుగా చేరి శాస్త్రీయ సంగీతం, అన్నమయ్య పాటలు నేర్చుకున్నారు. నేదునూరి గారు ముందుగా స్వరపరచినది ‘ఏమొకో చిగురుటధరమున’ అనే పాట. ఇది కీర్తన అనేందుకు లేదు. మాములుగా శాస్త్రీయ సంగీతంలో కనిపించే ధోరణులు ఇందులో ఉండవు. మరో పాట ‘నానాటి బ్రతుకు’ కూడా ఇటువంటిదే. ఆ పాటలలో భావం, కవి హృదయం వినే మనస్సుకు అందాలి.అది ఆ సంగీతంలోని భావనా శక్తి. అదే బాలకృష్ణ ప్రసాద్ గారికి స్ఫూర్తి. ఇక అన్నమయ్య పాట పుట్టింది. ప్రచారంలో ఉన్న త్యాగరాజ కీర్తనలకు భిన్నంగా నడిచింది ఈ సంగీతం. నిజానికి అన్నమయ్య త్యాగరాజ ముందు తరం వాడు. అదే బాటలో మొదటి అడుగుగా ‘వినరో భాగ్యం విష్ణు కథ’ పాటలా మన ముందుకు వచ్చింది. నేదునూరి రాగభావన అందిపుచ్చుకుని బాలకృష్ణ ప్రసాద్ ముందుకు నడిచారు. ‘చూడరమ్మ సతులాలా’ అన్నా, ‘జాజర పాట’ పాడినా, ‘కులుకుతూ నడవరో కొమ్మల్లాలా’ అన్నా బాలకృష్ణ ప్రసాద్ గొంతులో భావం, తెలుగు నుడి అందంగా ఒదిగిపోతాయి.అలాప్రారంభం అయిన బాలకృష్ణ ప్రసాద్ సంగీత ప్రస్థానం 150 రాగాలతో 800 పైగా సంకీర్తనలకు సంగీతం కూర్చడం దాకా సాగింది. అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20 కొత్త రాగాలు కూడా సృష్టించారు. అన్నమయ్యవి అచ్చ తెలుగు పాటలు. బాలకృష్ణ ప్రసాద్ గొంతులో ఆ తెలుగు సొబగు మృదుమధురంగా వినిపిస్తుంది. ఆయన సంగీతంలో అనవసరమైన సంగతులు ఉండవు. పాట స్పష్టంగా, హృదయానికి తాకేటట్లు పాడడమే ఉద్దేశం. విన్న ప్రతివారు మళ్ళీ ఆ పాట పాడుకోగలగాలి. దీనికై వారు అన్నమయ్య సంగీత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రచారం చేశారు.400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు బాలకృష్ణ. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400కు పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. ఆయన లలిత గీతాలు కూడా రచించారు. ఆంజనేయ కృతి మణిమాల, వినాయక కృతులు, నవగ్రహ కృతులు, సర్వదేవతాస్తుతి రచించి క్యాసెట్టు రూపంలో అందించి తెలుగు వారి పూజాగృహంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాట ఒక అనుభూతి, ఒక స్వర ప్రవాహం, ఒక భావ సంపద. కొందరికి మరణం ఉండదు. వారి పాట, మాట నిత్యం మనతోనే ఉంటాయి. బాలకృష్ణ ప్రసాద్ అటువంటి మహనీయుడు.

ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ఫైనల్‌కు చేరడం.. ఫైనల్లో కూడా అసాధారణ విజయం సాధించడాన్ని నాట్స్ నాయకత్వం అభినందించింది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్లేయర్స్ అంతా ఈ సీరీస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ విజయంతో ప్రవాస భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయానికి తామంతా గర్వపడుతున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!కాగా పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. తొలివికెట్ భాగస్వామ్యం రోహిత్ (76) శుభ్‌మన్ గిల్ (31) 105 పరుగులు అందించారు. కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజా (18 నాటౌట్) బౌండరీతో భారత్ ట్రోఫి దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025).

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు.
క్రైమ్

హెల్త్ సూపర్వైజర్ దారుణ హత్య.. కీలకం కానున్న హెల్మెట్..!
మహబూబాబాద్ రూరల్: ఓ గురుకులంలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్‌తండా సమీపంలో చోటు చేసుకుంది. రూరల్ సీఐ పి.సర్వయ్య కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన తాటి పార్ధసారథి (42) భద్రాచలంలోని జగదీశ్ కాలనీలో నివాసముంటున్నాడు. 11 ఏళ్ల క్రితం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రేకపల్లే గ్రామానికి చెందిన స్వప్నతో వివాహం జరిగింది. వారికి పిల్ల లు భార్గవ్‌సాయి, పరమేశ్వరి ఉన్నారు. పార్ధసారథి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఏడాది కాలంగా హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య స్వప్న, పిల్లలు భార్గవ్‌సాయి, పరమేశ్వరి భద్రాచలంలోని జగదీశ్ కాలనీలో ఉంటున్నారు. పార్ధసారథి మాత్రం దంతాపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటూ సెలవు రోజుల్లో ఇంటికి వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం భద్రాచలం వెళ్లి సోమవారం సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరాడు. తాను వస్తున్నానని తన గది యజమానికి ఫోన్ చేసి ఇంటి గేటు వేయొద్దని చెప్పాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున బోరింగ్‌తండా సమీపంలోని మిరప చేనులో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానిక రైతులు గమనించి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం తెలిపారు. దీంతో రూరల్ ఎస్సై వి.దీపిక, సీఐ పి.సర్వయ్య, డీఎస్పీ ఎన్.తిరుపతిరావు ఘటనా స్థలిని పరిశీలించి ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్‌కు సమాచారం ఇవ్వగా ఆయన హుటాహుటిన చేరకున్నారు. డాగ్స్కా్వ డ్, ఫింగర్‌ప్రింట్స్, క్లూస్‌టీం బృందాలు వివరాలు సేకరించాయి. ఘటనాస్థలికి చేరుకున్న మృతుడి సోదరి మద్దుల హేమవరలక్ష్మి, బావ శివప్రసాద్ బోరున విలపించారు. హేమవరలక్ష్మి మాట్లాడుతూ.. తన సోదరుడు పార్ధసారథిపై ఏడాది క్రితం దాడి జరిగిందని తెలిపారు. మరదలు స్వప్నకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఈ కారణంగానే తమ సోదరుడి హత్య జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా, పోలీస్ స్టేషన్లో పార్ధసారథిని దుండగులు హత్య చేసి చంపారని ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ గురుకులాల ఆర్సీఓ రాజ్‌కుమార్.. పార్ధసారథి హత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై దీపిక, బయ్యారం సీఐ రవికుమార్, ఎస్సై తిరుపతి, సీసీఎస్ సీఐ హథీరాం, ఇతర పోలీసుల అధికారులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.కీలకం కానున్న హెల్మెట్..పార్ధసారథి హత్య విషయంలో ఘటనా స్థలిలో లభ్యమైన హెల్మెట్ కీలకం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుల రాకపోకలు, వాళ్లు వాడిన ద్విచక్రవాహనం ఆచూకీ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజీల్లో నిందితులు హత్య చేయడానికి వచ్చే ముందు ఆ వాహనం నడిపిన వ్యక్తి ధరించిన హెల్మెట్ తెలుపురంగులో ఉండగా, ఘటనా స్థలిలో లభించిన హెల్మెట్ కూడా అదే రంగులో ఉండడం గమనార్హం. పార్ధసారథి హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనంపై ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. భద్రాచలం నుంచి హత్య జరిగిన ప్రాంతం వరకు రహదారుల వెంట ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్
సంగారెడ్డి, సాక్షి: అమీన్పూర్ చిన్నారుల మృతి కేసు(Ameenpur Children Death Case)లో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం కారణంగానే ముగ్గురు పిల్లలను కన్నతల్లి రజితనే కడతేర్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో మొదట భర్త చెన్నయ్యపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు.. లోతైన దర్యాప్తులో సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు.రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత(Rajitha) కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు. కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం.రజిత పదో తరగతి క్లాస్మేట్స్ ఈ మధ్య గెట్ టు గెదర్ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్ డేస్‌లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. అలా తన పాత క్లాస్‌మేట్‌తో రజిత చాటింగ్, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూయగా.. భర్త చెన్నయ్యకు అనుమానం రావొద్దని కడుపు నొప్పి నాటకం ఆడి ఆస్పత్రిలో చేరిందామె.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
కేపీహెచ్‌బీకాలనీ: ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్ధిపేట జిల్లా, ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఉప్పరపల్లి మహేందర్ (25) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అడ్డగుట్ట సొసైటీలోని హాస్టల్లో ఉంటున్నాడు.సోమవారం సాయంత్రం హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో హాస్టల్ నిర్వాహకుడు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమలో ఓడిపోవడమే తన మరణానికి కారణమని రాసి ఉన్న లెటర్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు పై పడిన సెల్‌ఫోన్ తీసుకుంటుండగా...శామీర్‌పేట్: రోడ్డు పడిన సెల్ ఫోన్ తీసుకుంటుండగా కారు ఢీ కొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి జినోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సిద్దిపేట్ జిల్లా, మామిడ్యాల గ్రామానికి చెందిన పొట్ట ప్రవీణ్ (23), హైదరాబాద్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై రాజీవ్ రహదారి మీదుగా వెళుతుండగా తుర్కపల్లి గ్రామ సమీపంలో తన జేబులోంచి సెల్‌ఫోన్ రోడ్డుపై పడింది. దీంతో కిందపడిన సెల్‌ఫోన్‌ను తీసుకుంటుండగా అదే సమయంలో నగరం నుంచి వేగంగా వచి్చన ఎర్టిగా కారు వెనక నుంచి అతడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. జినోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు నీ భార్యకు చూపించి..!
కృష్ణరాజపురం/ బనశంకరి: బెంగళూరులో ఓ పారిశ్రామికవేత్తను హనీట్రాప్ చేసి ముప్పుతిప్పలు పెట్టి దోచుకున్న ముఠా ఉదంతమిది. కిలాడీ మహిళ ఒక ముద్దుకు రూ.50 వేల చొప్పున వసూలు చేయడం గమనార్హం. ముఠా బెదిరింపులను తట్టుకోలేక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కిలాడీ శ్రీదేవి రుడగి (25), ఆమె ప్రియుడు సాగర్ మోరే (28), రౌడీషీటర్ గణేష్ కాలే (38) లను నగర సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... మహాలక్ష్మి లేఔట్లో ప్రీ స్కూల్ నిర్వహిస్తున్న శ్రీదేవి అసలు నిందితురాలు. ఆమె ప్రీస్కూల్‌కు రాకేష్ వైష్ణవ్ (34) అనే వ్యాపారవేత్త తన పిల్లలను పంపించేవాడు. అలా అతనితో పరిచయం పెంచుకుని స్కూలు నిర్వహణ కోసమని రూ.4 లక్షలను అప్పుగా తీసుకుంది. డబ్బు వాపసు ఇవ్వాలని అడగగా ప్రీ స్కూల్ పార్టనర్ కావాలని కోరింది. చనువు పెంచుకుని కలిసి తిరిగేవారు. కొత్త ఫోను, సిమ్ శ్రీదేవితో మాట్లాడేందుకు కొత్త సిమ్, ఫోన్‌ను రాకేష్ కొనిచ్చాడు. శ్రీదేవి అతనికి ముద్దు పెట్టి రూ.50 వేలు చొప్పున తీసుకుంది. నీతోనే రిలేషన్షిప్లో ఉంటానని చెప్పి రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తరచూ డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో రాకేష్‌కు విసుగొచ్చి ఆమె సిమ్‌ను విరగ్గొట్టి పారేశాడు. టీసీ ఇస్తామని పిలిచి కిడ్నాప్ రాకేష్ ఆమె సూచన మేరకు మార్చి 12న పిల్లలకు టీసీని తీసుకునేందుకు ప్రీ స్కూల్‌కు వచ్చాడు. అప్పుడు శ్రీదేవితో పాటు నిందితులు సాగర్ మోరే, గణేష్ కాలే ఉన్నారు. వారు రాకేష్ పై దాడి చేసి, సాగర్‌తో శ్రీదేవికి నిశ్చితార్థం అయ్యింది. నువ్వు ఆమెతో మజా చేస్తున్నావా? ఈ సంగతిని శ్రీదేవి తండ్రికి, నీ భార్యకు చెబుతానంటూ రాకేష్‌ను బ్లాక్మెయిల్ చేశారు. పోలీసు స్టేషన్‌కు వెళ్దాం పద అంటూ రాకే‹Ùను ఎక్స్‌యూవీ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఇంతటితో వదిలేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని రాకే‹Ùను ఒత్తిడి చేశారు. చివర రూ.20 లక్షలు ఇస్తే చాలని డిమాండ్ చేశారు. ఆఖరికి రూ.1.90 లక్షలు తీసుకుని వదిలేశారు. నిందితులు బిజాపురవాసులు శ్రీదేవి విద్యార్థుల తండ్రులను తీయని మాటలతో మోసపుచ్చి వలలో వేసుకునేదని, ముద్దు ఇస్తే రూ.50 వేలు ఇవ్వాలనే షరతుతో సల్లాపాలు నడిపేదని వెలుగులోకి వచ్చింది. నిందితులు ముగ్గురూ విజయపుర (బిజాపుర) జిల్లా నివాసులు. ఉపాధి కోసం బెంగళూరుకు వలసవచ్చి చాతుర్యాన్ని ప్రదర్శించారు. రౌడీ గణేశ్ కాలేపై బెదిరింపులు, దోపిడీ, హత్యాయత్నం వంటి 9 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కిలాడీలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి పోలీస్‌కస్టడీకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. దర్యాప్తులో మరిన్ని హనీట్రాప్ బాగోతాలు బయటపడే అవకాశముందని తెలుస్తోంది. నగరంలో ఈ హనీట్రాప్ దందా సంచలనం కలిగిస్తోంది. ఈమె బారిన మరికొందరు పడి ఉంటారని అనుమానాలున్నాయి.మళ్లీ బ్లాక్‌మెయిలింగ్ మార్చి 17న మళ్లీ రాకేష్ కు శ్రీదేవి ఫోన్ చేసి రూ.15 లక్షలు ఇవ్వాలని, అప్పుడే మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు, చాటింగ్‌ను డిలిట్ చేస్తాను, లేకుంటే నీ భార్యకు చూపించి నీ సంసారాన్ని పాడు చేస్తానని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో విసిగిపోయిన రాకేష్ చివరకు బెంగళూరు సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీదేవి, గణేష్, సాగర్లను అరెస్టు చేసి మరింత విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకున్నారు.
వీడియోలు


HCU భూ వివాదంపై సినీ సెలబ్రిటీల స్పందన


వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన YSRCP


విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి


ఏపీలో మహిళలకు రక్షణ లేదు: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి


YSRCP అఖండ మెజార్టీతో గెలుస్తుంది: YS జగన్


కార్యకర్తలు తెగింపు చూపారు: YS జగన్


ఐదేళ్లలో రెండింతలు దాటిన బంగారం ధరలు


విశాఖ మధురవాడలో దారుణం


మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: YS జగన్


వైఎస్ జగన్ ను కలిసిన ఫార్మసీ విద్యార్ధిని అంజలి తల్లిదండ్రులు