
ప్రపంచంలోనే ఉత్తమ మాంసాహార వంటకాల జాబితాను విడుదల చేసింది ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్. ఎప్పటిలానే బెస్ట్ స్వీట్స్, కర్రీల జాబితాను ఇచ్చినట్లుగానే ఈసారి బెస్ట్ మాంసాహార రెసిపీ జాబితాను విడుదల చేసింది. మొత్తం 100 ఉత్తమ మాంసాహార వంటకాలను విడుదల చేయగా అందులో మన భారతీయ వంటకం కీమా నాల్గోస్థానంలో నిలవడం విశేషం.
ఈ కీమాని సమోసాలు, బ్రెడ్‌లు, పరాఠాలు వంటి వాటిల్లో నొంచుకుని ఆస్వాదిస్తారు. ముఖ్యంగా ఇది మేక లేదా కోడి మాంసాన్ని చాలా చిన్నగా కట్ చేస్తారు. దాంతో చేసే వంటకమే ఈ కీమా రెసిపీ. అయితే దీన్ని ఉడికించడం సులభం, రుచిగానూ ఉంటుంది. ఇక ప్రపంచంలోనే ఉత్తమ మాంసాహార వంటకాల జాబితాలో టర్కీకి చెందిన టైర్ కోఫ్టేసి అగ్రస్థానంలో నిలిచింది.
తదుపరిస్థానాల్లో సెర్బియా నుంచి లెస్కోవాకి రోస్టిల్జ్ , టర్కీకి చెందిన అదానా కెబాప్, బారత్ నుంచి కీమా ట్రావ్నిక్, బోస్నియా నుంచి ట్రావ్నిక్కి సెవాపి, అజర్‌బైజాన్ నుంచి గురు ఖింగల్, ఇటలీ నుంచి పోల్పెట్ బోస్నియా మొదలైనవి చోటు దక్కించుకున్నాయి. కాగా, ఈ కీమా వంటకాలను అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరపకాయ, ఉల్లిపయాలు, నెయ్యి, గరం మసాల, కొద్దిపాటి సుగంధద్రవ్యాలతో రుచికరంగా తయారు చేస్తారు. సాధారణంగా పచ్చి బఠానీలు ఉపయోగించి చేస్తుంటారు చెఫ్‌లు.
(చదవండి: అతడు 95% దృష్టిని కోల్పోయాడు అయినా..! వైరల్‌గా ఆనంద్ మహీంద్రా పోస్ట్)