
సరదాగా సాయంత్రం కాసిన్న వేరుశెనగపప్పులో, మరమరాలు తింటుంటే ఆ మజానే వేరు. అందులోనూ మన భారతీయులకు చిరుతిండి అంటే మహా ఇష్టం. ఎన్ని చిరుతిండి బ్రాండ్‌లు మార్కెట్లోకి వచ్చినా..తన హవా చాటుతూ దూసుకుపోతున్న బ్రాండ్ ఏదంటే..ఠక్కున చెప్పేది హల్దిరామ్. నిన్న మొన్నటిది కాదు..ఏకంగా 88 ఏళ్ల నుంచి అశేష ప్రజల ఆధరణతో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనిపించుకున్న స్నాక్ ఐటెం ఇది. మార్కెట్లో దీని టర్నోవర్ వింటే..కళ్లుబైర్లు కమ్మడం ఖాయం. అలాంటి మన భారతీయ చిరుతిండి పెట్టుబడిదారుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలిస్తే..విస్తుపోతారు. నిజమేనా అని నోరెళ్ల బెడతారు. అంతలా అందరి మనసును దోచుకున్న ఈ చిరుతిండి కథకమామీషు ఏంటో చూద్దామా..!.
ప్రసిద్ధి చెందిన ఐకానిక్ స్నాకింగ్ బ్రాండ్లలో ఒకటిగా పేరుగాంచింది హల్దిరామ్ భుజియా చిరుతిండి. ప్రస్తుతం ఈ బ్రాండ్ దాదాపు వంద రకాల స్నాక్‌లను అందిస్తోంది. అందరూ మెచ్చిన రకం చిరుతిండి మాత్రం హల్దిరామ్ భుజియానే. దీనికి భారతదేశం అంతటానే గాదు విదేశాల్లో సైతం ఐకానిక్ బ్రాండ్‌గా ఉంది.
ఈ బ్రాండ్ యజమాని తన అత్త నుంచి ఈ భుజియా రెసిపీని తెలుసుకున్నాడట. అయితే ప్రజాదరణ పొందడం కోస అత్త ట్రిక్‌ని ఉపయోగించేవాడట. దీనికి ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్ ఆల్ఫా వేవ్‌లో రూ. 5600 కోట్ల వాటా ఉంది. అంతేగాదు దీనికి టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ పెట్టుబడిదారుడిగా మారడం విశేషం. ఆ నేపథ్యంలోనే ఈ హల్దిరామ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అంతేకాదండోయ్ ఈ విషయాన్ని స్వయంగా హల్దిరామ్ బ్రాండ్ ప్రతినిధే ఖరారు చేశారు. ప్రస్తుతం ఈబ్రాండ్ స్వీట్లు వంటి వాటిని కూడా అందించడంతో దీని విలువ ఏకంగా రూ. 8 లక్షల కోట్లకు చేరుకుందని అంచనా.
మొదలైందిలా..
మెగాబ్రాండ్‌గా అవతరించిన ఈ హల్దీరామ్ ప్రస్థానం 1937లో జరిగింది. రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఒక చిన్న స్వీట్లు, స్నాక్స్ దుకాణంగా ప్రారంభమైంది. ఆ దుకాణం యజమాని గంగా బిషన్ అగర్వాల్ని చుట్టపక్కల వాళ్లు ఆప్యాయంగా హల్దిరామ్ జీ అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆయనే ఈ హల్దిరామ్ బ్రాండ్ వ్యవస్థాపకుడు.
ఆ తర్వాత కోలకతా, నాగపూర్, ఢిల్లీకి విస్తరించి..ఘన విజయాన్ని అందుకుంది. ఆబ్రాండ్ వ్యవస్థాపకుడు గగన్ బిషన్ అగర్వాల్ దూరదృష్టి, అంకితభావం, కృషిల కారణంగా చిరుతిండి సామ్రాజ్యంలో రాణిగా పేరుతెచ్చుకుంది. 1980ల ప్రాంతంలో హల్దిరామ్ పెద్ద మార్కెట్లలోకి అడుగుపెట్టింది. ఎప్పటికప్పుడు సాంప్రదాయ వంటకాలకు ఆధునిక తయారీ పద్ధతులను జోడించి రుచికరంగా తయారుచేయడంతో ఈబ్రాండ్ అతడి ఇంటి పేరుగా మారిపోయింది.
ఇది పాపడ్‌లు నుంచి రెడీ టు ఈట్ మీల్స్, నామ్‌కీన్‌ల వరకు మార్కెట్‌లలో తన ఉత్పత్తులను ఎగుమతి చేయడం ప్రారంభించిన తర్వాత భారత్ తోపాటు విదేశాలలో కూడా గణనీయమైన ఉనికిని సంపాదించగలిగింది. అలాగే ఔత్సాహిక వ్యవస్థాపకులుకు ఓవ్యాపారాన్ని కాలనుగుణ మార్పులతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలో చాటిచెప్పి..స్ఫూర్తిగా నిలిచాడు.
(చదవండి: సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని ఎలా నివారించాలంటే..?)