
తెహ్రాన్ : ఇరాన్ ఎనభై ఐదు సెకన్ల నిడివిగల వీడియోతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రెచ్చగొట్టింది. అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లో అణు ఒప్పందం చేసుకోబోమని పరోక్షంగా సంకేతాలిచ్చింది.
ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌కు లేఖ రాశారు. ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూనే ఆ దేశం చర్చలకు రావాలని ఆహ్వానించారు. అందుకు సుమారు రెండు నెలల డెడ్‌లైన్ విధిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై ఇరాన్ అధ్యక్షుడు స్పందిస్తూ.. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధం లేమని, ఆయనకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చు’అని పేర్కొన్నారు.
అయితే, ట్రంప్ విధించిన అణు ఒప్పందం డెడ్ లైన్ గడువు సమీపిస్తున్న తరుణంలో తన సైనిక విభాగం బలంగా ఉందని చెబుతూ ఇరాన్ ఎనభై ఐదు సెకన్ల వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో మిస్సైల్ సిటీ పేరుతో క్షిపణులను ఏర్పాటు చేసిన తన మూడవ అండర్‌గ్రౌండ్ ప్రదేశాల్ని క్యాప్చర్ చేసింది. అండర్‌గ్రౌండ్ టన్నెల్స్‌లో ఏర్పాటు చేసిన మిస్సైల్ సిటీలో భారీ అణు ఆయుధాల్ని మనం చూడొచ్చు.
Iran is responding to external threats by releasing a new video showcasing one of its underground missile tunnel systems, packed with missile engines, mobile launchers, and a range of advanced weaponry. The footage prominently features the Paveh cruise missile, the Ghadr-380… pic.twitter.com/ILsdlrPtQy
— Basha باشا (@BashaReport) March 25, 2025
ఇక ఇరానియన్ రాష్ట్రీయ మీడియా ప్రసారం చేసిన 85 సెకన్ల వీడియోలో ఇరాన్ సైనిక సారథి మేజర్ జనరల్ మొహమ్మద్ హోసేన్ బాగెరీ, ఐఆర్‌సీజీ ఏరోస్పేస్ ఫోర్స్ చీఫ్ అమీర్ అలీ హాజిజాదెహోలు ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ఆ క్షిపణుల్ని చూపిస్తున్నారు.
ఇరాన్ మిస్సైల్ సిటీలో ఖైబర్ షెకాన్, ఘదర్-హెచ్,సెజిల్, పావే ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి. ఈ అణు ఆయుధాల్ని ఇరాన్ ఇటీవల ఇజ్రాయిల్‌పై దాడి చేసేందుకు ఉపయోగించినట్లు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.