Telangana Crime News: ప్రేమ విఫలమై.. యువతి తీవ్ర నిర్ణయం.. చివరికి..
Sakshi News home page

ప్రేమ విఫలమై.. యువతి తీవ్ర నిర్ణయం.. చివరికి..

Published Sat, Aug 26 2023 1:28 AM | Last Updated on Sat, Aug 26 2023 1:47 PM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని విఠలాపురంలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ ఈశ్వరయ్య కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఊస్సేన్‌సాబ్‌, ఖాజాబీకి ముగ్గురు కుమార్తెలు. చిన్న కుమార్తె షెహనాబీ (19) హైదరాబాద్‌లో డిగ్రీ రెండో సంవత్సరం చదివేది.

ఇటిక్యాల మండలం ఉదండాపురం గ్రామానికి చెందిన ఖాజా సమీప బంధువు కావడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లికి యువకుడు నిరాకరించడంతో మనస్థాపానికి గురై గురువారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగుమందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గద్వాలకు అటు నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. తండ్రి ఊస్సేన్‌సాబ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ వివరించారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement