
ప్రపంచ చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక ఈ ఏడాదిలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 23 విభాగాల్లోని విజేతలను ప్రకటించి వారికి అవార్డులను కూడా అందజేశారు. 95వ ఆస్కార్ వేడుకలలో భాగంగా టాలీవుడ్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ నామినేట్ అయిన.. ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచింది.
ఈ సాంగ్‌ను ఎంఎం కీరవాణి కంపోజ్ చేయగా.. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. వీరిద్దరూ కలిసి ఆస్కార్ స్టేజ్ పై అవార్డులు అందుకున్నారు. ఈ పాటకు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ అదిరిపోయే డ్యాన్స్‌తో మెప్పించారు. దర్శక ధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమా స్థాయిని ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆస్కార్ గెలిచే వరకూ తీసుకొని వెళ్లాడు. ఒక్క ‘నాటు’ దెబ్బతో ఆస్కార్ గెలవడమే కాదు ఏకంగా జ్యూరీ మెంబర్స్ అయ్యే అంత గొప్ప స్థానం టాలీవుడ్‌కు దక్కింది.
(ఇదీ చదవండి: 'తీవ్రమైన ఇన్ఫెక్షన్'తో ఆసుపత్రి పాలైన ప్రముఖ సింగర్)
తాజాగా ఆస్కార్ ప్యానెల్ నుంచి టాలీవుడ్‌కు మరో శుభవార్త అందింది. రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, కరణ్ జోహార్‌లతో పాటు ఎంఎం కీరవాణి, చంద్రబోస్, సాబు సిరిల్, మణిరత్నం, సెంథిల్ కుమార్, చైతన్య తమహనే, షౌనెక్ సేన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్‌లకు ఆస్కార్ ప్యానెల్‌లో చోటు దక్కింది. రాబోయే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాల్లో వీరందరికీ ఓటు హక్కు ఉంటుంది. అకాడమీ సభ్యులు మాత్రమే ఆస్కార్ విజేతలకు ఓటు వేయగలరు. వచ్చే ఏడాది ఆస్కార్ వేడుకలు మార్చి 10న జరగనున్నాయి. కాబట్టి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కీరవాణి కూడా ఓటు వేయనున్నారు.
దీనిలో భాగంగా 2023లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో చేరడానికి 398 మంది వ్యక్తుల జాబితాలో దాదాపు డజను మంది భారతీయ కళాకారులు ఉన్నారు, ఇందులో "RRR" చిత్రం యొక్క దిగ్గజ నటుల కాంబో, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, MM కీరవాణి,చంద్రబోస్ ఉన్నారు. అస్కార్ బరిలో నిలిచే చిత్రాలకు తెలుగు పరిశ్రమ నుంచి ఈ నలుగురికి మాత్రమే ఓటు హక్కు కలిగి ఉంటుంది. వీరి సభ్యత్వం లైఫ్ టైమ్ ఉంటుంది. కానీ దర్శకధీరుడు రాజమౌళి ఈ జాబితాలో చోటు దక్కలేదు.
(ఇదీ చదవండి: SPY Review: నిఖిల్ 'స్పై' మూవీ ట్విట్టర్ రివ్యూ!)
ఈ జాబితాలోని సభ్యుల గురించి అకాడమీ CEO బిల్ క్రామెర్, అకాడమీ ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ ఇలా అన్నారు. 'ఈ కళాకారులు, నిపుణులను మా (ఆస్కార్) సభ్యత్వంలోకి స్వాగతిస్తున్నందుకు అకాడమీ గర్విస్తోంది. వారు సినిమా విభాగాల్లో అసాధారణమైన ప్రతిభతో ప్రపంచాన్ని మెప్పించారు. వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర అభిమానులపై కీలకమైన ప్రభావాన్ని చూపారు' అని పేర్కొన్నారు.
ప్రస్తుతం అకాడమీలో 10,000 మందికి పైగా సభ్యులుగా ఉన్నారు. అకాడమీ విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ ఏడాది 40 శాతం మంది మహిళలకు చోటు కల్పించారు. ప్రతి ఏడాది విడుదలయై అస్కార్ ప్యానెల్ జాబితాలో ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ నుంచే ఉండేవారు. కానీ 2023లో మాత్రం ఇతర దేశాలకు చెందిన కళాకారులు ఎక్కువగా ఉండటం విశేషం.
We’re proud to announce our newly invited members to the Academy!
— The Academy (@TheAcademy) June 28, 2023
Meet the Class of 2023: https://t.co/xElbKejirD pic.twitter.com/9IqEmbU6GD