
అమృత్‌సర్: పంజాబ్‌ను ఆరోగ్యకరంగా, శక్తివంతంగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చెప్పారు. ప్రతి రంగంలోనూ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమన్నారు. శుక్రవారం అమృత్‌సర్‌లో ఆయన ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి 400 ఆమ్ ఆద్మీ క్లినిక్‌లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ ఇచ్చిన హామీలన్నిటినీ మాన్ సర్కార్ నెరవేరుస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. ఆప్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్ ప్రజలు ఆకాంక్షలు నెరవేరేందుకు కొద్దిగా ఓపిక పట్టాలన్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 500 ఆమ్ ఆద్మీ క్లినిక్కులను ఏర్పాటు చేయనుండటం సంతోషకరమని చెప్పారు.