
సుప్రీంకోర్టు భవన సముదాయాన్ని విస్తరించడమంటే.. న్యాయాన్ని మరింత బలోపేతం చేయడమేనని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. భవిష్యత్తు న్యాయవ్యవస్థకు పునాదిరాయి వేయడమేనని పేర్కొన్నారు.
సోమవారం రూ.800 కోట్లతో సుప్రీంకోర్టు విస్తరణ పనులకు సీజేఐ చంద్రచూడ్ భూమిపూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, జస్టిస్ బి.వి.నాగరత్న పాల్గొన్నారు.