
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నందిగ్రామ్‌లో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగింది. దీంతో నందిగ్రామ్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తనపై దాడి జరిగిందని సీఎం మమతా మీడియాకు వెల్లడించారు. నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తనపై పథకం ప్రకారం దాడి జరిగిందని, నలుగురు వ్యక్తులు దాడి చేశారని ఆమె తెలిపారు. ఆ వ్యక్తుల దాడి వల్ల తన కాలికి గాయమైనట్లు పేర్కొన్నారు. దాడి జరిగిన సమయంలో అక్కడ ఒక్క పోలీసు కూడా లేడని, తనపై కుట్ర జరగుతోందని అన్నారు.
ప్రచారాన్ని వాయిదా వేసుకుని చికిత్స కోసం మమతా కోల్‌కతాకు వెళ్లారు. ఎస్‌ఎస్‌కేఎమ్ ఆస్పత్రిలో సీఎం మమత చేరారు. సీఎం మమతాపై జరిగిన దాడిని టీఎంసీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మమతా వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఖండించారు. మమతా దాడి పేరుతో సానుభూతి పొందాలని భావిస్తున్నట్లు విమర్శించారు.
చదవండి: రసవత్తరంగా బెంగాల్ రాజకీయం