
పిటిషనర్‌కు సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ: స్థిరాస్తుల కూల్చివేత విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించారంటూ మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్ గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసీ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది.
దీనిపై తాము విచారణ చేపట్టలేమని, హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. అన్ని అంశాలనూ తాము ఇక్కడ విచారించలేమని స్పష్టంచేసింది. ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా ఆస్తులను కూల్చడానికి వీల్లేదని, కనీసం 15 రోజుల సమయం ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు 2024 నవంబర్ 13న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో అధికారులు తగిన సమయం ఇవ్వకుండానే ఆస్తులు కూల్చేశారని ఆరోపిస్తూ బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టుకు వెళ్లాలని