
కోల్‌కతా: ఆర్‌జీకార్ వైద్యురాలి ఘటన కేసులో సీబీఐ దర్యాప్తుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నల వర్షం కురిపించారు. దారుణం జరిగి 16 రోజులు అవుతుంది. న్యాయం ఎక్కడా? అంటూ సీబీఐని ప్రశ్నించారు. రాష్ట్ర అధికార తృణముల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవం బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ప్రసంగించిన దీదీ.. వైద్యురాలి కేసుపై పలు ప్రశ్నలు సంధించారు.
"BJP is trying to defame Bengal," CM Mamata Banerjee condemns 12-hour 'Bengal Bandh'
Read @ANI Story | https://t.co/bJMNXfPdD2 #MamataBanerjee #Bengalbandh #WestBengal #BJP pic.twitter.com/gCr6FFBGWa
— ANI Digital (@ani_digital) August 28, 2024
‘‘ఆర్‌జీ కార్ ఆస్పత్రి సెమినార్ హాల్‌లో వైద్యురాలిపై దారుణం జరిగిన రెండు రోజుల తర్వాత బాధితురాలి తల్లి దండ్రులను కలిశాను. కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు ఐదు రోజులు సమయం కావాలని వారిని అడిగాను. కానీ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది’’ అని అన్నారు. సీబీఐని ఉద్దేశిస్తూ..‘‘వాళ్లు మనకు న్యాయం చేయరు. కేసు దర్యాప్తు మరింత ఆలస్యం చేయడం వాళ్లకు కావాల్సింది’’ అని విమర్శించారు.
నేరస్తులకు ఉరిశిక్ష.. త్వరలో అసెంబ్లీలో తీర్మానం
బాధితురాలిపై దారుణం జరిగి 16 రోజులు అవుతుంది. న్యాయం ఎక్కడ? అని ప్రశ్నించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుందని, నేరస్తులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బిల్లును ప్రవేశపెడతామని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
విద్యార్థుల ముసుగులో బీజేపీ కుట్ర
అభయ ఘటనకు వ్యతిరేకంగా ‘నబన్న మార్చ్’ పేరుతో విద్యార్థి సంఘాలు మంగళవారం సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి.నబన్నా అభియాన్ పేరుతో హావ్‌డా నుంచి ప్రారంభమైన ర్యాలీ గందరగోళానికి దారి తీసింది. సంతర్‌గాచి వద్ద పోలీసులు విద్యార్థుల్ని అడ్డుకోవడం వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ర్యాలీ గురించి ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నబన్న మార్చ్‌కి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వగా.. రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి బీజేపీ-ఏబీవీపీ కుట్ర అని’ఆరోపించారు.
ప్రభుత్వ పరువు తీయడమే బీజేపీ ప్లాన్
రాష్ట్రంలో బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. వాళ్లకు కావాల్సింది మృతదేహాలు. కానీ మనం అభయ కేసు నిందితుల్ని ఉరిశిక్ష పడేలా న్యాయం చేయాలని కోరుతున్నాం. బాధితురాలికి న్యాయం చేయాలనే లక్ష్యం నుంచి వాళ్లు (బీజేపీ) దూరమయ్యారు. ఇప్పుడు రాష్ట్ర పరువు తీస్తున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు మరిన్ని కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’అని ధ్వజమెత్తారు.
రాష్ట్ర పోలీసులకు నా సెల్యూట్
అనంతరం నగర పోలీసులపై మమత బెనర్జీ ప్రశంసల వర్షం కురిపించారు. దాడులకు గురైనప్పటికీ ఉచ్చులో పడకుండా.. ప్రాణ నష్టం లేకుండా విధులు నిర్వహించిన పోలీసులకు నా సెల్యూట్ మరణాలను నిరోధించిన పోలీసులకు నా అభినందనలు’ అని మమతా బెనర్జీ ప్రసంగించారు.