
మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు అత్యంత హేయనీయం అని సినీ నటి కవిత మండిపడ్డారు.
సాక్షి, అమరావతి: మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు అత్యంత హేయనీయం అని సినీ నటి కవిత మండిపడ్డారు. రాజకీయాలను టీడీపీ నేతలు దిగజారుస్తున్నారని, మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడుతున్నారన్నారు. బండారుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
‘‘ప్రజలు అసహ్యించుకునేవిధంగా నీచమైన భాషతో మహిళలపై టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. రోజాపైన బండారు చేసిన వ్యాఖ్యలు వింటే ఎవరైనా చెప్పుతో కొడతారు. బండారు ఇంట్లో ఉన్న మహిళలు ఇలాంటి మాటలను ఆమోదించగలరా.?. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి బండారు వ్యాఖ్యలను ఖండించాలి. ఎన్టీఆర్ కడుపున పుట్టిన భువనేశ్వరి.. మహిళలపై టీడీపీ నేతలు అసభ్యకరంగా మాట్లాడితే ఖండించరా..?’’ అంటూ కవిత దుయ్యబట్టారు.
చదవండి: పవన్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటో?